Tuesday, January 24, 2017

కేంద్ర ప్రభుత్వ పథకాలు

*కేంద్ర ప్రభుత్వ పథకాలు*


*స్వచ్ఛభారత్‌*
* ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని రాజ్‌పథ్‌ రోడ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2014 అక్టోబరు 2న ప్రారంభించారు.
* ‘స్వచ్ఛభారత్‌ దిశగా ముందడుగు’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
* గతంలో ఉన్న ‘నిర్మల్‌ భారత్‌ అభియాన్‌’ను ఈ పథకంలో విలీనం చేశారు.
* 2019 అక్టోబరు 2 నాటికి గాంధీజీ 150వ జయంతి వరకు పరిశుభ్ర భారతదేశాన్ని సాధించడం దీని ప్రధాన లక్ష్యం.
* స్వచ్ఛభారత్‌కు 2016-17 బడ్జెట్‌లో 11,300 కోట్ల నిధులను కేటాయించారు.
* స్వచ్ఛభారత్‌ లోగోగా మహాత్మాగాంధీ కళ్లద్దాలను రూపొందించారు. ఈ లోగోను మహారాష్ట్రకు చెందిన అనంత్‌ ఖసెబర్దార్‌ రూపొందించారు.
* స్వచ్ఛభారత్‌ అభియాన్‌కు నిధులు సమకూర్చడానికి సేవాపన్నుపై అదనంగా 0.5ు సెస్‌ను 2015 నవంబరు 15 నుంచి విధించారు.
* స్వచ్ఛభారత్‌ అభియాన్‌ కింద మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.12,000లను అందిస్తున్నారు.

*బేటీ బచావో బేటీ పడావో*
+ ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ 2015 జనవరి 22న హర్యానాలోని పానిపట్టులో ప్రారంభించారు.
+ స్త్రీ, పురుష నిష్పత్తి తక్కువగా ఉన్న 100 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలుచేస్తారు.
+ మహిళలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలపై వారికి అవగాహన కల్పించి వారి సామర్ధ్యాన్ని పెంచడం ఈ పథక ఉద్దేశం.

*హృదయ్‌*
HRIDAY (Heritage City Development and Augmentation Yojana)
* వారసత్వ నగరాలను సంరక్షించేందుకు ఈ పథకాన్ని 2015 జనవరి 21న ప్రారంభించారు.
* ఈ పథకం కింద తొలిదశలో 12 నగరాలను ఎంపిక చేశారు. అవి-
1) వారణాసి (ఉత్తరప్రదేశ్‌) 2) పూరి (ఒడిశా) 3) వరంగల్‌ (తెలంగాణ) 4) అమరావతి (ఆంధ్రప్రదేశ్‌) 5) అమృత్‌సర్‌ (పంజాబ్‌) 6) అజ్మీర్‌ (రాజస్థాన్‌) 7) గయ (బీహార్‌) 8) మధుర (ఉత్తరప్రదేశ్‌) 9) కాంచీపురం (తమిళనాడు) 10) వేలంగిణి (తమిళనాడు) 11) బాదామీ (కర్ణాటక) 12) ద్వారక (గుజరాత్‌)

*మిషన్‌ ఇంద్రధనుష్‌*
+ ఈ పథకాన్ని 2014 డిసెంబరు 25న ప్రారంభించారు.
+   ఏడు రకాల వ్యాధులకు సంబంధించిన టీకాలను పిల్లలకు వేయాలనే లక్ష్యంతో ఈ మిషన్‌ను ప్రారంభించారు. ఈ ఏడురకాల వ్యాధులు: 1) డిప్తీరియా 2) కోరింతదగ్గు 3) ధనుర్వాతం 4) పోలియో 5) క్షయ 6) తట్టు 7) హైపటైటిస్‌-బి

*ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన*
* ఒక దేశం - ఒక పథకం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
* రైతులకు సామాజిక భద్రత కల్పించడానికి ఈ నూతన పంటల బీమా పథకాన్ని రూపొందించారు.
* 2016 జనవరి 13 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది.
*   ఈ పథకం కింద ఖరీఫ్‌ పంటలు అయితే బీమా మొత్తంలో 2ు, రబీ పంటలైతే బీమా మొత్తంలో 1.5ు సొమ్మును రైతుల నుంచి ప్రీమియంగా వసూలు చేస్తారు. ఉద్యానవన పంటలైతే బీమా మొత్తంలో 5ు ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది.

*ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన*
+ పేదలకు ఇళ్లు నిర్మించేందుకు 2015 జూన్‌ 25న ప్రధాని ఆవాస్‌ యోజనను ప్రారంభించారు.
+   2022 సం.లోగా బలహీన వర్గాల వారికి పూర్తిస్థాయిలో గృహాలను నిర్మిస్తారు.
+ ఈ పథకం కింద పేదవారికి రెండు కోట్ల ఇళ్లను నిర్మిస్తారు.

*స్మార్ట్‌ సిటీ కార్యక్రమం*
*   2015 జూన్‌ 25న ప్రారంభించారు.
* దేశవ్యాప్తంగా వంద నగరాలను అభివృద్ధి చేయాలన్నది దీని లక్ష్యం.
*   98 స్మార్ట్‌ సిటీల జాబితాను 2015 ఆగస్టు 27న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.
*   అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 13 నగరాలను ఎంపిక చేశారు.
*   స్మార్ట్‌ సిటీలుగా తెలంగాణలో వరంగల్‌, కరీంనగర్‌ను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ, తిరుపతి, విశాఖపట్టణాన్ని ఎంపిక చేశారు.
*   తొలి విడతలో స్మార్ట్‌ సిటీలుగా 20 నగరాలను ఎంపిక చేశారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి విశాఖ, కాకినాడ ఎంపికయ్యాయి.
*   ఈ పథకం కింద ఎంపిక చేసిన నగరాల్లో అయిదు సంవత్సరాలపాటు ఏటా 200 కోట్లను కేటాయిస్తారు.
* ఈ కార్యక్రమంలో భాగంగా నీటిసరఫరా, విద్యుత్‌, పారిశుద్ధ్యం, గృహనిర్మాణం, ఐటి, ఈ-గవర్నెన్స్‌, సుస్థిర పర్యావరణం, ఆరోగ్యం, విద్య వసతులు కల్పిస్తారు.

*అమృత్‌*
*(AMRUT- Atal Mission for Rejuvenation and Urban Transformation)*
+   ఈ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ 2015 జూన్‌ 25న ప్రారంభించారు.
+   దేశవ్యాప్తంగా 500 పట్టణాల్లో అవస్థాపన సౌకర్యాలు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం.
+   2015-16లలో ఈ మిషన్‌ కింద 89 నగరాలను ఎంపిక చేశారు.

*ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన*
*   2015 మార్చి 20న ప్రారంభించారు.
*   ఈ పథకం కింద 24 లక్షల మందికి శిక్షణ ఇప్పించి పరిశ్రమల్లో ప్రమాణాలు ప్రాతిపదికగా స్కిల్‌ ట్రైనింగ్‌ ఇస్తారు.
*   ఈ పథకం కింద శిక్షకునికి రూ.8000 నగదు ఇస్తారు.
* యువతలో నైపుణ్యాలను పెంపొందించడం ఈ పథక ప్రధాన ఉద్దేశం.
*   ఈశాన్య ప్రాంత యువతకు శిక్షణ ఇచ్చేందుకు రూ.150 కోట్లను కేటాయించారు.
*   మొత్తానికి ఈ పథకానికి రూ.1,500 కోట్లు కేటాయించారు.

*దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన*
+   2014 నవంబరు 20న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
+   దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు.
+   గతంలో దీనిని గ్రామీణ విద్యుదీకరణ పథకంగా పిలిచేవారు.
+   ఈ పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ 2015 జూలై 15న పాట్నాలో ప్రారంభించారు.
+   వ్యవసాయ రంగానికి, గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయడం దీని ముఖ్య ఉద్దేశం.

*ప్రధానమంత్రి కృషి సంచాయ్‌ యోజన*
*   2015లో ఈ పథకాన్ని ప్రారంభించారు.
* వ్యవసాయరంగం, గ్రామాలకు నీటిపారుదల సౌకర్యం కల్పించే ఉద్దేశంతో దీనిని ప్రారంభించారు.
* ఈ పథకం కింద కేంద్ర- రాష్ట్రాలు భరించే వ్యయం 75:25.
*  ఈశాన్య రాష్ట్రాల్లో 90:10 నిష్పత్తిలో వర్తిస్తాయి.
* సేద్యపు నీటి వినియోగాన్ని, సామర్ధ్యాన్ని పెంపొందిస్తూ సూక్ష్మ సాగునీటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటారు.

*ప్రధానమంత్రి ఉజ్వల్‌ యోజన*
+ 2016 మే 1న ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో ప్రారంభించారు.
+   బిపిఎల్‌ కుటుంబాల్లోని మహిళలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు అందిస్తారు.
+ అయిదు కోట్ల కనెక్షన్లను మూడు సంవత్సరాల్లో అందిస్తారు.

*ప్రధానమంత్రి సురక్షబీమా యోజన*
* ఈ పథకాన్ని 2015లో ప్రారంభించారు.
* ఇది ప్రమాద బీమా పథకం.
*  దీనికోసం సంవత్సరానికి రూ.12 ప్రీమియం చెల్లించాలి.
* ఇది 18 - 70 సంవత్సరాల వయస్సు వారికి వర్తిస్తుంది.
*  ఈ పథకం కింద రెండు లక్షల రూపాయల బీమాను అందిస్తారు.
*  వైకల్యం ఏర్పడిన వారికి లక్ష రూపాయల బీమాను ఇస్తారు.

*ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన*
+  ఈ పథకం 2015 మే9న ప్రారంభించారు.
+ ఇది జీవితబీమా పథకం.
+ ఈ పథకం 18-50 సంవత్సరాల వయస్సు వారికి వర్తిస్తుంది.
+ ఈ పథకం కింద రెండు లక్షల రూపాయల బీమా సదుపాయాన్ని కల్పిస్తారు.
+ దీని ప్రీమియం సంవత్సరానికి రూ.330.

*అటల్‌ పెన్షన్‌ యోజన*
*   ఈ పథకాన్ని 2015 మే 9న ప్రారంభించారు.
*   ఈ పథకం కింద 60 సంవత్సరాల తరవాత రూ.1000 నుంచి రూ.5000 వరకు పెన్షన్‌ను అందిస్తారు.
* పథకంలో వయసును బట్టి ప్రీమియం ఉంటుంది.
* దీనికి 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు వారు అర్హులు.

*ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన పథకం*
+   ఈ పథకం నినాదం ‘సబ్‌ కా సాథ్‌ - సబ్‌ కా వికాస్‌’.
+ 2014 ఆగస్టు 28న దీనిని ప్రారంభించారు.
+ దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్‌ అకౌంట్‌ ఉండేవిధంగా చర్యలు తీసుకునేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు.
+ ప్రస్తుతం నగదు బదిలీ పథకాన్ని ఈ పథకానికి విస్తరింపచేశారు.
+ ఈ పథకం కింద అకౌంట్‌ కలిగిన వారికి రూ.30000 బీమా సౌకర్యం, రూ.ఒక లక్ష, ప్రమాదబీమా సౌకర్యం లభిస్తుంది.

*డిజిటల్‌ ఇండియా*
*   2015 జూలై 1న ప్రధాని ప్రారంభించారు.
* గ్రామీణ ప్రాంతాలను హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తూ డిజిటల్‌ లిటరసీని మెరుగుపర్చేందుకు ప్రారంభించారు.
* సేవలను డిజిటల్‌ రూపంలో అందించడం ఈ పథక ముఖ్య ఉద్దేశం.

*శ్యాంప్రసాద్‌ ముఖర్జీ జాతీయ రూర్బన్‌ మిషన్‌*
+   ఈ పథకాన్ని 2016 ఫిబ్రవరి 21న చత్తీస్‌గఢ్‌లోని కురుభాత్‌ అనే గ్రామంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.
+ పట్టణ ప్రాంత సౌకర్యాలను గ్రామాల్లో కల్పిస్తూ మూడు సంవత్సరాల కాలంలో 300 స్మార్ట్‌ విలేజ్‌లను అభివృద్ధి చేస్తారు.
+ దేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలను అభివృద్ధి పరుస్తూ దేశాభివృద్ధికి తోడ్పడుతూ సమతౌల్య అభివృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
+గ్రామీణ ప్రాంతాలను బలోపేతం చేస్తూ, పట్టణ ప్రాంతాలపై ఉన్న భారాన్ని తగ్గిస్తారు.

*స్టాండప్‌ ఇండియా*
* ఈ పథకాన్ని 2016 ఏప్రిల్‌ 5న ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ప్రారంభించారు.
* ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఈ పథకం కింద రూ.10 లక్షల నుంచి ఒక కోటి వరకు రుణం మంజూరు చేస్తారు.

*స్టార్ట్‌ప్ ఇండియా*
+ 2016 జనవరి 16న ప్రారంభించారు.
+ కొత్త కంపెనీలను, వెంచర్లను ఉద్యోగాల కల్పన దిశగా ప్రోత్సహించడం ఈ పథక ఉద్దేశం.
+ రూ.25 కోట్ల లోపు వార్షిక టర్నోవర్‌ కలిగిన భారత సంస్థలకు ఈ పథకం కింద ప్రోత్సాహకాలు అందిస్తారు.
*ప్రధానమంత్రి ముద్రా యోజన*
*  ఈ పథకాన్ని 2015 ఏప్రిల్‌ 8న ప్రారంభించారు.
* చిన్న వ్యాపారులు, స్వయం సహాయక బృందాల కు, స్వయంఉపాధి పొందేవారికి చేయూతనివ్వ డానికి ఈ పథకాన్ని ప్రారంభించారు.
*   ఈ పథకం కింద రూ.10లక్షల వరకు రుణాన్ని అందిస్తారు.
*   ఈ పథకం కింద మూడు రకాలుగా రుణాన్ని మంజూరుచేస్తారు.
1) శిశు(రూ.50,000ల వరకు రుణాన్ని అంది స్తారు.
2) కిశోర్‌(రూ.50,00ల నుంచి అయిదు లక్షల వరకు రుణం)
3) తరుణ్‌(అయిదు లక్షల నుంచి పది లక్షల వరకు రుణం)
* ఈ పథకం కింద కేటాయించే నిధుల్లో సుమారు 60ు శిశు రుణాల కింద ఇవ్వడం జరుగుతుంది.
*సుకన్య సమృద్ధి యోజన*
+ ఈ పథకాన్ని 2015 జనవరి 22న హర్యానాలోని పానిపట్‌లో ప్రారంభించారు.
+ ఈ పథకం ఆడ పిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించి ప్రారంభించారు.
+ ఈ పథకం కింద బాలిక పేర పది సంవత్సరాల లోపు వారికి ఖాతాను ప్రారంభించాలి.
ఈ ఖాతా పోస్టాఫీసు లేదా బ్యాంకులో గాని నిర్వహించవచ్చు.
+ఖాతా రూ.1000లతో తెరిచి తరవాత నెలకు ఎంత మొత్తమైనా జమ చేయవచ్చు. కానీ, సంవత్సరానికి కనీసం రూ.1000లు ఖాతాలో జమ చేయాలి.
+ ఖాతా తెరిచిన నాటి నుంచి బాలిక వయస్సు 21 సంవత్సరాలు చేరినప్పటికి ఈ పథకం ముగు స్తుంది. పథకం కింద 14 సంవత్సరాల వరకు డబ్బును జమ చేయాలి.
+ 18 సంవత్సరాల తరవాత విద్య కోసం సగం నగదు తీసుకోవచ్చు.
+ 2016-17లో దీని వడ్డీరేటు 8.6% నిర్ణయించారు.
మేక్‌ ఇన్‌ ఇండియా
* 2014 సెప్టెంబరు 25న న్యూఢిల్లీలో ప్రధాని ప్రారంభించారు.

*   ఈ కార్యక్రమం లక్ష్యాలు
1) విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం.
2) తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడం.
3) సంపూర్ణ ఉద్యోగిత కల్పించడం.
4) 25 రంగాల్లో ఉపాధి కల్పన, నైపుణ్య పెంపుదల.
5) సాంకేతికతను పెంపొందించడం.
6) ఎగుమతులకు వీలు కల్పించడం.
7) ప్రభుత్వ ఆదాయ స్థాయిని పెంచడం.
8) పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడటం.
9) సరళీకరణ విధానాల ద్వారా పెట్టుబడులకు ప్రోత్సాహం.

No comments:

Post a Comment