Wednesday, January 18, 2017

Current affairs...

📚Current affairs...📚
   ( Q 1 to 50 )
🍃_________🌺__________🍃
1. ఇటీవల ఏ దేశంలో భారతదేశ రేడియో, టీవీ, సినిమాలను పూర్తిగా నిషేధించారు?
1) ఇరాన్
2) పాకిస్థాన్
3) ఇరాక్
4) సిరియా

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ(PEMRA)పాకిస్థాన్‌లోఅక్టోబర్ 21, 2016 నుంచి భారత్ రేడియా కార్యక్రమాలపై పూర్తి నిషేధం విధించింది.

2. ఇటీవల మిలాన్ సిటీ కౌన్సిల్ ఏ వ్యక్తికి ‘మిలాన్’ గౌరవ పౌరసత ్వంను ప్రదానం చేసింది?
1) దలైలామా
2) పోప్ ఫ్రాన్సిస్
3) షేక్ నియుర్ ఆల్ నియుర్
4) లీలా అల్ కోల్చ

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: దలైలామా టిబెట్‌లోని టక్టసర గ్రామంలో జన్మించారు. చైనా ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికీ మిలాన్ సిటీ కౌన్సిల్ దలైలామాకు గౌరవ పౌరసత్వాన్ని ప్రదానం చేసింది.

3. స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ముంబయిప్రదానం చేసే జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) కపిల్ దేవ్
2) అనిల్ కుంబ్లే
3) రాహుల్ ద్రావిడ్
4) సునీల్ గవాస్కర్

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: క్రీడలలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన, జీవితాంతం క్రీడలకు సేవ చేసిన వారిని గౌరవించడానికిSJAMఈ పురస్కారాన్ని 2013లోనెలకొల్పింది. మొదటి సాఫల్య పురస్కారాన్ని నందు పటేకర్‌కు ప్రదానం చేశారు. 2016 పురస్కారానికి సునీల్ గవాస్కర్ ఎంపికయ్యాడు.

4. ‘‘ ది స్లీప్ వాకర్స్ డ్రీమ్’’ పుస్తక రచయిత ఎవరు?
1) కిరణ్ దేశాయ్
2) అమితావ్ ఘోశ్
3) ధృబజ్యోతి బొర
4) అనితా ముఖర్జీ

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: ధృబజ్యోతి బొర అస్సాం సాహిత్య సభ అధ్యక్షుడుగా పనిచేస్తున్నాడు. ఇతనికి 2009లో సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆయన ‘‘ది స్లీప్ వాకర్స్ డ్రీమ్’’ అనే పుస్తకంలో మిలిటరీ గురించి రాశారు.

5. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ వ్యాధి నిర్ధారణ కోసం మునిలాప్ప కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
1) సార్స్
2) బర్డ్‌ప్లూ
3) స్వైన్ ఫ్లూ
4) డెంగ్యూ

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: దేశంలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి, నియంత్రణ కోసం ప్రభుత్వం కేంద్ర పశు సంవర్థక శాఖ జాయింట్ కమిషనర్ మునిలాప్ప నాయకత్వంలో కమిటీ వేసింది.

6. ఇటీవల మైక్రోసాఫ్ట్ సైబర్ సెక్యూరిటీ సెంటర్‌ను ఎక్కడ ప్రారంభించారు?
1) ముంబయి
2) హైదరాబాద్
3) మద్రాస్
4) న్యూఢిల్లీ

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: మైక్రోసాఫ్ట్ ఇప్పటి వరకు ఏడు సైబర్ సెక్యూరిటీ సెంటర్‌లను ఏర్పాటు చేసింది. అవి సింగపూర్, టోక్యో, సియోల్, బీజింగ్, బెర్లిన్, వాషింగ్టన్ డీసీ, న్యూఢిల్లీ.

7. ది యూరోపియన్ గోల్డెన్ షూ పురస్కారం- 2016న కు ఎంపికైన ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఎవరు?
1) క్రిస్టియానో రోనాల్డో
2) థామస్ ముల్లర్
3) లూయిస్ సువరెజ్
4) నైమర్ డ సిల్వా

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: బార్సిలోనా క్లబ్ తరుపున ఈ సీజన్‌లో 40 గోల్స్ చేసిన లూయిస్ సువరేజ్కు రెండవ సారి ఈ అవార్డు దక్కింది.

8. పందులలో ఉండే నులిపురుగు నివారణ కోసం వ్యాక్సిన్‌ను తయారు చేసిన సంస్థ ఏది?
1) NDDB
2) NASI
3) INDB
4) Icrisat

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: జాతీయ ఇమ్యూనాలాజికల్ లిమిటెడ్ అనుబంధ సంస్థ జాతీయ డైరీ డె వలప్‌మెంట్ బోర్డ్ (NDDB) పందులలో నులిపురుగు (Tape worm) నివారణ కోసం 'CYSVAX'అనే వ్యాక్సిన్ను తయారుచేసింది.

9. లోసార్ ఉత్సవాన్ని ఏ రాష్ట్రంలో నిర్వహించుకుంటారు?
1) అస్సోం
2) అరుణాచల్ ప్రదేశ్
3) హిమచల్ ప్రదేశ్
4) హర్యానా

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: అరుణాచల్ ప్రదేశ్లోని మెనోపా తెగ నూతన సంవత్సర పండుగను ‘లోసార్’ పేరుతో నిర్వహించుకుంటుంది.

10. G-20 అవినితీ వ్యతిరేక కార్యవర్గ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు?
1) న్యూయార్క్
2) సిడ్నీ
3) బెర్లిన్
4) పారిస్

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: 6వ FATF,G-20 అవినీతి వ్యతిరేక కార్యవర్గ సంయుక్త సమావేశాన్ని ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో నిర్వహించారు. ప్రపంచంలో పారదర్శక పాలన, అవినీతి రహిత సమాజం సృష్టి కోసం ఈ సమావేశం నిర్వహించారు.

11. ఇటీవల ప్రపంచ బ్యాంక్ పురస్కారానికి ఎంపికైన డ్యామ్ ఏది?
1) ఆల్మట్టి
2) నాగర్జున సాగర్
3) హిరాకుడ్
4) భాక్రా

View Answer

స‌మాధానం: 1

12. ఫిఫా అండర్-17 మహిళల ఫుట్‌బాల్ కప్- 2016 విజేత ఎవరు?
1) జపాన్
2) దక్షిణ కొరియా
3) ఉత్తర కొరియా
4) మలేషియా

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: ఉత్తర కొరియా జపాన్‌ను ఓడించి ఫిఫా అండర్ 17 మహిళల ఫుట్‌బాల్ కప్‌ను గెలుచుకుంది.

13. హుగెవిన్(Hoogeveen) అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ విజేత ఎవరు?
1) ఎమ్. ఆర్. లలిత్ బాబు
2) జి.ఎమ్. శ్యామ్ సుందర్
3) సందీప్ చంద్ర
4) అభిజిత్ గుప్తా

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: నెదర్లాండ్స్‌లో జరిగిన హుగెవిన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ టైటిల్‌ను అభిజిత్ గుప్తా వరుసగా రెండోసారి గెలుచుకున్నాడు.

14. ప్రపంచ కబడ్డీ కప్ 2016 విజేత ఎవరు?
1) ఇరాన్
2) ఇరాక్
3) ఇండియా
4) ఇండోనేషియా

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: కబడ్డీ ప్రపంచ కప్ 2016ను అహ్మాదాబాద్‌లో నిర్వహించారు. ఈ పోటీలలో 12 జట్లు పాల్గొన్నాయి. ఇరాన్‌ను ఓడించి ఇండియా ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.

15. భారతదేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్స్ సంస్థ ఏది?
1) ఇండియన్ ఎయిర్ లైన్స్
2) ఇండిగో
3) జెట్ ఎయిర్ వేస్
4) స్పైస్ జెట్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: ఇండియాలో ప్రయాణికులను ఎక్కువగా తీసుకువెళ్లే విమానయాన సంస్థ ఇండిగో, తర్వాతి స్థానాలలో జెట్ ఎయిర్‌వేస్, ఇండియన్ ఎయిర్ లైన్స్ ఉన్నాయి.

16. ప్రపంచంలో అతి పొడవైన నాన్-స్టాప్ విమాన రూట్ ఏది?
1) దుబాయి- అక్లాండ్
2) న్యూఢిల్లీ- శాన్ ఫ్రాన్సిస్కో
3) దుబాయి- శాన్ ఫ్రాన్సిస్కో
4) బీజింగ్- వాషింగ్టన్ డీసీ

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: న్యూఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు పసిఫిక్ మార్గం గుండా నాన్ స్టాప్ విమాన సర్వీసులను ఇండియాఇటీవలప్రారంభించింది. ఈ మార్గం పొడవు 15,300 కి.మీ. రెండవ స్థానంలో దుబాయి- అక్లాండ్ విమాన రూట్ (14,120 కి.మీ.) ఉంది.

17. 19 వ ప్రపంచ శాంతి సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు?
1) నాసిక్
2) బెర్లిన్
3) బీజింగ్
4) మాస్కో

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: గోఖలే ఎడ్యుకేషన్ సొసైటీ, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఎడ్యుకేటర్స్ ఫర్ వరల్డ్ పీస్ సంస్థ సంయుక్తంగా నాసిక్‌లో ఈ సమావేశాన్నినిర్వహించాయి.

18. ప్రతిష్టాత్మక కాంబ్రియన్ మిలిటరీ విన్యాసాలలో బంగారు పతాకం గెలుచుకున్న దేశం ఏది?
1) బ్రిటన్
2) యుఎస్‌ఏ
3) కెనడా
4) ఇండియా

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: ప్రతి సంవత్సరం కాంబ్రియన్ పర్వతాలలో (వేల్స్) కాంబ్రియన్ గస్తి విన్యాసాలు నిర్వహిస్తారు. ఈ విన్యాసాలలో భారత సైన్యం బంగారు పతాకం గెలుచుకుంది.

19. ఇటీవల ఏ దేశం ఆల్కహల్‌పై పూర్తి నిషేధం విధించింది?
1) ఇండియా
2) ఇరాక్
3) ఇరాన్
4) ఇండోనేషియా

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: ప్రజలలో నైతిక విలువలు కాపాడటానికి ఇరాక్‌లో ఆర్టికల్ 14 ప్రకారం ఆల్కహాల్‌ను నిషేధించారు. ఈ చట్టం అతిక్రమించి ఆల్కహాల్ ఉత్పత్తి చేసిన వారికి 10 మిలియన్‌ల నుంచి 25 మిలియన్‌ల దినార్ లు అపరాధ రుసుము విధిస్తారు.

20. ప్రపంచ దృశ్య శ్రావ్య వారసత్వ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) అక్టోబర్ 25
2) అక్టోబర్ 27
3) అక్టోబర్ 28
4) అక్టోబర్ 31

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: UNESCO 2005 నుంచి అక్టోబర్ 27ను ప్రపంచ దృశ్య శ్రావ్య వారసత్వ దినోత్సవంగా నిర్వహిస్తుంది.
2016 ఇతివృత్తం: '' Its your story- Don't lose it '' .

21. ప్రతిష్టాత్మక బి. సి. రాయ్ పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) డా. దీపక్ చోప్రా
2) డా. అబ్రహం వర్గీస్
3) రణదీప్ గులేరియా
4) డా. జె.కె. రావ్

View Answer
*_Bhaskar Valmiki_*
స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: డా.బిదున్ చంద్రరాయ్ పురస్కారాన్ని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ 1976లోప్రారంభించింది. 2016కు గాను డా. రణదీప్ గులేరియా, సి.ఎస్. యాదవ్‌లు ఎంపికయ్యారు. వైద్య వృత్తితో పాటు ప్రజాసేవ, కళలు, తత్వశాస్త్రంలో కృషి చేసిన వారికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.

22. యునెటైడ్ స్టేట్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ 2016 టైటిల్ విజేత ఎవరు?
1) డెనియల్ రిక్కియార్డ్
2) సెబాస్టియన్ వెటల్
3) నికో రోస్‌బర్గ్
4) లే విస్ హమిల్టన్

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: యూఎస్ గ్రాండ్ ప్రీ ఫార్ములావన్ టైటిల్‌ను లేవిస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. లేవిస్‌కి ఇది కెరియర్‌లో 50వ టైటిల్ కాగా సీజన్‌లో 7వ విజయం.

23. జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) అక్టోబర్ 28
2) అక్టోబర్ 29
3) అక్టోబర్ 30
4) అక్టోబర్ 31

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ఆయుష్ మంత్రిత్వశాఖ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పతి సంవత్సరంఅక్టోబర్ 28న నిర్వహిస్తుంది. 2016 ఇతివృత్తం: ఆయుర్వేదం ద్వారా డయాబెటిస్ నియంత్రణ , నివారణ.

24. వరల్డ్ గివింగ్ ఇండెక్స్-2016లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది?
1) ఇండియా
2) మయన్మార్
3) యు.ఎ.ఈ
4) ఆస్ట్రేలియా

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: ఛారిటీ ఎయిడ్ ఫౌండేషన్ ప్రతి సంవత్సవం వరల్డ్ గివింగ్ ఇండెక్స్ (WGI)ను తయారు చేస్తుంది. ఇందులో 130 దేశాల్లోని ప్రజల ఛారిటీ, సహాయ గుణం మీద పరిశోధన జరుపుతారు. ఈ నివేదికలో మొదటి స్థానంలో మయన్మార్, రెండో స్థానంలో అమెరికా, మూడో స్థానంలో ఆస్ట్రేలియా ఉన్నాయి. ఇండియా 91వ స్థానంలో ఉంది.

25. ఇటీవల ఇండియా ఏ దేశంతో ‘‘మిత్రశక్తి 2016’’ పేరుతో సైనిక విన్యాసాలు నిర్వహించింది?
1) శ్రీలంక
2) బంగ్లాదేశ్
3) నేపాల్
4) భూటాన్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ఇండియా శ్రీలంకతో కలిసి నాల్గో మిత్ర శక్తి సైనిక విన్యాసాలు 2016 నిర్వహించింది. ఈ విన్యాసాలలో ఇండియా తరుపున రాజపుతానా రైఫిల్స్ పాల్గొంది.

26. మొదటి జాతీయ గిరిజన ఉత్సవం 2016 ను ఎక్కడ నిర్వహించారు?
1) కోహిమా
2) ఐజ్వాల్
3) ఈటానగర్
4) న్యూఢిల్లీ

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: భారత ప్రధాని నరేంద్ర మోదీజాతీయ గిరిజన ఉత్సవాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ ఉత్సవాల్లో 8000 మంది గిరిజన ప్రతినిధులు, 1600 మంది గిరిజన కళాకారులు పాల్గొన్నారు.

27. అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) అక్టోబర్ 25
2) అక్టోబర్ 27
3) అక్టోబర్ 29
4) అక్టోబర్ 31

View Answer

స‌మాధానం: 3

28. ప్రపంచ గుండె పోటు నివారణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) అక్టోబర్ 31
2) అక్టోబర్ 29
3) అక్టోబర్ 27
4) అక్టోబర్ 25

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: WSO- World Stroke Organization
WSO మొదటిసారిగా 2006లో ప్రపంచ గుండె పోటు నివారణ దినోత్సవాన్ని నిర్వహించింది. WSO సౌహర్ధ రాయబారులు రాణిముఖర్జీ, మాజీ మిస్ ఈజిప్ట్ డాలియా ఎల్ బెహరి, అల్బెర్టో కాండర్.

29. ఇటీవల ఏ రాష్ట్రంలో ‘ వైట్‌నర్ ’ ను పూర్తిగా నిషేధించారు?
1) తెలంగాణ
2) ఉత్తరాఖండ్
3) ఉత్తరప్రదేశ్
4) మధ్యప్రదేశ్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: ఉత్తరాఖండ్‌లో 14 సంవత్సరాల బాలుడు వైట్‌నర్‌ను పీల్చడం ద్వారా మరణించాడు. దీంతో జస్టిస్ రాజీవ్ శర్మ ఏకసభ్య ధర్మాసనం ఉత్తరాఖండ్‌లో వైట్‌నర్‌ను పూర్తిగా నిషేధించింది. దీంతో పాటు Iodex, Feviquick లను 18 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే అమ్మాలని ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పు చెప్పింది.

30. ప్రతిష్టాత్మక ఆసియా పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ ప్రదానం చేసే ‘‘ కమ్యూనిటీ సర్వీస్’’ విభాగంలో మొదటి బహుమతి పొందిన సంస్థ ఏది?
1) ఇరాక్ బ్రాడ్ కాస్టింగ్
2) రేడియో హంకాంగ్
3) ఆల్ ఇండియా రేడియో
4) బంగ్లాదేశ్ రేడియో

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: డైరీ ఆఫ్ టైగర్ పేరుతో ఆల్ ఇండియా రేడియో అలహాబాద్ విభాగం తయారు చేసిన ప్రోగ్రాం ఆసియా పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ (ABU) పురస్కారానికి ఎంపికైంది. ABU 1964లో ఏర్పాటు అయింది. ఇందులో 57 దేశాలు 280 సంస్థలు సభ్యులుగా ఉన్నాయి.

31. ప్రపంచ నగరాల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) అక్టోబర్ 31
2) అక్టోబర్ 28
3) అక్టోబర్ 25
4) అక్టోబర్ 27

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ప్రపంచ నగరీకరణ అభివృద్ధిలో అంతర్జాతీయ సమాజం పాలుపంచుకునేలా కృషి చేయడం కోసం ఈ దినంను ఐక్యరాజ్యసమితి ప్రారంభించింది.
2016 ఇతివృత్తం: ‘‘ Inclusive cities, Shared Development ''.

32. ప్రపంచ లింగ సూచీ 2016లో ఇండియా స్థానం ఎంత?
1) 87
2) 78
3) 76
4) 67

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ప్రపంచ ఆర్థిక సంస్థ ప్రతి సంవత్సర ం ప్రపంచ లింగ సూచీని విడుదల చేస్తుంది. ఈ నివేదికలో మొదటి స్థానంలో ఐస్‌లాండ్, తర్వాతి స్థానాల్లో ఫిన్‌లాండ్, నార్వే, స్వీడన్ ఉన్నాయి. బంగ్లాదేశ్ 72, ఇండియా 87, శ్రీలంక 100, నేపాల్ 110 వ స్థానాల్లో ఉన్నాయి. ‘‘విద్య, ఆరోగ్యం, ఆర్థిక అవకాశాలు, రాజకీయ ఆర్థిక సాధికారతను పరిగణనలోకి తీసుకొని ఈ నివేదికను తయారు చేశారు.

33. ఇటీవల అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి సభ్యత్వంను రద్దు చేసుకున్న దేశం ఏది?
1) నైజీరియా
2) ఘనా
3) గాంబియా
4) కాంగో

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు 2002లో ఏర్పడింది. గత కొద్ది కాలం నుంచి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆఫ్రికన్ దేశాలపై వివక్ష చూపడంతో ఈ సంస్థ నుంచి ఆఫ్రికా దేశాలు వరుసగా సభ్యత్వంను రద్దు చేసుకుంటున్నాయి. గతంలో దక్షిణాఫ్రికా, బురిండిలు ఇటీవల గాంబియా సభ్యత్వంను రద్దు చేసుకున్నాయి.

34. ప్రపంచ పొదుపు దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు?
1) అక్టోబర్ 28
2) అక్టోబర్ 31
3) నవంబర్ 5
4)నవంబర్ 10

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: 1924లో అంతర్జాతీయ సేవింగ్స్ బ్యాంక్ కాంగ్రెస్ ‘‘ ప్రపంచ పొదుపు దినోత్సవాన్ని ప్రారంభించింది.
2016 ఇతివృత్తం:Grabbing hold of your financial future

35. 23వ అంతర్జాతీయ పునరావాస సదస్సు ఎక్కడ నిర్వహించారు?
1) గోవా
2) షాంఘై
3) కౌలాలంపూర్
4) హిడెన్‌బర్గ్

View Answer

స‌మాధానం: 4

36. ఇటీవల ఇండియా ఏ దేశంతో నేరస్థుల మార్పిడి ఒప్పందం కుదుర్చుకుంది?
1) స్పెయిన్
2) మాంటినిగ్రో
3) ఎస్తోనియా
4) సెర్బియా

View Answer
*_Bhaskar Valmiki_*
స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: నేరస్థుల జాబితా, నేరస్థుల అప్పగింత కోసం ఇండియా, ఎస్తోనియా దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటి వరకు ఇండియా 29 దేశాలతో నేరస్థుల అప్పగింత ఒప్పందం కుదుర్చుకుంది.

37. ఇటీవల ఏ దేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ మెమోరియల్ లైబ్రరీ అండ్ రిసోర్స్ సెంటర్‌ను ప్రారంభించారు?
1) శ్రీలంక
2) సింగపూర్
3) ఇండోనేషియా
4) బంగ్లాదేశ్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: శ్రీలంకలో రవీంద్రనాథ్ ఠాగూర్ మెమొరియల్ లైబ్రరీ అండ్ రిసోర్స్ సెంటర్‌ను38 మిలియన్‌ల వ్యయంతో నిర్మించారు.

38. కామన్‌వెల్త్ విడుదల చేసిన గ్లోబల్ యూత్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది?
1) ఇండియా
2) మలేషియా
3) జర్మనీ
4) డెన్మార్క్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: కామన్‌వెల్త్ సెక్రటేరియట్ 183 దేశాలకు చెందిన విద్య, ఆరోగ్యం, ఉద్యోగాల కల్పన, రాజకీయ భాగస్వామ్యం వంటి సమాచారం విశ్లేషించి ‘‘ గ్లోబల్ యూత్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ 2016 ’’ నివేదికను తయారు చేసింది. ఈ నివేదికలో తొలి స్థానంలో జర్మనీ నిలిచింది. తర్వాతి స్థానాల్లో డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా ఉన్నాయి. నేపాల్ 77, భూటాన్ 69, శ్రీలంక 39, ఇండియా 133 వ స్థానాల్లో ఉన్నాయి.

39. ప్రతిష్టాత్మక ‘‘ సఖరోవ్ స్వేచ్ఛ పురస్కారం 2016 నకు ఎంపికైంది ఎవరు?
1) నదియా మురాద్
2) మలాల యూసఫ్‌జాయ్
3) అజేరి సయ్యద్
4) షహిన్ షేక్ మిర్జా

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ఇస్లామిక్ స్టేట్ త్రీవవాద సంస్థ అమ్మాయిలను లైంగిక బానిసలుగా అమ్మి నగదును సమకూర్చుకుంటుంది. ఇరాక్‌కు చెందిన నదియా మురాద్ అండ్ లామియా అజి బషర్‌లు ఇస్లామిక్ స్టేట్ త్రీవవాదుల నుంచి తప్పించుకొని ప్రస్తుతం మహిళల హక్కుల కోసం పోరాడుతున్నందుకు వారికి ఈ అవార్డు లభించింది.
యూరప్‌లో మానవహక్కుల పురస్కారాలలో అతి ముఖ్యమైనది The Sakharov prize for freedom of thought.

40. ఇటీవలయూరోపియన్ యూనియన్ఏ సముద్ర ప్రాంతంను రక్షిత ప్రాంతంగా ప్రకటించింది?
1) దక్షిణ చైనా సముద్రం
2) రోస్స్ సముద్రం
3) బంగాళాఖాతం
4) బాల్టిక్ సముద్రం

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: యురోపియన్ యూనియన్, 24 ఇతర దేశాలు అంటార్కికా వద్ద ఉన్న రోస్స్ (ROSS) సముద్రాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించాయి. ప్రపంచంలో అతి పెద్ద సముద్ర రక్షిత ప్రాంతంగా రోస్స్ సముద్రం రికార్డుకు ఎక్కింది.

41. ఇటీవల హిల్‌సా చేపల వేటను నిషేధించిన దేశం ఏది?
1) జపాన్
2) బంగ్లాదేశ్
3) దక్షిణ కొరియా
4) న్యూజిలాండ్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: హిల్‌సా చేపల వేట వలన వాటి జనాభా తగ్గిపోతుండటంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం వాటి వేటను నిషేధించింది.ఈ చేపల వేటలో 60 శాతం బంగ్లాదేశ్ లోనే జరుగుతుంది.

42. UNHCR పకారం వలసదారులకు ప్రతికూల సంవత్సరం ఏది?
1) 2011
2) 2013
3) 2014
4) 2016

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: UNHCR- United Nations High Commissionor for Refugees వివిధ దేశాలలో ప్రతికూల పరిస్థితుల వలన అనేక మంది యురోప్ దేశాలకు వలస వెళ్తున్నారు. 2016 సంవత్సరంలో 3,740 మంది వ్యక్తులు మధ్యధరా సముద్రం దాటుతూ ప్రాణాలు కోల్పోయారు.
1954, 1981 లో UNHCRకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.

43. CMA అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఉత్తమ డాక్యుమెంటరీ పురస్కారానికి ఎంపికైన డాక్యుమెంటరీ ఏది?
1) హెవెన్ ఆన్ ది ఎర్త్
2) ది స్ట్రీట్
3) డాటర్స్ ఆఫ్ మదర్ ఇండియా
4) ది గంగా మదర్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: అరబిక్ ఈజిప్షియన్ సోసైటీ ఫర్ కల్చర్, మీడియా అండ్ ఆర్ట్స్ (CMA) అంతర్జాతీయ చిత్రోత్సవంను నిర్వహించింది. సినిమా మాధ్యమం ద్వారా పేదరికపు నిర్మూలన, త్రీవవాదంను ఎదుర్కోవడం, ప్రజలలో అజ్ఞానాన్ని పారద్రోలటం ముఖ్య లక్ష్యంగా ఈ చిత్రత్సోవాన్ని ప్రారంభించారు. లింగ వివక్షత, లింగ హింస ప్రధాన ఇతివృత్తంగా విభా బక్షే తీసిన‘‘డాటర్స్ ఆఫ్ మదర్ ఇండియా’’ఈ అవార్డుకు ఎంపికైంది.

44. యూరోపియన్ గోల్డెన్ బాయ్ పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) రెనటో శాన్‌చెస్
2) అమన్ ఛత్రి
3) జోసెఫ్ మారిన్
4) హెన్రీ అంటోని

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: యురోపియన్ గోల్డెన్ బాయ్ పురస్కారాన్ని Tutto sports2003లో ప్రారంభించింది. 21 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్న ఫుట్‌బాల్ క్రీడాకారులకు ఈ పురస్కారాన్ని ఇస్తారు. పోర్చుగల్‌కు చెందిన మిడ్ పీల్డర్ రెనటో శాన్‌చెస్ ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు.

45. స్పెయిన్ నూతన ప్రధానమంత్రి ఎవరు?
1) జోసే మరియ హాజనర్
2) ఫిలిప్పె గోంజలెజ్
3) ఆడఫ్ఫో సురెజ్
4) మారియానో రాజోయ్

View Answer

స‌మాధానం: 4

46. 4వ ఏసియన్ హాకీ ఛాంపియన్‌షిప్ టైటిల్ విజేత ఎవరు?
1) పాకిస్థాన్
2) బంగ్లాదేశ్
3) ఇండియా
4) మలేషియా

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: 4వ ఏసియన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించి ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది.

47. 4వ ఏసియన్ హాకీ ఛాంపియన్‌షిప్ మహిళల విభాగం టైటిల్ విజేత ఎవరు?
1) దక్షిణ కొరియా
2) ఇండియా
3) మలేషియా
4) సింగపూర్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: దక్షిణ కొరియాను ఓడించి ఇండియా 4వ ఏసియన్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

48. ఇటీవల ఫోర్బ్స్ మేగజీన్ ప్రకటించిన ఫ్యాబ్ 40 అత్యంత విలువైన బాండ్క్రీడాకారుడు ఎవరు?
1) రోజర్ ఫెదరర్
2) లేబ్రాన్ జేమ్స్
3) ఫిల్ మికెల్సన్
4) ఉసెన్ బోల్ట్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ఫోర్బ్స్ మేగజీన్ వెల్లడించిన ఫ్యాబ్ 40 అత్యంత బ్రాండ్ విలువ కల్గిన క్రీడాకారులలో రోజర్ ఫెదరర్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇతని బ్రాండ్ విలువ 36 మిలియన్ డాలర్లు. తర్వాతి స్థానాలలో లేబ్రాన్ జెమ్స్ (34 మిలియన్ డాలర్లు), ఫిల్ మికెల్సన్ (28 మిలియన్ డాలర్లు), ఉసెన్ బోల్ట్ (25 మిలియన్ డాలర్లు). ఉన్నారు.11 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో మహేంద్రసింగ్ ధోని 10వ స్థానంలో ఉన్నాడు.

49. ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు స్వర్ణోత్సవాలు జరుపుకుంది?
1) హైదరాబాద్
2) మహారాష్ట్ర
3) ఢిల్లీ
4) అలహాబాద్

View Answer

స‌మాధానం: 3

50. ఇటీవల చేపలను వేటాడే పిల్లిని ఏ ప్రాంతంలో కనుగొన్నారు?
1) పాండిచ్చేరి
2) మచిలీపట్నం
3) కొచ్చి
4) గోవా

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: చేపలను వేటాడే పిల్లి (Prionailurus Viverrinus) ని మచిలీపట్నం వద్ద ఉన్న మడ అడవులలో కనుగొన్నారు. ఈ పిల్లి దక్షిణాసియా, ఆగ్నేయాసియాలలో మాత్రమే కన్పిస్తుంది.వేటాడే పిల్లిని IUCN2016లో అంతరించిపోయే జీవజాతుల జాబితాలో చేర్చింది

No comments:

Post a Comment