Thursday, January 26, 2017

వైరస్‌ల ద్వారా మానవునిలో , మొక్కలలో కలిగే వ్యాధులు:

వైరస్‌ల ద్వారా మానవునిలో కలిగే వ్యాధులు:
1. ఆటలమ్మ 2. పోలియో 3. తట్టు/మీజిల్స్‌/రుబెల్లా
4. గవద బిళ్ళలు/మమ్స్‌ 5. జలుబు 6. మశూచి/స్మాల్‌పాక్స్‌
7. మెదడువాపు వ్యాధి/జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌
8. హెపటైటిస్‌ 9. ఎయిడ్స్‌ 10. డెంగ్యూ 11. చికెన్‌గున్యా 12. రేబిస్‌ 13. సార్స్‌ 14. ఎబోలా 15. క్యాన్సర్‌ 16. స్వైన్‌ఫ్లూ 17. ఇన్‌ఫ్లూయెంజా 18. కంటికలక


మొక్కలలో వైరస్‌ల ద్వారా వచ్చే వ్యాధులు: వైరస్‌లు అవికల్ప పరాన్న జీవులుగా ఉండి, మొక్కల్లో పెరుగుతూ అనేక వ్యాధులను కలుగచేస్తాయి.
సాధారణంగా వైరస్‌ల వల్ల కలిగే మొక్కల వ్యాధులు చాలా వరకు 'మొక్క మొత్తాన్ని ప్రభావితం' (సర్వాంగీణం) చేస్తాయి. ఎక్కువగా తెగులు లక్షణాలు పత్రాల్లో కనిపిస్తాయి.
1. నిర్హరితం- పీచు పసుపు పచ్చ తెగులు
2. మొజాయిక్‌ వ్యాధి- పొగాకు మొజాయిక్‌ వ్యాధి
3. ఈనెల నిర్హరితం- బెండ ఈనెల నిర్హరితం
4. కురూపకత - కోకో ఉబ్బుకాండం
5. పుష్పాల చీలికలు- ట్యూలిప్‌ పుష్పాల చీలిక
6. వేరువిల్ట్‌ - కొబ్బరి వేరు విల్ట్‌
7. ట్రిస్టిజ- చీని/బత్తాయి ట్రిస్టిజ
8. మొవ్వకుళ్ళు - వేరుశనగ మొవ్వకుళ్ళు తెగులు
9. వెర్రితల తెగులు- మిరప వెర్రితల తెగులు
10. టమోటాలో ఆకుముడత తెగులు
11. అరటిలో బంబీటాప్‌ తెగులు
12. టొమాటో రింగ్‌స్పాట్‌ తెగులు
13. పొగాకు నెక్రోసిస్‌ తెగులు
14. వరి టుంగ్రో తెగులు
జంతువులలో వైరస్‌ వ్యాధులు
1. కోళ్ళు - బర్డ్‌ ఫ్లూ
2. పాడిపశువులు - గాలికుంటు వ్యాధి
3. గొర్రెలు - నీలి నాలుక వ్యాధి
4. కౌపాక్స్‌ - పశువులు
5. రాణిఖేట్‌ వ్యాధి - కోళ్ళు కొక్కెర వ్యాధి
6. కోళ్ళు - మార్క్స్‌ వ్యాధి
7. పశువులు - చీడపారుడు వ్యాధి

No comments:

Post a Comment