Tuesday, January 31, 2017

Current affairs with practisebits

2017 ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ కైవసం చేసుకుంది.*

జనవరి 28న మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్‌లో 6-4, 6-4తో 13వ సీడ్, తన సోదరి వీనస్ విలియమ్స్‌ను ఓడించింది. ఈ విజయంతో గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సంఖ్యను 23కు పెంచుకున్న సెరెనా 22 టైటిల్స్‌తో స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ) పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. అలాగే ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకును మళ్లీ సొంతం చేసుకుంది.

సెరెనా గ్రాండ్‌స్లామ్ టైటిల్స్

ఆస్ట్రేలియన్ ఓపెన్(7) :

2003, 2005, 2007, 2009, 2010, 2015, 2017

ఫ్రెంచ్ ఓపెన్ (3) :

2002, 2013, 2015

వింబుల్డన్ (7) :

2002, 2003, 2009, 2010, 2012, 2015, 2016

యూఎస్ ఓపెన్ (6) :

1999, 2002, 2008, 2012, 2013, 2014

మొత్తం (23)

*సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రీ గోల్డ్ ట్రోఫీని హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తొలిసారి గెలుచుకుంది.*

జనవరి 29న లక్నోలో జరిగిన ఫైనల్‌లో ఇండోనేసియాకు చెందిన గ్రెగోరినా మర్సికాపై 21-13, 21-14తో విజయం సాధించింది.

పురుషుల విభాగంలో జాతీయ ఛాంపియన్ సమీర్ వర్మ విజేగా నిలిచాడు. ఫైనల్‌లో బీ సాయి ప్రణీత్ (భారత్)పై 21-19, 21-16తో సమీర్ విజయం సాధించాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రణవ్ జెర్రీ-సిక్కి రెడ్డి(భారత్) జోడీ 22-20, 21-10తో అశ్వనీ పొన్నప్ప-బీ సుమీత్ రెడ్డి(భారత్) జంటపై విజయం సాధించింది.

*ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ దక్కించుకున్నాడు.*

జనవరి 29న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రఫెల్ నాదల్(స్పెయిన్)పై 6-4, 3-6, 6-1, 3-6, 6-3తో విజయం సాధించి రూ. 19 కోట్ల ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో ఫెడరర్ గ్రాండ్ స్లామ్ టైటిళ్ల సంఖ్య 18కి చేరింది. 2012 తర్వాత ఫెడరర్ గెలిచిన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ఇదే. ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్ స్లామ్‌లు నెగ్గిన పురుష క్రీడాకారుడి రికార్డు కూడా అతడి పేరిటే ఉంది.

ఫెడరర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్

ఆస్ట్రేలియన్ ఓపెన్ (5) :

2004, 2006, 2007, 2010, 2017

ఫ్రెంచ్ ఓపెన్ (1) :

2009

వింబుల్డన్ (7) :

2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012

యూఎస్ ఓపెన్ (5) :

2004, 2005, 2006, 2007, 2008

మొత్తం

(18)

*మాజీ జస్టిస్ పి.విశ్వనాథ్ శెట్టి కర్ణాటక లోకాయుక్తగా నియమితులయ్యారు.*

ఈ మేరకు జనవరి 28న ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. కుటుంబీకులపై వచ్చిన అవినీతి ఆరోపణలతో అంతకుముందు లోకాయుక్తగా ఉన్న జస్టిస్ భాస్కర్‌రావు పదవికి రాజీనామా చేశారు. దీంతో 2015 నుంచి కర్ణాటక లోకాయుక్త స్థానం ఖాళీగా ఉంది.

ఏడు ఇస్లామిక్ దేశాల పౌరులు 90 రోజుల పాటు అమెరికాలో ప్రవేశించకుండా ఆ దేశం నిషేధం విధించింది.*
ఈ మేరకు వీసాల జారీకి సంబంధించిన కార్య నిర్వాహక ఉత్తర్వులపై జనవరి 28న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు.

ఉత్తర్వుల్లో కీలకాంశాలు
ఇరాక్, సిరియా, ఇరాన్, సూడాన్, లిబియా, సోమాలియా, యెమెన్ పౌరులకు 90 రోజుల వరకూ అమెరికా వీసాలు నిలిపివేత. వలసదారులకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించే వరకు ఇది అమల్లో ఉంటుంది.అమెరికాలోకి సిరియా శరణార్థుల ప్రవేశంపై నివరధిక నిషేధం. వలసదారుల్లో క్రైస్తవులకు ప్రాధాన్యత.అమెరికాలోని శరణార్థుల పునరావాస కార్యక్రమం కనీసం 120 రోజుల పాటు నిలిపివేత.
అమెరికాలోకి 7 ఇస్లామిక్ దేశాల పౌరుల ప్రవేశాన్ని నిలిపివేస్తూ ట్రంప్ వెలువరించిన ఉత్తర్వుపై న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు అత్యవసర స్టే విధించింది. ట్రంప్ నిర్ణయానికి ప్రతిచర్యగా ఇరాన్‌లోకి అమెరికా పౌరుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఇరాన్ జనవరి 29న ప్రకటన చేసింది.

Practisebits


 (Q 1 to 50)_

1. ఇటీవల బ్రిక్స్ దేశాల పర్యాటకరంగ సమావేశం ఎక్కడ జరిగింది ?
1) ఫోర్తలేజా
2) నేపాల్
3) ఖజురహో
4) షాంఘై

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: మొదటి బ్రిక్స్ దేశాల పర్యాటక రంగ సమావేశం మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో జరిగింది. ఈ సమావేశానికి బ్రిక్స్ (BRICS) దేశాల పర్యాటక శాఖ మంత్రులు హాజరయ్యారు.

2. ఇటీవల ప్రారంభించిన రైల్వే బీమా పాలసీ ప్రకారం రైలు ప్రయాణ ప్రమాదంలో మరణించిన వారికి ఎంత నష్ట పరిహారం చెల్లిస్తారు?
1) రూ. 10 లక్షలు
2) రూ. 8 లక్షలు
3) రూ. 5 లక్షలు
4) రూ. 2 లక్షలు

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: రైల్వే టికెట్ తీసుకునే ప్రయాణికుడు రైల్వే బీమా పాలసీకింద రూ.1 చెల్లించాలి. ఒక వేళ రైలు ప్రమాదానికి గురై ఆ వ్యక్తి మరణించిన లేదా శాశ్వతంగా అంగ వికలురు అయినా రూ. 10 లక్షలు నష్టపరిహారం ఇస్తారు. శాశ్వత పాక్షిక అంగ వికలురు అయితే రూ. 7.5 లక్షలు, ప్రాణాపాయ స్థితితో ఆసుపత్రికి తరలించడానికి రూ.10,000, గాయాలు బాగా తగిలి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే రూ. 2 లక్షలు ఇస్తారు.

3. భారతీయ రైల్వే ప్రయాణికులకు ఇచ్చే బీమా సౌకర్యం కల్పించేందుకు టెండర్లు దక్కించుకొన్న సంస్థలు ఏవి?
1) శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్
2) ICICI లాంబర్డ్ జనరల్ ఇన్సూరెన్స్
3) రాయల్ సుందరమ్ జనరల్ ఇన్సూరెన్స్
4) పైవన్నీ

View Answer

స‌మాధానం: 4

4. ‘‘అంతర్జాతీయ ఇండియా- కెమ్ 2016’’ సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) న్యూఢిల్లీ
2) ముంబయి
3) బెంగళూరు
4 హైదరాబాద్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: 9వ అంతర్జాతీయ ఎగ్జిబిషన్ సమావేశాన్ని‘‘ఇండియా- కెమ్ 2016’’ పేరుతో ముంబయిలో నిర్వహించారు. దీనిని రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. 23 దేశాల నుంచి 282 ప్రదర్శనకారులు ఈ సమావేశానికి వచ్చారు. దీనిని ఫిక్కి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్స్ అండ్ పెట్రో కెమికల్స్, భారత ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించారు.

5. జాతీయ యుద్ధ ప్రదర్శన శాలను ఎక్కడ నిర్మించనున్నారు?
1) న్యూఢిల్లీ
2) పూణె
3) సిమ్లా
4) కోల్‌కతా

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: న్యూఢిల్లీలో జాతీయ యుద్ధ ప్రదర్శనశాల నిర్మాణానికి రక్షణ మంత్రిత్వ శాఖ పచ్చజెండా ఊపింది. మ్యూజియం నిర్మాణానికి డిజైన్‌ల కోసం ఆహ్వానించింది. అత్యుత్తమ డిజైన్ లు అందించిన మొదటి ముగ్గురు విజేతలకి వరుసగా రూ. 75,000, రూ.50,000 , రూ. 25,000 నగదు బహుమతి ఇస్తారు.

6. ఇటీవల ఏ రాష్ట్రం రైల్వే మార్గాల అభివృద్ధి కోసం భారతీయ రైల్వేతో కలసి జాయింట్ వెంచర్ ప్రారంభించింది ?
1) తెలంగాణ
2) తమిళనాడు
3) కేరళ
4) కర్ణాటక

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: రైల్వేల అభివృద్ధి కోసం భారతీయ రైల్వేతో కేరళ ప్రభుత్వం జాయింట్ వెంచర్‌ను ప్రారంభించింది. 51:49 ఈక్విటీ భాగస్వామ్యంతో కేరళలో రైల్వే మార్గాలు అభివృద్ది చేయనున్నారు.

7. ఇటీవల అంతర్జాతీయ ఎల్‌పీజీ గ్యాస్ సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) కోయంబత్తూరు
2) కాన్పూర్
3) నాగపూర్
4) భువనేశ్వర్

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: భారత పెట్రోలియం కంపెనీలు సంయుక్తంగా భవనేశ్వర్‌లో అంతర్జాతీయ ఎల్‌పీజీ గ్యాస్ సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశానికి బ్రెజిల్, ఘనా, నైజీరియా, నేపాల్, శ్రీలంక దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.

8. బీహార్‌లో గంగానదిలో ఒండ్రు మట్టి పరిస్థితిని అధ్యయనం చేయడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏది?
1) ఎ.కె. సిన్హా కమిటీ
2) జస్టిస్ షా కమిటీ
3) రవిందర్ షా కమిటీ
4) మిశ్రా కమిటీ

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: బీహార్‌లో గంగానదిలో పేరుకుపోతున్న ఒండ్రు మట్టి గురించి అధ్యయనం చేయడం కోసం గంగా వరద నియంత్రణ కమిషన్ సభ్యుడు ఎ.కె. సిన్హా అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

9. ఇటీవల CNBC పకటించిన ‘‘ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్’’ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు?
1) అమితాబ్ బచ్చన్
2) సల్మాన్ ఖాన్
3) ఇర్ఫాన్ ఖాన్
4) షారుఖ్ ఖాన్

View Answer

స‌మాధానం: 3

10. దేశంలో మొదటిసారిగా విపత్తు నిర్వహణవిన్యాసాలు ఏ పేరుతో నిర్వహించారు?
1) విరోధ్
2) ప్రకంపన
3) సంఘర్ష్
4) ఎన్‌డీఆర్‌ఎఫ్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: దేశంలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ సంయుక్త విన్యాసాలు ‘ప్రకంపన’ పేరుతో విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ విన్యాసాలలో భారత సైన్యం, జాతీయ విపత్తుల నిరోధక దళం( NDRF) సంయుక్తంగా పాలుపంచుకున్నాయి.

11. ఇటీవల ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ‘‘Logistics Performance Index’ లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది?
1) లక్సెంబర్గ్
2) జర్మనీ
3) స్వీడన్
4) నెదర్లాండ్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: ప్రపంచ బ్యాంకు ‘‘Connecting to Compete 2016’’ అనే పేరుతో లాజిస్టిక్స్ ఫెర్ఫార్మన్స్ ఇండెక్స్ను విడుదల చేసింది. ఈ నివేదికలో జర్మనీ మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో లక్సెంబర్గ్, స్వీడన్, నెదర్లాండ్ నిలిచాయి. ఇండియా 35వ స్థానంలో ఉంది.

12. మాస్కోలో జరిగిన సైకత శిల్పకళ పోటీలలో ‘‘పీపుల్స్ ఛాయిస్’’ పురస్కారానికి ఎంపికైనది ఎవరు?
1) డాన్ బెల్ల్ చెర్
2) జేమ్ డెన్‌వాన్
3) సుదర్శన పట్నాయక్
4) జాన్‌డేవిడ్
*_Bhaskar Valmiki_*
View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: సుదర్శన్ పట్నాయక్ఇసుకతో నిర్మించిన మహత్మగాంధీ-ప్రపంచ శాంతి అనే శిల్పానికి గాను పీపుల్స్ ఛాయిస్ పురస్కారానికి ఎంపికయ్యాడు.

13. ఫ్రెంచ్ ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘‘Knight of the Legion of Honour’’ కు ఎవరు ఎంపికయ్యారు?
1) చందా కొచ్చర్
2) అరుంధతీ రాయ్
3) కిరణ్ మజుందార్ షా
4) ఇంద్రానూయి

View Answer

స‌మాధానం: 3

14. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు?
1) కె.కె. అగర్వాల్
2) సునంద బెన్
3) స్వాతి పిరమల్
4) కె.కె. మిట్టల్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌ను 1928లోప్రారంభించారు. ఇది డాక్టర్లకు చెందిన జాతీయ స్వచ్ఛంద సంస్థ. 2016-17 సంవత్సరానికిజాతీయ అధ్యక్షుడిగా కె.కె. అగర్వాల్ ఎంపికయ్యాడు.

15. మార్లేబోన్ క్రికెట్ క్లబ్‌లో జీవితకాల సభ్యత్వంను పొందిన క్రికెటర్ ఎవరు ?
1) ముత్తయ్య మురళీధరన్
2) హర్భజన్ సింగ్
3) విరాట్ కోహ్లి
4) జహీర్ ఖాన్

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: ఎంసీసీ మార్లేబోన్ క్రికెట్ క్లబ్‌లో జీవిత కాల సభ్యత్వంను పొందిన 24వ ఇండియన్ క్రికెటర్ జహీర్ ఖాన్.

16. ప్రపంచంలో అతి పెద్ద నది ద్వీపంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఏ ప్రాంతాన్ని గుర్తించింది ?
1) పొఖర్ హిల్
2) మజూలి ద్వీపం
3) మరాజో ద్వీపం
4) మేరిల్యాండ్ ద్వీపం

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్ ప్రపంచంలోనే నది ద్వీపాల్లో అతిపెద్దదిగా అస్సాంలో బ్రహ్మపుత్ర నదిలో ఉన్న మజూలి ద్వీపాన్ని గుర్తించింది. తర్వాతి స్థానంలో మారాజో ద్వీపం (బ్రెజిల్) ఉంది.

17. యునెస్కో- కన్ఫూషియస్ సాహిత్య పురస్కారం- 2016 నకు ఎంపికైన సంస్థ ఏది?
1) పెన్ ఇంటర్నేషనల్
2) సాహిత్య అకాడమీ
3) జనశిక్షణ్ సంస్థాన్
4) కాళిదాస్ సంస్థాన్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: గ్రామీణ యువతకు విద్యను అందించడానికి కృషి చేసిన వ్యక్తులకు లేదా సంస్థలకు ఈ పురస్కారాన్ని ఇస్తారు. యునెస్కో-కన్ఫూషియస్పురస్కారాన్ని చైనా ప్రభుత్వం 2005లోప్రారంభించింది. దీని కింద 20,000 అమెరికన్ డాలర్లు నగదు బహుమతి ఇస్తారు.

18. ఆస్కార్ ‘‘జీవితకాల సాఫల్య పురస్కారం’’ 2016 నకు ఎంపికైన నటుడు ఎవరు?
1) ఓంపూరి
2) బ్రాడ్‌పిట్
3) లియోనార్డ్ డి కాప్రి
4) జాకీచాన్

View Answer

స‌మాధానం: 4

19. ఇటీవల ఈ స్టాంప్స్‌ను విడుదల చేసిన రాష్ట్రం ఏది ?
1) రాజస్థాన్
2) తెలంగాణ
3) ఆంధ్రప్రదేశ్
4) జమ్మూ అండ్ కశ్మీర్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: దేశంలో మొదటిసారిగా ఈ స్టాంప్స్ విడుదల చేసిన రాష్ట్రం ఢిల్లీ (2012). ఇటీవల రాజస్థాన్ ఈ స్టాంప్స్‌ను విడుదల చేసింది. ఈ స్టాంప్స్‌ను విడుదల చేసిననాల్గో రాష్ట్రం రాజస్థాన్.

20. ప్రతిష్ఠాత్మక సరళ పురస్కారానికి ఎంపికైనది ఎవరు?
1) డాక్టర్ ప్రదిప్ కూమార్ పాండా
2) డాక్టర్ రుషికేశ్ మల్లిక్
3) శ్రీమనోజ్ దాస్
4) డాక్టర్ శీతకాంత్ మహపాత్ర

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: 37వ సరళ పురస్కారానికి ప్రముఖ ఒడియా రచయిత డాక్టర్ రుషికేశ్ మల్లిక్ఎంపికయ్యాడు. ఇతను రాసిన ‘Jeje Dekhi Nathiba Bharat’ అనే పుస్తకానికి ఈ పురస్కారం దక్కింది. ఇండియన్ మెటల్స్ పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ సాహిత్యంలో కృషి చేసిన వారి కోసం సరళ పురస్కారమును ప్రారంభించింది. ఈ పురస్కారం కింద రూ.1,50,000 నగదు బహుమతితో పాటు ఒక ప్రశంస పత్రం ఇస్తారు.

21. కేరళ ప్రభుత్వం మద్యపాన, డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికి రాయబారిగా ఎవరిని నియమించింది?
1) అమితాబ్ బచ్చన్
2) పి.వి. సింధు
3) దీపామాలిక్
4) సచిన్ టెండూల్కర్

View Answer
*_Bhaskar Valmiki_*
స‌మాధానం: 4

22. ప్రపంచంలో మొట్టమొదటి డ్రైవర్ రహిత మినీబస్ సర్వీస్‌ను ఎక్కడ ప్రారంభించారు?
1) ఫ్రాన్స్
2) ఇండియా
3) అమెరికా
4) కెనడా

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ప్రపంచంలో మొదటి డ్రైవర్ రహిత మినీబస్ సర్వీస్‌ను ఫ్రాన్స్‌లోని లైయన్ నగరంలో ప్రారంభించారు. ఈ బస్సులో 15 మంది ప్రయాణికులు ప్రయాణించే సౌకర్యం ఉంది.

23. అంకసముద్ర బర్డ్ శాంక్చుయరీ ఎక్కడ ఉంది?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక
4) తమిళనాడు

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: ఇటీవల కర్ణాటక రాష్ట్రం అంకసముద్ర సరస్సును పక్షి సంరక్షణ శాంక్చుయరీగా గుర్తించింది. అంకసముద్ర సరస్సులో 140 జాతుల వరకుఅనేక దేశీయ, వలస పక్షులు నివశిస్తుంటాయి.

24. ఇటీవల ఏ ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా భారత ఎన్నికల కమిషన్ గుర్తించింది?
1) ముస్లిం లీగ్
2) తృణమూల్ కాంగ్రెస్
3) శివసేన
4) మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన

View Answer

స‌మాధానం: 2

25. ఇటీవల ఏ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 200 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది ?
1) మహారాష్ట్ర
2) ఉత్తరప్రదేశ్
3) పశ్చిమబెంగాల్
4) జమ్మూ అండ్ కశ్మీర్

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: జమ్మూ అండ్ కశ్మీర్రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం ప్రతి జిల్లాలో ఇండోర్ క్రీడా ప్రాంత నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం రూ. 200 కోట్లు కేటాయించింది.

26. గోవా రాష్ట్ర పక్షి ఏది?
1) బుల్‌బుల్
2) పూసిన కొంగ
3) రామచిలక
4) పాలపిట్ట

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: గోవా రాష్ట్రం నవంబర్ 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు బుల్‌బుల్ పక్షి ఉత్సవాలు నిర్వహించనున్నది.

27. ‘ సొలంగ్ ఉత్సవం’ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?
1) ఉత్తరప్రదేశ్
2) అరుణాచల్‌ప్రదేశ్
3) బీహార్
4) కేరళ

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: అరుణాచల్ ప్రదేశ్‌లోని ‘ఆది తెగ’ ప్రజలు సొలంగ్ ఉత్సవాలను జరుపుకుంటారు. ఈ ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్లు కేటాయించింది.

28. ‘‘Lee Kuan Yew School of Public Policy of Singapore’’ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇండియాలో వ్యాపారానికి అనుకూలమైన ఉత్తమ రాష్ట్రం ఏది?
1) మహారాష్ట్ర
2) గుజరాత్
3) ఢిల్లీ
4) గోవా

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ఈ నివేదిక ప్రకారం వ్యాపారానికి అనుకూలమైన మొదటి అత్యుత్తమ రాష్ట్రం మహారాష్ట్ర. తర్వాతి స్థానాల్లో గుజరాత్, ఢిల్లీ, గోవా ఉన్నాయి.

29. IUCN ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘‘ హెరిటేజ్ హీరోస్’’ పురస్కారానికి ఎంపికైన మొదటి ఆసియావాసి ఎవరు?
1) బెజవాడ విల్సన్
2) బిభూతి లహకర్
3) చాన్ కొవాక్ వై
4)నార్మన్ లీమ్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: అస్సాంకు చెందిన ఎకాలజిస్ట్ బిభూతి లహకర్ (Bibhuti Lahkar) IUCN ఇచ్చే ‘‘ హెరిటేజ్ హీరోస్’’ పురస్కారానికి ఎంపికైనాడు. సహజ ప్రపంచ వారసత్వ ప్రాంతాలనురక్షించడానికి కృషి చేసిన వారికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.

30. ఇటీవల కనుగొన్న ఏ జీవికి అమెరికా అధ్యక్షుడు ఒబామా పేరు పెట్టారు?
1) పక్షి
2) పాము
3) కప్ప
4) చేప

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: హవాయి దీవులలో కనుగొన్న నూతన రకం చేపకు ఒబామా అని పేరు పెట్టారు.

31. ఇటాలియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములావన్ టైటిల్ విజేత ఎవరు?
1) లేవిస్ హమిల్టన్
2) సెబాస్టియన్ వెటల్
3) నికో రోస్‌బర్గ్
4) జులెస్ బై యన్ చా
*_Bhaskar Valmiki_*
View Answer

స‌మాధానం: 3

32. ITF పురుషుల ఫ్యూచర్ టెన్నిస్ టోర్నమెంట్ 2016 ఎక్కడ జరిగింది?
1) థాయిలాండ్
2) శ్రీలంక
3) మలేసియా
4) చైనా

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: థాయిలాండ్‌లోని ‘హుహిన్’ అనే నగరంలో ITFపురుషుల ఫ్యూచర్ టెన్నిస్ టోర్నమెంట్ జరిగింది.

33. ITF పురుషుల ఫ్యూచర్ టెన్నిస్ టోర్నమెంట్సింగిల్స్ విజేత ఎవరు?
1) సియోంగ్ చాన్ హంగ్
2) సుందర ప్రశాంత్
3) శ్రీరామ్ బాలాజీ
4) మసాతోషిగా

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: కొరియాకు చెందిన సియాంగ్ చాన్ హంగ్‌ను ఓడించి శ్రీరామ్ బాలాజీ ఈ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

34. హర్యానా రాష్ట్రంలో వైఫై హాట్‌స్పాట్ ఏర్పాటు చేసిన మొదటి గ్రామం ఏది?
1) లాహిలి
2) నిందాన
3) బల్లా
4) గుంతల గర్హూ

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాష్ట్రంలో తొలి వైఫై హాట్‌స్పాట్‌ను గుంతల గర్హూ (Gumthala Garhu) అనే గ్రామంలో ఏర్పాటు చేశారు. ఈ గ్రామంలో BSNL 10 mbps స్పీడుతో ఇంటర్‌నెట్ అందిస్తోంది.

35. శాంతి భద్రతలు పరిరక్షించే సమయంలో వాడే పెల్లెట్ గన్ స్థానంలో ప్రవేశ పెట్టనున్న గన్ పేరు ఏమిటి?
1) వాటర్‌గన్
2) పీఏవీఏ గన్
3) నైట్రస్ ఆక్సైడ్ గన్
4) ఎస్‌గన్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: జమ్మూలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పెల్లెట్‌గన్‌లను వాడారు. దీని వల్ల 1000 మందికి పైగా తీవ్ర గాయాలవడంతో వాటి వాడకం మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ గన్ స్థానంలో కారంతో తయారు చేసిన PAVA గన్‌లు వాడతారు. PAVA - Pelargonic Acid Vanillyl Amide

36. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశంనుమలేరియా రహిత దేశంగా ప్రకటించింది?
1) శ్రీలంక
2) పాకిస్తాన్
3) నైజీరియా
4) భూటాన్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ఆగ్నేయాసియా దేశాలలో మలేరియాను నివారించిన మొదటి దేశం మాల్దీవులు. రెండవ దేశం శ్రీలంక. ్రపపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల శ్రీలంకను మలేరియా రహిత దేశంగా ప్రకటించింది.

37. రాజస్థాన్‌లో డిజిటల్ విద్యను ప్రజలకు అందించటం కోసం ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు?
1) గూగుల్
2) మైక్రోసాప్ట్
3) రీడ్ ఇట్
4) సిస్కో

View Answer

స‌మాధానం: 4

38. అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకరంగ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?
1) షారుఖ్ ఖాన్
2) హృతిక్ రోషన్
3) జాన్ అబ్రహం
4) అజయ్ దేవగన్

View Answer

స‌మాధానం: 3

39. ఇటీవల జలప్రవేశం చేసిన వాటర్ జెట్‌ఫాస్ట్ ఎటాక్ క్రాప్ట్ షిప్ 'INS TIHAYA' ను నిర్మించిన సంస్థ ఏది?
1) హిందుస్థాన్ షిప్ యార్డ్
2) గార్డెన్ రీచ్‌షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్
3) కొచ్చిన్ షిప్‌యార్డ్
4) మజగావ్ డాక్‌యార్డ్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: ‘‘వాటర్ జెట్‌ఫాస్ట్ ఎటాక్ క్రాప్ట్ షిప్’’ రకానికి చెందిన మూడు షిప్‌లను గార్డెన్ రీచ్‌షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ నిర్మించింది. అవి.. INS Tarmugli, INS Tihaya, INS Tilanchans

40. ఇటీవల IUCN అంతరించిపోతున్న జంతువుల జాబితా (రెడ్ లిస్ట్)లో చేరిన జంతువు ఏది?
1) సైబిరియన్ నక్క
2) పశ్చిమ ఎలుగుబంటి
3) తూర్పు గొరిల్లా
4) అనకొండ

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: IUCN అంతరించిపోతున్న జీవజాతుల జాబితా(రెడ్ లిస్ట్)లో 23,928 జంతువులు, మొక్కలు ఉన్నాయి. గత 20 ఏళ్లలోగొరిల్లాలు 70 శాతం తగ్గిపోయాయి. ప్రస్తుతం 5000 తూర్పు గొరిల్లా మాత్రమే భూమి మీద ఉన్నాయి.

41. ఇటీవల జరిగిన బ్రెజిల్ ఓపెన్ గ్రాండ్ ప్రి డబుల్స్ టైటిల్ విజేత ఎవరు? *_Bhaskar Valmiki_*
1) సిక్కి రెడ్డి- ప్రణవ్ చోప్రా
2) టొబినెగ్ - రాచెల్ హొండేంచ్
3) బాబ్- రాబ్ బ్రయాన్
4) మహమ్మద్ - జుల్‌ఫాదై

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: కెనడాకు చెందిన టొబినెగ్ - రాచెల్ హొండేంచ్లను ఓడించి సిక్కి రెడ్డి- ప్రణవ్ చోప్రాఈ టైటిల్ గెలుచుకున్నారు.

42. ఆసియన్ కార్టింగ్ ఛాంపియన్ షిప్ టైటిల్ విజేత ఎవరు?
1) షహన్ అలీమెహసిన్
2) ఆనంద్ పవార్
3) మహమ్మద్ నషీద్
4) చాన్ వాంగ్ టు

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: మలేసియాలో జరిగిన ఆసియన్ కార్టింగ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న మొదటి భారతీయుడు షహన్ అలీ మెహసిన్

43. అంతర్జాతీయ ఛారిటీ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
1) సెప్టెంబర్ 2
2) సెప్టెంబర్ 3
3) సెప్టెంబర్ 4
4) సెప్టెంబర్ 5

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: పేదరిక నిర్మూలన కోసం ధార్మిక సంస్థలు ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్య సమితి 2012 నుంచి సెప్టెంబర్ 5వతేదీని అంతర్జాతీయ ఛారిటీ దినోత్సవంగా నిర్వహిస్తుంది.

44. జె.సి. డానియెల్ పురస్కారం 2016 (J. C. Daniel Award) నకు ఎంపికైనది ఎవరు?
1) విజయన్
2) కె.జి. జార్జ్
3) మమ్ముట్టి
4) మెహన్‌లాల్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: మళయాళం సినిమా పరిశ్రమలో అత్యున్నత పురస్కారం జె.సి. డానియెల్అవార్డు. మళయాళ సినిమాకు అత్యున్నత సేవలు అందించిన వారికి 1992 నుంచి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. ఈ పురస్కారం కింది ఒక విగ్రహం, రూ. 1,00,000 నగదు బహుమతి ఇస్తారు.

45. ఇటీవల భారత్‌లో పర్యటించిన ఈజిప్ట్ దేశ అధ్యక్షుడు ఎవరు?
1) హోస్ని ముబారక్
2) మహమ్మద్ ఆల్‌సిసి
3) సులైమాన్ ఫతాజిర్లా
4) అబ్దుల్ ఫతాహ్ ఆల్-సిసి

View Answer

స‌మాధానం: 4

46. 2016లో జీ-20 సమావేశంను ఎక్కడ నిర్వహించారు?
1) హాంగ్జౌ
2) తైపి
3) సింగపూర్
4) మనీలా

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: జీ-20 సమావేశం చైనాలోని హాంగ్జౌ నగరంలో నిర్వహించారు.

47. ‘నూఖై’ అనే వ్యవసాయ పండుగను ఏ ప్రాంత ప్రజలు జరుపుకుంటారు?
1) ఉత్తరప్రదేశ్
2) కేరళ
3) మహారాష్ట్ర
4) పశ్చిమ ఒడిశా

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: పశ్చిమ ఒడిశాలో పంట చేతికి రాగానేనూఖై వ్యవసాయ పండగను జరుపుకుంటారు.

48. బ్రిక్స్ దేశాల మొట్టమొదటి చిత్రోత్సవం ఎక్కడ నిర్వహించారు?
1) మాస్కో
2) న్యూఢిల్లీ
3) షాంఘై
4) ప్రిటోరియా

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: బ్రిక్స్ దేశాల మొదటి ఫిల్మ్ ఫెస్టివల్‌ను న్యూఢిల్లీలో నిర్వహించారు. దీనిలో ఉత్తమ చిత్రంగా ‘తిథి’ ఎంపికైంది.

49. దేశంలో అతి ఎక్కువ డెంగ్యూ మరణాలు సంభవించిన రాష్ట్రం ఏది?
1) ఒడిశా
2) కర్ణాటక
3) పశ్చిమ బెంగాల్
4) కేరళ

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: దేశంలో అతి ఎక్కువ డెంగ్యూ మరణాలు సంభవించిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఈ రాష్ట్రంలో 23 మంది మరణించారు. అలాగే 5,639 మంది డెంగ్యూ వ్యాధికి గురయ్యారు. తర్వాతి స్థానంలో ఒడిశా, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి.

50. ఇటీవల UNO ఛార్టర్‌లో ఏ భాషను చేర్చారు?
1) హిందీ
2) బెంగాలీ
3) తెలుగు
4) సంస్కృతం

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: UNO ఛార్టర్‌లో సంస్కృత భాషను చేర్చారు. ఇప్పటి నుంచి చార్టర్‌ను సంస్కృతంలో కూడా ప్రచురిస్తారు.

*భారత ఆర్థిక సర్వే 2016-17*



*దేశ వృద్ధిరేటు 7.1శాతం*
దిల్లీ: 2016-17 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు 7.1 శాతంగా నమోదైనట్లు ఆర్థిక సర్వేలో వెల్లడించారు. 2017 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను ఈరోజు లోక్‌సభలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.7 నుంచి 7.5 శాతం మధ్య ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2016-17లో వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు 4.1 శాతం నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఇది 1.2శాతం ఎక్కువ.

ఆర్థిక సర్వే ఇంకా ఏం చెప్పిందంటే.. ‘పెద్దనోట్ల రద్దు వల్ల ఇబ్బందులున్నప్పటికీ దాని వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరతాయి. ఏప్రిల్‌ నాటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. కార్మిక, పన్నుల విధానాల్లో సంస్కరణలు తేవాలి. వస్త్ర, తోలు పరిశ్రమల బలోపేతానికి సంస్కరణలు అవసరం’.
💐💐💐💐💐💐💐💐💐

*బడ్జెట్‌*:👉 బడ్జెట్‌ అనేది బొగెట్టీ అనే ఫ్రెంచి పదం నుంచి వచ్చింది. బొగెట్టీ అంటే సంచి అని అర్థం.
 ఒక సంవత్సరానికి ప్రభుత్వ ఆదాయ వ్యయాల స్వరూపమే బడ్జెట్‌.

👉ఏటా సెప్టెంబరులో బడ్జెట్‌ ప్రకటనను అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, స్వతంత్ర సంస్థలకు పంపిస్తారు.

👉నవంబరు నెలలో వివిధ వాణిజ్య మండళ్లురైతులు, ఉద్యోగ సంఘాలతో ఆర్థిక శాఖ అధికారులు చర్చిస్తారు.
వాణిజ్య మండళ్లు తదితర సంఘాలతో ఆర్థికమంత్రి తుది సమావేశాలు నిర్వహిస్తారు.
 ప్రణాళికలు రూపొందిస్తారు.

👉బడ్జెట్‌తో సంబంధమున్న ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, నిపుణులు, ముద్రణకు సంబంధించిన సాంకేతిక నిపుణులు, స్టెనోగ్రాఫర్లు, జాతీయ సమాచారశాస్త్ర కేంద్రం అధికారులను దిల్లీలోని నార్త్‌బ్లాక్‌(ఆర్థిక మంత్రిత్వశాఖ) కార్యాలయంలోకి తరలిస్తారు.
 ఇక వారక్కడే ఉండాలి. ఇతర ప్రపంచంతో సంబంధాలుండవు. కుటుంబ సభ్యులు కూడా నేరుగా మాట్లాడే అవకాశముండదు. అంతకు ముందు నార్త్‌బ్లాక్‌లో హల్వా వేడుక నిర్వహిస్తారు. హల్వాను ఆర్థిక మంత్రి సిబ్బందికి.. పంచి పెడుతారు.

👉ఆర్థికమంత్రి ప్రసంగాన్ని అత్యంత రహస్యంగా ఉంచుతారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి రెండు రోజుల ముందు అర్థరాత్రి సమయంలో ముద్రణకు ఇస్తారు. బడ్జెట్‌ పత్రాలను నార్త్‌బ్లాక్‌లోని దిగువ భాగంలో ముద్రిస్తారు.బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభమయ్యాక.. నార్త్‌బ్లాక్‌లో బడ్జెట్‌ తయారీ.. ముద్రణలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది బయటకు వస్తారు.

👉బడ్జెట్‌ సమర్పణ తేదీని ప్రభుత్వం నిర్ణయించి.. లోక్‌సభ స్పీకర్‌కు ప్రతిపాదిస్తుంది. అక్కడ ఆమోదం లభించాక.. లోక్‌సభ సచివాలయం రాష్ట్రపతి ఆమోదం కోరుతుంది.లోక్‌సభలో ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను సమర్పిస్తారు. అంతకు ముందు ఆర్థిక మంత్రి బడ్జెట్‌ వివరాలను సంక్షిప్తంగా కేబినెట్‌కి వివరిస్తారు. ప్రధాని ఆమోదించాక.. రాష్ట్రపతి ఆమోదానికి బడ్జెట్‌ వివరాలను అక్కడకు పంపుతారు.

👉.లోక్‌సభలో బడ్జెట్‌ను సమర్పించాక ‘వార్షిక ఆర్థిక పత్రం’ను రాజ్యసభలో ప్రవేశపెడుతారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టాక ఆ రోజు సభలో ఏ చర్చా జరగదు.కొన్ని రోజుల తర్వాత బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. సభ వాయిదా పడుతుంది.రాజ్యాంగంలో బడ్జెట్‌ పదమే లేదు. ‘‘వార్షిక ఆర్థిక పత్రం’’గా పేర్కొన్నారు. వాడుకలో బడ్జెట్‌ అయింది.

*🎁ఆ బడ్జెట్‌‘మన్మోహనమే’!*

👉పాతికేళ్ల కిందట... రాజకీయ అస్థిరతకు తోడు నిరుద్యోగం, తిరోగమన ఆర్థిక వృద్ధి, తయారీ రంగంలో సంక్షోభం, పేరుకుపోతున్న విదేశీ అప్పులు వంటివి దేశ ఆర్థిక వ్యవస్థను మందగించేలా చేశాయి. ఆ సమయంలో పీవీ నరసింహారావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్‌ సింగ్‌ 1991 జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించింది. ఎగుమతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. భారతీయ పరిశ్రమలు విదేశాల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేలా దిగుమతులను గరిష్ఠ స్థాయిలో కట్టడి చేశారు. పన్ను విధానాల్లో మార్పులు చేసి కస్టమ్స్‌ సుంకాలను భారీగా తగ్గించారు. ప్రభుత్వపరమైన చెల్లింపులు పెద్ద మొత్తంలో ఉండడం.. బకాయిలు భారీగా పేరుకుపోయి ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా పరిస్థితి ఎటు దారితీస్తుందో అన్న స్థితిలో మన్మోహన్‌ తీసుకొచ్చిన సరళీకరణ విధానాలు సత్ఫలితాలు ఇచ్చాయి. అందుకే ఇప్పటికీ 1991 నాటి మన్మోహన్‌ బడ్జెట్‌ను ఇప్పటికీ ప్రత్యేకంగా చెప్పుకొంటుంటారు.
*ఈ బడ్జెట్‌ ‘సమ్‌థింగ్‌ స్పెషల్‌’*

👉ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నాలుగోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. బడ్జెట్‌ అంటేనే ప్రతిఒక్కరిలో ఎంతో కొంత ఆసక్తి ఉంటుంది. కార్మికులు, కర్షకులు ఇలా ప్రతి రంగానికి చెందిన వారు బడ్జెట్‌లో విత్తమంత్రి ప్రకటించే వరాల కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు. గత బడ్జెట్‌లకు భిన్నంగా ఈ బడ్జెట్‌ ఉండబోతోందని సమాచారం. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ కావడంతో అందరిలోనూ ఒకింత ఆసక్తి సైతం నెలకొంది. ఇంకో విశేషమేమంటే, ఈసారి రైల్వే బడ్జెట్‌ లేకపోవడం. గత బడ్జెట్‌లకు భిన్నంగా ఈ బడ్జెట్‌ ప్రత్యేకతలేంటో ఓసారి చూస్తే...

*2017-18 బడ్జెట్‌లో కొన్ని ప్రత్యేకతలు*

👉* బడ్జెట్‌ తయారీకి సంబంధించిన సమస్త సమాచారాన్ని కేంద్రం బడ్జెట్‌ సమాచార వ్యవస్థ(యూబీఐఎస్‌) ద్వారానే కొనసాగుతోంది. పెన్‌డ్రైవ్‌లు, కాగితాల రూపంలో స్వీకరణలు జరగడం లేదు.

👉* బడ్జెట్‌ ఎప్పుడూ ఫిబ్రవరి చివరి రోజున ప్రవేశపెట్టే వారు కానీ ఈసారి ఆ తేదీని మార్చారు. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.

👉* ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయడం బడ్జెట్‌లో స్పష్టంగా కన్పించనుంది. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల విషయంలో ప్రత్యేకత కోల్పోవచ్చు.

👉* జనవరి 31న 2016-17 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ప్రకటించే అవకాశం ఉంది. గతంలో బడ్జెట్‌ సమావేశాలకు కొద్దిరోజుల ముందు దీన్ని ప్రకటించే వారు. కానీ ఈసారి బడ్జెట్‌కు ఒకరోజు ముందుకు ఆర్థిక సర్వేను ప్రకటించనున్నారట.

👉* ఈసారి సాధారణ బడ్జెట్‌ మాత్రమే ప్రవేశపెట్టనున్నారు. రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్‌లో కలిపేశారు.

👉* జులై 1 నుంచి వస్తు, సేవల పన్ను అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో సేవా పన్ను, ఎక్సైజ్‌ డ్యూటీల ప్రస్తావన చివరిసారి కావచ్చు.

👉* బడ్జెట్‌ ప్రక్రియను మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 15లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మే నెలలో బడ్జెట్‌ ఆమోదం పొందే అవకాశం ఉంది. వర్షాకాలం వచ్చే సమయానికి పూర్తి బడ్జెట్‌ ప్రక్రియ పూర్తయి ఆమోదం పొందనుంది.



*ఆర్థిక సర్వే 2016-17: ముఖ్యాంశాలు*


👉పార్లమెంట్‌  బడ్జెట్‌ సమావేశాల్లో  2016-17 ఆర్థిక సంవత్సరానికి  సంబంధంచిన  ఆర్థిక సర్వేను  ప్రవేశపెట్టారు. 2017 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను ఆర్థికమంత్రి  అరుణ్ జైట్టీ మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. దేశ వృద్ధిరేటు 7.1 శాతంగా నమోదైనట్లు ఆర్థిక సర్వే లో  తేల్చింది. జీడీపీలో కరెంట్ అకౌంట్ లోటు 0.3 శాతంగా ఉంటుందన్న సంకేతాలను జైట్లీ ఇచ్చారు.  అయితే ఇది తాత్కాలికమేనని ఆయన చెప్పారు.  గత ఏడాది కాలంగా 7 ముఖ్యమైన సంస్కరణలు తీసుకొచ్చినట్టు చెప్పారు.  ముఖ్యంగా జీఎస్టీ, అవినీతి నిరోధక బిల్లు, పరపతి విధాన కమిటీ, ఆధార్ బిల్లు, విదేశీ పెట్టుబడుల సరళీకరణ, యపీఐ, కార్మిక రంగ అభివృద్ధి లాంటి అంశాల్లో సంస్కరణలు చేపట్టినట్టు   ఆర్థిక సర్వేలో వెల్లడించారు.

👉2017-18 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.7 నుంచి 7.5 శాతం మధ్య ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  వ్యవసాయ రంగం  4.1 శాతం పెరుగుదలను నమోదుచేయగా, గతేడాదితో పోలిస్తే ఇది 1.2శాతం ఎక్కువ.  పారిశ్రామిక ఉత్పత్తి 5.2 శాతానికి మందగించినట్టు చెప్పారు. సేవల వృద్ధి 8.8 శాతంగా ఉంటుంది. ఈ మూడు రంగాల మునుపటి ఆర్థిక సంవత్సరంలో వరుసగా   1.2 శాతం, 7.4 శాతం, 8.9 శాతం మేర విస్తరించినట్టు ఆర్థికమంత్రి చెప్పారు.ముఖ్యంగా పెద్దనోట్ల రద్దు వల్ల  స్వల్పకాలంలో ఇబ్బందులున్నప్పటికీ, దీర్ఘకాలికంగా భారీ ప్రయోజనాలు చేకూరనున్నాయని సర్వే తేల్చింది.  రీమానిటైజేషన్   పూర్తి అయ్యి  ఏప్రిల్‌ నాటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. అనంతరం లోక్ సభ రేపటికి వాయిదా పడింది.

*👉చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ అరవింద్ సుబ్రమణియన్ రూపొందించిన 2017-18 ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.*

*ముఖ్యాంశాలు...*
👉ఆర్థిక వ్యవస్థ విస్తరించే కొద్దీ ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.
జీఎస్టీ అమల్లోకి వస్తే, ప్రజలకు నాణ్యమైన జీవనం దగ్గరవుతుంది.

👉ప్రభుత్వానికి వస్తున్న ఆదాయపు పన్ను భారీగా వసూలవుతోంది
నగదు రహిత లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ  నేపథ్యంలో బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం.
👉నల్లధనంగా మిగిలిపోయిన మొత్తం నగదు వెలుగులోకి వస్తోంది.
👉ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టే అవకాశం
👉డిజిటలైజేషన్ తో కేంద్ర ఖజానాకు మరిన్ని నిధులు.
👉జీడీపీ తగ్గినట్టు కనిపించడం తాత్కాలికం మాత్రమే.
👉విదేశీ కంపెనీల పెట్టుబడులకు మరిన్ని అవకాశాలు కల్పించనున్నాం.
👉మేకిన్ ఇండియాలో భాగంగా ఎన్నో సంస్థలు ఇక్కడికి వస్తున్నాయి.
👉గ్లోబలైజేషన్ కారణంగా అత్యధికంగా లాభపడుతున్న దేశాల్లో భారత్ ఒకటి.

*సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌*


👉సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస మన లక్ష్యమని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. ఉభయ సభల నుద్దేశించి ప్రణబ్‌ ప్రసంగిస్తూ, ప్రస్తుతం దేశంలో బ్లాక్‌మనీ, అవినీతి గణనీయంగా తగ్గిందన్నారు.ప్రజా ఉద్యమంతోనే స్వచ్ఛభారత్‌ మిషన్‌ను తీర్చిదిద్దామన్నారు.. స్వచ్భభారత్‌ మిషన్‌లో ప్రజలు భాగస్వామ్యానికి సెల్యూట్‌ చేస్తున్నానని అన్నారు. దేశంలో అవినీతినిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్రపతి అన్నారు. అవినీతి , నల్లధనం నిర్మూలనలో ప్రభుత్వ చర్యలకు ప్రజలు సహకరించారని ప్రణబ్‌ అన్నారు.

*👉చంపారన్‌ ఉద్యమానికి వందేళ్లు పూర్తి*

స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన చంపారన్‌ సత్యాగ్రహ ఉద్యమానికి నేటితో 100 పూర్తయ్యాయని అన్నారు.. ప్రజా ఉద్యమ బలాన్ని చాటిన చెప్పిన సందర్భం అది అని రాష్ట్రపతి పేర్కొన్నారు.



*26 కోట్ల మందికి జన్‌ధన్‌లో ఖాతాలు*

👉దేశవ్యాప్తంగా 26 కోట్ల మందికి జన్‌ధన్‌లో ఖాతాలు తెరిచామని రాస్ట్రపతి తెలిపారు.. పార్లమెంట్‌ ఉభయ సభల నుద్దేశించి ఆయన ప్రసంఇంచారు.. ఇండియన్‌ పోస్టల్‌ చెల్లింపు బ్యాంకును ప్రారంభించామని వెల్లడించారు.. పేద, దళిత, పీడిత, రైతు, శ్రామిక , యువత ప్రగతికి నూతన విధానాలు రూపొందించామని చెప్పారు.

*సాధారణ బడ్జెటలోనే రైల్వే బడ్జెట్‌*

👉ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌ ఇకపై సాధారణ బడ్జెట్‌లోనే ఉంటుందని రాష్ట్రపతి తెలిపారు. తొలిసారి సాధారణ బడ్జెట్‌లో రైల్వేబడ్జెట్‌ వీలనమైందని ఆయన పేర్కొన్నారు.

*ఇంటింటికీ విద్యుత్‌ వెలుగులు*

👉దేశంలో ఇంటింకీ విద్యుత్ వెలుగులు, వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రణబ్‌ తెలిపారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ప్రతి ఇంటికి విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.. దేశంలో 20 కోట్లమేర ఎల్‌ఇడి బల్బులు పంపిణీ చేశామని తెలిపారు.

*ప్రతిఎకరాకు సాగునీరు*

👉దేశంలోని ప్రతిఎకరానికి సాగునీరు అందించటమే లక్ష్యంగా కృషిచేస్తున్నామన్నారు. ప్రధాని కృషి సంచార్ యోజన పథకం కింద ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. రబీలో సాగు విస్తీరణం 6శాతం పెరిగిందన్నారు.

No comments:

Post a Comment