Wednesday, January 18, 2017

భారతదేశ నది వ్యవస్థ (నదులు)

భారతదేశ నది వ్యవస్థ (నదులు)



నదులకు మూడు దశలు ఉంటాయని డబ్ల్యూఎన్ డేవిస్ పేర్కొన్నారు. నదులను మానవుని జీవిత దశలతో పోల్చారు.
1. బాల్యదశ: పర్వతమార్గంలో నది ప్రవహించే దశ
2. యవ్వనదశ: నది మైదానంలో ప్రవహించే దశ
3. వృద్ధాప్యదశ: నది వంకలు తిరుగుతూ సముద్రంలో కలిసే ముందు దశ
దేశంలో నదులను నది పరీవాహక ప్రాంతం (ఆయకట్టు) ఆధారంగా కేఎల్ రావు అనే భారతీయ శాస్త్రవేత్త మూడు భాగాలుగా విభజించారు.
1. భారీ తరహా నదులు (MAJOR RIVERS)
ఇవి దేశంలో 14 ఉన్నాయి. 20,000 చ.కి.మీ. నది పరీవాహక ప్రాంతం ఉంది.
ఇవి సముద్రంలోకి 85 శాతం నీటిని తీసుకెళ్తాయి.
2. మధ్యతరహా నదులు (MEDIUM RIVERS)
ఈ తరహా నదులు దేశంలో 44 ఉన్నాయి.
2000 నుంచి 20,000 చ.కి.మీ. నది పరీవాహక ప్రాంతం కలిగిఉంది.
ఇవి సముద్రంలోకి 7 శాతం నీటిని తీసుకెళ్తాయి.
3. చిన్న తరహా నదులు (SMALL RIVERS)
ఈ నదులు దేశంలో చాలా ఉన్నాయి.
2000 చ.కి.మీ. కంటే తక్కువ నది పరీవాహక ప్రాంతం కలిగి ఉంది.
ఇవి సముద్రంలోకి 8 శాతం నీటిని తీసుకెళ్తాయి.
పై నదుల్లో 77 శాతం నదులు బంగాళాఖాతంలో కలుస్తుండగా, 23 శాతం నదులు అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి.
మొత్తం నీటి పరిమాణంలో 90 శాతం నీరు బంగాళాఖాతంలో కలుస్తుంది. 10 శాతం నీరు అరేబియా సముద్రంలో కలుస్తుంది.
నదుల గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని పాటమాలజీ అని, సరస్సుల గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని లిమ్నాలజీ అని, నీటి గురించి అధ్యయనాన్ని హైడ్రాలజీ అని పిలుస్తారు.
ప్రపంచ మంచినీటి దినోత్సవం- మార్చి 22
ప్రపంచ నదుల దినోత్సవం- సెప్టెంబర్ 28
2003 సంవత్సరాన్ని అంతర్జాతీయ మంచినీటి సంవత్సరంగా యూఎన్‌ఓ ప్రకటించింది.
ఒడిశాలోని రూర్కిలో ఉన్న జాతీయ జల విజ్ఞాన సంస్థను 1979లో ఏర్పాటుచేశారు.
జాతీయ జలమండలి - 1990లో ఏర్పాటుచేశారు.
నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ ఆధారంగా నీటి నాణ్యతను నిర్ణయిస్తారు. (BIOLOGICAL OXYGEN DEMAND)

హిమాలయ నదులు



బ్రహ్మపు్ర తనది
మొత్తం పొడవు: 2,900 కి.మీ.
మనదేశంలో పొడవు: 880 కి.మీ.
ఈ నది టిబెట్ (చైనా ప్రావిన్స్), ఇండియా, బంగ్లాదేశ్ గుండా క్షొపవహిస్తుంది.
జన్మస్థలం: మానస సరోవరం (టిబెట్)
ఇది టిబెట్‌లోని కైలాసనాథ పర్వత శ్రేణిలో ఉన్న మానస సరోవరం సరస్సు వద్ద ఉన్న షిమ్‌యమ్‌డంగ్ హిమనీ నదం వద్ద జన్మించి టిబెట్ గుండా ప్రవహిస్తూ ఇండియాలో నామ్చాబార్వా శిఖరం (అరుణాచల్‌ప్రదేశ్) వద్ద అడ్డు తిరిగి (యూ టర్న్ తీసుకొని) జిడో వద్ద అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రవేశిస్తుంది. అసోంలోకి సాదియా అనే ప్రాంతం వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది.
అసోం గుండా ప్రవహిస్తూ దుబ్రి వద్ద బంగ్లాదేశ్‌లో ప్రవేశించి గోలుండ్ వద్ద పద్మ లేదా గంగానదిలో కలుస్తుంది. ఆ తర్వాత డాఖిన్‌షా బాజ్‌పూర్ దీవుల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
బ్రహ్మపుత్ర నదిని వివిధ దేశాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.
టిబెట్‌లో- యార్లాంగ్ త్సాంగ్‌పో (టిబెట్ భాషలో శుద్ధి చేసేవాడు అని అర్థం. THE PURIFIER)

అరుణాచల్‌ప్రదేశ్- దిహంగ్
అసోం- సైడంగ్
బంగ్లాదేశ్- జమున (పద్మానదితో కలవకముందు)
బంగ్లాదేశ్‌లో గంగానది (పద్మానది)తో కలిసిన తర్వాత (రెండింటినీ కలిపి)- మేఘన
చైనా- యార్లాంగ్ జాంగ్‌బో జియాన్‌జిన్
ఇండియా- రెడ్ రివర్

బ్రహ్మపుత్ర ఉపనదులు


బ్రహ్మపుత్ర నదికి ఉత్తరాన కలిసే ఉపనదులు: తీస్తా, మానస, గంగాధర్, బేల్‌సిరి, ధరణ్‌సిరి, సుభనసిరి
దక్షిణవైపు నుంచి కలిసే ఉప నదులు: దిబ్రూ, డిక్కు, దిహంగ్
పర్వతీయ నది: రాగాత్సాంగ్‌పో
బ్రహ్మపుత్ర నదికి అసోం దుఃఖదాయని అనే పేరు ఉంది. (ఇది దిశను మార్చుకొని భయంకర వరదతో ప్రవహిస్తుంది)
బ్రహ్మపుత్ర నది చైనా, ఇండియా, బంగ్లాదేశ్‌ల మధ్య వివాదాస్పదమైనది.
ఈ నది అసోంలో మాజోలి అనే ద్వీపాన్ని ఏర్పర్చింది. దీని విస్తీర్ణం 1250 చ.కి.మీ.
ఇది ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపం
ఈ నది పరీవాహక ప్రాంతంలోని జోర్హాట్ జిల్లాలో కజిరంగా నేషనల్ పార్క్ (1905 - 2005 వందేండ్లు పూర్తి) ఉంది. ఇది ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి.
బ్రహ్మపుత్ర నది S ఆకారంలో ప్రవహిస్తుంది.
సాదియా (అసోం) నుంచి దుబ్రి (బంగ్లాదేశ్) వరకు 2వ నంబర్ జాతీయ రహదారి ఉన్నది.
ఈ నది పరీవాహక ప్రాంతంలోనే (అసోం) దేశంలో మొదటి చమురుబావి అయిన దిగ్భాయ్‌ని 1890లో స్థాపించారు.

గంగానది


గంగానది మొత్తం పొడవు- 2,525 కి.మీ.
ప్రవహించే దేశాలు- భారత్, బంగ్లాదేశ్
భారతదేశంలో పొడవు- 2,510 కి.మీ.
జన్మస్థలం: గంగానది భగీరథి, అలకనంద అనే రెండు నదుల కలయిక వల్ల జన్మించింది.
భగీరథి జన్మస్థలం- గంగోత్రి హిమానీనదం (ఉత్తరాఖండ్)
అలకనంద జన్మస్థలం- అలకపురి హిమానీనదం (ఉత్తరాఖండ్)
అలకనంద, భగీరథి అనే రెండు నదులు దేవప్రయాగ (ఉత్తరాఖండ్) వద్ద కలిసి గంగానదిగా ఏర్పడి అక్కడి నుంచి సుమారు 280 కి.మీ. అంతర్భూభాగ నదిగా ప్రవహిస్తూ హరిద్వార్ వద్ద మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది.
ఈ నది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ (జార్ఖండ్), పశ్చిమబెంగాల్ రాష్ర్టాల గుండా ప్రవహిస్తూ ఫరక్కా ప్రాజెక్టు వద్ద రెండు పాయలుగా విడిపోతుంది.
ఒక పాయ పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరంలోకి ప్రవేశింస్తుంది. దీనిని హుగ్లీ నది అని (రాజమహల్ కొండల వద్ద గంగానది - హుగ్లీ నది) (భగీరథి)
రెండో పాయ బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. దీన్ని పద్మానది అని అంటారు.
బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించిన పద్మానది గొలుండ్ వద్ద జమునా నదితో (బ్రహ్మపుత్ర) కలిసి మేఘన నదిగా ప్రవహిస్తూ డాఖిన్‌షా బాజ్‌పూర్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

గంగానది పొడవు వివిధ రాష్ర్టాల్లో


1. ఉత్తరాఖండ్ - 310 కి.మీ.
2. ఉత్తరప్రదేశ్ - 1450 కి.మీ.
3. బీహార్ - 445 కి.మీ.
4. పశ్చిమబెంగాల్ - 520 కి.మీ.

గంగానది ఉపనదులు


యమున (ఉత్తరప్రదేశ్), సోన్ (బీహార్), దామోదర్ (పశ్చిమ బెంగాల్) - ఇవి కుడివైపు నుంచి, దక్షిణ దిక్కు నుంచి గంగానదిలో కలిసే ఉప నదులు
రామ్‌గంగా, గోమతి, భాగమతి (ఉత్తరప్రదేశ్), గండక్, కోసి, ఘాగ్రా, కాలి (బీహార్)- ఇవి ఎడమ వైపు నుంచి, ఉత్తర దిక్కు నుంచి గంగానదిలో కలిసే ఉపనదులు.
గంగానది తీరాన ఉన్న ప్రధాన నగరాలు
హరిద్వార్ - ఉత్తరాఖండ్
కాన్పూర్ - ఉత్తరప్రదేశ్
అలహాబాద్ - ఉత్తరప్రదేశ్
వారణాసి - ప్రయాగ
మొఘల్ సరాయ్ - బీహార్
పాట్నా - బీహార్
ససారాం - బీహార్
నోట్: గోమతి నది తీరాన లక్నో, హుగ్లీ నది తీరాన కోల్‌కతా, సరయూ నది తీరాన అయోధ్య ఉంది.
ప్రాముఖ్యం: ఇది దేశంలో పొడవైన నది. అధిక నీటి పరిమాణంతో ప్రవహించే రెండో పెద్ద నది.
గంగానది అతి తరుణ నది (యవ్వన నది), భారతదేశ విస్తీర్ణంలో 26.3 శాతం భూభాగాన్ని పరీవాహక ప్రాంతంగా అత్యధికంగా కలిగి ఉంది.
గంగానది పరీవాహక ప్రాంతం మనదేశంలో 8,61,404 చ.కి.మీ.గా ఉంది.
గంగానది పరీవాహక ప్రాంతంలో సుమారు 40 కోట్ల జనాభా నివసిస్తున్నారు. గంగ, యుమన, సరస్వతి నదులు కలిసి అలహాబాద్ వద్ద త్రివేణిసంగమం ఏర్పడినది.
ఫరక్కా ప్రాజెక్టును గంగానది వల్ల కోల్‌కతా ఓడరేవును రక్షించడానికి నిర్మించారు.
2008 నవంబర్ 4న గంగానదిని జాతీయ నదిగా ప్రకటించారు.

గంగానది ఉప నదులు


యమునా నది
పొడవు: 1376 కి.మీ.
జన్మస్థలం: ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి హిమానీనదం వద్ద ఉన్న బండార్ పుంచ్ శిఖరం
మైదానంలోకి ప్రవేశించే ప్రాంతం- తజేవాలా (ఉత్తరాఖండ్)
ఈ నది ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల గుండా ప్రవహిస్తూ యూపీలోని అలహాబాద్ (ప్రయాగ) వద్ద గంగానదిలో కలుస్తున్నది.
అలహాబాద్ వద్ద సరస్వతి నది కూడా కలుస్తున్నది. దీనినే త్రివేణి సంగమం అంటారు. గంగా నది ఉప నదుల్లో కెల్లా యమునా నది పొడవైనది.
ఇక్కడ ప్రతి 144 ఏండ్లకోసారి (అలహాబాద్) మహాకుంభమేలా ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి 12 ఏండ్లకోసారి కుంభమేళ ఉత్సవాలు జరుగుతాయి. కుంభమేళ ఉత్సవాలు జరిగే ప్రదేశాలు
1. అలహాబాద్ (ఉత్తరప్రదేశ్)
2. హరిద్వార్ (ఉత్తరాఖండ్)- గంగా నదిపై
3. నాసిక్ (మహారాష్ట్ర)- గోదావరి నదిపై
4. ఉజ్జయిని (మధ్యప్రదేశ్)- శిప్రానదిపై
2 యుమునా నది ఉప నదులు: చంబల్, బెట్వా, క్రేన్. ఈ మూడు నదుల కలయికను కౌఠీలా అంటారు.
2 చంబల్ నది: ఇది మధ్యప్రదేశ్‌లోని జనపావో కొండల్లో గల మౌ అనే ప్రదేశంలో జన్మిస్తుంది.
2 బెట్వా నది: ఇది మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపాన ఉన్న కైమూర్‌కొండల్లో జన్మిస్తుంది. దీన్ని నేత్రావతి నది అని కూడా పిలుస్తారు.
2 కెక్ నది: ఇది మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపాన ఉన్న కైమూర్ కొండల్లో జన్మిస్తుంది. దీన్ని కర్ణావతి నది అని కూడా పిలుస్తారు.
2 ఈ మూడు నదులు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాలు, చంబల్ లోయ, రాజస్థాన్ గుండా ప్రవహిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని ఎటోవా జిల్లాలో యమునా నదిలో కలుస్తుంది. తర్వాత ఆ నది యమునా నదిగా ప్రవహిస్తూ అలహాబాద్ వద్ద గంగా నదిలో కలుస్తుంది.

దామోదర నది


చోటానాగపూర్ పీఠభూమిలోని టోరి వద్ద జన్మించి, రాజమహల్ కొండలను చీల్చుకుంటూ వాటి పగులు లోయల గుండా ప్రవహిస్తూ పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ నదిలో కలుస్తుంది.
దీన్ని బెంగాల్ దుఃఖదాయని అని పిలుస్తారు. దీని ఉప నదులు బార్కార్, కోనార్.
3. గండక్ నది: ఇది నేపాల్‌లోని ఎవరెస్ట్, ధవళగిరి శిఖరాల మధ్య జన్మించి బీహార్‌లో గంగానదిలో కలుస్తుంది. దీన్ని నేపాల్‌లో సాలగ్రామి అని, బీహార్‌లో నారాయణి అని పిలుస్తారు.
4. కోసినది: దీన్ని సంస్కృతంలో కౌసికి అంటారు. ఇది నేపాల్, టిబెట్, సిక్కిం ప్రాంతాల సరిహద్దుల్లో జన్మిస్తుంది. ఇది బీహార్‌లో గంగానదిలో కలుస్తుంది.
కోసిని ప్రారంభంలో సప్తకోసి అని పిలిచేవారు. వీటిలో ముఖ్యమైనవి అరుణ్‌కోసి, తుమార్‌కోసి, సన్‌కోసి. దీన్ని (కోసినది) బీహార్ దుఃఖదాయని అని పిలుస్తారు.

నదులు


మనదేశంలో నది జన్మ స్థానాలను అనుసరించి నదులను మూడు సముదాయాలుగా విభజించవచ్చు. అవి..
1. హిమాలయ నదులు
2. ద్వీపకల్ప నదులు
3. అంతర్ భూభాగ నదులు

హిమాలయ నదులు


హిమాలయాల కంటే పూర్వం ఏర్పడ్డ నదులు: అలకనంద, బ్రహ్మపుత్ర, సట్లేజ్, ఇండస్ (సింధు)
హిమాద్రి నదులు: గంగా, కాలి, గండక్, తీస్తా, ఘగ్రా
హిమాచల్ హిమాలయాల్లో జన్మించిన నదులు : జీలం, చీనాబ్, బియాస్, రావి.
శివాలిక్ నదులు: హిండన్, సొలాని
పురాణాల్లో పేర్కొన్న అతి ప్రాచీన నది- సరస్వతి
ద్వీపకల్ప నదులు : వృద్ధ నదులు
పశ్చిమాన ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నదులు- 13. అవి..
మహి, సబర్మతి (గుజరాత్)
బానీ, బనాస్ (రాజస్థాన్)
నర్మద, తపతి (మధ్యప్రదేశ్)
భరత్ పూజ, మాండవి (గోవా)
పంబ, పెరియార్ (కేరళ)
శరావతి, నేత్రావతి, గంగావళ్లి (కర్ణాటక)
తూర్పున ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నదులు- 9
గంగా, దామోదర (పశ్చిమబెంగాల్)
బ్రహ్మణి, మహానది (ఒడిశా)
గోదావరి, కృష్ణా, పెన్నా (ఆంధ్రప్రదేశ్)
కావేరి (తమిళనాడు)
తుంగభద్ర - ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణానదిలో కలుస్తుంది.
దక్షిణం నుంచి ఉత్తరాన ప్రవహించే నదులు: చంబల్, బెట్వా, కేన్ (ఈ మూడు నదులు యమునా నదిలో కలుస్తాయి)
సోన్ (గంగానదిలో కలుస్తుంది)
ఈశాన్యం నుంచి బంగాళాఖాతంలో కలిసే నదులు: బ్రహ్మపుత్ర
అంతర్ భూభాగ నదులు
ఈ నదులు రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో ఉన్న లూనీ, బనాస్, సరస్వతి
జమ్ముకశ్మీర్ లడఖ్‌లో ఉన్న గగ్గర్ (ఇది ఇండియాలో అతి పెద్ద అంతర్భాగ నది)
నోట్: ప్రపంచంలో అతి పెద్ద అంతర్భాగ నది- వోల్గా నది (రష్యాలో)
ఇండియాలో నీటి పరిమాణంలో పెద్ద నది- బ్రహ్మపుత్ర, రెండో పెద్ద నది - గంగా
దేశంలో పొడవైనది- గంగా (2,525 కి.మీ.), రెండో పొడవైనది - గోదావరి (1,465 కి.మీ.)
దేశంలో పొడవైన ఉపనది- యమున (1,372 కి.మీ.), రెండో పొడవైన ఉపనది- చీనాబ్ (1,180 కి.మీ.)
మనదేశ జాతీయ, పవిత్ర, కలుషితనది- గంగానది
గంగా నది భారతీయుల జీవనాడి అని పేర్కొన్నది
- జవహర్‌లాల్ నెహ్రూ
జాతీయ జల జంతువు- గంగా డాల్ఫిన్
ప్రపంచంలో నీటి పరిమాణంలో పెద్ద నది- అమేజాన్ (బ్రెజిల్, దక్షిణ అమెరికా)
ప్రపంచంలో నీటి పరిమాణంలో రెండో పెద్దనది- కాంగోనది (కాంగోదేశం జైరినది, ఆఫ్రికా)
ఇటీవల అమేజాన్ నదికి ఒక అంతర్‌వాహిని నదిని కనుగొన్నారు. దాని పేరు - హమ్ల
ప్రపంచంలో పొడవైన నది- నైలునది (ఆఫ్రికా 6,650 కి.మీ.)
అమేజాన్ 6,350 కి.మీ. (దక్షిణ అమెరికా)
అంతర్జాతీయనది- డాన్యూబ్ నది (ఐరోపా)

గంగ, యమున, సరస్వతి కలిసే ప్రదేశం - అలహాబాద్
భగిరథి, అలకనంద కలిసే ప్రదేశం - దేవప్రయాగ
మందాకిని, అలకనంద కలిసే ప్రదేశం - రుద్ర ప్రయాగ
పండార్, అలకనంద కలిసే ప్రదేశం - కరుణ ప్రయాగ
గంగానది అత్యధిక భాగం - ఉత్తరప్రదేశ్‌లో, గంగానది అత్యల్ప భాగం - ఉత్తరాఖండ్‌లో ప్రవహిస్తుంది.

EXOTIC నదులు


ఎడారి గుండా ప్రవహించే జీవ నదులు
1. నైలు నది- సహార ఎడారి (ఆఫ్రికా ఖండం)
2. ఆరెంజ్ నది- కలహరి ఎడారి (ఆఫ్రికా ఖండం)
3. ఇండస్ నది (సింధు) - థార్ ఎడారి (ఆసియా ఖండం)
4. డార్లింగ్ నది - ఆస్ట్రేలియా (ఆస్ట్రేలియా ఖండం)
పగులులోయ గుండా ప్రవహించే నదులు
నర్మద, తపతి, దామోదర్ (ఇండియా), రైన్ - జర్మనీ, కొలరాడో - అమెరికా
SINGLE LETTER RIVERS
మా నది- భూటాన్
టీ నది- భూటాన్
పో నది- ఇటలీ
డీ నది- అమెరికా

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు



1.అసోంలో భారీ వరదలు ఏ నది వల్ల వస్తాయి? (3)
1) గోమతి 2) గంగ
3) బ్రహ్మపుత్ర 4) యమున

2.దేశంలో ఎక్కువగా వరదలు వచ్చే నది? (4)
1) గోదావరి 2) గోమతి
3) కావేరి 4) బ్రహ్మపుత్ర

3.ప్రపంచ నీటి దినం? (2)
1) మార్చి 21 2) మార్చి 22
3) మార్చి 23 4) మార్చి 24

4.ఇండియాలో పడమర దిక్కు పారే నదులు (3)
1) గోదావరి 2) కావేరి 3) నర్మదా 4) కృష్ణా

5.కింది వాటిలో ఏ నదీతీరం అత్యధిక నీటి పరీవాహక ప్రాంతాన్ని కలిగి ఉంది? (1)
1) గంగా 2) బ్రహ్మపుత్ర
3) యమున 4) గోదావరి

6.కింది వాటిలో ఏ నది సమూహం టిబెట్‌లో ప్రారంభ మూలాల్ని కలిగి ఉన్నాయి? (4)
1) బ్రహ్మపుత్ర, గంగ, సట్లేజ్
2) గంగ, సట్లేజ్, యమున
3) చీనాబ్, రావి, సట్లేజ్
4) బ్రహ్మపుత్ర, ఇండస్, సట్లేజ్

7.ఎక్కువ పొడవైన నది ఏది? (2)
1) బ్రహ్మపుత్రం 2) గంగ
3) గోదావరి 4) నర్మద

8.గంగానది పొడవు ఎన్ని కిలోమీటర్లు? (4)
1) 2710 కి.మీ 2) 2610 కి.మీ
3) 2410 కి.మీ 4) 2510 కి.మీ

9.హిమాలయలకన్నా ప్రాచీనమైన నది? (2)
1) గంగ 2) బ్రహ్మపుత్ర 3) యమున 4) కోసి

10.బ్రహ్మపుత్ర నది పొడవు దాదాపుగా? (1)
1) 2900 కి.మీ. 2) 3900 కి.మీ.
3) 1800 కి.మీ. 4) 2100 కి.మీ.


11.గోమతి నది ఒడ్డున ఉన్న భారతీయ పట్టణం? (1)
1) లక్నో 2) అలహాబాద్ 3) నాసిక్ 4) ఢిల్లీ

12.దేశంలోని అతి పెద్ద నది ముఖద్వారం ఏది? (1)
1) హుగ్లీ 2) భగీరథి 3) గోదావరి 4) కృష్ణ

13.బ్రహ్మపుత్ర నదికి మరోక పేరు? (3)
1) అతి పెద్దనది 2) చిన్ననది
3) దుఃఖనది 4) తూర్పునది

14.సోన్ నది ఏ నదికి ఉపనది? (1)
1) గంగ 2) యమున 3) నర్మద 4) సట్లేజ్

15.చైనా, ఇండియాలో ప్రవహించే నది? (3)
1) గంగ 2) యమున
3) బ్రహ్మపుత్ర 4) తుంగభద్ర

No comments:

Post a Comment