Thursday, January 26, 2017

ఆర్డినెన్స్, కాలపరిమితి

రాజ్యాంగంలో ఆర్డినెన్స్ 


-రాజ్యాంగం అధికరణ 123 ప్రకారం పార్లమెంటు ఉభయసభలు సమావేశంలో లేనప్పుడు అత్యవసరంగా చట్టం చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే, ఆర్డినెన్స్ రూపంలో రాష్ట్రపతి చట్టం చేస్తారు.
-గవర్నర్ అయితే ఆర్టికల్ 213 (1) ప్రకారం ఇదే తరహా ఆర్డినెన్స్ జారీ చేస్తారు.
code😀
123-213
  ఆర్డినెన్స్ కాలపరిమితి
-సాధారణంగా ఆర్డినెన్స్‌ను పార్లమెంటు తిరిగి సమావేశమైన తరువాత ఆరు వారాల్లోపు ఆమోదించాలి.
-ఈ ఆర్డినెన్స్ పార్లమెంటు ద్వారా ఆమోదం పొందకుండా గరిష్టంగా ఏడు నెలల పదిహేను రోజులు అమల్లో ఉంటుంది.
-అంటే పార్లమెంటు ఒక సమావేశానికి, మరొక సమావేశానికి మధ్య కాలం ఆరు నెలలు, అలాగే పార్లమెంటు సమావేశమైన తరువాత, ఆరు వారాల్లోపు ఆమోదించవచ్చనే నియమం వల్ల, ఒకవేళ పార్లమెంటు సమావేశం ముగిసిన తరువాత ఆర్డినెన్స్ జారీ అయి, తిరిగి సమావేశమైన తరువాత ఆరో వారం చివరి రోజున ఆమోదించినట్లయితే 6 నెలలు+ 6 వారాలు, గరిష్టంగా ఏడున్నర నెలలు అవుతుంది.
-అయితే ఆర్డినెన్స్‌కు కనిష్ట కాలపరిమితి లేదు. దీన్ని రాష్ట్రపతి ఎప్పుడైనా రద్దు చేయవచ్చు.
అసలు ఎందుకు వివాదాస్పదమవుతుంది?

-నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 26 ఆర్డినెన్స్‌లు జారీచేసింది. అంటే కేవలం రెండున్నరేండ్లలో ఇన్ని ఆర్డినెన్స్‌లు జారీఅయ్యాయంటే పార్లమెంటరీ వ్యవస్థ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

No comments:

Post a Comment