Thursday, January 26, 2017

Current affairs

      Current affairs..._*

*(Nov
🍃_________🌺_________🍃
1. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌ను ఎక్కడ ప్రారంభించారు?
1) కోల్ కతా
2) న్యూఢిల్లీ
3) గోవా
4) అహ్మదాబాద్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: భారత వ్యాపార ప్రోత్సాహక సంస్థ (ITPO) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో 36వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌ను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ఈ ట్రెడ్ ఫెయిర్ భాగస్వామ్య దేశం దక్షిణ కొరియా. ఫోకస్ దేశం బెలారస్.

2. లేడిస్ యురోపియన్ గోల్ఫ్ టూర్ టైటిల్ విజేత ఎవరు?
1) లేక్సి థామ్సన్
2) షర్మిలా నికొలెక్ట్
3) నటాలియా ఘిల్జోన్
4) ఆదితి అశోక్

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: లేడిస్ యురోపియన్ గోల్ఫ్ టూర్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి ఇండియన్ గోల్ఫర్ ఆదితి అశోక్. ఈ టైటిల్ కింద ఆమెకు 60,000 అమెరికన్ డాలర్లు నగదు బహుమతి అందుతుంది.

3. దేశంలో తొలి ‘చెర్రి బ్లోసమ్స్’ ఉత్సవాలు ఎక్కడ నిర్వహించారు?
1) షిల్లాంగ్
2) సిమ్లా
3) సిలిగురి
4) ఐజ్వాల్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: పర్యాటకులనుఆకర్షించడం కోసం మణిపూర్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోరిస్సోర్స్, సస్టేన్‌బుల్ డెవలప్‌మెంట్,National institute of department of biotechnology ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించారు.

4. ఇటీవల ఏ దేశంలో ‘ ప్రీ స్కూల్స్’లో హిందీ భాషను ప్రవేశపెట్టనున్నారు?
1) ఆస్ట్రేలియా
2) జపాన్
3) తైవాన్
4) జర్మనీ

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రీ స్కూల్ ఆన్‌లైన్ కార్యక్రమంలో భాగంగా విదేశీ భాషల బోధన ప్రారంభించింది. 2015-16 అకడమిక్ సంవత్సరంలో చైనీస్, జపనీష్, ఇండోనేషియా, ఫ్రెంచ్, అరబిక్ భాషలను ప్రవేశపెట్టారు. 2017లో ఇటాలియన్, స్పానిష్ భాషలను, 2018లో హిందీ, ఆధునిక గ్రీక్ భాషలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

5. ఫెడరల్ బ్యాంక్ మొదటి విదేశీ శాఖను ఎక్కడ ప్రారంభించింది?
1) టోక్యో
2) రంగూన్
3) దుబాయి
4) మక్కా

View Answer

స‌మాధానం: 3

6. అంతర్జాతీయ కార్మిక సంస్థకు నూతన డెరైక్టర్ జనరల్‌గా ఎంపికైంది ఎవరు?
1) గై రైడర్
2) డా.మార్గరెట్ చాన్
3) అంథోని లాకే
4) ముల్లర్ మైఖైల్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. ఈ సంస్థలో 187 దేశాలకు సభ్యత్వం ఉంది.

7. ‘‘ లండన్ ఈవినింగ్ స్టాండర్డ్ థియేటర్’’ పురస్కారాల్లో ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకొన్నది ఎవరు?
1) డి.ఎమ్. స్మిత్
2) జాన్ మాల్క్ విచ్
3) రాల్ఫ్ ఫిన్నెస
4) వి. కెన్నెత్ బ్రాన్‌గ్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: ది మాస్టర్ బిల్డర్, రిచర్ట్స్-III లలో రాల్ఫ్ ఫిన్నెసనటనకుగాను ఉత్తమ నటుడు పురస్కారం లభించింది.

8. 2015లో భారతదేశ కార్బన్ ఉదార్గాలు ఎంత శాతం పెరిగాయి?
1) 10%
2) 5%
3) 3%
4) 1%

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా తయారుచేసిన నివేదిక ప్రకారం ఇండియాలోశిలాజ ఇంధనాల ద్వారా కార్బన్ ఉదార్గాలు 2015లో 5 శాతం పెరిగాయి. చైనాలో 0.7 %, అమెరికాలో 1.7 % తగ్గాయి.

9. భారతదేశంలో ఏ నగరాన్ని ‘‘ బ్రెస్ట్ క్యాన్సర్ క్యాపిటల్’’ గా పిలుస్తారు?
1) తిరువనంతపురం
2) పూణె
3) మైసూర్
4) కాన్పూర్

View Answer
*_Basu_*
స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: దేశవ్యాప్తంగా సగటున ప్రతి లక్ష మందిలో 20 మందికి బెస్ట్ క్యాన్సర్ఉంది. అలాగే కేరళ రాష్ట్రంలో ప్రతి లక్ష మందిలో 14 మందికి, తిరువనంతపురంలో ప్రతి లక్ష మందిలో 40 మందికి బెస్ట్ క్యాన్సర్ఉంది. సర్వీకల్ క్యాన్సర్ త ర్వాత అత్యంత ప్రాణాంతకరమైన వ్యాధి బ్రెస్ట్ క్యాన్సర్.

10. బ్రెజిలియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములావన్ టైటిల్ విజేత ఎవరు?
1) నికో రోస్‌బర్గ్
2) లూయిస్ హమిల్టన్
3) సెబాస్టియన్ వెటల్
4) డెనియల్ రిక్కియార్డొ

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: 2016 సీజన్‌లో లూయిస్ హమిల్టన్ బ్రెజిలియన్ గ్రాండ్ ప్రీ తో కలిపి మొత్తం 9 టైటిల్స్‌ను గెలుచుకున్నాడు.

11. రిసోనన్స్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో ఆకర్షణీయ నగరం ఏది?
1) టోక్యో
2) న్యూయార్క్
3) పారిస్
4) లండన్

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: రిసోనన్స్ సంస్థ ట్రావెల్ మార్కెట్‌ను పరిగణలోకి తీసుకొని ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయ నగరాల జాబితాను తయారుచేసింది. ఈ నివేదికలో తొలిస్థానంలో లండన్ ఉంది. తర్వాత స్థానాలలో సింగపూర్, న్యూయార్క్, పారిస్ నగరాలు ఉన్నాయి.

12. యూఏఈ లో యునెస్కో గుర్తించిన మొదటి ప్రపంచ వారసత్వ సంపద ప్రాంతాలు ఏవి?
1) ఆల్ ఐన్ ఓయాసిస్
2) ఆల్ జజిరాన్
3) హిలి పురావస్తు పార్క్
4) హిరా పర్వతాలు

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: యూఏఈలో యునెస్కో గుర్తించిన మొదటి వరల్డ్ హెరిటెజ్ సైట్ Al Ain Oasis. ఇది ప్రపంచంలో అతి పురాతన శాశ్వత నివాస స్థలం. ఆల్ ఐన్ ఓయాసిస్‌లో 4000 సంవత్సరాల నుంచి మనుషులు నివాసం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి.

13. ఇటీవల ఇండియా ‘‘ హ్యండ్ ఇన్ హ్యండ్ 2016’’ అనే పేరుతో ఏ దేశంతో సైనిక విన్యాసాలు నిర్వహించింది?
1) శ్రీలంక
2) నేపాల్
3) చైనా
4) జపాన్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: 6వ ‘‘హ్యండ్ ఇన్ హ్యండ్ ’’సైనిక శిక్షణ విన్యాసాలను చైనాతో ఇండియా నిర్వహించింది.

14. జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ ఛాంపియన్‌షిప్ 2016 విజేత ఎవరు?
1) ఎస్. విజయలక్ష్మీ
2) పద్మిని రౌత్
3) ఈష ఖరవడే
4) కోనేరు హంపి

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: జాతీయ మహిళ ప్రీమియర్ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను పద్మిని రౌత్ వరుసగా మూడోసారి గెలుచుకుంది. ఎస్.విజయలక్ష్మీ మొదటి రన్నరప్, ఈషా ఖరవడే రెండో రన్నరప్‌గా నిలిచారు.

15. ప్రపంచ మనీలా మాస్టర్స్ గోల్ఫ్ టైటిల్ విజేత ఎవరు?
1) సామ్ చెనై
2) ఎస్.ఎస్.పి. చౌరాసియా
3) నికొలస్ ఫంగ్
4) డేవిడ్ థోరో

View Answer

స‌మాధానం: 2

16. ఆయుర్ హెర బారియా ప్రాజెక్టును ఎక్కడ ప్రారంభించారు?
1) న్యూఢిల్లీ
2) కోల్‌కత్త
3) ముంబాయి
4) గోవా

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గోవాలో మారిషస్ ప్రధాన మంత్రి అనిరుధ్ జగ్ననాధ్ ఈ ప్రాజెక్ట్ ను లాంఛనంగా ప్రారంభించారు.

17. వివాదాస్పద ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్‌పై కేంద్ర ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు నిషేదం విధించింది?
1) 1 సంవత్సరం
2) 3 సంవత్సరాలు
3) 5 సంవత్సరాలు
4) జీవిత కాలం

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: చట్ట విరుద్ధ కార్యకలపాల నిరోధక చట్టం కింద జాకిర్ నాయక్‌కు చెందిన ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్‌పై 5 సంవత్సరాల పాటు ప్రభుత్వం నిషేధం విధించింది.

18. ‘‘ హార్ ఘర్ బిజిల్లి లఘతార్’’ అనే పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) బీహార్
2) ఒడిశా
3) ఉత్తరప్రదేశ్
4) హర్యానా
*_Vaalmeeki Bhaskar_*
View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కూమార్ వచ్చే రెండు సంవత్సరాలలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.

19. ఇటీవల ఏ దేశంలో ‘‘ భారతీయ ఉత్సవాలు’’ 2016 నిర్వహించారు?
1) బెలారస్
2) ఒమన్
3) జపాన్
4) బ్రూనై

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: ఒమన్ దేశంలో ముఖ్య నగరాలైన మస్కట్, సుర్, సోహర్, సలహ్‌లలో భారతీయ జానపద నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, భారతీయ వంటకాలు, ఇస్లామిక్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు.

20. ప్రపంచంలో మొదటిసారిగా మెదడు మార్పిడిని ఇటీవల ఏ దేశ డాక్టర్లువిజయవంతంగా నిర్వహించారు?
1) కెనడా
2) ఇజ్రాయిల్
3) నెదర్లాండ్స్
4) ఇంగ్లాండ్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: లౌ గెహ్రిగ్ వ్యాధి వల్ల పక్షవాతం బారినపడిన రోగికి విజయవంతంగా మెదడు మార్పిడి చేశారు.

21. 2017లో టీ-20 అంధుల క్రికెట్ప్రపంచ కప్‌ను నిర్వహించనున్న దేశం ఏది?
1) న్యూజిలాండ్
2) పాకిస్థాన్
3) ఇండియా
4) బంగ్లాదేశ్

View Answer

స‌మాధానం: 3

22. ఇప్పటి వరకు ఎన్ని భారతీయ వస్తువులకు భౌగోళిక గుర్తింపు లభించింది?
1) 57
2) 99
3) 187
4) 272

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: కంట్రోలర్ జనరల్ ఆఫ్ పెటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్ ఇప్పటి వరకు 272 భారతీయ వస్తువులకు భౌగోళిక గుర్తింపు(GI) ఇచ్చింది.

23. ఇటీవల డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించిన డ్రోన్ ఏది?
1) రుస్తుమ్-2
2) రుద్ర-2
3) త్రినేత్ర-2
4) నరేంద్ర-2

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: మానవ రహిత యుద్ధ విమానం (డ్రోన్) రుస్తుమ్-2ను డీఆర్‌డీవోకు చెందిన ఏరోనాటిక్స్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ADE) అభివృద్ధి చేసింది. ఈ డ్రోన్ 10, 000-30,000 అడుగుల ఎత్తులో దాదాపు 48 గంటలు ఆగకుండా ప్రయాణించగలదు.

24. ఇటీవల ఏ దేశం అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానంలో సభ్యత్వం రద్దు చేసుకుంది?
1) ఇండియా
2) చైనా
3) కెనడా
4) రష్యా

View Answer
*_Bhaskar Valmiki_*
స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: రష్యా క్రిమియాను దురాక్రమణ ద్వారా ఉక్రెయిన్ నుంచి లాక్కుందని అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానంపేర్కొంది. ఈ నేపథ్యంలో రష్యా ICC నుంచి వైదొలగింది.

25. ప్రతిష్టాత్మక టాటా లిటరేచర్ పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) జావెద్ అక్తర్
2) గుల్జార్
3) ఇర్షద్ కమీల్
4) అమిత్ త్రివేది

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: Tata literature live poet laureate పురస్కారానికి ప్రముఖ సినీగేయ రచయిత, నిర్మాత అయిన గుల్జార్ ఎంపికయ్యారు.

26. ప్రపంచంలో ఉత్తమ ఎయిర్ లైన్స్ ఏది?
1) లుఫ్తాన్సా
2) ఎమిరెట్స్
3) ఖతార్ ఎయిర్‌లైన్స్
4) ఎయిర్ న్యూజిలాండ్

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: ఎయిర్ లైన్స్ రేటింగ్స్.కామ్ ఎయిర్ లైన్స్ ఎక్స్‌లెన్స్ పురస్కారాలను ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది. వరుసగా నాల్గోసారి కూడా ఎయిర్ న్యూజిలాండ్ ఉత్తమ ఎయిర్‌లైన్స్ పురస్కారానికి ఎంపికైంది. ఉత్తమ ప్రీమియం ఎకానమీ కేటగిరిలో కూడా ఎయిర్ న్యూజిలాండ్ తొలిస్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో ఆస్ట్రేలియన్ ఎయిర్‌లైన్స్ ఉంది.

27. ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) నవంబర్ మొదటి ఆదివారం
2) నవంబర్ మూడో ఆదివారం
3) నవంబర్ మూడో గురువారం
4) నవంబర్ చివరి గురువారం

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: యునెస్కో నవంబర్ మూడవ గురువారంను ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవంగా ప్రకటించింది.

28. ఇటీవల నాసా తరపున అంతరిక్షంలోకి వెళ్లిన వృద్ధ మహిళ ఆస్ట్రోనాట్ ఎవరు?
1) పిగ్గి విట్స్‌న్
2) సల్లీ రైడ్
3) మాసి జెమ్సిన్
4) ఎల్లెన్ ఓచా

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: 56 సంవత్సరాల పిగ్గి విట్స్‌న్ (Piggy whitson) అంతరిక్షంలోకి వెళ్లిన వృద్ధ మహిళ ఆస్ట్రోనాట్‌గా రికార్డు సృష్టించింది. ఆమె ఫిబ్రవరి 9, 2017న భూమి మీదకి తిరిగి వస్తుంది.

29. 3వ ప్రపంచ ఇంటరె ్నట్ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించారు?
1) న్యూఢిల్లీ
2) కజన్
3) వుజన్
4) టొరంటో

View Answer

స‌మాధానం: 3
*_Basu Valmiki_*
30. మార్కెట్ ఎకానమీ స్టేటస్ వల్ల కలిగే లాభాలు ఏవి?
1) వస్తువులను అధిక లాభాలకు అమ్మవచ్చు
2) వస్తువులను ఉత్పత్తి ధర వద్ద అమ్మవచ్చు
3) వస్తువుల అమ్మకంపై పన్నులు విధించవచ్చు
4) వస్తువుల దిగుమతులపై యాంటి డంపింగ్ డ్యూటీ విధించడం.

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: ప్రపంచ వ్యాపార సంస్థ(WTO) పమాణాల ప్రకారం చైనాకి ఇండియా మార్కెట్ ఎకానమీ స్టేటస్ ఇవ్వాలి. కానీ ఈ స్టేటస్ చైనాకు ఇవ్వలేదు. ఈ స్టేటస్ చైనాకు ఇచ్చిన ట్లైతే ఎగుమతి, దిగుమతుల మీద పన్ను విధించే అధికారం భారత్ కోల్పోతుంది. స్వదేశీ పరిశ్రమల మీద తీవ్రదెబ్బ పడుతుంది.

31. ఇటీవల ''smile campaign'' పారంభించిన బ్యాంక్ ఏది?
1) బ్యాంక్ ఆఫ్ బరోడా
2) ఇండియన్ బ్యాంక్
3) ఐసీఐసీఐ
4) బ్యాంక్ ఆఫ్ ఇండియా

View Answer

స‌మాధానం: 1

32. ప్రతిష్టాత్మక ‘‘సుమిత్రా చరత్ రామ్’’ జీవితకాల సాఫల్య పురస్కారం-2016నకు ఎంపికైంది ఎవరు?
1) శేఖర్ సేన్
2) సి. నారాయణ రెడ్డి
3) అద్దెపల్లి రామారావు
4) పండిత హరిప్రసాద్ చౌరాసియా

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: భారతీయ శాస్త్రీయ సంగీత అభివృద్ధికి పాటుపడిన పండిత హరిప్రసాద్ చౌరాసియా ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు. ఈ పురస్కారం కింద ఒక వెండి ఫలకం, శాలువ, జ్ఞాపికను ప్రదానం చేస్తారు.

33. 17వ వార్షిక లాటిన్ గ్రామీ పురస్కారాలలో ఉత్తమ ఆల్బమ్‌గా ఎంపికైన ఆల్బమ్ ఏది?
1) జేస్సి అండ్ జోన్స్
2) యాండర్ దియాన్
3) లాస్ టైగర్ డెల్ నోర్తె
4) జువాన్ గేబ్రియల్

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: 17వ వార్షిక లాటిన్ గ్రామీ సంగీత పురస్కారాలల్లో 'Juan Gabriel' ఉత్తమ ఆల్బమ్‌గా ఎంపికైంది. ఉత్తమ సాంగ్ కేటగిరిలో ‘La Bicicleta’ పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ పాటను షకిరా, ఆండ్రేస్ క్యాస్టొ పాడారు.

34. Asia corporate excellence and sustainability పురస్కారానికి ఎంపికైన సంస్థ ఏది?
1) రిలయన్స్
2) టీసీఎస్
3) ఇన్ఫోసిస్
4) విప్రో

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: 3వ ఆసియా కార్పొరెట్ ఎక్స్లెన్స్ అండ్ సస్టేయిన్‌బుల్ పురస్కారానికి టీసీఎస్(TCS), వేదాంత సంస్థలు ఎంపికయ్యాయి. ఈ సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యత, పర్యావరణ సృహ, స్థిరమైన నాయకత్వం అందించడంలో తనదైన పాత్ర పోషించినందుకుగాను ఈ పురస్కారానికి ఎంపికయ్యాయి.

35. అంతర్జాతీయ బ్రూసెల్లొసిస్ సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) బెల్‌గ్రెడ్
2) బుడాపెస్ట్
3) వియన్నా
4) న్యూఢిల్లీ

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: ఈ సమావేశాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రిసెర్చ్ సహకారంతో న్యూఢిల్లీలో నిర్వహించారు. 26 దేశాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. బ్రుసెల్లొసిస్ అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి. ఇది బ్రూసెల్లా అనే బ్యాక్టిరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి ఆవులు, గెదెలు, మేకలు, గొర్రెలు, పందులు, కుక్కలు మొదలైన జంతువులకు సోకుతుంది. జంతువుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుంది. ‘‘Brucella-Free Villages’’ అనే పెలైట్ ప్రాజెక్టును దేశంలో 10 రాష్ట్రాల్లోని 50 గ్రామాలలో నిర్వహిస్తున్నారు.

36. గ్లోబల్ సిటిజన్ ఉత్సవాలు ఎక్కడ నిర్వహించారు?
1) ముంబయి
2) బుడాపెస్ట్
3) వియన్నా
4) కివ్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: గ్లోబల్ సిటిజన్ ఉత్సవాలునవంబర్ 19, 2016న ముంబయిలోనిర్వహించారు. ఇది ఛారిటీ కోసం ఏర్పాటు చేసిన సంగీత విభావరి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఉత్సవాలను ఉద్దేశించి ప్రసంగించారు.

37. ప్రపంచంలో తొలిసారి ఈ- కరెన్సీని విడుదల చేసిన దేశం ఏది?
1) పిన్లాండ్
2) నార్వే
3) స్వీడన్
4) బెల్జియం

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: ప్రపంచంలో అతిపురాతన కేంద్ర బ్యాంక్ ‘‘ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్’’.

38. భారతదేశం ఏ దేశం నుంచి అత్యధికంగా ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది?
1) సౌదీ అరేబియా
2) ఇరాన్
3) ఇరాక్
4) కువైట్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: ఇండియాప్రతి రోజు ఇరాన్ నుంచి 7,59,700 బ్యారెళ్లు ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. సౌదీ అరేబియా నుంచి రోజుకు 7,17,000 బ్యారెళ్లు దిగుమతి చేసుకుంటుంది.
*_Bhaskar Valmiki_*
39. ప్రతిష్టాత్మక రోలెక్స్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) డా.మీరాకౌశాంబి
2) డా.సోనమ్ వాంగ్ చుక్
3) హాకిమ్ అబ్దుల్ ఆజింజ్
4) డా. చంద్రముఖి బసు

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: కరువు సమయంలో కృత్రిమ హిమానీనదాల నుంచి నీరు ప్రజలకు సరఫరా చేయడం కోసం డా.సోనమ్ వాంగ్ చుక్ చేస్తున్న పరిశోధనలకు గాను రోలెక్స్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ పురస్కారానికి ఎంపికయ్యాడు. ఈ పురస్కారం కింద 1,00,000 స్విస్ ఫ్రాంక్‌లు లభిస్తాయి.

40. జాతీయ సమగ్రత వారోత్సవాలు ఎప్పుడు నిర్వహిస్తారు?
1) నవంబర్ 1 నుంచి 7
2) నవంబర్ 8 నుంచి 14
3) నవంబర్ 14 నుంచి 20
4) నవంబర్ 19 నుంచి 25

View Answer

స‌మాధానం: 4

41. ప్రపంచ టాయిలెట్ల దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
1) నవంబర్ 5
2) నవంబర్ 12
3) నవంబర్ 19
4) నవంబర్ 21

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: ప్రజలలో పారిశుధ్యం మీద అవగాహన కల్పించటానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో 2.4 బిలియన్ ప్రజలకు మెరుగైన పారిశుధ్య సౌకర్యాలు లేవు. ప్రతి 10 మందిలో ఒకరు బహిరంగంగా మలవిసర్జన చేస్తున్నారు.

42. ప్రపంచ టెలివిజన్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) నవంబర్ 21
2) నవంబర్ 19
3) నవంబర్ 16
4) నవంబర్ 13

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: 1996లో ప్రపంచ టెలివిజన్ ఫోరమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సమాజంలో ఎదుర్కొంటున్న సవాళ్లకు టెలివిజన్ మెరుగైన సూచనలు ఇస్తూ, ప్రపంచ శాంతి స్థానంలో కృషి చేస్తుంది.

43. ఇటీవల ఇండియాను సందర్శించిన ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఎవరు?
1) షిరిన్ ఎబాది
2) రెవువెన్ రివ్లిన్
3) మహమ్మద్ అబ్బాస్
4) షిమన్ పిరిస్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: ఇజ్రాయిల్ నుంచి అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశం ఇండియా. ఇజ్రాయిల్ అధ్యక్షుడు రెవువెన్ రివ్లిన్ భారతదేశంతో వ్యవసాయ, తీవ్రవాద అణిచివేత మీద ఒప్పందం చేసుకున్నారు.

44. ప్రపంచంలో పొడవైన క్వాంటమ్ కమ్యూనికేషన్ వ్యవస్థను ప్రారంభించిన దేశం ఏది?
1) చైనా
2) కెనడా
3) ఆస్ట్రేలియా
4) బ్రెజిల్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: 712 కి.మీ.ల క్వాంటమ్ (అత్యంత సురక్షిత) టెలి కమ్యూనికేషన్ వ్యవస్థను చైనా ప్రారంభించింది. ఈ వ్యవస్థ నుంచి సమాచారం హ్యాక్ చేయడం అసాధ్యం.

45. తెలంగాణ ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను పోత్సహించడం కోసం ఏ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది?
1) HDFC
2) ICICI
3) IDFC
4) Axis bank

View Answer

స‌మాధానం: 3

46. దేశంలో అతి ఎక్కువ ఔషధాలను తయారు చేస్తున్న రాష్ట్రం ఏది?
1) హిమాచల్ ప్రదేశ్
2) హర్యానా
3) పంజాబ్
4) మహారాష్ట్ర

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ఆసియాకు ఔషధాల హబ్‌గా హిమాచల్‌ప్రదేశ్ అవతరించింది. ఆసియా ఖండ ఔషధ అవసరాలలో 35 శాతం హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎగుమతి అవుతున్నాయి.

47. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మదర్ థెరిసా పురస్కారానికి ఎంపికైనది ఎవరు?
1) థాబో ఎంబేకి
2) షేక్ అబ్దులాబిన్ జయాద్
3) వంగరి మథాయి
4) నయిఫ్ బిన్ అబ్దుల్ అజీజ్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: ముంబయికి చెందిన హర్మిని ఫౌండేషన్ ప్రదానం చేసే మదర్ థెరిసా పురస్కారానికి యూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రి షేక్ అబ్దులాబిన్ జయద్ ఆల్ నయాన్ఎంపికయ్యాడు. యువతను తీవ్రవాదం వైపు వెళ్లనీయకుండా, అలాగే మధ్యాసియాలో శాంతి స్థాపనకు కృషి చేసినందుకుగాను ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు.

48. డా. నాగేంద్రసింగ్ అంతర్జాతీయ శాంతి పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) శ్రీ రవిశంకర్
2) బాబా రామ్‌దేవ్
3) దాది జానకి
4) మాత అమృతనందమయి

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: అంతర్జాతీయ న్యాయస్థానంలో తొలి భారతీయ న్యాయమూర్తి నాగేంద్రసింగ్. ఈమన గౌరవార్థం 2014లో ఇంటర్నేషనల్ గుడ్‌విల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ పురస్కారాన్ని ప్రారంభించింది.

49. ఢిల్లీ హాఫ్ మారథాన్- 2016 విజేత ఎవరు?
1) జి. లక్ష్మణన్
2) మహమ్మద్ యూసఫ్
3) మాన్ సింగ్
4) ఎలిదే కిపొచోగే

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: కెన్యాకు చెందిన ఎలిదే కిపొచొగే (Eliud kipchoge) ఢిల్లీ హాఫ్ మారథాన్‌ను 59 నిమిషాల 44 సెకన్లలో పూర్తి చేశాడు. 27,000 అమెరికన్ డాలర్లు నగదును బహుమతిగా అందుకున్నాడు.

50. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ విజేత ఎవరు?
1) పి.వి. సింధు
2) సన్ యు
3) చాంగ్ యెనా
4) లీ సొహి

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: చైనాకు చెందిన సన్‌యును ఓడించి పి.వి. సింధు సూపర్ సిరీస్ టైటిల్‌ను గెలుచుకుంది. చైనా ఓపెన్ సిరీస్‌ను గెలుచుకున్న రెండవ మహిళ పి.వి. సింధు. మొదట మహిళ సైనా నెహ్వాల్.

No comments:

Post a Comment