Monday, January 23, 2017

Practice bits

1. ఆధునిక భారతదేశ చరిత్రలో విప్లవ ఉద్యమానికి మూలపురుషులు (మహారాష్ట్రకు చెందిన వారు)- జ:  వాసుదేవ బల్వంత పాడ్కే
2. భారతదేశంలో మొట్టమొదటి విప్లవ ఉగ్రవాద సంస్థ మహారాష్ట్రలో ప్రారంభమైంది. దానిపేరు-జ:  మిత్రమేళా
3. 1897లో పుణే ప్లేగు కమిషనర్ 'రాండే'ను చంపింది-జ:  చాపేకర్ సోదరులు
4. బెంగాల్‌లో స్థాపించిన మొదటి విప్లవ ఉగ్రవాద సంస్థ-జ:  అనుశీలన సమితి
5. 'అనుశీలన సమితి ఆఫ్ ఢాకా'ను స్థాపించినవారు-జ:  పులీన్ దాస్
6. 'వందేమాతరం' అని అరచినందుకు, 15 ఏళ్ల సుశీల్ సేన్‌ను తన పర్యవేక్షణలో క్రూరంగా కొట్టించిన కలకత్తా మేజిస్ట్రేట్ కింగ్స్‌ఫోర్డ్‌పై హత్యాప్రయత్నం కేసులో (1908) ఉరితీయబడినవారు-జ:  కుదీరాంబోస్
7. 1908లో కలకత్తా సమీపంలోని మానిక్‌టోలా తోటలో బాంబులు తయారుచేస్తున్నట్లు పోలీసులు కనిపెట్టిన ఆలీపూర్ కుట్రకేసు లేదా ఆలీపూర్ బాంబు కేసులో ఉరితీతకు గురైన వారిని గుర్తించింది?జ:  కన్హయలాల్‌దత్తా, సత్యన్‌బోస్
8. ఆలీపూర్ కుట్రకేసులో నిందితుల తరఫున ఉచితంగా వాదించినవారు-జ:  చిత్తరంజన్‌దాస్
9. 1909 డిసెంబరులో నాసిక్ జిల్లా మేజిస్ట్రేట్ జాక్సన్ హత్యకేసులో యావజ్జీవ కారాగారశిక్షకు గురైన 'అభినవ భారత్' సభ్యులు-జ:  సావర్కర్ సోదరులు
10. గణేశ్ సావర్కర్‌ను అరెస్ట్ చేయాల్సిందిగా జాక్సన్‌ను ప్రోత్సహించిన సర్ కర్జన్ వైలీని (లండన్‌లోని భారతీయ కార్యాలయంలోని ఉద్యోగి) చంపి, ఉరిశిక్షకు గురైనవారెవరు? (ఐరిష్ ప్రజలు ఈయనను మహా వీరుడిగా ప్రస్తుతించారు.)జ:  మదన్‌లాల్ డింగ్రా
11. 1912లో ఢిల్లీలో వైశ్రాయ్ లార్డ్ హార్డింజ్-II పై బాంబులు వేసి, జపాన్‌కు పారిపోయినవారు-జ:  రాస్‌బిహారీ బోస్
12. లార్డ్ హార్డింజ్-II పై బాంబుల దాడిని బ్రిటిష్ ప్రభుత్వం 'ఢిల్లీకుట్ర కేసు'గా పరిగణించి, నలుగురిని ఉరితీసింది. అందులో ఒకరు- బ్రిటిష్ పరిపాలనను తుదముట్టించడమే చివరికోరిక- అని చెప్పారు. వారెవరు?జ:  అవధ్‌బిహారీ
13. వారణాసి కుట్రకేసులో యావజ్జీవ కారాగారశిక్షకు గురైన బెంగాలీ యువకుడెవరు?(అతడు ఉత్తరప్రదేశ్‌లో విప్లవోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించాడు. వైశ్రాయ్ లార్డ్ హార్డింజ్-II పై బాంబుదాడుల్లో నిందితుడు)జ:  సచిన్ సన్యాల్
14. ఒరిస్సాలోని 'బాలాసోర్' వద్ద సాయుధ పోరాటాలు నిర్వహించి, పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన జ:  ప్రముఖ విప్లవ యోధుడు- జతిన్ ముఖర్జీ
15. 1911లో తిరునల్వేలి జిల్లా కలెక్టర్ 'ఆష్' హత్యకేసులో (తిరునల్వేలి కుట్ర) ప్రధాన నిందితుడై, ఆత్మహత్య చేసుకున్న వారు-జ:  వాంచీ అయ్యర్
16. దక్షిణ భారతదేశంలో ఏకైక విప్లవ సంస్థ-జ:  భారతమాత సంఘం
17. విదేశాల్లో భారతీయ విప్లవకారులకు స్ఫూర్తినిచ్చినవారు-జ:  శ్యాంజీ కృష్ణవర్మ
18. 'ది ఇండియన్ సోషియాలజిస్ట్' పత్రికను ఎవరు నిర్వహించారు? జ:  శ్యాంజీ కృష్ణవర్మ
19. బెర్లిన్‌లో భారత్ స్వాతంత్య్రం కోసం విప్లవ కార్యక్రమాలు నిర్వహించినవారు-జ:  వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ
20. విదేశాల్లో భారతీయ త్రివర్ణపతాకాన్ని ఎగురవేసిన మొదటి వ్యక్తిగా మేడమ్ కామా చరిత్ర సృష్టించారు. మరి ఆ సంఘటన ఏ దేశంలో జరిగింది? (1907లో)జ:  జర్మనీ
21. ప్యారిస్‌లో విప్లవ ఉగ్రవాద కార్యక్రమాలు నిర్వహించిన మేడమ్ కామా ఏ జాతీయ నాయకుడి ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేశారు?జ:  దాదాభాయ్ నౌరోజీ
22. గదర్‌పార్టీలో చేరిన రైతులు ఎక్కువగా ఏ మతానికి చెందినవారు?జ:  సిక్కు
23. గదర్ పార్టీలో చేరిన ఆంధ్రకు చెందిన ప్రముఖ వ్యక్తి-జ:  దర్శి చెంచయ్య
24. గదర్ అంటే-జ:  తిరుగుబాటు
25. 1913లో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో స్థాపించిన గదర్ పార్టీకి చెందిన వారు-జ:  లాల హరదయాళ్,  సోహన్ సింగ్ బంక్నా, రామచంద్ర భరద్వాజ్
26. కొమగటుమారు అనేది-జ:  జపాన్‌కు చెందిన నౌక
27. 1866లో లండన్‌లో ఈస్టిండియా అసోసియేషన్‌ను స్థాపించినవారు-జ:  దాదాబాయి నౌరోజి
28. 'వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ'కు సంబంధించింది-జ:  జిమ్మర్ ప్లాన్
29. సరికాని జత      విప్లవ స్థావరాలు -   స్థాపన       ప్యారిస్           -   మేడం కామా       వాంకోవర్        -  తారక్ నాథ్ దాస్        టోక్యో             -  లాలా హరదయాళ్జ:  టోక్యో - లాలా హరదయాళ్
30. 1924 చిట్టగాంగ్ రైల్వే స్టేషన్ దోపిడీకి నాయకత్వం వహించింది-జ:  సూర్యసేన్
31. మొదటి జాతీయ విప్లవ సంఘం-జ:  హెచ్.ఆర్.ఎ.
32. 1924లో కాన్పూర్‌లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ స్థాపనలో సంబంధం లేనివారు-జ:  చంద్రశేఖర్ ఆజాద్
33. 1925లో లక్నో సమీపంలో ప్రఖ్యాతిగాంచిన 'కకోరి రైలు దోపిడీ'లో నలుగురిని ఉరితీశారు. అందులో లేనివారు  కిందివారిలో ఎవ‌రు?   రాంప్రసాద్ బిస్మిల్ ,   అస్వకుల్లా ఖాన్ ,  రోష‌న్ లాల్‌ ,  జతీంద్రనాథ్‌దాస్జ:  జతీంద్రనాథ్‌దాస్
34. హెచ్.ఆర్.ఎ. ను హెచ్.ఎస్.ఆర్.ఎ. గా మార్చినవారు-జ:  చంద్రశేఖర్ ఆజాద్
35. 1928లో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ చారిత్రక సమావేశం ఎక్కడ జరిగింది?జ:  ఢిల్లీ
36. 1928లో సైమన్ కమిషన్ బహిష్కరణోద్యమంలో భాగంగా లాహోర్‌లో లాలా లజపతిరాయ్‌ను తీవ్రంగా కొట్టిన 'సాండర్స్'ను కాల్చి చంపినవారితో సంబంధం ఉన్నవారు (లాహోర్ కుట్రకేసు)-జ:  భ‌గ‌త్ సింగ్‌, సుఖ్‌దేవ్‌, రాజ్‌గురు
37. 1929లో కార్మికులు సమ్మెచేసే హక్కును రద్దు చేయడానికి ఉద్దేశించిన వాణిజ్య వివాదాల బిల్లు (ట్రేడ్ డిస్ఫ్యూట్), కమ్యూనిస్టులను అణచివేయదలచిన 'పబ్లిక్ సేఫ్టీ' బిల్లును బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో కేంద్ర శాసనసభపై బాంబులు వేసినవారు-జ:  భగత్‌సింగ్, బతుకేశ్వర దత్తా
38. లాహోర్ కుట్రకేసు నిందితులకు మరణశిక్ష అమలు జరిపిన సంవత్సరం-జ: 1931
39. లాహోర్ జైలులో ఖైదీలకు కనీస సదుపాయాల కోసం 63 రోజుల ఉపవాసాన్ని కొనసాగించిన విప్లవనాయకుడు మరణించగా, కలకత్తాలో ఆయన మృతదేహాన్ని ఊరేగించినప్పుడు ఆరు లక్షలమంది జనం పాల్గొన్నారు. ఆ నాయకుడి పేరు-జ:  జతిన్‌దాస్

No comments:

Post a Comment