Tuesday, January 31, 2017

బాబాసాహెబ్ అంబేద్కర్ - తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు ❤❤❤

బాబాసాహెబ్ అంబేద్కర్ - తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు ❤❤❤

(దయచేసి చదవండి - తరువాత తరాలకు తెలియజేయండి)

✿✿ జీవన చిత్రం ✿✿
☞ తల్లిదండ్రులు :- తల్లి భీమాబాయి సక్పాల్, తండ్రి రాంజీ మాలోజీ సక్పాల్ బ్రిటీష్ ఆర్మీలో సుబేదార్ గా పని చేసేవారు. వీరి స్వంత గ్రామం అంబెవాడ గ్రామం, రత్నగిరి జిల్లా, మహారాష్ట్ర.
☞ జననం:- 14 ఏప్రిల్ 1891
☞ ప్రాంతం :- మావ్, సెంట్రల్ ప్రావిన్స్ (ప్రస్తుత మధ్య ప్రదేశ్) ( రాంజీ సక్పాల్ గారు ఉద్యోగం చేస్తున్న ప్రాంతం)
☞ వివాహం:-
* రమాబాయి అంబేద్కర్:- 1906 లో వివాహం జరిగింది, ఆయన ప్రతి విజయంలో పూర్తి సహకారం అందించారు, తాను చిరిగిన దుస్తులు ధరిస్తూ కూడా బాబాసాహెబ్ చదువుకు, ఆయన చేసే కార్యక్రమాలకు ఏనాడూ ఆటంకం కాలేదు., చివరికి రక్త హీనతతో 1935 సంవత్సరంలో చనిపోయారు.
* సవిత అంబేద్కర్ :- అసలు పేరు శారద కబీర్, రాజ్యాంగ రచన సమయంలో నిద్రలేమి, కాళ్ళలో కండరాల సమన్య వలన దెబ్బ తిన్న ఆరోగ్యన్ని దగ్గర ఉండి చూసుకోవడం కోసం 15 ఏప్రిల్ 1948 న వివాహం చేసుకున్నారు..
☞ మరణం:- రాజకీయ పరిస్థితులపై, తన అనుచరులు అనుకున్న వారి వ్యవహర శైలి వలన తీవ్రమైన మానసిక వత్తిడిని అనుభవించారు, నిద్రలేమి, మానసిక వత్తిడి వలన కలిగిన తీవ్రమైన మధుమేహ వ్యాధితో బాధ పడ్డారు .
తన ఆఖరి పుస్తకం "Buddha and his Dhamma" పూర్తి చేసిన మూడు రోజులకు, 1956 డిసంబర్ 06 న నిద్రలోనే పరినిర్వాణం చెందారు

☞✿ బాబాసాహెబ్ చదువులు - ప్రత్యేకతలు:- ✿☜

✍ మెట్రికులేషన్ -1908
✍ B.A - (Politics and Economics) Bombay University in 1912 - అంటబడని కులాల నుండి మొట్టమొదటి గ్రాడ్యుయేట్
✍ M.A - (Economics - For his thesis ‘Ancient Indian Commerce’) in America in 1915.
✍ Ph.d - (Economics - For his thesis ‘The evolution of provincial finance in British India’) in Columbia University, America in 1917. - ఆర్థిక శాస్త్రంలో ఆసియా ఖండం నుండి మొట్టమొదటి డాక్టరేట్.
✍ D.Sc - (Thesis - ‘Problem of the Rupee - Its origin and its solution’) in London School of Economics in 1923. ఆర్ధిక శాస్త్రంలో D Sc తీసుకున్న మొదటి మరియు ఆఖరి భారతీయుడు
✍ M.Sc – (Economics – For his thesis ‘Provincial Decentralisation of Imperial Finance in British India’) London. - ఆర్ధిక శాస్త్రంలో మొదటి డబల్ డాక్టరేట్
✍ Bar-At-Law - Gray’s Inn in London, 1923. మొట్టమొదటి ప్రపంచ స్థాయి న్యాయవాది
✍ Political Economics - Germany.
✍ LLD - (Honoris) Columbia University, New York, For his achievements of leadership and authoring the Constitution of India.
✍ D.Litt - (Honoris) Osmania University, Hyderabad, For his achievements, Leadership and writing the constitution of India.
✍ బాబాసాహెబ్ తన జీవిత కాలంలో 20000 పుస్తకాలు సేకరించారు., అమెరికా నుండి తిరిగి వచ్చే సమయంలో ఆయన పుస్తకాలు తీసుకొస్తున్న నౌకను జర్మనీ సబ్మెరైన్ దాడి చేసి ముంచేయడంతో దాదాపు 6000 పుస్తకాలు పోగొట్టుకున్నారు., ఆ సమయంలో బాబాసాహెబ్ చాలా బాధ పడ్డారు.

✿✿ తెలిసిన బాషలు -9 భాషల్లో బాబాసాహబ్ పూర్తి ప్రావిన్యత కలిగి ఉన్నారు ✿✿

- మరాఠీ
- హిందీ
- ఇంగ్లీషు
- గుజరాతీ
పాళీ (- పాళీ వ్యాకరణం మరియు నిఘంటువు కూడా రాసారు )
- సంస్కృతం
- జర్మన్
- పార్శీ
- ఫ్రెంచ్

✿✿ బాబాసాహెబ్ ఉద్యమ జీవితం ✿✿

☞☆ బాబాసాహెబ్ స్థాపించిన ఉద్యమ సంస్థలు:-

1. బహిషృిత హితకారిణి సభ :- జులై 20, 1924
2. సమత సైనిక్ దళ్ :- మార్చి 13, 1927

☞☆ బాబాసాహెబ్ స్థాపించిన రాజకీయ సంస్థలు:-

1. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ (ILP)-- ఆగస్టు 16, 1936
2. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ (SCF)-- జులై 19, 1942 ( ILP నే SCF గా మార్చారు)
3. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI) - అక్టోబరు 3, 1957 (బాబాసాహెబ్ అనారోగ్యం కారణంగా ఆయన తదనంతరం నెలకొల్పబడింది)

☞☆ బాబాసాహెబ్ స్థాపించిన విధ్యా సంస్థలు

1. డిప్రెస్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సొసైటీ -- జూన్ 14, 1928
2. పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ -- జూలై 08, 1945
3. సిద్ధార్థ్ కాలేజి, ముంబై -- జూన్ 20, 1946
4. మిళింద్ కాలేజీ, ఔరంగాబాద్ -- జూన్ 01, 1950

☞☆ బాబాసాహెబ్ స్థాపించిన ధార్మిక సంస్థ

1. బుద్ధిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా -- మే 4, 1955

✿✿ బాబాసాహెబ్ నాయకత్వం వహించిన కొన్ని ముఖ్య ఉద్యమాలు ✿✿

- మహద్ చెరువు ఉద్యమం -20/3/1927
- మొహాళీ (ఘులేల)తిరుగుబాటు -12/2/1939
- అంబాదేవీ మందిరం ఆందోళన -26/7/1927
- పూణే కౌన్సిల్ ఉద్యమం - 4/6/1946
- పర్వతీ ఆలయ ఉద్యమం -22/9/1929
- నాగపూర్ ఆందోళన - 3/9/1946
- కాలారామ్ ఆలయ ఆందోళన -2/3/1930
- లక్నౌ ఉద్యమం - 2/3/1947
- ముఖేడ్ ఉద్యమం -23/9/1931

✿✿ బాబాసాహెబ్ స్థాపించిన పత్రికలు ✿✿

*- మూక్ నాయక్ - జనవరి 31, 1920
*- బహిషృిత భారత్ - ఏప్రిల్ 3, 1927
*- సమత - జూన్ 29, 1928
*- జనత - నవంబరు 24, 1930
*- ప్రభుద్ధ భారత్ - ఫిబ్రవరి 4, 1956

✿✿ బాబాసాహెబ్ ప్రత్యేకతలు - దక్కిన గౌరవాలు ✿✿

☞- బాబాసాహెబ్ తన జీవిత కాలంలో 527 ప్రసంగాలు చేసారు., ప్రతి ప్రసంగం అత్యంత ప్రభావితం చేయగలిగేవే..
☞- లండన్ యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు మొత్తం చదివి అవపోసన పట్టిన ఒకే ఒక్కరు బాబాసాహెబ్
☞- ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు గల ప్రజా నాయకుడు బాబాసాహెబ్
☞- ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావశీలురైన 6గురు మేధావులలో బాబాసాహెబ్ ఒకరు
☞- లండన్ విశ్వవిద్యాలయంలో తన ఎనిమిదేళ్ళ Phd ని మూడు సంవత్సరాలలో పూర్తి చేసిన అత్యంత మేధావి
☞- తన ప్రమేయం లేదు కాబట్టి హిందూమతంలో పుట్టాను గానీ హిందూమతంలో మాత్రం చావను అని ఆయన బౌద్ధం తీసుకుంటే, మరో ఆలోచన లేకుండా 5లక్షల మంది బౌద్ధం తీసుకున్నారు.. ఇంతటి అభిమానం ఇంకే నాయకుడు పొంది ఉండడు.
❤❤ అరుదైన గౌరవాలు ❤❤
☞- భారత రత్న - ఇంత ప్రపంచ మేధావికి స్వతంత్ర్యం వచ్చిన 43 ఏళ్ళకు గానీ గుర్తించలేకపోయింది కులం రోగంతో కొట్టుకుంటున్న భారత ప్రభుత్వం
☞- కొలంబియా యూనివర్సిటీ ప్రకారం - ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుడైన నాయకుడు
☞- ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకారం విశ్వంలోనే అతిగొప్ప ఉద్యమ నిర్మాత
☞- CNN, IBN, History channel నిర్వహించిన సర్వే ప్రకారం THE GREATEST INDIAN

❇❇ బాబాసాహెబ్ గురించి బయటకు తెలియకుండా దాయబడుతున్న అంశాలు ❇❇

బాబాసాహెబ్ ను నవ భారత నిర్మాతగా, భారతదేశ చరిత్రలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన ఒక అత్యంత ప్రభావశీలుడైన నాయకునిగా గుర్తిస్తుంటే, భారతదేశంలో మాత్రం ఆయనను ఒక కులానికి నాయకునిగా, ఒక వర్గానికి నాయకుడిగా చూస్తోంది., సంఘ్ విద్రోహులు బాబాసాహెబ్ అందరి నాయకుడు అంటూనే ఆయన గొప్పదనం తెలియజేయకుండా కేవలం ఆయనను రాజ్యాంగ రచయితగా మాత్రమే పరిమితం చేసి, హిందూ మత ఉద్ధారకునగా ప్రచారం చేస్తూ హిందూ ఓటు బ్యాంకు పెంచుకోవాలని కుట్ర పన్నుతోంది., ఇది బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని పూర్తిగా తుడిచి పెట్టే కుట్ర,.

ఇలాంటి సమయంలో బాబాసాహెబ్ నిజమైన గొప్పతనాన్ని తెలుసుకోకపోతే, మనువాద వక్రీకరణలే చరిత్రగా మారే ప్రమాదం ఉంది.. మన భావితరాలను ఈ వక్రీకరణల నుండి కాపాడుకోకపోతే., అంబేద్కరిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టినవారం అవుతాం.,

✿✿☆ వివిధ రంగాల్లో బాబాసాహెబ్ కృషి - గొప్పతనాలు - వాటి ఫలితాలు .. ☆✿✿

✿ బాబాసాహెబ్ - మహిళా హక్కులు ✿
☞✓ హిందూకోడ్ బిల్లు - మహిళల విధ్య, ఆర్థిక సమానత్వం కోసం (హిందువులు తీవ్రంగా వ్యతిరేకించినందున పార్లమెంటు నిరాకరించడంతో బాబాసాహెబ్ మహిళా హక్కుల కోసం మంత్రి పదవి వదిలేసారు.)
☞✓ పురుషులతో పాటు మహిళలకు సమాన వేతనాలు
☞✓ మహిళలకు గర్భధారణ సమయంలో 8 వారాల ప్రత్యేక సెలవు (Maternity leave).
☞✓ పని ప్రాంతాలలో మహిళకు ప్రత్యేక సౌకర్యాల కోసం పథకాలు
☞✓ స్త్రీ శిశు సంక్షేమ చట్టం - ఇది తరువాతి కాలంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆవిర్భావానికి దారి తీసింది.

✗✗✗ అయినప్పటికీ మనువాదంలో మునిగి తేలుతున్న స్త్రీ సమాజం ఏనాడూ బాబాసాహెబ్ పేరు కూడా తలుచుకోదు., మహిళా హక్కులంటూ గొంతు చించుకునే మహిళా సంఘాలు బాబాసాహెబ్ గురించి ఒక్క మాట కూడా తమ సంఘాల వారికి చెప్పరు ✗✗✗

✿ బాబాసాహెబ్ - కార్మికుల హక్కులు ✿
☞✓ 8 గంటల పనిదినాలు - 7వ Indian Labour Conference, నవంబరు 27, 1942 లో 14 నుండి 8 గంటలకు కుదించారు
☞✓ ESI (Employee State Insurance) సౌకర్యం :- కార్మికుల ఆరోగ్య భద్రత కోసం (తూర్పు ఆసియాలోనే మొదటిది
☞✓ ఇండియన్ ఫాక్టరీల చట్టం :- పని ప్రదశంలో నిర్ధిష్ట విధానాలు, జవాబుదారీతనం కోసం.
☞✓ కరువు భత్యం (Dearness Allowance)పెరిగిన నిత్యావసర కర్చులను భరించేందుకు వీలుగా
☞✓ కనీస వేతనం ఉండే విధంగా చర్యలు
☞✓ కేంద్ర కార్మిక సంఘాల (సవరణ) చట్టం :- 1926 చట్టం కేవలం కార్మిక సంఘాలను రిజిష్ట్రేషను చేయడం మాత్రమే చెప్పింది ., 8 నవంబరు 1943న సవరణ చట్టం తీసుకొచ్చి పూర్తి విధివిధానాలు రూపొందించారు బాబాసాహెబ్
☞✓ ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం

✗✗✗ కానీ ఏనాడూ బాబాసాహెబ్ పేరు కూడా ఎత్తకుండా కార్మికులను మాయలో ఉంచుతారు ఈ అగ్రకులాల నాయకత్వంలో ఉన్న కమ్యూనిజం ✗✗✗

✿ బాబాసాహెబ్ - రైతుల కోసం ✿
☞✓ నీటిపారుదల సౌకర్యాల పితామహుడు:- హిరాకుడ్ ప్రాజెక్టు, దామోదర్ నదీలోయ ప్రాజెక్టు, సోన్ నది లాంటి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల డిజైన్ దగ్గర నుండి పూర్తి చేసేదాకా బాబాసాహెబ్ కృషి ఉంది.. భారత దేశ చరిత్రలో అనుకున్న ఖర్చు మరియు అనుకున్న సమయంలో పూర్తయిన నీటిపారుదల జల విద్యుత్ ప్రాజెక్టులు ఇవే.,
☞✓ మెరుగైన నీటిపారుదల కోసం Central Waterway and Irrigation Commission (CWIRC) ఏర్పాటు చేసారు.
☞✓ జలవనరుల నుండి విధ్యుత్తుత్పత్తిని క్రమబద్ధం చేయడం కోసం Central technical power board స్థాపించారు.
☞✓ ఇప్పటికీ సమస్యలు లేకుండా విజయవంతంగా నడుస్తూ దేశంలో విధ్యుత్తు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్న "గ్రిడ్ వ్యవస్థ " బాబాసాహెబ్ ఆలోచనే.

✗✗✗ మొక్షగుండం విశ్వేశ్వరయ్య, నెహూ, పటేల్ ల వల్లనే ఇవన్నీ సాధ్యమైనాయంటూ బాబాసాహెబ్ పేరు కూడా తలవవు ఈ ప్రభుత్వాలు.. ✗✗✗

✿ బాబాసాహెబ్-నిరుద్యోగం-స్వయం వికాసం ✿
☞✓ ఇప్పుడు నిరుద్యోగులకు అత్యంత సహాయకరంగా నిలుస్తున్న "ఎంప్లాయిమెంట్ ఎక్సచేంజీలు" (Employement exchange) బాబాసాహెబ్ స్థాపించినవే
☞✓ భారత దేశంలో సాంకేతిక విధ్య అందుబాటులో లేని కారణంగా నిరుద్యోగులను యూనిట్ గా చేసుకుని ITI లాంటి సంస్థలు ఏర్పాటు చేసి అవసరం అయితే వారిని విదేశాలకు పంపి శిక్షణ ఇప్పించాలని ప్రతిపాదించారు బాబాసాహెబ్

✿ భారతదేశ ఆర్థిక ప్రగతికి బాబాసాహెబ్ కృషి ✿
☞✓ రెండవ ప్రపంచ యుద్ధం సమయానికి ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్న భారతదేశాన్ని మళ్ళీ పునర్నించే ప్రయత్నంలో భాగంగా నియమించిన Reconstruction Commitee of Council లో బాబాసాహెబ్ సభ్యులుగా ఉన్నారు., నీటిపారుదల మరియు విధ్యుత్తుత్పత్తి ద్వారా ఆర్థిక ప్రగతికి బాటలు వేసారు..
☞✓ ఇప్పటిదాకా నివేదికలు సమర్పించిన 13 ఆర్థిక సంఘాల (Finance Commisions) నివేదికల కూడా బాబాసాహెబ్ Phd thesis అయిన "The Evolution of Provincial Finance in British India" నుండి సేకరించినవే.,
✍✓ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ఘోరంగా దెబ్బ తీస్తున్న ఆర్థిక మాంద్యాలు కూడా భారతదేశాన్ని ప్రభావితం చేయలేక పోవడానికి ముఖ్య కారణం అయిన రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా స్థాపన పూర్తిగా బాబాసాహెబ్ కృషి ఫలితమే., రిజర్వు బ్యాంకు స్థాపన కోసం ఏర్పాటు చేసిన హల్టన్ అండ్ యంగ్ కమీషన్ పూర్తిగా బాబాసాహెబ్ రాసిన "The Problem of the Rupee – It’s origin and it’s solution.” ని అనుసరించింది.

✗✗✗ మరి ఈనాడు చూస్తే కరెన్సీ నోటు మీద గాంధీ బొమ్మ మరియు బ్యాంకుల్లో రవీంద్రనాద్ ఠాగోర్ ల ప్రవచనాలే కనిపిస్తాయి., నిజానికి వీరి ఇద్దరి సహకారం శూన్యం..✗✗✗

✿ బాబాసాహెబ్ - హేతువాదం - సామాజిక ఉద్యమాలు ✿
☞✓ భారతదేశం విజ్ఞానపరంగా ముందుకు వెళ్ళకుండా మూఢనమ్మకాలలో మగ్గుతూ ఉండడానికి ముఖ్య కారణం హిందూమతం అని నినదించి., ఈ రుగ్మతలు ఒక సాంప్రదాయంగా కొనసాగిస్తున్న మనుధర్మాన్ని తగలబెట్టారు బాబాసాహెబ్
☞✓ ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని ఎదుర్కోవడానికి హేతువాదం మాత్రమే సరిపోదు, ఒక హేతువాద భావనలు గల మరో సంస్కృతి సృష్టించాల్సిందే అని చెప్పి నవయానాన్ని ప్రభోధించారు బాబాసాహెబ్

✗✗✗ కానీ ఈనాడు హేతువాదులం అని చెప్పుకునే ఏ అగ్రకులం వాడు బాబాసాహెబ్ పేరు తలవడానికి ఇష్టపడడు ✗✗✗

ఇలా మనువాద భావనలు నిండిన మన సమాజం బాబాసాహెబ్ ఈ దేశ వ్యవస్థకు అందించిన సహకారం పూర్తిగా విస్మరిస్తూ వస్తోంది .

✿ బాబాసాహెబ్ తన జీవిత కాలంలో నిర్వహించిన బాధ్యతలు ✿

- ఒక గొప్ప సామాజిక శాస్త్రవేత్త..
- ఒక ప్రఖ్యాత న్యాయకోవిదుడు..
- ఒక విశిష్టమైన చరిత్రకారుడు..
- ఒక ప్రతిష్టాత్మక ఆర్థిక శాస్త్రవేత్త...
- ఒక అద్భుతమైన రచయిత..
- ఒక తిరుగులేని ఉద్యమకారుడు..
- ప్రజలను కట్టిపడేయగల వక్త..
- ప్రపంచంలో మరెవరూ చదవలేనన్ని,
- డిగ్రీలను అందుకున్న ప్రపంచ మేధావి..
- భారత రాజ్యాంగ నిర్మాత..
- అన్నిటికంటే ముఖ్యంగా ఒక మానవతావాది,
- స్వేచ్చ, సమానత్వ స్థాపన కోసం,
తపన పడ్డ, సామాజిక విప్లవకారుడు..
- భారత భూమిపై నడయాడిన ఒక...
☆☆ "గ్రేటెస్ట్ ఇండియన్" "Greatest Indian"☆☆

"జీవితం సుదీర్ఘంగా ఉండాల్సిన అవసరం లేదు,, గొప్పగా ఉండాలని" బాబాసాహెబ్ చెప్పిన మాటలు ఆయనకే వర్తించాయి..

((☞☞ పైన విషయాలు కొన్ని మాత్రమే, బాబాసాహెబ్ గురించీ మీరు కూడా మీకు తెలిసిన కొన్ని జోడించి, మన ఇంట్లో పిల్లలకు ఈ విషయాలు అవగాహన కల్పించకడి., కుదిరితే మీ దగ్గర లోని SC,ST,BC హాస్టల్ లకు ఒక సాయంత్రం వెళ్ళి బాబాసాహెబ్ నిజమైన గొప్పతనాన్ని మన తరువాతి తరాలకు వివరించండి ☜☜ ))

☞☞ భారతదేశ సామాజిక ఉద్యమ పితామహుడు, ప్రపంచ మేధావి, నిజమైన ప్రజా నాయకుడు బాబాసాహెబ్ క

Current affairs with practisebits

2017 ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ కైవసం చేసుకుంది.*

జనవరి 28న మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్‌లో 6-4, 6-4తో 13వ సీడ్, తన సోదరి వీనస్ విలియమ్స్‌ను ఓడించింది. ఈ విజయంతో గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సంఖ్యను 23కు పెంచుకున్న సెరెనా 22 టైటిల్స్‌తో స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ) పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. అలాగే ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకును మళ్లీ సొంతం చేసుకుంది.

సెరెనా గ్రాండ్‌స్లామ్ టైటిల్స్

ఆస్ట్రేలియన్ ఓపెన్(7) :

2003, 2005, 2007, 2009, 2010, 2015, 2017

ఫ్రెంచ్ ఓపెన్ (3) :

2002, 2013, 2015

వింబుల్డన్ (7) :

2002, 2003, 2009, 2010, 2012, 2015, 2016

యూఎస్ ఓపెన్ (6) :

1999, 2002, 2008, 2012, 2013, 2014

మొత్తం (23)

*సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రీ గోల్డ్ ట్రోఫీని హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తొలిసారి గెలుచుకుంది.*

జనవరి 29న లక్నోలో జరిగిన ఫైనల్‌లో ఇండోనేసియాకు చెందిన గ్రెగోరినా మర్సికాపై 21-13, 21-14తో విజయం సాధించింది.

పురుషుల విభాగంలో జాతీయ ఛాంపియన్ సమీర్ వర్మ విజేగా నిలిచాడు. ఫైనల్‌లో బీ సాయి ప్రణీత్ (భారత్)పై 21-19, 21-16తో సమీర్ విజయం సాధించాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రణవ్ జెర్రీ-సిక్కి రెడ్డి(భారత్) జోడీ 22-20, 21-10తో అశ్వనీ పొన్నప్ప-బీ సుమీత్ రెడ్డి(భారత్) జంటపై విజయం సాధించింది.

*ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ దక్కించుకున్నాడు.*

జనవరి 29న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రఫెల్ నాదల్(స్పెయిన్)పై 6-4, 3-6, 6-1, 3-6, 6-3తో విజయం సాధించి రూ. 19 కోట్ల ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో ఫెడరర్ గ్రాండ్ స్లామ్ టైటిళ్ల సంఖ్య 18కి చేరింది. 2012 తర్వాత ఫెడరర్ గెలిచిన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ఇదే. ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్ స్లామ్‌లు నెగ్గిన పురుష క్రీడాకారుడి రికార్డు కూడా అతడి పేరిటే ఉంది.

ఫెడరర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్

ఆస్ట్రేలియన్ ఓపెన్ (5) :

2004, 2006, 2007, 2010, 2017

ఫ్రెంచ్ ఓపెన్ (1) :

2009

వింబుల్డన్ (7) :

2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012

యూఎస్ ఓపెన్ (5) :

2004, 2005, 2006, 2007, 2008

మొత్తం

(18)

*మాజీ జస్టిస్ పి.విశ్వనాథ్ శెట్టి కర్ణాటక లోకాయుక్తగా నియమితులయ్యారు.*

ఈ మేరకు జనవరి 28న ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. కుటుంబీకులపై వచ్చిన అవినీతి ఆరోపణలతో అంతకుముందు లోకాయుక్తగా ఉన్న జస్టిస్ భాస్కర్‌రావు పదవికి రాజీనామా చేశారు. దీంతో 2015 నుంచి కర్ణాటక లోకాయుక్త స్థానం ఖాళీగా ఉంది.

ఏడు ఇస్లామిక్ దేశాల పౌరులు 90 రోజుల పాటు అమెరికాలో ప్రవేశించకుండా ఆ దేశం నిషేధం విధించింది.*
ఈ మేరకు వీసాల జారీకి సంబంధించిన కార్య నిర్వాహక ఉత్తర్వులపై జనవరి 28న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు.

ఉత్తర్వుల్లో కీలకాంశాలు
ఇరాక్, సిరియా, ఇరాన్, సూడాన్, లిబియా, సోమాలియా, యెమెన్ పౌరులకు 90 రోజుల వరకూ అమెరికా వీసాలు నిలిపివేత. వలసదారులకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించే వరకు ఇది అమల్లో ఉంటుంది.అమెరికాలోకి సిరియా శరణార్థుల ప్రవేశంపై నివరధిక నిషేధం. వలసదారుల్లో క్రైస్తవులకు ప్రాధాన్యత.అమెరికాలోని శరణార్థుల పునరావాస కార్యక్రమం కనీసం 120 రోజుల పాటు నిలిపివేత.
అమెరికాలోకి 7 ఇస్లామిక్ దేశాల పౌరుల ప్రవేశాన్ని నిలిపివేస్తూ ట్రంప్ వెలువరించిన ఉత్తర్వుపై న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు అత్యవసర స్టే విధించింది. ట్రంప్ నిర్ణయానికి ప్రతిచర్యగా ఇరాన్‌లోకి అమెరికా పౌరుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఇరాన్ జనవరి 29న ప్రకటన చేసింది.

Practisebits


 (Q 1 to 50)_

1. ఇటీవల బ్రిక్స్ దేశాల పర్యాటకరంగ సమావేశం ఎక్కడ జరిగింది ?
1) ఫోర్తలేజా
2) నేపాల్
3) ఖజురహో
4) షాంఘై

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: మొదటి బ్రిక్స్ దేశాల పర్యాటక రంగ సమావేశం మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో జరిగింది. ఈ సమావేశానికి బ్రిక్స్ (BRICS) దేశాల పర్యాటక శాఖ మంత్రులు హాజరయ్యారు.

2. ఇటీవల ప్రారంభించిన రైల్వే బీమా పాలసీ ప్రకారం రైలు ప్రయాణ ప్రమాదంలో మరణించిన వారికి ఎంత నష్ట పరిహారం చెల్లిస్తారు?
1) రూ. 10 లక్షలు
2) రూ. 8 లక్షలు
3) రూ. 5 లక్షలు
4) రూ. 2 లక్షలు

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: రైల్వే టికెట్ తీసుకునే ప్రయాణికుడు రైల్వే బీమా పాలసీకింద రూ.1 చెల్లించాలి. ఒక వేళ రైలు ప్రమాదానికి గురై ఆ వ్యక్తి మరణించిన లేదా శాశ్వతంగా అంగ వికలురు అయినా రూ. 10 లక్షలు నష్టపరిహారం ఇస్తారు. శాశ్వత పాక్షిక అంగ వికలురు అయితే రూ. 7.5 లక్షలు, ప్రాణాపాయ స్థితితో ఆసుపత్రికి తరలించడానికి రూ.10,000, గాయాలు బాగా తగిలి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే రూ. 2 లక్షలు ఇస్తారు.

3. భారతీయ రైల్వే ప్రయాణికులకు ఇచ్చే బీమా సౌకర్యం కల్పించేందుకు టెండర్లు దక్కించుకొన్న సంస్థలు ఏవి?
1) శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్
2) ICICI లాంబర్డ్ జనరల్ ఇన్సూరెన్స్
3) రాయల్ సుందరమ్ జనరల్ ఇన్సూరెన్స్
4) పైవన్నీ

View Answer

స‌మాధానం: 4

4. ‘‘అంతర్జాతీయ ఇండియా- కెమ్ 2016’’ సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) న్యూఢిల్లీ
2) ముంబయి
3) బెంగళూరు
4 హైదరాబాద్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: 9వ అంతర్జాతీయ ఎగ్జిబిషన్ సమావేశాన్ని‘‘ఇండియా- కెమ్ 2016’’ పేరుతో ముంబయిలో నిర్వహించారు. దీనిని రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. 23 దేశాల నుంచి 282 ప్రదర్శనకారులు ఈ సమావేశానికి వచ్చారు. దీనిని ఫిక్కి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్స్ అండ్ పెట్రో కెమికల్స్, భారత ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించారు.

5. జాతీయ యుద్ధ ప్రదర్శన శాలను ఎక్కడ నిర్మించనున్నారు?
1) న్యూఢిల్లీ
2) పూణె
3) సిమ్లా
4) కోల్‌కతా

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: న్యూఢిల్లీలో జాతీయ యుద్ధ ప్రదర్శనశాల నిర్మాణానికి రక్షణ మంత్రిత్వ శాఖ పచ్చజెండా ఊపింది. మ్యూజియం నిర్మాణానికి డిజైన్‌ల కోసం ఆహ్వానించింది. అత్యుత్తమ డిజైన్ లు అందించిన మొదటి ముగ్గురు విజేతలకి వరుసగా రూ. 75,000, రూ.50,000 , రూ. 25,000 నగదు బహుమతి ఇస్తారు.

6. ఇటీవల ఏ రాష్ట్రం రైల్వే మార్గాల అభివృద్ధి కోసం భారతీయ రైల్వేతో కలసి జాయింట్ వెంచర్ ప్రారంభించింది ?
1) తెలంగాణ
2) తమిళనాడు
3) కేరళ
4) కర్ణాటక

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: రైల్వేల అభివృద్ధి కోసం భారతీయ రైల్వేతో కేరళ ప్రభుత్వం జాయింట్ వెంచర్‌ను ప్రారంభించింది. 51:49 ఈక్విటీ భాగస్వామ్యంతో కేరళలో రైల్వే మార్గాలు అభివృద్ది చేయనున్నారు.

7. ఇటీవల అంతర్జాతీయ ఎల్‌పీజీ గ్యాస్ సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) కోయంబత్తూరు
2) కాన్పూర్
3) నాగపూర్
4) భువనేశ్వర్

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: భారత పెట్రోలియం కంపెనీలు సంయుక్తంగా భవనేశ్వర్‌లో అంతర్జాతీయ ఎల్‌పీజీ గ్యాస్ సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశానికి బ్రెజిల్, ఘనా, నైజీరియా, నేపాల్, శ్రీలంక దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.

8. బీహార్‌లో గంగానదిలో ఒండ్రు మట్టి పరిస్థితిని అధ్యయనం చేయడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏది?
1) ఎ.కె. సిన్హా కమిటీ
2) జస్టిస్ షా కమిటీ
3) రవిందర్ షా కమిటీ
4) మిశ్రా కమిటీ

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: బీహార్‌లో గంగానదిలో పేరుకుపోతున్న ఒండ్రు మట్టి గురించి అధ్యయనం చేయడం కోసం గంగా వరద నియంత్రణ కమిషన్ సభ్యుడు ఎ.కె. సిన్హా అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

9. ఇటీవల CNBC పకటించిన ‘‘ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్’’ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు?
1) అమితాబ్ బచ్చన్
2) సల్మాన్ ఖాన్
3) ఇర్ఫాన్ ఖాన్
4) షారుఖ్ ఖాన్

View Answer

స‌మాధానం: 3

10. దేశంలో మొదటిసారిగా విపత్తు నిర్వహణవిన్యాసాలు ఏ పేరుతో నిర్వహించారు?
1) విరోధ్
2) ప్రకంపన
3) సంఘర్ష్
4) ఎన్‌డీఆర్‌ఎఫ్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: దేశంలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ సంయుక్త విన్యాసాలు ‘ప్రకంపన’ పేరుతో విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ విన్యాసాలలో భారత సైన్యం, జాతీయ విపత్తుల నిరోధక దళం( NDRF) సంయుక్తంగా పాలుపంచుకున్నాయి.

11. ఇటీవల ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ‘‘Logistics Performance Index’ లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది?
1) లక్సెంబర్గ్
2) జర్మనీ
3) స్వీడన్
4) నెదర్లాండ్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: ప్రపంచ బ్యాంకు ‘‘Connecting to Compete 2016’’ అనే పేరుతో లాజిస్టిక్స్ ఫెర్ఫార్మన్స్ ఇండెక్స్ను విడుదల చేసింది. ఈ నివేదికలో జర్మనీ మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో లక్సెంబర్గ్, స్వీడన్, నెదర్లాండ్ నిలిచాయి. ఇండియా 35వ స్థానంలో ఉంది.

12. మాస్కోలో జరిగిన సైకత శిల్పకళ పోటీలలో ‘‘పీపుల్స్ ఛాయిస్’’ పురస్కారానికి ఎంపికైనది ఎవరు?
1) డాన్ బెల్ల్ చెర్
2) జేమ్ డెన్‌వాన్
3) సుదర్శన పట్నాయక్
4) జాన్‌డేవిడ్
*_Bhaskar Valmiki_*
View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: సుదర్శన్ పట్నాయక్ఇసుకతో నిర్మించిన మహత్మగాంధీ-ప్రపంచ శాంతి అనే శిల్పానికి గాను పీపుల్స్ ఛాయిస్ పురస్కారానికి ఎంపికయ్యాడు.

13. ఫ్రెంచ్ ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘‘Knight of the Legion of Honour’’ కు ఎవరు ఎంపికయ్యారు?
1) చందా కొచ్చర్
2) అరుంధతీ రాయ్
3) కిరణ్ మజుందార్ షా
4) ఇంద్రానూయి

View Answer

స‌మాధానం: 3

14. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు?
1) కె.కె. అగర్వాల్
2) సునంద బెన్
3) స్వాతి పిరమల్
4) కె.కె. మిట్టల్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌ను 1928లోప్రారంభించారు. ఇది డాక్టర్లకు చెందిన జాతీయ స్వచ్ఛంద సంస్థ. 2016-17 సంవత్సరానికిజాతీయ అధ్యక్షుడిగా కె.కె. అగర్వాల్ ఎంపికయ్యాడు.

15. మార్లేబోన్ క్రికెట్ క్లబ్‌లో జీవితకాల సభ్యత్వంను పొందిన క్రికెటర్ ఎవరు ?
1) ముత్తయ్య మురళీధరన్
2) హర్భజన్ సింగ్
3) విరాట్ కోహ్లి
4) జహీర్ ఖాన్

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: ఎంసీసీ మార్లేబోన్ క్రికెట్ క్లబ్‌లో జీవిత కాల సభ్యత్వంను పొందిన 24వ ఇండియన్ క్రికెటర్ జహీర్ ఖాన్.

16. ప్రపంచంలో అతి పెద్ద నది ద్వీపంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఏ ప్రాంతాన్ని గుర్తించింది ?
1) పొఖర్ హిల్
2) మజూలి ద్వీపం
3) మరాజో ద్వీపం
4) మేరిల్యాండ్ ద్వీపం

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్ ప్రపంచంలోనే నది ద్వీపాల్లో అతిపెద్దదిగా అస్సాంలో బ్రహ్మపుత్ర నదిలో ఉన్న మజూలి ద్వీపాన్ని గుర్తించింది. తర్వాతి స్థానంలో మారాజో ద్వీపం (బ్రెజిల్) ఉంది.

17. యునెస్కో- కన్ఫూషియస్ సాహిత్య పురస్కారం- 2016 నకు ఎంపికైన సంస్థ ఏది?
1) పెన్ ఇంటర్నేషనల్
2) సాహిత్య అకాడమీ
3) జనశిక్షణ్ సంస్థాన్
4) కాళిదాస్ సంస్థాన్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: గ్రామీణ యువతకు విద్యను అందించడానికి కృషి చేసిన వ్యక్తులకు లేదా సంస్థలకు ఈ పురస్కారాన్ని ఇస్తారు. యునెస్కో-కన్ఫూషియస్పురస్కారాన్ని చైనా ప్రభుత్వం 2005లోప్రారంభించింది. దీని కింద 20,000 అమెరికన్ డాలర్లు నగదు బహుమతి ఇస్తారు.

18. ఆస్కార్ ‘‘జీవితకాల సాఫల్య పురస్కారం’’ 2016 నకు ఎంపికైన నటుడు ఎవరు?
1) ఓంపూరి
2) బ్రాడ్‌పిట్
3) లియోనార్డ్ డి కాప్రి
4) జాకీచాన్

View Answer

స‌మాధానం: 4

19. ఇటీవల ఈ స్టాంప్స్‌ను విడుదల చేసిన రాష్ట్రం ఏది ?
1) రాజస్థాన్
2) తెలంగాణ
3) ఆంధ్రప్రదేశ్
4) జమ్మూ అండ్ కశ్మీర్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: దేశంలో మొదటిసారిగా ఈ స్టాంప్స్ విడుదల చేసిన రాష్ట్రం ఢిల్లీ (2012). ఇటీవల రాజస్థాన్ ఈ స్టాంప్స్‌ను విడుదల చేసింది. ఈ స్టాంప్స్‌ను విడుదల చేసిననాల్గో రాష్ట్రం రాజస్థాన్.

20. ప్రతిష్ఠాత్మక సరళ పురస్కారానికి ఎంపికైనది ఎవరు?
1) డాక్టర్ ప్రదిప్ కూమార్ పాండా
2) డాక్టర్ రుషికేశ్ మల్లిక్
3) శ్రీమనోజ్ దాస్
4) డాక్టర్ శీతకాంత్ మహపాత్ర

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: 37వ సరళ పురస్కారానికి ప్రముఖ ఒడియా రచయిత డాక్టర్ రుషికేశ్ మల్లిక్ఎంపికయ్యాడు. ఇతను రాసిన ‘Jeje Dekhi Nathiba Bharat’ అనే పుస్తకానికి ఈ పురస్కారం దక్కింది. ఇండియన్ మెటల్స్ పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ సాహిత్యంలో కృషి చేసిన వారి కోసం సరళ పురస్కారమును ప్రారంభించింది. ఈ పురస్కారం కింద రూ.1,50,000 నగదు బహుమతితో పాటు ఒక ప్రశంస పత్రం ఇస్తారు.

21. కేరళ ప్రభుత్వం మద్యపాన, డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికి రాయబారిగా ఎవరిని నియమించింది?
1) అమితాబ్ బచ్చన్
2) పి.వి. సింధు
3) దీపామాలిక్
4) సచిన్ టెండూల్కర్

View Answer
*_Bhaskar Valmiki_*
స‌మాధానం: 4

22. ప్రపంచంలో మొట్టమొదటి డ్రైవర్ రహిత మినీబస్ సర్వీస్‌ను ఎక్కడ ప్రారంభించారు?
1) ఫ్రాన్స్
2) ఇండియా
3) అమెరికా
4) కెనడా

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ప్రపంచంలో మొదటి డ్రైవర్ రహిత మినీబస్ సర్వీస్‌ను ఫ్రాన్స్‌లోని లైయన్ నగరంలో ప్రారంభించారు. ఈ బస్సులో 15 మంది ప్రయాణికులు ప్రయాణించే సౌకర్యం ఉంది.

23. అంకసముద్ర బర్డ్ శాంక్చుయరీ ఎక్కడ ఉంది?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక
4) తమిళనాడు

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: ఇటీవల కర్ణాటక రాష్ట్రం అంకసముద్ర సరస్సును పక్షి సంరక్షణ శాంక్చుయరీగా గుర్తించింది. అంకసముద్ర సరస్సులో 140 జాతుల వరకుఅనేక దేశీయ, వలస పక్షులు నివశిస్తుంటాయి.

24. ఇటీవల ఏ ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా భారత ఎన్నికల కమిషన్ గుర్తించింది?
1) ముస్లిం లీగ్
2) తృణమూల్ కాంగ్రెస్
3) శివసేన
4) మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన

View Answer

స‌మాధానం: 2

25. ఇటీవల ఏ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 200 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది ?
1) మహారాష్ట్ర
2) ఉత్తరప్రదేశ్
3) పశ్చిమబెంగాల్
4) జమ్మూ అండ్ కశ్మీర్

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: జమ్మూ అండ్ కశ్మీర్రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం ప్రతి జిల్లాలో ఇండోర్ క్రీడా ప్రాంత నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం రూ. 200 కోట్లు కేటాయించింది.

26. గోవా రాష్ట్ర పక్షి ఏది?
1) బుల్‌బుల్
2) పూసిన కొంగ
3) రామచిలక
4) పాలపిట్ట

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: గోవా రాష్ట్రం నవంబర్ 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు బుల్‌బుల్ పక్షి ఉత్సవాలు నిర్వహించనున్నది.

27. ‘ సొలంగ్ ఉత్సవం’ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?
1) ఉత్తరప్రదేశ్
2) అరుణాచల్‌ప్రదేశ్
3) బీహార్
4) కేరళ

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: అరుణాచల్ ప్రదేశ్‌లోని ‘ఆది తెగ’ ప్రజలు సొలంగ్ ఉత్సవాలను జరుపుకుంటారు. ఈ ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్లు కేటాయించింది.

28. ‘‘Lee Kuan Yew School of Public Policy of Singapore’’ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇండియాలో వ్యాపారానికి అనుకూలమైన ఉత్తమ రాష్ట్రం ఏది?
1) మహారాష్ట్ర
2) గుజరాత్
3) ఢిల్లీ
4) గోవా

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ఈ నివేదిక ప్రకారం వ్యాపారానికి అనుకూలమైన మొదటి అత్యుత్తమ రాష్ట్రం మహారాష్ట్ర. తర్వాతి స్థానాల్లో గుజరాత్, ఢిల్లీ, గోవా ఉన్నాయి.

29. IUCN ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘‘ హెరిటేజ్ హీరోస్’’ పురస్కారానికి ఎంపికైన మొదటి ఆసియావాసి ఎవరు?
1) బెజవాడ విల్సన్
2) బిభూతి లహకర్
3) చాన్ కొవాక్ వై
4)నార్మన్ లీమ్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: అస్సాంకు చెందిన ఎకాలజిస్ట్ బిభూతి లహకర్ (Bibhuti Lahkar) IUCN ఇచ్చే ‘‘ హెరిటేజ్ హీరోస్’’ పురస్కారానికి ఎంపికైనాడు. సహజ ప్రపంచ వారసత్వ ప్రాంతాలనురక్షించడానికి కృషి చేసిన వారికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.

30. ఇటీవల కనుగొన్న ఏ జీవికి అమెరికా అధ్యక్షుడు ఒబామా పేరు పెట్టారు?
1) పక్షి
2) పాము
3) కప్ప
4) చేప

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: హవాయి దీవులలో కనుగొన్న నూతన రకం చేపకు ఒబామా అని పేరు పెట్టారు.

31. ఇటాలియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములావన్ టైటిల్ విజేత ఎవరు?
1) లేవిస్ హమిల్టన్
2) సెబాస్టియన్ వెటల్
3) నికో రోస్‌బర్గ్
4) జులెస్ బై యన్ చా
*_Bhaskar Valmiki_*
View Answer

స‌మాధానం: 3

32. ITF పురుషుల ఫ్యూచర్ టెన్నిస్ టోర్నమెంట్ 2016 ఎక్కడ జరిగింది?
1) థాయిలాండ్
2) శ్రీలంక
3) మలేసియా
4) చైనా

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: థాయిలాండ్‌లోని ‘హుహిన్’ అనే నగరంలో ITFపురుషుల ఫ్యూచర్ టెన్నిస్ టోర్నమెంట్ జరిగింది.

33. ITF పురుషుల ఫ్యూచర్ టెన్నిస్ టోర్నమెంట్సింగిల్స్ విజేత ఎవరు?
1) సియోంగ్ చాన్ హంగ్
2) సుందర ప్రశాంత్
3) శ్రీరామ్ బాలాజీ
4) మసాతోషిగా

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: కొరియాకు చెందిన సియాంగ్ చాన్ హంగ్‌ను ఓడించి శ్రీరామ్ బాలాజీ ఈ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

34. హర్యానా రాష్ట్రంలో వైఫై హాట్‌స్పాట్ ఏర్పాటు చేసిన మొదటి గ్రామం ఏది?
1) లాహిలి
2) నిందాన
3) బల్లా
4) గుంతల గర్హూ

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాష్ట్రంలో తొలి వైఫై హాట్‌స్పాట్‌ను గుంతల గర్హూ (Gumthala Garhu) అనే గ్రామంలో ఏర్పాటు చేశారు. ఈ గ్రామంలో BSNL 10 mbps స్పీడుతో ఇంటర్‌నెట్ అందిస్తోంది.

35. శాంతి భద్రతలు పరిరక్షించే సమయంలో వాడే పెల్లెట్ గన్ స్థానంలో ప్రవేశ పెట్టనున్న గన్ పేరు ఏమిటి?
1) వాటర్‌గన్
2) పీఏవీఏ గన్
3) నైట్రస్ ఆక్సైడ్ గన్
4) ఎస్‌గన్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: జమ్మూలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పెల్లెట్‌గన్‌లను వాడారు. దీని వల్ల 1000 మందికి పైగా తీవ్ర గాయాలవడంతో వాటి వాడకం మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ గన్ స్థానంలో కారంతో తయారు చేసిన PAVA గన్‌లు వాడతారు. PAVA - Pelargonic Acid Vanillyl Amide

36. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశంనుమలేరియా రహిత దేశంగా ప్రకటించింది?
1) శ్రీలంక
2) పాకిస్తాన్
3) నైజీరియా
4) భూటాన్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ఆగ్నేయాసియా దేశాలలో మలేరియాను నివారించిన మొదటి దేశం మాల్దీవులు. రెండవ దేశం శ్రీలంక. ్రపపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల శ్రీలంకను మలేరియా రహిత దేశంగా ప్రకటించింది.

37. రాజస్థాన్‌లో డిజిటల్ విద్యను ప్రజలకు అందించటం కోసం ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు?
1) గూగుల్
2) మైక్రోసాప్ట్
3) రీడ్ ఇట్
4) సిస్కో

View Answer

స‌మాధానం: 4

38. అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకరంగ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?
1) షారుఖ్ ఖాన్
2) హృతిక్ రోషన్
3) జాన్ అబ్రహం
4) అజయ్ దేవగన్

View Answer

స‌మాధానం: 3

39. ఇటీవల జలప్రవేశం చేసిన వాటర్ జెట్‌ఫాస్ట్ ఎటాక్ క్రాప్ట్ షిప్ 'INS TIHAYA' ను నిర్మించిన సంస్థ ఏది?
1) హిందుస్థాన్ షిప్ యార్డ్
2) గార్డెన్ రీచ్‌షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్
3) కొచ్చిన్ షిప్‌యార్డ్
4) మజగావ్ డాక్‌యార్డ్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: ‘‘వాటర్ జెట్‌ఫాస్ట్ ఎటాక్ క్రాప్ట్ షిప్’’ రకానికి చెందిన మూడు షిప్‌లను గార్డెన్ రీచ్‌షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ నిర్మించింది. అవి.. INS Tarmugli, INS Tihaya, INS Tilanchans

40. ఇటీవల IUCN అంతరించిపోతున్న జంతువుల జాబితా (రెడ్ లిస్ట్)లో చేరిన జంతువు ఏది?
1) సైబిరియన్ నక్క
2) పశ్చిమ ఎలుగుబంటి
3) తూర్పు గొరిల్లా
4) అనకొండ

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: IUCN అంతరించిపోతున్న జీవజాతుల జాబితా(రెడ్ లిస్ట్)లో 23,928 జంతువులు, మొక్కలు ఉన్నాయి. గత 20 ఏళ్లలోగొరిల్లాలు 70 శాతం తగ్గిపోయాయి. ప్రస్తుతం 5000 తూర్పు గొరిల్లా మాత్రమే భూమి మీద ఉన్నాయి.

41. ఇటీవల జరిగిన బ్రెజిల్ ఓపెన్ గ్రాండ్ ప్రి డబుల్స్ టైటిల్ విజేత ఎవరు? *_Bhaskar Valmiki_*
1) సిక్కి రెడ్డి- ప్రణవ్ చోప్రా
2) టొబినెగ్ - రాచెల్ హొండేంచ్
3) బాబ్- రాబ్ బ్రయాన్
4) మహమ్మద్ - జుల్‌ఫాదై

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: కెనడాకు చెందిన టొబినెగ్ - రాచెల్ హొండేంచ్లను ఓడించి సిక్కి రెడ్డి- ప్రణవ్ చోప్రాఈ టైటిల్ గెలుచుకున్నారు.

42. ఆసియన్ కార్టింగ్ ఛాంపియన్ షిప్ టైటిల్ విజేత ఎవరు?
1) షహన్ అలీమెహసిన్
2) ఆనంద్ పవార్
3) మహమ్మద్ నషీద్
4) చాన్ వాంగ్ టు

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: మలేసియాలో జరిగిన ఆసియన్ కార్టింగ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న మొదటి భారతీయుడు షహన్ అలీ మెహసిన్

43. అంతర్జాతీయ ఛారిటీ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
1) సెప్టెంబర్ 2
2) సెప్టెంబర్ 3
3) సెప్టెంబర్ 4
4) సెప్టెంబర్ 5

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: పేదరిక నిర్మూలన కోసం ధార్మిక సంస్థలు ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్య సమితి 2012 నుంచి సెప్టెంబర్ 5వతేదీని అంతర్జాతీయ ఛారిటీ దినోత్సవంగా నిర్వహిస్తుంది.

44. జె.సి. డానియెల్ పురస్కారం 2016 (J. C. Daniel Award) నకు ఎంపికైనది ఎవరు?
1) విజయన్
2) కె.జి. జార్జ్
3) మమ్ముట్టి
4) మెహన్‌లాల్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: మళయాళం సినిమా పరిశ్రమలో అత్యున్నత పురస్కారం జె.సి. డానియెల్అవార్డు. మళయాళ సినిమాకు అత్యున్నత సేవలు అందించిన వారికి 1992 నుంచి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. ఈ పురస్కారం కింది ఒక విగ్రహం, రూ. 1,00,000 నగదు బహుమతి ఇస్తారు.

45. ఇటీవల భారత్‌లో పర్యటించిన ఈజిప్ట్ దేశ అధ్యక్షుడు ఎవరు?
1) హోస్ని ముబారక్
2) మహమ్మద్ ఆల్‌సిసి
3) సులైమాన్ ఫతాజిర్లా
4) అబ్దుల్ ఫతాహ్ ఆల్-సిసి

View Answer

స‌మాధానం: 4

46. 2016లో జీ-20 సమావేశంను ఎక్కడ నిర్వహించారు?
1) హాంగ్జౌ
2) తైపి
3) సింగపూర్
4) మనీలా

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: జీ-20 సమావేశం చైనాలోని హాంగ్జౌ నగరంలో నిర్వహించారు.

47. ‘నూఖై’ అనే వ్యవసాయ పండుగను ఏ ప్రాంత ప్రజలు జరుపుకుంటారు?
1) ఉత్తరప్రదేశ్
2) కేరళ
3) మహారాష్ట్ర
4) పశ్చిమ ఒడిశా

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: పశ్చిమ ఒడిశాలో పంట చేతికి రాగానేనూఖై వ్యవసాయ పండగను జరుపుకుంటారు.

48. బ్రిక్స్ దేశాల మొట్టమొదటి చిత్రోత్సవం ఎక్కడ నిర్వహించారు?
1) మాస్కో
2) న్యూఢిల్లీ
3) షాంఘై
4) ప్రిటోరియా

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: బ్రిక్స్ దేశాల మొదటి ఫిల్మ్ ఫెస్టివల్‌ను న్యూఢిల్లీలో నిర్వహించారు. దీనిలో ఉత్తమ చిత్రంగా ‘తిథి’ ఎంపికైంది.

49. దేశంలో అతి ఎక్కువ డెంగ్యూ మరణాలు సంభవించిన రాష్ట్రం ఏది?
1) ఒడిశా
2) కర్ణాటక
3) పశ్చిమ బెంగాల్
4) కేరళ

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: దేశంలో అతి ఎక్కువ డెంగ్యూ మరణాలు సంభవించిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఈ రాష్ట్రంలో 23 మంది మరణించారు. అలాగే 5,639 మంది డెంగ్యూ వ్యాధికి గురయ్యారు. తర్వాతి స్థానంలో ఒడిశా, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి.

50. ఇటీవల UNO ఛార్టర్‌లో ఏ భాషను చేర్చారు?
1) హిందీ
2) బెంగాలీ
3) తెలుగు
4) సంస్కృతం

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: UNO ఛార్టర్‌లో సంస్కృత భాషను చేర్చారు. ఇప్పటి నుంచి చార్టర్‌ను సంస్కృతంలో కూడా ప్రచురిస్తారు.

*భారత ఆర్థిక సర్వే 2016-17*



*దేశ వృద్ధిరేటు 7.1శాతం*
దిల్లీ: 2016-17 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు 7.1 శాతంగా నమోదైనట్లు ఆర్థిక సర్వేలో వెల్లడించారు. 2017 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను ఈరోజు లోక్‌సభలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.7 నుంచి 7.5 శాతం మధ్య ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2016-17లో వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు 4.1 శాతం నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఇది 1.2శాతం ఎక్కువ.

ఆర్థిక సర్వే ఇంకా ఏం చెప్పిందంటే.. ‘పెద్దనోట్ల రద్దు వల్ల ఇబ్బందులున్నప్పటికీ దాని వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరతాయి. ఏప్రిల్‌ నాటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. కార్మిక, పన్నుల విధానాల్లో సంస్కరణలు తేవాలి. వస్త్ర, తోలు పరిశ్రమల బలోపేతానికి సంస్కరణలు అవసరం’.
💐💐💐💐💐💐💐💐💐

*బడ్జెట్‌*:👉 బడ్జెట్‌ అనేది బొగెట్టీ అనే ఫ్రెంచి పదం నుంచి వచ్చింది. బొగెట్టీ అంటే సంచి అని అర్థం.
 ఒక సంవత్సరానికి ప్రభుత్వ ఆదాయ వ్యయాల స్వరూపమే బడ్జెట్‌.

👉ఏటా సెప్టెంబరులో బడ్జెట్‌ ప్రకటనను అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, స్వతంత్ర సంస్థలకు పంపిస్తారు.

👉నవంబరు నెలలో వివిధ వాణిజ్య మండళ్లురైతులు, ఉద్యోగ సంఘాలతో ఆర్థిక శాఖ అధికారులు చర్చిస్తారు.
వాణిజ్య మండళ్లు తదితర సంఘాలతో ఆర్థికమంత్రి తుది సమావేశాలు నిర్వహిస్తారు.
 ప్రణాళికలు రూపొందిస్తారు.

👉బడ్జెట్‌తో సంబంధమున్న ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, నిపుణులు, ముద్రణకు సంబంధించిన సాంకేతిక నిపుణులు, స్టెనోగ్రాఫర్లు, జాతీయ సమాచారశాస్త్ర కేంద్రం అధికారులను దిల్లీలోని నార్త్‌బ్లాక్‌(ఆర్థిక మంత్రిత్వశాఖ) కార్యాలయంలోకి తరలిస్తారు.
 ఇక వారక్కడే ఉండాలి. ఇతర ప్రపంచంతో సంబంధాలుండవు. కుటుంబ సభ్యులు కూడా నేరుగా మాట్లాడే అవకాశముండదు. అంతకు ముందు నార్త్‌బ్లాక్‌లో హల్వా వేడుక నిర్వహిస్తారు. హల్వాను ఆర్థిక మంత్రి సిబ్బందికి.. పంచి పెడుతారు.

👉ఆర్థికమంత్రి ప్రసంగాన్ని అత్యంత రహస్యంగా ఉంచుతారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి రెండు రోజుల ముందు అర్థరాత్రి సమయంలో ముద్రణకు ఇస్తారు. బడ్జెట్‌ పత్రాలను నార్త్‌బ్లాక్‌లోని దిగువ భాగంలో ముద్రిస్తారు.బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభమయ్యాక.. నార్త్‌బ్లాక్‌లో బడ్జెట్‌ తయారీ.. ముద్రణలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది బయటకు వస్తారు.

👉బడ్జెట్‌ సమర్పణ తేదీని ప్రభుత్వం నిర్ణయించి.. లోక్‌సభ స్పీకర్‌కు ప్రతిపాదిస్తుంది. అక్కడ ఆమోదం లభించాక.. లోక్‌సభ సచివాలయం రాష్ట్రపతి ఆమోదం కోరుతుంది.లోక్‌సభలో ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను సమర్పిస్తారు. అంతకు ముందు ఆర్థిక మంత్రి బడ్జెట్‌ వివరాలను సంక్షిప్తంగా కేబినెట్‌కి వివరిస్తారు. ప్రధాని ఆమోదించాక.. రాష్ట్రపతి ఆమోదానికి బడ్జెట్‌ వివరాలను అక్కడకు పంపుతారు.

👉.లోక్‌సభలో బడ్జెట్‌ను సమర్పించాక ‘వార్షిక ఆర్థిక పత్రం’ను రాజ్యసభలో ప్రవేశపెడుతారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టాక ఆ రోజు సభలో ఏ చర్చా జరగదు.కొన్ని రోజుల తర్వాత బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. సభ వాయిదా పడుతుంది.రాజ్యాంగంలో బడ్జెట్‌ పదమే లేదు. ‘‘వార్షిక ఆర్థిక పత్రం’’గా పేర్కొన్నారు. వాడుకలో బడ్జెట్‌ అయింది.

*🎁ఆ బడ్జెట్‌‘మన్మోహనమే’!*

👉పాతికేళ్ల కిందట... రాజకీయ అస్థిరతకు తోడు నిరుద్యోగం, తిరోగమన ఆర్థిక వృద్ధి, తయారీ రంగంలో సంక్షోభం, పేరుకుపోతున్న విదేశీ అప్పులు వంటివి దేశ ఆర్థిక వ్యవస్థను మందగించేలా చేశాయి. ఆ సమయంలో పీవీ నరసింహారావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్‌ సింగ్‌ 1991 జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించింది. ఎగుమతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. భారతీయ పరిశ్రమలు విదేశాల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేలా దిగుమతులను గరిష్ఠ స్థాయిలో కట్టడి చేశారు. పన్ను విధానాల్లో మార్పులు చేసి కస్టమ్స్‌ సుంకాలను భారీగా తగ్గించారు. ప్రభుత్వపరమైన చెల్లింపులు పెద్ద మొత్తంలో ఉండడం.. బకాయిలు భారీగా పేరుకుపోయి ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా పరిస్థితి ఎటు దారితీస్తుందో అన్న స్థితిలో మన్మోహన్‌ తీసుకొచ్చిన సరళీకరణ విధానాలు సత్ఫలితాలు ఇచ్చాయి. అందుకే ఇప్పటికీ 1991 నాటి మన్మోహన్‌ బడ్జెట్‌ను ఇప్పటికీ ప్రత్యేకంగా చెప్పుకొంటుంటారు.
*ఈ బడ్జెట్‌ ‘సమ్‌థింగ్‌ స్పెషల్‌’*

👉ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నాలుగోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. బడ్జెట్‌ అంటేనే ప్రతిఒక్కరిలో ఎంతో కొంత ఆసక్తి ఉంటుంది. కార్మికులు, కర్షకులు ఇలా ప్రతి రంగానికి చెందిన వారు బడ్జెట్‌లో విత్తమంత్రి ప్రకటించే వరాల కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు. గత బడ్జెట్‌లకు భిన్నంగా ఈ బడ్జెట్‌ ఉండబోతోందని సమాచారం. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ కావడంతో అందరిలోనూ ఒకింత ఆసక్తి సైతం నెలకొంది. ఇంకో విశేషమేమంటే, ఈసారి రైల్వే బడ్జెట్‌ లేకపోవడం. గత బడ్జెట్‌లకు భిన్నంగా ఈ బడ్జెట్‌ ప్రత్యేకతలేంటో ఓసారి చూస్తే...

*2017-18 బడ్జెట్‌లో కొన్ని ప్రత్యేకతలు*

👉* బడ్జెట్‌ తయారీకి సంబంధించిన సమస్త సమాచారాన్ని కేంద్రం బడ్జెట్‌ సమాచార వ్యవస్థ(యూబీఐఎస్‌) ద్వారానే కొనసాగుతోంది. పెన్‌డ్రైవ్‌లు, కాగితాల రూపంలో స్వీకరణలు జరగడం లేదు.

👉* బడ్జెట్‌ ఎప్పుడూ ఫిబ్రవరి చివరి రోజున ప్రవేశపెట్టే వారు కానీ ఈసారి ఆ తేదీని మార్చారు. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.

👉* ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయడం బడ్జెట్‌లో స్పష్టంగా కన్పించనుంది. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల విషయంలో ప్రత్యేకత కోల్పోవచ్చు.

👉* జనవరి 31న 2016-17 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ప్రకటించే అవకాశం ఉంది. గతంలో బడ్జెట్‌ సమావేశాలకు కొద్దిరోజుల ముందు దీన్ని ప్రకటించే వారు. కానీ ఈసారి బడ్జెట్‌కు ఒకరోజు ముందుకు ఆర్థిక సర్వేను ప్రకటించనున్నారట.

👉* ఈసారి సాధారణ బడ్జెట్‌ మాత్రమే ప్రవేశపెట్టనున్నారు. రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్‌లో కలిపేశారు.

👉* జులై 1 నుంచి వస్తు, సేవల పన్ను అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో సేవా పన్ను, ఎక్సైజ్‌ డ్యూటీల ప్రస్తావన చివరిసారి కావచ్చు.

👉* బడ్జెట్‌ ప్రక్రియను మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 15లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మే నెలలో బడ్జెట్‌ ఆమోదం పొందే అవకాశం ఉంది. వర్షాకాలం వచ్చే సమయానికి పూర్తి బడ్జెట్‌ ప్రక్రియ పూర్తయి ఆమోదం పొందనుంది.



*ఆర్థిక సర్వే 2016-17: ముఖ్యాంశాలు*


👉పార్లమెంట్‌  బడ్జెట్‌ సమావేశాల్లో  2016-17 ఆర్థిక సంవత్సరానికి  సంబంధంచిన  ఆర్థిక సర్వేను  ప్రవేశపెట్టారు. 2017 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను ఆర్థికమంత్రి  అరుణ్ జైట్టీ మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. దేశ వృద్ధిరేటు 7.1 శాతంగా నమోదైనట్లు ఆర్థిక సర్వే లో  తేల్చింది. జీడీపీలో కరెంట్ అకౌంట్ లోటు 0.3 శాతంగా ఉంటుందన్న సంకేతాలను జైట్లీ ఇచ్చారు.  అయితే ఇది తాత్కాలికమేనని ఆయన చెప్పారు.  గత ఏడాది కాలంగా 7 ముఖ్యమైన సంస్కరణలు తీసుకొచ్చినట్టు చెప్పారు.  ముఖ్యంగా జీఎస్టీ, అవినీతి నిరోధక బిల్లు, పరపతి విధాన కమిటీ, ఆధార్ బిల్లు, విదేశీ పెట్టుబడుల సరళీకరణ, యపీఐ, కార్మిక రంగ అభివృద్ధి లాంటి అంశాల్లో సంస్కరణలు చేపట్టినట్టు   ఆర్థిక సర్వేలో వెల్లడించారు.

👉2017-18 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.7 నుంచి 7.5 శాతం మధ్య ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  వ్యవసాయ రంగం  4.1 శాతం పెరుగుదలను నమోదుచేయగా, గతేడాదితో పోలిస్తే ఇది 1.2శాతం ఎక్కువ.  పారిశ్రామిక ఉత్పత్తి 5.2 శాతానికి మందగించినట్టు చెప్పారు. సేవల వృద్ధి 8.8 శాతంగా ఉంటుంది. ఈ మూడు రంగాల మునుపటి ఆర్థిక సంవత్సరంలో వరుసగా   1.2 శాతం, 7.4 శాతం, 8.9 శాతం మేర విస్తరించినట్టు ఆర్థికమంత్రి చెప్పారు.ముఖ్యంగా పెద్దనోట్ల రద్దు వల్ల  స్వల్పకాలంలో ఇబ్బందులున్నప్పటికీ, దీర్ఘకాలికంగా భారీ ప్రయోజనాలు చేకూరనున్నాయని సర్వే తేల్చింది.  రీమానిటైజేషన్   పూర్తి అయ్యి  ఏప్రిల్‌ నాటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. అనంతరం లోక్ సభ రేపటికి వాయిదా పడింది.

*👉చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ అరవింద్ సుబ్రమణియన్ రూపొందించిన 2017-18 ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.*

*ముఖ్యాంశాలు...*
👉ఆర్థిక వ్యవస్థ విస్తరించే కొద్దీ ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.
జీఎస్టీ అమల్లోకి వస్తే, ప్రజలకు నాణ్యమైన జీవనం దగ్గరవుతుంది.

👉ప్రభుత్వానికి వస్తున్న ఆదాయపు పన్ను భారీగా వసూలవుతోంది
నగదు రహిత లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ  నేపథ్యంలో బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం.
👉నల్లధనంగా మిగిలిపోయిన మొత్తం నగదు వెలుగులోకి వస్తోంది.
👉ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టే అవకాశం
👉డిజిటలైజేషన్ తో కేంద్ర ఖజానాకు మరిన్ని నిధులు.
👉జీడీపీ తగ్గినట్టు కనిపించడం తాత్కాలికం మాత్రమే.
👉విదేశీ కంపెనీల పెట్టుబడులకు మరిన్ని అవకాశాలు కల్పించనున్నాం.
👉మేకిన్ ఇండియాలో భాగంగా ఎన్నో సంస్థలు ఇక్కడికి వస్తున్నాయి.
👉గ్లోబలైజేషన్ కారణంగా అత్యధికంగా లాభపడుతున్న దేశాల్లో భారత్ ఒకటి.

*సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌*


👉సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస మన లక్ష్యమని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. ఉభయ సభల నుద్దేశించి ప్రణబ్‌ ప్రసంగిస్తూ, ప్రస్తుతం దేశంలో బ్లాక్‌మనీ, అవినీతి గణనీయంగా తగ్గిందన్నారు.ప్రజా ఉద్యమంతోనే స్వచ్ఛభారత్‌ మిషన్‌ను తీర్చిదిద్దామన్నారు.. స్వచ్భభారత్‌ మిషన్‌లో ప్రజలు భాగస్వామ్యానికి సెల్యూట్‌ చేస్తున్నానని అన్నారు. దేశంలో అవినీతినిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్రపతి అన్నారు. అవినీతి , నల్లధనం నిర్మూలనలో ప్రభుత్వ చర్యలకు ప్రజలు సహకరించారని ప్రణబ్‌ అన్నారు.

*👉చంపారన్‌ ఉద్యమానికి వందేళ్లు పూర్తి*

స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన చంపారన్‌ సత్యాగ్రహ ఉద్యమానికి నేటితో 100 పూర్తయ్యాయని అన్నారు.. ప్రజా ఉద్యమ బలాన్ని చాటిన చెప్పిన సందర్భం అది అని రాష్ట్రపతి పేర్కొన్నారు.



*26 కోట్ల మందికి జన్‌ధన్‌లో ఖాతాలు*

👉దేశవ్యాప్తంగా 26 కోట్ల మందికి జన్‌ధన్‌లో ఖాతాలు తెరిచామని రాస్ట్రపతి తెలిపారు.. పార్లమెంట్‌ ఉభయ సభల నుద్దేశించి ఆయన ప్రసంఇంచారు.. ఇండియన్‌ పోస్టల్‌ చెల్లింపు బ్యాంకును ప్రారంభించామని వెల్లడించారు.. పేద, దళిత, పీడిత, రైతు, శ్రామిక , యువత ప్రగతికి నూతన విధానాలు రూపొందించామని చెప్పారు.

*సాధారణ బడ్జెటలోనే రైల్వే బడ్జెట్‌*

👉ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌ ఇకపై సాధారణ బడ్జెట్‌లోనే ఉంటుందని రాష్ట్రపతి తెలిపారు. తొలిసారి సాధారణ బడ్జెట్‌లో రైల్వేబడ్జెట్‌ వీలనమైందని ఆయన పేర్కొన్నారు.

*ఇంటింటికీ విద్యుత్‌ వెలుగులు*

👉దేశంలో ఇంటింకీ విద్యుత్ వెలుగులు, వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రణబ్‌ తెలిపారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ప్రతి ఇంటికి విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.. దేశంలో 20 కోట్లమేర ఎల్‌ఇడి బల్బులు పంపిణీ చేశామని తెలిపారు.

*ప్రతిఎకరాకు సాగునీరు*

👉దేశంలోని ప్రతిఎకరానికి సాగునీరు అందించటమే లక్ష్యంగా కృషిచేస్తున్నామన్నారు. ప్రధాని కృషి సంచార్ యోజన పథకం కింద ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. రబీలో సాగు విస్తీరణం 6శాతం పెరిగిందన్నారు.

Thursday, January 26, 2017

బోదకాలు

: డైఇతైల్ కార్బమజీన్ (డీఈసీ),ఆల్బెండజోల్‌ బిళ్ళలు 21 రోజుల పాటు కోర్సుగా వాడాలి. ఒకసారి ఈ వ్యాధి వస్తే లింఫ్ నాళాలు దెబ్బ తింటే , కాలు వాపు వస్తు పోతూ ఉంటుంది.ఈ మందులు సురక్షితమైనవి. వ్యాధి లేనివారు కూడా వాడవచ్చు. ఇది సూక్ష్మ ఫైలేరియాను నశింపజేస్తుంది. ఆల్బెండజోల్‌ పేగుల్లో ఉండే క్రిములను నిర్మూలించి అదనపు లాభం చేకూరుస్తుంది. ఈ రెండింటినీ కలిపి ఇవ్వడం ద్వారా పెరిగిన క్రిములపై ప్రభావం చూపిస్తుంది.
 బోదకాలు (Filariasis) సమస్య క్యూలెక్స్‌ రకం దోమ  కుట్టటం వల్ల వస్తుంది.ఈ వ్యాధి ఫైలేరియా అనే సూక్ష్మక్రిమి ద్వారా సంక్రమిస్తుంది. ఇంటి పరిసరాల్లో ఉన్న మురుగునీటిలో గుడ్లు పెట్టి వృద్ధి చెందే క్యూలెక్స్‌ దోమ ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలోని 'మైక్రోఫైలేరియా' క్రిములు మన శరీరంలో ప్రవేశించి మన లింఫ్‌ నాళాల్లో పెరిగి పెద్దవవుతాయి.☝

మన ఘనత... మంగళ్ యాన్

మన ఘనత... మంగళ్ యాన్

భారత్ అంగారక యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన మంగళ్‌యాన్ అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. మంగళ్‌యాన్ 300 రోజుల్లో 670 మిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించి, గమ్యస్థానాన్ని చేరుకుంది. భారత్ అంగారక గ్రహయాత్ర చేపట్టనుందన్న విషయాన్ని తొలిసారిగా ప్రభుత్వం 2012 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించింది.

మంగళ్‌యాన్ ప్రయాణం 2013 నవంబరు 5 న మొదలైంది. 2014, సెప్టెంబరు 24 న మంగళ్‌యాన్ అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. భారతదేశం ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించిన తొలి ఆసియా దేశంగా ఖ్యాతి గాంచింది. తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అమెరికా, రష్యా తొలి ప్రయత్నంలో విఫలమయ్యాయి. అంగారక కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టే సామర్థ్యం పొందిన నాలుగో సంస్థ ఇస్రో. ఇప్పటి వరకు అమెరికాకు చెందిన నాసా, రష్యన్ స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు మాత్రమే ఈ రకమైన విజయాన్ని సాధించాయి.
* మంగళ్‌యాన్‌గా పిలిచే భారత అంగారక యాత్రకైన ఖర్చు 73 మిలియన్ డాలర్లు మాత్రమే, అంటే రూ.450 కోట్లు. అమెరికాకు చెందిన నాసా ప్రయోగించిన మావెన్ ప్రోబ్ (Mars Atmosphere and Volatile Evolution - MAVEN) కు అయిన ఖర్చు 672 మిలియన్ డాలర్లు అంటే సుమారు పదిరెట్లు ఎక్కువ. దీన్ని మంగళ్‌యాన్ అంగారక కక్ష్యలోకి చేరే రెండు రోజుల ముందే కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
* చంద్రయాన్ ప్రాజెక్టును కూడా అమెరికా, యూరోపియన్ దేశాలతో పోలిస్తే భారత్ అతి తక్కువ ఖర్చుతో పూర్తి చేయగలిగింది.

అంగారక యాత్ర ఎందుకంటే..

అంగారక గ్రహ కక్ష్యలోకే కాదు, అమెరికా లాంటి దేశాలు ఆ గ్రహంపైకి కూడా చేరగలిగాయి. అమెరికా, రష్యా అంగారక గ్రహాన్ని పరిశోధించాయి. ఇలాంటి తరుణంలో భారత్ అంగారక గ్రహ యాత్ర చేపట్టడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. చంద్రయాన్ ప్రయోగ సమయంలోనూ ఇలాంటి వాదనలే వినిపించాయి. అయితే తొలిసారిగా చంద్రుడిపై నీటి ఆనవాళ్లున్నాయని స్పష్టంగా, నిర్దిష్టంగా రుజువు చేసింది భారత్ చేపట్టిన చంద్రమండల యాత్రే. చంద్రయాన్-1 పై ఉన్న మూన్ మినరాలజీ మ్యాపర్ (M-3) ఈ విషయాన్ని బయటపెట్టింది. అమెరికాకు చెందిన నాసా ఈ మూన్ మినరాలజీ మ్యాపర్‌ను చంద్రయాన్‌లో ఏర్పాటు చేసింది. అందుకే భారత్ చంద్రయాన్ కృషిని నాసా కూడా కొనియాడింది.
* అంగారక గ్రహంపై మీథేన్ వాయువు ఆనవాళ్లపై ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారం లేదు. మంగళ్‌యాన్ తన పరిశోధనల్లో ఈ విషయాన్ని పరీక్షించనుంది. చంద్రయాన్‌కు దక్కిన విజయమే మంగళ్‌యాన్‌కి కూడా లభిస్తే భారత్ మరో చరిత్ర సృష్టించినట్లే.

సాంకేతిక ప్రదర్శన

మార్స్ మిషన్ ద్వారా భారత్ జరిపే శాస్త్ర పరిశోధనలు పరిమితమే. వాస్తవానికి మంగళ్‌యాన్‌లో ఉన్నవి కేవలం అయిదు పరికరాలు మాత్రమే. ఇది అంగారక కక్ష్యలో దీర్ఘవృత్తాకారంలో పరిభ్రమిస్తూ ఉంటుంది. అందువల్ల పరిశోధనలకు ఉన్న అవకాశాలు పరిమితం. అందుకే భారత్ ఈ ప్రయోగం ద్వారా శాస్త్ర పరిశోధన కంటే సాంకేతిక సామర్థ్యాన్ని పరీక్షించడం, ప్రదర్శించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది.
* గ్రహాంతర, సుదూర రోదసి యానంలో అనేక సంక్లిష్ట అంశాలుంటాయి. ఇస్రో ఈ ప్రయోగం ద్వారా క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించడమే కాకుండా దీని ఆధారంగా భవిష్యత్ యాత్రలకు పటిష్టమైన బాటలు వేసుకుంటోంది.

ఆకస్మిక విజయం కాదు..

రోదసి రంగంలోకి భారత్ 60వ దశకం ప్రారంభంలోనే అడుగుపెట్టింది. భారత్ ఒకవైపు పేదరికాన్ని ఎదుర్కొంటూనే మరోవైపు అంతరిక్షంలో వాతావరణ పరిశోధనల కోసం రాకెట్లను ప్రయోగించింది. 1975 లో తొలి ప్రయోగాత్మక ఉపగ్రహం 'ఆర్యభట్ట'ను విజయవంతంగా ప్రయోగించింది.
* 1980 లో ఇన్‌శాట్‌తో సహా ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ఇస్రో ప్రవేశపెట్టింది. వాతావరణ పరిశోధన, కమ్యూనికేషన్ టెలివిజన్, టెలిఫోన్ మొదలైన ఆధునిక అవసరాలు తీర్చడమే కాకుండా అటవీ అధ్యయనం, కరవు, వరద ప్రాంతాల గుర్తింపు, విద్య, ఆరోగ్యం లాంటి అవసరాలను తీర్చడంలో కూడా భారత్ రోదసి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటోంది.

ఆంక్షలను అధిగమించి..

మన శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీలో వాడిన వికాస్ ఇంజిన్‌ను దేశీయ పరిజ్ఞానంతో రూపొందించారు. కానీ జీఎస్ఎల్వీ ప్రయోగానికి సంబంధించిన క్రయోజెనిక్ సాంకేతిక పరిజ్ఞానం, క్రయోజెనిక్ ఇంజిన్ల కోసం ఇస్రో రష్యాకు చెందిన గ్లావ్ కాస్మోస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే అమెరికా ఈ ఒప్పందానికి అడ్డుతగిలింది. భారత్, రష్యాలకు చెందిన స్పేస్ ఏజెన్సీలపై ఆంక్షలు విధించింది. భారత్ ఈ టెక్నాలజీని క్షిపణుల కోసం వాడుతోందని అభియోగాన్ని మోపింది.
* క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ (MTCR) కూడా భారత్‌పై వివిధ ఆంక్షలు విధించింది. దీంతో మన శాస్త్రవేత్తలు తక్కువ ఖర్చుతో దేశీయంగానే క్రయోజెనిక్ టెక్నాలజీని రూపొందించారు. ఇప్పుడు మంగళ్‌యాన్ ప్రయోగంలో ఉపయోగించిన రోదసి వాహక నౌక, ఉపగ్రహం కూడా దేశీయ పరిజ్ఞానంతోనే రూపొందించినవే.

మంగళ్‌యాన్‌తో పెరిగిన మార్కెట్

మార్స్ మిషన్ దేశ ప్రజల అవసరాలను తీర్చడమే కాకుండా రోదసి సాంకేతిక పరిజ్ఞానంలో భారీగా లాభాలను అందిస్తోంది. ప్రస్తుతం రోదసి వాహక నౌకల ద్వారా జరిపే ప్రయోగాలకు ప్రపంచ మార్కెట్‌లో ఉన్న విలువ మూడువేల కోట్ల డాలర్లు. వీటిపై అమెరికా, యూరోపియన్ దేశాల పెత్తనమే ఎక్కువ. అయితే ఇప్పుడిప్పుడే భారత్, చైనా, జపాన్ లాంటి దేశాలు ఈ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నాయి.
* ఇప్పటికే పీఎస్ఎల్వీ రోదసి మార్కెట్‌లో మంచి ఆదాయాన్ని అందిస్తోందని, తాజాగా మంగళ్‌యాన్ విజయంతో ఇది మరింత పెరగనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో చంద్రమండలానికి, అంగారక గ్రహానికీ జీఎస్ఎల్వీ ద్వారా భారత్ చేరుకోగలిగితే ఈ మార్కెట్‌ను మరింతగా విస్తరించవచ్చు. భవిష్యత్‌లో చంద్రుడిపై ఉన్న హీలియం, అంగారకుడిపై ఉన్న మీథేన్, ఇతర ఖనిజాలను తీసుకు రాగలిగితే అధిక లాభాలు పొందవచ్చు.

బలపడనున్న బంధాలు..

ఇప్పటికే భారత్ రోదసి రంగంలో ప్రపంచ దేశాలకు తన సహకారాన్ని అందిస్తోంది. మన తొలి ప్రయోగాత్మక ఉపగ్రహం ఆర్యభట్టను ఆనాటి సోవియట్ యూనియన్ నుంచి ప్రయోగించారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, రష్యన్ స్పేస్ ఏజెన్సీలతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు అనేక అవగాహనలు కుదిరాయి. చంద్రయాన్-1 లో నాసా పరికరాలను కూడా ప్రయోగించారు. మంగళ్‌యాన్ విజయవంతం కావడంతో రోదసి రంగంలో ఈ అంతర్జాతీయ సంబంధాలు మరింతగా బలపడనున్నాయి.
* నాసాకు చెందిన మావెన్, భారత్ మంగళ్‌యాన్ దాదాపు ఒకేసారి అంగారక కక్ష్యలోకి ప్రవేశించాయి. ఇరుదేశాలూ ఈ మార్స్ మిషన్‌లను పంపించే శాస్త్రీయ సమాచారాన్ని పరస్పరం అందించుకుంటున్నాయి.
* ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో భాగంగా రోదసి రంగంలో పరస్పర సహకారంపై ఒప్పందం కుదరనుంది. భారత్, అమెరికా సంయుక్తంగా రాడార్ శాటిలైట్ మిషన్‌ను చేపట్టనున్నాయి.
* అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించుకోవడంపై ఇటీవల భారత్, చైనా మధ్య కూడా అవగాహనా ఒప్పందం కుదిరింది.

చైనాను మించిన తీరు..

20 వ శతాబ్దపు రోదసి రంగంలో అమెరికాకు, నాటి సోవియట్ యూనియన్‌కు మధ్య పోటీ ఉండేది. అయితే అది 21 వ శతాబ్దం నాటికి ఆసియా దేశాల మధ్య పోటీగా మారింది.
* ఇతర రంగాల మాదిరే రోదసి రంగానికి సంబంధించిన అనేక అంశాల్లో చైనా భారత్ కంటే ముందుంది. మనదేశంతో పోలిస్తే చైనాకు శక్తిమంతమైన వాహక నౌకలు, భారీ ఉపగ్రహాలు, అధిక సంఖ్యలో ప్రయోగ కేంద్రాలు ఉన్నాయి.
* 2003 లో చైనా తొలి వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపించింది. భారత్ రోదసిలోకి వ్యోమగామిని పంపించడానికి ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు ప్రారంభించింది. చంద్రమండల యాత్రలో కూడా భారత్ కంటే చైనా ముందుంది. కానీ అంగారకగ్రహ యాత్రలో మాత్రం భారత్ బలమైన పొరుగుదేశాన్ని పక్కకు నెట్టగలిగింది.
* 2012 లో చైనా తొలి మార్స్ మిషన్ Yinghuo-1 విఫలమైంది. 1998 లో జపాన్ జరిపిన అంగారక యాత్ర కూడా నిరాశనే మిగిల్చింది.

అనంతర దశ ...

తొలి ప్రయత్నంలోనే భారత్ మంగళ్‌యాన్‌ను విజయవంతంగా అరుణగ్రహ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీనిపై ఉన్న పరికరాలతో శాస్త్రవేత్తలు ప్రయోగాలు మొదలుపెట్టారు. భారత్‌తోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్ మొదలైన దేశాల్లో ఉన్న గ్రౌండ్ స్టేషన్స్ కూడా మంగళ్‌యాన్‌ను మానిటర్ చేస్తున్నాయి.
* అమెరికా మాదిరే గ్రహాల మధ్య రోదసి యాత్రలు జరిపి మౌలిక, శాస్త్ర పరిశోధనలకు భారీగా నిధులు వెచ్చించే సామర్థ్యం భారత్‌కు లేదు. అందుకే భారత్ ఈ పరిజ్ఞానాన్ని నిర్దిష్టంగా దేశ ప్రజల సామాజిక, ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఉపయోగించనుంది.
* ప్రస్తుతం జరిపిన అంగారక యాత్రను మూడు దశల్లో చేపట్టారు. మంగళ్‌యాన్‌ను మొదటి దశలో భూకక్ష్యలోకి, రెండో దశలో సౌర కక్ష్యలోకి, మూడో దశలో అంగారక కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. మంగళ్‌యాన్‌ను నేరుగా అంగారక కక్ష్యలోకి ప్రవేశపెట్టకపోవడానికి కారణం దాన్ని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్ఎల్వీ) ద్వారా ప్రయోగించడమే.
* అనేక సంవత్సరాలుగా భారత్ పీఎస్ఎల్వీ ద్వారా జరిపిన ప్రయోగాలన్నీ దాదాపు విజయవంతం అయ్యాయి. అందుకే ఇస్రో మంగళ్‌యాన్ కోసం పీఎస్ఎల్వీనే ఎంచుకుంది. భవిష్యత్‌లో మరింత సమర్థంగా జీఎస్ఎల్వీ ద్వారా గ్రహాంతర యాత్రలను భారత్ చేపట్టనుంది.
* పీఎస్ఎల్వీతో పోలిస్తే జీఎస్ఎల్వీ చాలా శక్తిమంతమైన రోదసి వాహక నౌక. సుదూర, స్థిర కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టగల సామర్థ్యం దీని సొంతం. అయితే భారత్ జరిపిన జీఎస్ఎల్వీ ప్రయోగాలు ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. అందుకే ఇప్పుడు దీన్ని ఉపయోగించలేదు. భవిష్యత్‌లో జరిపే అంగారక యాత్రలు నేరుగానే జరుగుతాయి. అంగారక, చంద్రమండల యాత్రల్లో కూడా భారత్ జీఎస్ఎల్వీని ఉపయోగించాల్సి ఉంది.


Trains special

ఫెయిరీ క్వీన్: ప్రస్తుతం ఉన్న అతి పురాతన రైలు ఇంజిన్

-రాజధాని ఎక్స్‌ప్రెస్: మొదటి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. దీన్ని ఢిల్లీ-హౌరా (కలకత్తా) మధ్య ప్రారంభించారు.

-దక్కన్ క్వీన్: మొదటి ఎలక్ట్రిక్ రైలు. పుణె-కల్యాణ్ మధ్య ప్రారంభించారు. (1929లో)

-గతిమాన్ ఎక్స్‌ప్రెస్: ఇది దేశంలో అత్యంత వేగవంతమైన రైలు (160 కి.మీ). ఢిల్లీ, అగ్రా మధ్య నడుస్తుంది.

-నీలగిరి ఎక్స్‌ప్రెస్: అత్యంత నిదానంగా నడిచే రైలు. ఉదక మండల ప్రాంతం.

-వివేకా ఎక్స్‌ప్రెస్: దేశంలో అత్యంత దూరం పయనించే రైలు. దిబ్రూగర్ (అస్సాం) నుంచి కన్యాకుమారి (తమిళనాడు) వరకు మొత్తం పొడవు 4,278 కి.మీ (2,658 మైళ్లు)

-సంఝౌతా ఎక్స్‌ప్రెస్: దేశంలో అత్యంత తక్కువ దూరం పయనించే రైలు ఇది. భారత్-పాక్‌ల మధ్య (కటారి-లాహోర్) నడుస్తున్నది. (3 కి.మీ)

-జీవనరేఖ (లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్): సంచార వైద్యశాలను కలిగిన రైలు. ఇది ప్రపంచంలోనే తొలిసారి రైలు చక్రాలపై ప్రారంభించిన వైద్యశాల.

-ధన్వంతరి: ఇది రోగుల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక రైలు. కేవలం రోగులకు మందులు అందించేందుకు ప్రారంభించారు.

-హాస్పిటల్ ఆన్ వీల్స్: ఇది పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రారంభించిన రైలు.

-విలేజ్ ఆన్ వీల్స్: ఇది పల్లె ప్రాంతాల సందర్శనకు ప్రారంభించిన రైలు. దీన్ని 2005లో మదురై, మధ్యప్రదేశ్ మధ్య ప్రారంభించారు.

-రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్: ఇది ఎయిడ్స్ రోగులకు చికిత్స, అవగాహన కోసం ప్రారంభించిన రైలు. 2007 డిసెంబర్ 1న తొలిసారిగా ప్రారంభించారు.

-ప్యాలెస్ ఆన్ వీల్స్: విదేశీ పర్యాటకుల కోసం ఏర్పాటైన విలాసవంతమైన రైలు ఇది. రాజస్థాన్ పర్యాటక విభాగం ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల మధ్య నడుస్తున్నది.

-గరీబ్ రథ్: పేదలకు, మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే ఏసీ సదుపాయంతో ప్రారంభించిన రైలు. దీన్ని 2010లో ప్రారంభించారు.

-సైన్స్ ఎక్స్‌ప్రెస్: ఇది దేశ సైన్స్, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధిని వివరిస్తూ నడిచే రైలు. దేశంలో అన్ని ప్రధాన నగరాలకు వెళ్తుంది.

-టైగర్ ఎక్స్‌ప్రెస్: దేశంలో తొలి సెమీ లగ్జరీ రైలు. పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు.

-దేశంలో మొదటి రెండంతస్తుల రైలు (డబుల్ డెక్కర్)ను 2011 అక్టోబర్ 1న హౌరా నుంచి ధన్‌బాద్ వరకు ప్రారంభించారు.

 దేశంలో తొలి హరిత రైల్వేస్టేషన్‌గా జమ్ముకశ్మీర్‌లోని మన్వాల్‌స్టేషన్‌ను గుర్తించారు.

 అత్యంత పొడవైన రైలు సొరంగం-పిర్ పంజాల్ (జమ్ముకశ్మీర్) 

హార్మోన్

ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్, ప్రొలాక్టిన్, ఆక్సిటాసిన్ హార్మోన్‌లు స్త్రీలలో రజస్వల, ఋతుచ్రకం, ద్వితీయ లైంగిక లక్షణాలు (Secondary Sexual Characters) సంతానోత్పత్తి, ప్రసవంలో ఉపకరిస్తాయి. ఈ హార్మోన్‌లు అసమతుల్యతల వలన స్త్రీలలో ఋతుచక్ర సమస్యలు (Menstrual Disorders, PCOD) హిర్సుటిజం (అవాంఛిత రోమాలు) మరియు సంతానలేమి సమస్యలు వస్తాయి. స్త్రీలలో మెనోపాజ్, రజస్వల అయ్యే సమయంలో హార్మోన్‌ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మెనోపాజ్‌లో హార్మోన్ హెచ్చుతగ్గుల వలన Hot Flushes, మానసికఅశాంతి, నీరసం, కీళ్ళు, కండరాల నొప్పులు వస్తాయి.
 టెస్టోస్టిరాన్:
 ఇది పురుషులలో ఉండే హార్మోన్. దీని అసమతుల్యతల వలన  శుక్రకణ సమస్యలు, సంతానలేమి సమస్యలు వస్తాయి.

వైరస్‌ల ద్వారా మానవునిలో , మొక్కలలో కలిగే వ్యాధులు:

వైరస్‌ల ద్వారా మానవునిలో కలిగే వ్యాధులు:
1. ఆటలమ్మ 2. పోలియో 3. తట్టు/మీజిల్స్‌/రుబెల్లా
4. గవద బిళ్ళలు/మమ్స్‌ 5. జలుబు 6. మశూచి/స్మాల్‌పాక్స్‌
7. మెదడువాపు వ్యాధి/జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌
8. హెపటైటిస్‌ 9. ఎయిడ్స్‌ 10. డెంగ్యూ 11. చికెన్‌గున్యా 12. రేబిస్‌ 13. సార్స్‌ 14. ఎబోలా 15. క్యాన్సర్‌ 16. స్వైన్‌ఫ్లూ 17. ఇన్‌ఫ్లూయెంజా 18. కంటికలక


మొక్కలలో వైరస్‌ల ద్వారా వచ్చే వ్యాధులు: వైరస్‌లు అవికల్ప పరాన్న జీవులుగా ఉండి, మొక్కల్లో పెరుగుతూ అనేక వ్యాధులను కలుగచేస్తాయి.
సాధారణంగా వైరస్‌ల వల్ల కలిగే మొక్కల వ్యాధులు చాలా వరకు 'మొక్క మొత్తాన్ని ప్రభావితం' (సర్వాంగీణం) చేస్తాయి. ఎక్కువగా తెగులు లక్షణాలు పత్రాల్లో కనిపిస్తాయి.
1. నిర్హరితం- పీచు పసుపు పచ్చ తెగులు
2. మొజాయిక్‌ వ్యాధి- పొగాకు మొజాయిక్‌ వ్యాధి
3. ఈనెల నిర్హరితం- బెండ ఈనెల నిర్హరితం
4. కురూపకత - కోకో ఉబ్బుకాండం
5. పుష్పాల చీలికలు- ట్యూలిప్‌ పుష్పాల చీలిక
6. వేరువిల్ట్‌ - కొబ్బరి వేరు విల్ట్‌
7. ట్రిస్టిజ- చీని/బత్తాయి ట్రిస్టిజ
8. మొవ్వకుళ్ళు - వేరుశనగ మొవ్వకుళ్ళు తెగులు
9. వెర్రితల తెగులు- మిరప వెర్రితల తెగులు
10. టమోటాలో ఆకుముడత తెగులు
11. అరటిలో బంబీటాప్‌ తెగులు
12. టొమాటో రింగ్‌స్పాట్‌ తెగులు
13. పొగాకు నెక్రోసిస్‌ తెగులు
14. వరి టుంగ్రో తెగులు
జంతువులలో వైరస్‌ వ్యాధులు
1. కోళ్ళు - బర్డ్‌ ఫ్లూ
2. పాడిపశువులు - గాలికుంటు వ్యాధి
3. గొర్రెలు - నీలి నాలుక వ్యాధి
4. కౌపాక్స్‌ - పశువులు
5. రాణిఖేట్‌ వ్యాధి - కోళ్ళు కొక్కెర వ్యాధి
6. కోళ్ళు - మార్క్స్‌ వ్యాధి
7. పశువులు - చీడపారుడు వ్యాధి

Science tips

జనరల్‌ స్టడీస్‌లో భాగమైన సైన్సులోని అంశాలను వీలైనన్ని ఎక్కువసార్లు పునశ్చరణ చేస్తే మరిచిపోకుండా ఉంటారు. ఇలా చేసేటప్పుడు కఠినంగా భావిస్తున్నవాటి/ తరచుగా మరిచిపోతున్న వాటికింద ఒక గీతను గీయండి. లేదా విడిగా కాగితంపై రాసుకోండి. పునశ్చరణ చేసేటప్పుడు వీటిని మాత్రమే చదవండి.
భౌతిక, రసాయన, జీవశాస్త్రాల్లో ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టి చదివితేవీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షల్లో అధిక మార్కుల స్కోరుకు ఆస్కారం ఉంటుంది. ఈ సందర్భంలో పాటించాల్సింది- కొత్త అంశాలను అస్సలు చదవకూడదనేది.
భౌతికశాస్త్రం
దీనిలో సబ్జెక్టు సంబంధిత వాటికంటే అనువర్తనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నిత్యజీవితంలో భౌతికశాస్త్రం, పరికరాలు వాటి ఉపయోగాలు, మూలసూత్రాలపై శ్రద్ధపెట్టాలి. చదల్సిన ముఖ్యమైన అంశాలు:
* న్యూటన్‌ గమననియమాలు, పాస్కల్‌ సూత్రం, ఆర్కిమెడిస్‌ సూత్రం, బెర్నౌలి సూత్రం *కాంతి: దర్పణాలు, కటకాలు వీటి రకాలు, ఉపయోగాలు, దీర్ఘదృష్టి, హ్రస్వదృష్టి వంటి దృష్టిలోపాలు
* మన విశ్వం: గ్రహాల గురించిన సమాచారం
* ధ్వని: ధ్వని పరావర్తనం, అతిధ్వనులు, ధ్వనివేగం
* కాంతి పరావర్తనం, వక్రీభవనం, విక్షేపణం, ఉదాహరణలు, కలిగే ప్రభావాలు
* పారా, డయా, ఫెర్రో అయస్కాంత పదార్థాలు
* ఇంధనవనరులు రకాలు- పునరుద్ధరణ జరిగే ఇంధనవనరులు, పునరుద్ధరణ జరగని ఇంధన వనరులు, పెట్రోలియం శుద్ధి, సౌరశక్తి, బయోమాస్‌ శక్తి, పవనశక్తి.
గమనిక: ఇంధన వనరులు అనే అంశం భౌతిక, రసాయన, జీవశాస్త్రాల్లో, కరెంట్‌ ఎఫైర్స్‌లో ఉంది. దీన్ని తప్పనిసరిగా చదవాలి; ఎక్కువసార్లు పునశ్చరణ చెయ్యాలి.
రసాయనశాస్త్రం
రసాయనిక నియమాలు, రసాయనాల ఉపయోగాలు, రసాయనాల సాధారణ నామాలపై ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వీటిని ముఖ్యమైనవిగా భావించవచ్చు:
* పరిశ్రమల్లో వివిధ వస్తువుల తయారీ, పద్ధతులు
* కార్బోహైడ్రేట్లు- రకాలు, వీటి ఉదాహరణలు, చక్కెర, ఆల్కహాల్‌ తయారీ
* కొవ్వుల ఉపయోగం, సబ్బు, డాల్డా తయారీ
* మూలకాల లాటిన్‌ నామాలు
* ఆమ్లాలు, క్షారాలు, వాటి లక్షణాలు, రకాలు
* ద్రావణాలు, కర్బన రూపాంతరాలు
* భౌతిక మార్పులు, రసాయన మార్పులు
* రసాయనిక చర్యలలో సంయోగం, వియోగం, స్థానభ్రంశం
* రసాయన సంయోగ నియమాలు, వీటి ప్రాధాన్యం
జీవశాస్త్రం
దీనిలో గ్రామీణ ప్రాంత సమస్యలు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, వ్యాధులు, పోషకాహార లోపం, వ్యాధులు వ్యాపించే విధానం ప్రాధాన్యం ఉన్న అంశాలు. జనరల్‌ స్టడీస్‌లో 50 శాతం ప్రశ్నలు గ్రామీణ ప్రాంతాల అవగాహనపై ఉంటాయని సిలబస్‌లో పేర్కొన్నారని తెలిసిందే. అందుకే వీటిని వీలైనన్నిసార్లు పునశ్చరణ చేయాలి. జీవశాస్త్రంలో కింది అంశాలు ముఖ్యమైనవిగా భావించవచ్చు:
* హార్మోనులు- వీటిలోపం వల్ల కలిగే వ్యాధులు
* మెదడులోని భాగాలు, అవి నియంత్రించే పనులు
* పోషక పదార్ధాలు- మన శరీరానికి కలిగే ఉపయోగం, వీటిలోపం వల్ల కలిగే వ్యాధులు
* ఎయిడ్స్‌ వ్యాధి, నివారణ
* విటమిన్ల లోపం వల్ల కలిగే వ్యాధులు
* మొక్కల, జంతువుల వర్గీకరణం
* పశుసంవర్ధనం- జంతువుల్లో కలిగే వ్యాధులు
* మానవునికి బాక్టీరియా, వైరస్‌, ప్రోటోజోవాలవల్ల కలిగే వ్యాధులు. (బాక్టీరియా, వైరస్‌ల వల్ల కలిగే వ్యాధుల పేర్లు, బాక్టీరియా, వైరస్‌ల పేర్లు దాదాపుగా ఒకేరకంగా ఉంటాయి. వీటిలో 1 లేదా 2 వేరుగా ఉన్నవాటిని గుర్తించి వాటిని మాత్రమే పునశ్చరణ చెయ్యాలి).
* పర్యావరణం- కాలుష్యం.
* రక్తప్రసరణం, రక్తవర్గాలు, రక్తంలోని అంశాలు
* మానవ ఆరోగ్యం గమనిక: ఆరోగ్యం అనే అంశం జీవశాస్త్రంలో 3 సార్లు, కరెంట్‌ ఎఫైర్స్‌లో 2 సార్లు సిలబస్‌లో ఇచ్చారు. దీని ప్రాధాన్యం దృష్ట్యా సంబంధిత అంశాలన్నిటినీ వీలైనన్ని ఎక్కువసార్లు చదవాలి.
ఈవిధంగా ముఖ్యమైనవాటిని/ ఈ అంశాల నుంచి అడగవచ్చు అని భావించేవాటిని ఎక్కువగా పునశ్చరణ చేయాలి. చివరగా నమూనా పేపర్లు సాధన చెయ్యండి. సాధన చేసే సమయంలో రాని ప్రశ్నల గురించి బెంగపడకూడదు.

కరెంట్ అఫైర్స్

*కరెంట్ అఫైర్స్*

*డైనమిక్ సిటీ హైదరాబాద్*

ప్రపంచంలో అత్యంత వేగంగా మార్పు చెందుతున్న నగరాల జాబితాలో హైదరాబాద్ ఐదోస్థానంలో నిలిచింది.
డైనమిక్ సిటీల పేరుతో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ జేఎల్‌ఎల్ ఏటా విడుదల చేసే గ్లోబల్ సిటీ మొమెంటమ్ ఇండెక్స్‌లో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, హోచిమిన్ సిటీ (వియత్నాం), సిలికాన్ వ్యాలీ (అమెరికా), షాంఘై (చైనా) తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలోని టాప్ 30 సిటీల్లో భారత్‌కు చెందిన ఆరు నగరాలు ఉన్నాయి. ఇందులో పుణె 13, చెన్నై 18, ఢిల్లీ 23, ముంబై 25వ స్థానం సంపాదించాయి.

*మ*
*అవార్డులు*



*జాతీయ సాహస బాలల పురస్కారాలు*

*ణి*
2017కుగాను జాతీయ సాహస బాలల పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బాలికల అక్రమరవాణాను అరికట్టేందుకు సహాయం చేసిన పశ్చిమబెంగాల్ అమ్మాయిలు తేజస్విద, శివానీలు గీతా చోప్రా అవార్డు, అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన తార్హ్ పీజు.. భారత్ అవార్డు, ఉత్తరాఖండ్‌కు చెందిన సుమిత్.. సంజయ్‌చోప్రా అవార్డు అందుకోనున్నారు.

*లెజెండ్స్ క్లబ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో కపిల్*

*కు*
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్‌కు క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాకు చెందిన లెజెండ్స్ క్లబ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది.

*కృష్ణారావుకు ఎల్లాప్రగడ అవార్డు*

*మా*
ప్రతిష్ఠాత్మక డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు అవార్డుకు ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ సీఈవో అమెరికన్ డాక్టర్ అప్పసాని కృష్ణారావు ఎంపికయ్యారు. బయాలజీ, కెమిస్ట్రీ, జెనటిక్స్, మెడికల్ సైన్స్‌లో చేసిన కృషికిగాను ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు.

*జాతీయం*

*ర్*
*కాలం చెల్లిన చట్టాల రద్దు*

కాలం చెల్లిన 105 చట్టాలను రద్దు చేయడానికి కేంద్ర మంత్రిమండలి జనవరి 18న ఆమోదం తెలిపింది. ఇందులో 2008 సార్లు సవరణలకు గురైన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంతోపాటు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల జీతాలు, పెన్షన్‌లకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల రద్దు కోసం రద్దు-సవరణ బిల్లు-2017ను తీసుకురానున్నారు.

*హిమాచల్‌ప్రదేశ్ రెండో రాజధానిగా ధర్మశాల*

*M*

హిమాచల్‌ప్రదేశ్ రెండో రాజధానిగా ధర్మశాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ జనవరి 19న ప్రకటించారు. 2005 నుంచి ధర్మశాలలో పూర్తిస్థాయి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.

*జల్లికట్టుపై నిషేధం ఎత్తివేత*🐂

*A*
తమిళుల సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ తమిళనాడు ప్రభుత్వం జనవరి 21న ఆర్డినెన్స్ జారీచేసింది. జంతుహింస నిరోధక చట్టం-1960లోని ప్రదర్శన జంతువుల (పెర్ఫామింగ్ యానిమల్స్) జాబితా నుంచి ఎద్దులను తొలగించేందుకు సవరణ కోసం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్‌ను ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆమోదించారు. 2014, మే 7న సుప్రీంకోర్టు జల్లికట్టును నిషేధించింది. అయితే కొన్ని మార్పులతో కేంద్ర అడవులు, పర్యావరణ శాఖలు జల్లికట్టు వంటి క్రీడను అనుమతించాయి. దీనిపై 2016 జనవరి 16న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.

*N*
*యుద్ధనౌకలో ఏటీఎం*💳

తొలిసారిగా యుద్ధనౌకలో ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఇండియన్ నేవీలోని అతిపెద్ద యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలో జనవరి 21న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సేవలు ప్రారంభించింది. ఈ యుద్ధనౌకలో విధులు నిర్వర్తిస్తున్న సుమారు 1500ల మందికిపైగా సిబ్బంది, అధికారులు ఈ సేవలను వినియోగించుకుంటారు.

*రైల్వే బడ్జెట్ విలీనానికి రాష్ట్రపతి ఓకే*🚊✅

*I*
కేంద్ర సాధారణ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ను విలీనం చేయడాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. దీనికి అనుగుణంగా భారత ప్రభుత్వ (వాణిజ్య కేటాయింపులు) నిబంధనలు-1961 చట్టంలో ప్రతిపాదించిన సవరణలకు జనవరి 20న రాష్ట్రపతి ఆమోద ముద్రవేశారు.

*అతి పొడవైన మానవహారం*

*K*

ప్రపంచంలోనే అత్యంత పొడవైన మానవహారాన్ని బీహార్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో అమలవుతున్న సంపూర్ణ మద్య నిషేధానికి మద్దతునిస్తూ 11,400 కి.మీ. పొడవైన మానవహారాన్ని ఏర్పాటు చేశారు. నిషాముక్త్ కాంపెయిన్ పేరుతో దీన్ని అమలు చేశారు. సుమారు మూడు కోట్ల మంది బీహార్ ప్రజలు కలిసి దీన్ని నిర్మించారు. ఇప్పటి వరకు ప్రపంచపు అత్యంత పొడవైన మానవహారం రికార్డు 1050 కి.మీ.తో బంగ్లాదేశ్ పేరున రికార్డయ్యింది.

*అంతర్జాతీయం*

*U*

*అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్*

అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ జే ట్రంప్ జనవరి 20న ప్రమాణస్వీకారం చేశారు. మాజీ అధ్యక్షుడు ఒబామా తీసుకొచ్చిన ఆరోగ్య చట్టం ఒబామా కేర్‌ను రద్దు చేస్తూ రూపొందించిన ఫైలుపై తొలి సంతకం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా మైక్ పెన్స్‌ను ట్రంప్ నియమించారు. వీరి ప్రమాణ స్వీకారం నేషనల్ మాల్ సమీపంలో జరిగింది.

అధ్యక్షతరహాకు మారిన టర్కీ
పార్లమెంటరీతరహా ప్రభుత్వం నుంచి టర్కీ అధ్యక్షతరహా ప్రజాస్వామ్యానికి మారింది. ఇందుకు ఉద్దేశించిన బిల్లును టర్కీ పార్లమెంటు జనవరి 22న ఆమోదించింది. దాంతోపాటు అధ్యక్షుడికి అసాధారణ అధికారాలను కూడా పార్లమెంటు కట్టబెట్టింది. ఈ బిల్లును త్వరలో ప్రజాభిప్రాయ సేకరణకు పంపనున్నారు. ప్రజాభిప్రాయం అనుకూలంగా వస్తే తక్షణం అమల్లోకి వస్తుంది. అంతేకాకుండా ప్రస్తుత అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ 2029 వరకు అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.

*నేపాల్ కూరగాయల స్వయం సమృద్ధి ప్రణాళిక*

*M*

వచ్చే పదేండ్లలో కూరగాయల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించేందుకు నేపాల్ పదేండ్ల ప్రణాళికలను చేపట్టింది. ప్రస్తుతం నేపాల్‌కు కూరగాయలు భారత్‌నుంచే ఎగుమతి అవుతున్నాయి. భారత్ నుంచి ఏటా రూ. 550 కోట్ల విలువైన 25,000 మెట్రిక్ టన్నుల కూరగాయలు ఎగుమతి అవుతున్నాయి.

*హాంకాంగ్‌కు వీసా ఫ్రీ సౌకర్యం రద్దు*

*A*

భారతీయ పర్యాటకులకు వర్తిస్తున్న వీసా ఫ్రీ సౌకర్యాలను రద్దుచేస్తున్నట్లు హాంకాంగ్ జనవరి 21న ప్రకటించింది. ఇప్పటివరకు భారతీయులు హాంకాంగ్‌లో పర్యటించాలంటే వీసా అవసరం లేకుండానే 14 రోజులవరకు అవకాశం ఉండేది. చైనా ప్రత్యేక పాలన కింద ఉన్న హాంకాంగ్‌లో ఇకనుంచి భారతీయులు పర్యటించాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలి.

*R*

*క్రీడలు*🏏⚽🏸

*మ*

*వన్డే సిరీస్ భారత్ కైవసం*

ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో భారత్ గెలుచుకుంది. మొదటి రెండు వన్డేల్లో విజయం సాధించిన భారత్ జనవరి 22న కోల్‌కతాలో జరిగిన మూడో మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. సిరీస్‌లో మొత్తం 232 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ కేదార్ జాదవ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్నాడు.
*ణి*

*సైనాకు మలేసియా గ్రాండ్ ప్రి టైటిల్*

హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా నిలిచింది. మలేసియాలోని సారావక్‌లో జనవరి 22న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన పోర్న్‌వవీ చోచువోంగ్‌పై 22-20, 22-20తో విజయం సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ తర్వాత సైనా గెలిచిన తొలి టైటిల్ ఇదే. ఆమె కెరీర్‌లో ఇది తొమ్మిదో గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్ కాగా, మొత్తంగా 23వ టైటిల్.

*వార్తల్లో వ్యక్తులు*

*కు*

*చంద్రునిపై చివరిగా కాలుమోపిన సెర్నన్ మృతి*😔


చంద్రునిపై చివరిసారిగా కాలుమోపిన అమెరికా వ్యోమగామి జీన్ సెర్నన్ జనవరి 17న మరణించారు. ఆయన 1972 డిసెంబర్‌లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన అపోలో 17 మిషన్‌కు కమాండర్‌గా పనిచేశారు. చంద్రమండలంపై ఇప్పటివరకు 12 మంది కాలుమోపారు.

*ఐసీఎస్‌ఐ కొత్త అధ్యక్షుడిగా శ్యామ్ అగర్వాల్*


*మా*
2017 ఏడాదికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) నూతన అధ్యక్షుడిగా శ్యామ్ అగర్వాల్, ఉపాధ్యక్షుడిగా మకరంద్ లెలెలు జనవరి 19 ఎన్నికయ్యారు. ఐసీఎస్‌ఐ అధ్యక్షులుగా ఎన్నికైన వారిలో శ్యామ్ అతి చిన్న వయస్కుడు. జైపూర్‌కు చెందిన ఆయన ప్రస్తుతం సీఎస్‌ఐ కేంద్ర మండలిలో సభ్యుడిగా ఉన్నారు.

*సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ కుమార్*

*ర్*
సీబీఐ నూతన డైరెక్టర్‌గా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ వర్మను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్, లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లికార్జున్ ఖర్గేలతో కూడిన త్రిసభ్య కమిటీ వర్మ నియామకానికి అనుమతించింది. సీబీఐ డైరెక్టర్ అనిల్ సిన్హా 2016, డిసెంబర్ 2న పదవీ విరమణ చేయడంతో అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది.

ఆర్డినెన్స్, కాలపరిమితి

రాజ్యాంగంలో ఆర్డినెన్స్ 


-రాజ్యాంగం అధికరణ 123 ప్రకారం పార్లమెంటు ఉభయసభలు సమావేశంలో లేనప్పుడు అత్యవసరంగా చట్టం చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే, ఆర్డినెన్స్ రూపంలో రాష్ట్రపతి చట్టం చేస్తారు.
-గవర్నర్ అయితే ఆర్టికల్ 213 (1) ప్రకారం ఇదే తరహా ఆర్డినెన్స్ జారీ చేస్తారు.
code😀
123-213
  ఆర్డినెన్స్ కాలపరిమితి
-సాధారణంగా ఆర్డినెన్స్‌ను పార్లమెంటు తిరిగి సమావేశమైన తరువాత ఆరు వారాల్లోపు ఆమోదించాలి.
-ఈ ఆర్డినెన్స్ పార్లమెంటు ద్వారా ఆమోదం పొందకుండా గరిష్టంగా ఏడు నెలల పదిహేను రోజులు అమల్లో ఉంటుంది.
-అంటే పార్లమెంటు ఒక సమావేశానికి, మరొక సమావేశానికి మధ్య కాలం ఆరు నెలలు, అలాగే పార్లమెంటు సమావేశమైన తరువాత, ఆరు వారాల్లోపు ఆమోదించవచ్చనే నియమం వల్ల, ఒకవేళ పార్లమెంటు సమావేశం ముగిసిన తరువాత ఆర్డినెన్స్ జారీ అయి, తిరిగి సమావేశమైన తరువాత ఆరో వారం చివరి రోజున ఆమోదించినట్లయితే 6 నెలలు+ 6 వారాలు, గరిష్టంగా ఏడున్నర నెలలు అవుతుంది.
-అయితే ఆర్డినెన్స్‌కు కనిష్ట కాలపరిమితి లేదు. దీన్ని రాష్ట్రపతి ఎప్పుడైనా రద్దు చేయవచ్చు.
అసలు ఎందుకు వివాదాస్పదమవుతుంది?

-నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 26 ఆర్డినెన్స్‌లు జారీచేసింది. అంటే కేవలం రెండున్నరేండ్లలో ఇన్ని ఆర్డినెన్స్‌లు జారీఅయ్యాయంటే పార్లమెంటరీ వ్యవస్థ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Current affairs

      Current affairs..._*

*(Nov
🍃_________🌺_________🍃
1. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌ను ఎక్కడ ప్రారంభించారు?
1) కోల్ కతా
2) న్యూఢిల్లీ
3) గోవా
4) అహ్మదాబాద్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: భారత వ్యాపార ప్రోత్సాహక సంస్థ (ITPO) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో 36వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌ను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ఈ ట్రెడ్ ఫెయిర్ భాగస్వామ్య దేశం దక్షిణ కొరియా. ఫోకస్ దేశం బెలారస్.

2. లేడిస్ యురోపియన్ గోల్ఫ్ టూర్ టైటిల్ విజేత ఎవరు?
1) లేక్సి థామ్సన్
2) షర్మిలా నికొలెక్ట్
3) నటాలియా ఘిల్జోన్
4) ఆదితి అశోక్

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: లేడిస్ యురోపియన్ గోల్ఫ్ టూర్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి ఇండియన్ గోల్ఫర్ ఆదితి అశోక్. ఈ టైటిల్ కింద ఆమెకు 60,000 అమెరికన్ డాలర్లు నగదు బహుమతి అందుతుంది.

3. దేశంలో తొలి ‘చెర్రి బ్లోసమ్స్’ ఉత్సవాలు ఎక్కడ నిర్వహించారు?
1) షిల్లాంగ్
2) సిమ్లా
3) సిలిగురి
4) ఐజ్వాల్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: పర్యాటకులనుఆకర్షించడం కోసం మణిపూర్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోరిస్సోర్స్, సస్టేన్‌బుల్ డెవలప్‌మెంట్,National institute of department of biotechnology ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించారు.

4. ఇటీవల ఏ దేశంలో ‘ ప్రీ స్కూల్స్’లో హిందీ భాషను ప్రవేశపెట్టనున్నారు?
1) ఆస్ట్రేలియా
2) జపాన్
3) తైవాన్
4) జర్మనీ

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రీ స్కూల్ ఆన్‌లైన్ కార్యక్రమంలో భాగంగా విదేశీ భాషల బోధన ప్రారంభించింది. 2015-16 అకడమిక్ సంవత్సరంలో చైనీస్, జపనీష్, ఇండోనేషియా, ఫ్రెంచ్, అరబిక్ భాషలను ప్రవేశపెట్టారు. 2017లో ఇటాలియన్, స్పానిష్ భాషలను, 2018లో హిందీ, ఆధునిక గ్రీక్ భాషలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

5. ఫెడరల్ బ్యాంక్ మొదటి విదేశీ శాఖను ఎక్కడ ప్రారంభించింది?
1) టోక్యో
2) రంగూన్
3) దుబాయి
4) మక్కా

View Answer

స‌మాధానం: 3

6. అంతర్జాతీయ కార్మిక సంస్థకు నూతన డెరైక్టర్ జనరల్‌గా ఎంపికైంది ఎవరు?
1) గై రైడర్
2) డా.మార్గరెట్ చాన్
3) అంథోని లాకే
4) ముల్లర్ మైఖైల్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. ఈ సంస్థలో 187 దేశాలకు సభ్యత్వం ఉంది.

7. ‘‘ లండన్ ఈవినింగ్ స్టాండర్డ్ థియేటర్’’ పురస్కారాల్లో ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకొన్నది ఎవరు?
1) డి.ఎమ్. స్మిత్
2) జాన్ మాల్క్ విచ్
3) రాల్ఫ్ ఫిన్నెస
4) వి. కెన్నెత్ బ్రాన్‌గ్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: ది మాస్టర్ బిల్డర్, రిచర్ట్స్-III లలో రాల్ఫ్ ఫిన్నెసనటనకుగాను ఉత్తమ నటుడు పురస్కారం లభించింది.

8. 2015లో భారతదేశ కార్బన్ ఉదార్గాలు ఎంత శాతం పెరిగాయి?
1) 10%
2) 5%
3) 3%
4) 1%

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా తయారుచేసిన నివేదిక ప్రకారం ఇండియాలోశిలాజ ఇంధనాల ద్వారా కార్బన్ ఉదార్గాలు 2015లో 5 శాతం పెరిగాయి. చైనాలో 0.7 %, అమెరికాలో 1.7 % తగ్గాయి.

9. భారతదేశంలో ఏ నగరాన్ని ‘‘ బ్రెస్ట్ క్యాన్సర్ క్యాపిటల్’’ గా పిలుస్తారు?
1) తిరువనంతపురం
2) పూణె
3) మైసూర్
4) కాన్పూర్

View Answer
*_Basu_*
స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: దేశవ్యాప్తంగా సగటున ప్రతి లక్ష మందిలో 20 మందికి బెస్ట్ క్యాన్సర్ఉంది. అలాగే కేరళ రాష్ట్రంలో ప్రతి లక్ష మందిలో 14 మందికి, తిరువనంతపురంలో ప్రతి లక్ష మందిలో 40 మందికి బెస్ట్ క్యాన్సర్ఉంది. సర్వీకల్ క్యాన్సర్ త ర్వాత అత్యంత ప్రాణాంతకరమైన వ్యాధి బ్రెస్ట్ క్యాన్సర్.

10. బ్రెజిలియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములావన్ టైటిల్ విజేత ఎవరు?
1) నికో రోస్‌బర్గ్
2) లూయిస్ హమిల్టన్
3) సెబాస్టియన్ వెటల్
4) డెనియల్ రిక్కియార్డొ

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: 2016 సీజన్‌లో లూయిస్ హమిల్టన్ బ్రెజిలియన్ గ్రాండ్ ప్రీ తో కలిపి మొత్తం 9 టైటిల్స్‌ను గెలుచుకున్నాడు.

11. రిసోనన్స్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో ఆకర్షణీయ నగరం ఏది?
1) టోక్యో
2) న్యూయార్క్
3) పారిస్
4) లండన్

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: రిసోనన్స్ సంస్థ ట్రావెల్ మార్కెట్‌ను పరిగణలోకి తీసుకొని ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయ నగరాల జాబితాను తయారుచేసింది. ఈ నివేదికలో తొలిస్థానంలో లండన్ ఉంది. తర్వాత స్థానాలలో సింగపూర్, న్యూయార్క్, పారిస్ నగరాలు ఉన్నాయి.

12. యూఏఈ లో యునెస్కో గుర్తించిన మొదటి ప్రపంచ వారసత్వ సంపద ప్రాంతాలు ఏవి?
1) ఆల్ ఐన్ ఓయాసిస్
2) ఆల్ జజిరాన్
3) హిలి పురావస్తు పార్క్
4) హిరా పర్వతాలు

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: యూఏఈలో యునెస్కో గుర్తించిన మొదటి వరల్డ్ హెరిటెజ్ సైట్ Al Ain Oasis. ఇది ప్రపంచంలో అతి పురాతన శాశ్వత నివాస స్థలం. ఆల్ ఐన్ ఓయాసిస్‌లో 4000 సంవత్సరాల నుంచి మనుషులు నివాసం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి.

13. ఇటీవల ఇండియా ‘‘ హ్యండ్ ఇన్ హ్యండ్ 2016’’ అనే పేరుతో ఏ దేశంతో సైనిక విన్యాసాలు నిర్వహించింది?
1) శ్రీలంక
2) నేపాల్
3) చైనా
4) జపాన్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: 6వ ‘‘హ్యండ్ ఇన్ హ్యండ్ ’’సైనిక శిక్షణ విన్యాసాలను చైనాతో ఇండియా నిర్వహించింది.

14. జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ ఛాంపియన్‌షిప్ 2016 విజేత ఎవరు?
1) ఎస్. విజయలక్ష్మీ
2) పద్మిని రౌత్
3) ఈష ఖరవడే
4) కోనేరు హంపి

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: జాతీయ మహిళ ప్రీమియర్ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను పద్మిని రౌత్ వరుసగా మూడోసారి గెలుచుకుంది. ఎస్.విజయలక్ష్మీ మొదటి రన్నరప్, ఈషా ఖరవడే రెండో రన్నరప్‌గా నిలిచారు.

15. ప్రపంచ మనీలా మాస్టర్స్ గోల్ఫ్ టైటిల్ విజేత ఎవరు?
1) సామ్ చెనై
2) ఎస్.ఎస్.పి. చౌరాసియా
3) నికొలస్ ఫంగ్
4) డేవిడ్ థోరో

View Answer

స‌మాధానం: 2

16. ఆయుర్ హెర బారియా ప్రాజెక్టును ఎక్కడ ప్రారంభించారు?
1) న్యూఢిల్లీ
2) కోల్‌కత్త
3) ముంబాయి
4) గోవా

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గోవాలో మారిషస్ ప్రధాన మంత్రి అనిరుధ్ జగ్ననాధ్ ఈ ప్రాజెక్ట్ ను లాంఛనంగా ప్రారంభించారు.

17. వివాదాస్పద ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్‌పై కేంద్ర ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు నిషేదం విధించింది?
1) 1 సంవత్సరం
2) 3 సంవత్సరాలు
3) 5 సంవత్సరాలు
4) జీవిత కాలం

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: చట్ట విరుద్ధ కార్యకలపాల నిరోధక చట్టం కింద జాకిర్ నాయక్‌కు చెందిన ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్‌పై 5 సంవత్సరాల పాటు ప్రభుత్వం నిషేధం విధించింది.

18. ‘‘ హార్ ఘర్ బిజిల్లి లఘతార్’’ అనే పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) బీహార్
2) ఒడిశా
3) ఉత్తరప్రదేశ్
4) హర్యానా
*_Vaalmeeki Bhaskar_*
View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కూమార్ వచ్చే రెండు సంవత్సరాలలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.

19. ఇటీవల ఏ దేశంలో ‘‘ భారతీయ ఉత్సవాలు’’ 2016 నిర్వహించారు?
1) బెలారస్
2) ఒమన్
3) జపాన్
4) బ్రూనై

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: ఒమన్ దేశంలో ముఖ్య నగరాలైన మస్కట్, సుర్, సోహర్, సలహ్‌లలో భారతీయ జానపద నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, భారతీయ వంటకాలు, ఇస్లామిక్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు.

20. ప్రపంచంలో మొదటిసారిగా మెదడు మార్పిడిని ఇటీవల ఏ దేశ డాక్టర్లువిజయవంతంగా నిర్వహించారు?
1) కెనడా
2) ఇజ్రాయిల్
3) నెదర్లాండ్స్
4) ఇంగ్లాండ్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: లౌ గెహ్రిగ్ వ్యాధి వల్ల పక్షవాతం బారినపడిన రోగికి విజయవంతంగా మెదడు మార్పిడి చేశారు.

21. 2017లో టీ-20 అంధుల క్రికెట్ప్రపంచ కప్‌ను నిర్వహించనున్న దేశం ఏది?
1) న్యూజిలాండ్
2) పాకిస్థాన్
3) ఇండియా
4) బంగ్లాదేశ్

View Answer

స‌మాధానం: 3

22. ఇప్పటి వరకు ఎన్ని భారతీయ వస్తువులకు భౌగోళిక గుర్తింపు లభించింది?
1) 57
2) 99
3) 187
4) 272

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: కంట్రోలర్ జనరల్ ఆఫ్ పెటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్ ఇప్పటి వరకు 272 భారతీయ వస్తువులకు భౌగోళిక గుర్తింపు(GI) ఇచ్చింది.

23. ఇటీవల డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించిన డ్రోన్ ఏది?
1) రుస్తుమ్-2
2) రుద్ర-2
3) త్రినేత్ర-2
4) నరేంద్ర-2

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: మానవ రహిత యుద్ధ విమానం (డ్రోన్) రుస్తుమ్-2ను డీఆర్‌డీవోకు చెందిన ఏరోనాటిక్స్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ADE) అభివృద్ధి చేసింది. ఈ డ్రోన్ 10, 000-30,000 అడుగుల ఎత్తులో దాదాపు 48 గంటలు ఆగకుండా ప్రయాణించగలదు.

24. ఇటీవల ఏ దేశం అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానంలో సభ్యత్వం రద్దు చేసుకుంది?
1) ఇండియా
2) చైనా
3) కెనడా
4) రష్యా

View Answer
*_Bhaskar Valmiki_*
స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: రష్యా క్రిమియాను దురాక్రమణ ద్వారా ఉక్రెయిన్ నుంచి లాక్కుందని అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానంపేర్కొంది. ఈ నేపథ్యంలో రష్యా ICC నుంచి వైదొలగింది.

25. ప్రతిష్టాత్మక టాటా లిటరేచర్ పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) జావెద్ అక్తర్
2) గుల్జార్
3) ఇర్షద్ కమీల్
4) అమిత్ త్రివేది

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: Tata literature live poet laureate పురస్కారానికి ప్రముఖ సినీగేయ రచయిత, నిర్మాత అయిన గుల్జార్ ఎంపికయ్యారు.

26. ప్రపంచంలో ఉత్తమ ఎయిర్ లైన్స్ ఏది?
1) లుఫ్తాన్సా
2) ఎమిరెట్స్
3) ఖతార్ ఎయిర్‌లైన్స్
4) ఎయిర్ న్యూజిలాండ్

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: ఎయిర్ లైన్స్ రేటింగ్స్.కామ్ ఎయిర్ లైన్స్ ఎక్స్‌లెన్స్ పురస్కారాలను ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది. వరుసగా నాల్గోసారి కూడా ఎయిర్ న్యూజిలాండ్ ఉత్తమ ఎయిర్‌లైన్స్ పురస్కారానికి ఎంపికైంది. ఉత్తమ ప్రీమియం ఎకానమీ కేటగిరిలో కూడా ఎయిర్ న్యూజిలాండ్ తొలిస్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో ఆస్ట్రేలియన్ ఎయిర్‌లైన్స్ ఉంది.

27. ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) నవంబర్ మొదటి ఆదివారం
2) నవంబర్ మూడో ఆదివారం
3) నవంబర్ మూడో గురువారం
4) నవంబర్ చివరి గురువారం

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: యునెస్కో నవంబర్ మూడవ గురువారంను ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవంగా ప్రకటించింది.

28. ఇటీవల నాసా తరపున అంతరిక్షంలోకి వెళ్లిన వృద్ధ మహిళ ఆస్ట్రోనాట్ ఎవరు?
1) పిగ్గి విట్స్‌న్
2) సల్లీ రైడ్
3) మాసి జెమ్సిన్
4) ఎల్లెన్ ఓచా

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: 56 సంవత్సరాల పిగ్గి విట్స్‌న్ (Piggy whitson) అంతరిక్షంలోకి వెళ్లిన వృద్ధ మహిళ ఆస్ట్రోనాట్‌గా రికార్డు సృష్టించింది. ఆమె ఫిబ్రవరి 9, 2017న భూమి మీదకి తిరిగి వస్తుంది.

29. 3వ ప్రపంచ ఇంటరె ్నట్ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించారు?
1) న్యూఢిల్లీ
2) కజన్
3) వుజన్
4) టొరంటో

View Answer

స‌మాధానం: 3
*_Basu Valmiki_*
30. మార్కెట్ ఎకానమీ స్టేటస్ వల్ల కలిగే లాభాలు ఏవి?
1) వస్తువులను అధిక లాభాలకు అమ్మవచ్చు
2) వస్తువులను ఉత్పత్తి ధర వద్ద అమ్మవచ్చు
3) వస్తువుల అమ్మకంపై పన్నులు విధించవచ్చు
4) వస్తువుల దిగుమతులపై యాంటి డంపింగ్ డ్యూటీ విధించడం.

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: ప్రపంచ వ్యాపార సంస్థ(WTO) పమాణాల ప్రకారం చైనాకి ఇండియా మార్కెట్ ఎకానమీ స్టేటస్ ఇవ్వాలి. కానీ ఈ స్టేటస్ చైనాకు ఇవ్వలేదు. ఈ స్టేటస్ చైనాకు ఇచ్చిన ట్లైతే ఎగుమతి, దిగుమతుల మీద పన్ను విధించే అధికారం భారత్ కోల్పోతుంది. స్వదేశీ పరిశ్రమల మీద తీవ్రదెబ్బ పడుతుంది.

31. ఇటీవల ''smile campaign'' పారంభించిన బ్యాంక్ ఏది?
1) బ్యాంక్ ఆఫ్ బరోడా
2) ఇండియన్ బ్యాంక్
3) ఐసీఐసీఐ
4) బ్యాంక్ ఆఫ్ ఇండియా

View Answer

స‌మాధానం: 1

32. ప్రతిష్టాత్మక ‘‘సుమిత్రా చరత్ రామ్’’ జీవితకాల సాఫల్య పురస్కారం-2016నకు ఎంపికైంది ఎవరు?
1) శేఖర్ సేన్
2) సి. నారాయణ రెడ్డి
3) అద్దెపల్లి రామారావు
4) పండిత హరిప్రసాద్ చౌరాసియా

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: భారతీయ శాస్త్రీయ సంగీత అభివృద్ధికి పాటుపడిన పండిత హరిప్రసాద్ చౌరాసియా ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు. ఈ పురస్కారం కింద ఒక వెండి ఫలకం, శాలువ, జ్ఞాపికను ప్రదానం చేస్తారు.

33. 17వ వార్షిక లాటిన్ గ్రామీ పురస్కారాలలో ఉత్తమ ఆల్బమ్‌గా ఎంపికైన ఆల్బమ్ ఏది?
1) జేస్సి అండ్ జోన్స్
2) యాండర్ దియాన్
3) లాస్ టైగర్ డెల్ నోర్తె
4) జువాన్ గేబ్రియల్

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: 17వ వార్షిక లాటిన్ గ్రామీ సంగీత పురస్కారాలల్లో 'Juan Gabriel' ఉత్తమ ఆల్బమ్‌గా ఎంపికైంది. ఉత్తమ సాంగ్ కేటగిరిలో ‘La Bicicleta’ పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ పాటను షకిరా, ఆండ్రేస్ క్యాస్టొ పాడారు.

34. Asia corporate excellence and sustainability పురస్కారానికి ఎంపికైన సంస్థ ఏది?
1) రిలయన్స్
2) టీసీఎస్
3) ఇన్ఫోసిస్
4) విప్రో

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: 3వ ఆసియా కార్పొరెట్ ఎక్స్లెన్స్ అండ్ సస్టేయిన్‌బుల్ పురస్కారానికి టీసీఎస్(TCS), వేదాంత సంస్థలు ఎంపికయ్యాయి. ఈ సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యత, పర్యావరణ సృహ, స్థిరమైన నాయకత్వం అందించడంలో తనదైన పాత్ర పోషించినందుకుగాను ఈ పురస్కారానికి ఎంపికయ్యాయి.

35. అంతర్జాతీయ బ్రూసెల్లొసిస్ సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) బెల్‌గ్రెడ్
2) బుడాపెస్ట్
3) వియన్నా
4) న్యూఢిల్లీ

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: ఈ సమావేశాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రిసెర్చ్ సహకారంతో న్యూఢిల్లీలో నిర్వహించారు. 26 దేశాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. బ్రుసెల్లొసిస్ అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి. ఇది బ్రూసెల్లా అనే బ్యాక్టిరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి ఆవులు, గెదెలు, మేకలు, గొర్రెలు, పందులు, కుక్కలు మొదలైన జంతువులకు సోకుతుంది. జంతువుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుంది. ‘‘Brucella-Free Villages’’ అనే పెలైట్ ప్రాజెక్టును దేశంలో 10 రాష్ట్రాల్లోని 50 గ్రామాలలో నిర్వహిస్తున్నారు.

36. గ్లోబల్ సిటిజన్ ఉత్సవాలు ఎక్కడ నిర్వహించారు?
1) ముంబయి
2) బుడాపెస్ట్
3) వియన్నా
4) కివ్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: గ్లోబల్ సిటిజన్ ఉత్సవాలునవంబర్ 19, 2016న ముంబయిలోనిర్వహించారు. ఇది ఛారిటీ కోసం ఏర్పాటు చేసిన సంగీత విభావరి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఉత్సవాలను ఉద్దేశించి ప్రసంగించారు.

37. ప్రపంచంలో తొలిసారి ఈ- కరెన్సీని విడుదల చేసిన దేశం ఏది?
1) పిన్లాండ్
2) నార్వే
3) స్వీడన్
4) బెల్జియం

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: ప్రపంచంలో అతిపురాతన కేంద్ర బ్యాంక్ ‘‘ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్’’.

38. భారతదేశం ఏ దేశం నుంచి అత్యధికంగా ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది?
1) సౌదీ అరేబియా
2) ఇరాన్
3) ఇరాక్
4) కువైట్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: ఇండియాప్రతి రోజు ఇరాన్ నుంచి 7,59,700 బ్యారెళ్లు ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. సౌదీ అరేబియా నుంచి రోజుకు 7,17,000 బ్యారెళ్లు దిగుమతి చేసుకుంటుంది.
*_Bhaskar Valmiki_*
39. ప్రతిష్టాత్మక రోలెక్స్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) డా.మీరాకౌశాంబి
2) డా.సోనమ్ వాంగ్ చుక్
3) హాకిమ్ అబ్దుల్ ఆజింజ్
4) డా. చంద్రముఖి బసు

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: కరువు సమయంలో కృత్రిమ హిమానీనదాల నుంచి నీరు ప్రజలకు సరఫరా చేయడం కోసం డా.సోనమ్ వాంగ్ చుక్ చేస్తున్న పరిశోధనలకు గాను రోలెక్స్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ పురస్కారానికి ఎంపికయ్యాడు. ఈ పురస్కారం కింద 1,00,000 స్విస్ ఫ్రాంక్‌లు లభిస్తాయి.

40. జాతీయ సమగ్రత వారోత్సవాలు ఎప్పుడు నిర్వహిస్తారు?
1) నవంబర్ 1 నుంచి 7
2) నవంబర్ 8 నుంచి 14
3) నవంబర్ 14 నుంచి 20
4) నవంబర్ 19 నుంచి 25

View Answer

స‌మాధానం: 4

41. ప్రపంచ టాయిలెట్ల దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
1) నవంబర్ 5
2) నవంబర్ 12
3) నవంబర్ 19
4) నవంబర్ 21

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: ప్రజలలో పారిశుధ్యం మీద అవగాహన కల్పించటానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో 2.4 బిలియన్ ప్రజలకు మెరుగైన పారిశుధ్య సౌకర్యాలు లేవు. ప్రతి 10 మందిలో ఒకరు బహిరంగంగా మలవిసర్జన చేస్తున్నారు.

42. ప్రపంచ టెలివిజన్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) నవంబర్ 21
2) నవంబర్ 19
3) నవంబర్ 16
4) నవంబర్ 13

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: 1996లో ప్రపంచ టెలివిజన్ ఫోరమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సమాజంలో ఎదుర్కొంటున్న సవాళ్లకు టెలివిజన్ మెరుగైన సూచనలు ఇస్తూ, ప్రపంచ శాంతి స్థానంలో కృషి చేస్తుంది.

43. ఇటీవల ఇండియాను సందర్శించిన ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఎవరు?
1) షిరిన్ ఎబాది
2) రెవువెన్ రివ్లిన్
3) మహమ్మద్ అబ్బాస్
4) షిమన్ పిరిస్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: ఇజ్రాయిల్ నుంచి అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశం ఇండియా. ఇజ్రాయిల్ అధ్యక్షుడు రెవువెన్ రివ్లిన్ భారతదేశంతో వ్యవసాయ, తీవ్రవాద అణిచివేత మీద ఒప్పందం చేసుకున్నారు.

44. ప్రపంచంలో పొడవైన క్వాంటమ్ కమ్యూనికేషన్ వ్యవస్థను ప్రారంభించిన దేశం ఏది?
1) చైనా
2) కెనడా
3) ఆస్ట్రేలియా
4) బ్రెజిల్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: 712 కి.మీ.ల క్వాంటమ్ (అత్యంత సురక్షిత) టెలి కమ్యూనికేషన్ వ్యవస్థను చైనా ప్రారంభించింది. ఈ వ్యవస్థ నుంచి సమాచారం హ్యాక్ చేయడం అసాధ్యం.

45. తెలంగాణ ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను పోత్సహించడం కోసం ఏ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది?
1) HDFC
2) ICICI
3) IDFC
4) Axis bank

View Answer

స‌మాధానం: 3

46. దేశంలో అతి ఎక్కువ ఔషధాలను తయారు చేస్తున్న రాష్ట్రం ఏది?
1) హిమాచల్ ప్రదేశ్
2) హర్యానా
3) పంజాబ్
4) మహారాష్ట్ర

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ఆసియాకు ఔషధాల హబ్‌గా హిమాచల్‌ప్రదేశ్ అవతరించింది. ఆసియా ఖండ ఔషధ అవసరాలలో 35 శాతం హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎగుమతి అవుతున్నాయి.

47. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మదర్ థెరిసా పురస్కారానికి ఎంపికైనది ఎవరు?
1) థాబో ఎంబేకి
2) షేక్ అబ్దులాబిన్ జయాద్
3) వంగరి మథాయి
4) నయిఫ్ బిన్ అబ్దుల్ అజీజ్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: ముంబయికి చెందిన హర్మిని ఫౌండేషన్ ప్రదానం చేసే మదర్ థెరిసా పురస్కారానికి యూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రి షేక్ అబ్దులాబిన్ జయద్ ఆల్ నయాన్ఎంపికయ్యాడు. యువతను తీవ్రవాదం వైపు వెళ్లనీయకుండా, అలాగే మధ్యాసియాలో శాంతి స్థాపనకు కృషి చేసినందుకుగాను ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు.

48. డా. నాగేంద్రసింగ్ అంతర్జాతీయ శాంతి పురస్కారానికి ఎంపికైంది ఎవరు?
1) శ్రీ రవిశంకర్
2) బాబా రామ్‌దేవ్
3) దాది జానకి
4) మాత అమృతనందమయి

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: అంతర్జాతీయ న్యాయస్థానంలో తొలి భారతీయ న్యాయమూర్తి నాగేంద్రసింగ్. ఈమన గౌరవార్థం 2014లో ఇంటర్నేషనల్ గుడ్‌విల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ పురస్కారాన్ని ప్రారంభించింది.

49. ఢిల్లీ హాఫ్ మారథాన్- 2016 విజేత ఎవరు?
1) జి. లక్ష్మణన్
2) మహమ్మద్ యూసఫ్
3) మాన్ సింగ్
4) ఎలిదే కిపొచోగే

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: కెన్యాకు చెందిన ఎలిదే కిపొచొగే (Eliud kipchoge) ఢిల్లీ హాఫ్ మారథాన్‌ను 59 నిమిషాల 44 సెకన్లలో పూర్తి చేశాడు. 27,000 అమెరికన్ డాలర్లు నగదును బహుమతిగా అందుకున్నాడు.

50. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ విజేత ఎవరు?
1) పి.వి. సింధు
2) సన్ యు
3) చాంగ్ యెనా
4) లీ సొహి

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: చైనాకు చెందిన సన్‌యును ఓడించి పి.వి. సింధు సూపర్ సిరీస్ టైటిల్‌ను గెలుచుకుంది. చైనా ఓపెన్ సిరీస్‌ను గెలుచుకున్న రెండవ మహిళ పి.వి. సింధు. మొదట మహిళ సైనా నెహ్వాల్.

రకరకాల అధ్యయన శాస్త్రాలు

           రకరకాల అధ్యయన శాస్త్రాలు

» జన్యువులు - జెనెటిక్స్
» వైరస్‌లు - వైరాలజీ
» బ్యాక్టీరియా - బ్యాక్టీరియాలజీ
» జంతువులు, మానవుల స్వభావం - సైకాలజీ
» భూకంపాలు - సిస్మోలజీ
» పర్వతాలు - ఓరాలజీ
» సమాజం - సోషియాలజీ

» బోధనా పద్ధతులు - పెడగాగి
» షెల్స్ - కాంకోలజీ
» ఎముకలు - ఆర్థోపెడిక్స్

» చేపలు - ఇక్తియాలజీ
» జంతువుల వైఖరి - ఎథోలజీ
» లోహాల శాస్త్ర, సాంకేతికత - మెటలర్జి
» రాసిన రికార్డులు - ఫిలాలజీ
» వృక్షాలు, జంతువుల చుట్టూ వుండే పరిసరాలతో గల సంబంధం - ఎకాలజీ
» నిఘంటువులు - లెక్సికోగ్రఫి
» గర్భధారణ, ప్రసవం - అబ్‌స్టేట్రిక్స్
» తూనికలు, కొలతలు - మెట్రోలజీ
» కాంతి, దాని ధర్మాలు - ఆప్టిక్స్
» ఎముకలు - ఓస్టియోలజీ
» కణతులు - అంకాలజీ
» నరాలు - న్యూరాలజీ
» వృద్ధాప్యం, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు - జెరంటాలజీ
» ధ్వని - అకౌస్టిక్స్
» గుండె, దానికి వచ్చే వ్యాధులు - కార్డియాలజీ
» వర్షపాతం - హైటోలజీ
» పని, పనిచేసే పరిస్థితులు - ఎర్గొనొమిక్స్
» మొక్కలు, జంతువులు, మానవ దేహ నిర్మితి - అనాటమి
» కాలం - హొరాలజీ
» భూగర్భ జలం - హైడ్రాలజీ
» తవ్వకాల ద్వారా చారిత్రక ఆధారాలు - ఆర్కియాలజీ
» కాలేయం, దాని విధులు, నిర్మాణం - హెప్తాలజీ
» నాణేలు - న్యూమిస్‌మ్యాటిక్స్
» రక్తం, దానికి సంబంధించిన వ్యాధులు - హెమటాలజీ

» కణజాలాలు (టిష్యూలు) - హిస్టాలజీ
» కణజాలాలు (టిష్యూలు) - హిస్టాలజీ
» పదాల పుట్టుక, పూర్వోత్తరాలు - ఎటిమాలజీ
» వేలిముద్రలు - డాక్టిలోలజీ
» గుహలు - స్పెలియాలజీ
» భాషా ఉచ్ఛారణ - ఫొనెటిక్స్
» చారిత్రక వరుస క్రమాలు - క్రొనాలజీ
» ఫంగస్, శిలీంధ్ర వ్యాధులు - మైకాలజీ
» మానవ అందం - కాలోలజీ
» నీటి క్షీరదాలు - సిటోలజీ
» వ్యాధులు - పాథాలజీ
» సంఖ్యలు - న్యూమరాలజీ

» మొక్కలు - బోటనీ

» గడ్డి - అగ్ర

విస్తీర్ణంలో పెద్ద రాష్ట్రాలు

        విస్తీర్ణంలో పెద్ద రాష్ట్రాలు


రాష్ట్రం                       విస్తీర్ణం(చ.కి.మీ)

1.రాజస్తాన్                 342,239

2.మధ్య ప్రదేశ్             308,245

3.మహారాష్ట్ర              307,713

4.ఉత్తర ప్రదేశ్              240,928

5.జమ్మూ కాశ్మీర్           222,236

6.గుజరాత్                  196,024

7.కర్ణాటక                     191,791

8.ఆంధ్రప్రదేశ్                160,205

9.ఒడిషా                      155,707

10.చత్తీస్ ఘడ్             135,191

11.తమిళనాడు            130,058

12.తెలంగాణా              114,840

Wednesday, January 25, 2017

Dance - State

*Dance - State*

1. Bharatanatyam ---Tamil Nadu
2. Bihu ---Assam
3. Bhangra ---Punjab
4.Chhau--- Bihar, Orissa, W. Bengal and Jharkhand
5.Garhwali ---Uttaranchal
6.Garba ---Gujarat
7. Hattari ---Karnataka
8.Kathak--- North India
9. Kathakali ---Kerala
10.Kutchipudi ---Andhra Pradesh
11. Khantumm ---Mizoram
12.Karma ---Madhya Pradesh
13. Laho ---Meghalaya
14. Mohiniattam ---Kerala
15.Mando ---Goa
16.Manipuri ---Manipur
17.Nati ---Himachal Pradesh
18. Nat-Natin ---Bihar
19. Odissi ---Orissa
20. Rauf ---Jammu &Kashmir
21. Yakshagan ---Karnataka.

Tuesday, January 24, 2017

62వ ఫిలింఫేర్ అవార్డ్స్

*ఉత్తమ నటుడు ఆమిర్.. ఉత్తమ నటి ఆలియా భట్*

ముంబై: 62వ ఫిలింఫేర్ అవార్డ్స్ కార్యక్రమం శనివారం ముంబైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 2016లో విడుదలయి ప్రేక్షకుల మన్ననలు పొందిన సినిమాలకు, నటులకు అవార్డులు వరించాయి. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులంతా పాల్గొని ఎంజాయ్ చేశారు. సరదా సరదాగా సాగిన ఈ కార్యక్రమానికి షారుఖ్ ఖాన్, కరణ్ జొహర్, కపిల్ శర్మల హోస్టింగ్ బాధ్యతలు నిర్వర్తించగా, నటీనటులు లైవ్ పర్‌ఫార్మెన్స్‌లు ఈ వేడుకని మరింత అందాన్ని తీసుకువచ్చాయి.

అవార్డు విన్నర్స్:

 బెస్ట్ ఫిలిం : దంగల్

బెస్ట్ యాక్టర్ ( మేల్ ) : అమీర్ ఖాన్ - దంగల్

బెస్ట్ యాక్టర్ ( ఫీమేల్ ) : ఆలియా భట్ - ఉడ్తా పంజాబ్

బెస్ట్ డైరెక్టర్ : నితీష్ తివారి - దంగల్

బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ : అశ్విని అయ్యర్ తివారి - నిల్ బట్టె సన్నట

బెస్ట్ మేల్ డెబ్యూ : దిల్జిత్ దోసంజ్ - ఉడ్తా పంజాబ్

బెస్ట్ ఫీమేల్ డెబ్యూ : రితిక సింగ్ - సాలా ఖడూస్

ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిలిం : నీర్జ

ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ ( మేల్) : షాహీద్ కపూర్ - ఉడ్తా పంజాబ్

మనోజ్ బాజ్‌పాయ్ - అలీఘర్

ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ ( ఫీమేల్) : సోనమ్ కపూర్ - నీర్జ

బెస్ట్ మేల్ యాక్టర్ ఇన్ షార్ట్ ఫిలిం : మనోజ్ బాజ్‌పాయ్ - తాండవ్

బెస్ట్ ఫీమేల్ యాక్టర్ ఇన్ షార్ట్ ఫిలిం : టిస్కా చోప్రా - చట్నీ

బెస్ట్ షార్ట్ ఫిలిం పీపుల్స్ ఛాయిస్ : ఖమఖ

బెస్ట్ షార్ట్ ఫిలిం ( ఫిక్షన్ ): చట్నీ

బెస్ట్ షార్ట్ ఫిలిం ( ఫిక్షన్ ) : మతితలి కుస్తీ

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (మేల్) : రిషీ కపూర్ - కపూర్ అండ్ సన్స్

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (ఫీమేల్) : శబానా అజ్మీ - నీర్జ

బెస్ట్ మ్యూజిక్ ఆల్బం: ప్రీతమ్ - యే దిల్ హై ముష్కిల్

బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ( మేల్ ) : అరిజిత్ సింగ్ - యే దిల్ హై ముష్కిల్ ( యే దిల్ హై ముష్కిల్ )

బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ( ఫీమేల్ ) : నేహా భాసిన్ - జగ్ ఘుమెయా ( సుల్తాన్ )

బెస్ట్ లిరికిస్ట్ : అమితాబ్ భట్టాచార్య - చన్నా మేరెయా ( యే దిల్ హై ముష్కిల్ )

బెస్ట్ డైలాగ్: రితేష్ షా - పింక్

ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ : శత్రుఘున్ సిన్హా

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ : రెడ్ చిల్లీస్ - ఫ్యాన్

బెస్ట్ ఎడిటింగ్ : మోనిషా బల్ద్వారా - నీర్జ

బెస్ట్ సౌండ్ డిజైన్ : వివేక్ సచ్చిదానంద - ఫోబియా

బెస్ట్ స్క్రీన్‌ప్లే : శకున్ బాత్రా, ఆయేశా దివిత్రే ధిల్లాన్ - కపూర్ అండ్ సన్స్

బెస్ట్ స్టోరీ : శకున్ బాత్రా, ఆయేశా దివిత్రే ధిల్లాన్ - కపూర్ అండ్ సన్స్

బెస్ట్ కాస్ట్యూమ్స్ : పాయల్ సలూజ - ఉడ్తా పంజాబ్

బెస్ట్ యాక్షన్ : శ్యామ్ కౌశల్ - దంగల్

బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ : సమీర్ ఉద్దిన్ - కపూర్ అండ్ సన్స్

బెస్ట్ కొరియోగ్రఫీ: ఆదిల్ శేఖ్ - కర్ గయీ చుల్ ( కపూర్ అండ్ సన్స్ )

ఫిలింఫేర్ ఆర్డీ బర్మన్ అవార్డ్ ఫర్ న్యూ మ్యూజిక్ టాలెంట్ : అమిత్ మిశ్రా - బుల్లెయా సాంగ్ ( యే దిల్ హై ముష్కిల్ )

బెస్ట్ సినిమాటోగ్రఫీ : మితేష్ మిర్చిందాని - నీర్జ

కేంద్ర ప్రభుత్వ పథకాలు

*కేంద్ర ప్రభుత్వ పథకాలు*


*స్వచ్ఛభారత్‌*
* ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని రాజ్‌పథ్‌ రోడ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2014 అక్టోబరు 2న ప్రారంభించారు.
* ‘స్వచ్ఛభారత్‌ దిశగా ముందడుగు’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
* గతంలో ఉన్న ‘నిర్మల్‌ భారత్‌ అభియాన్‌’ను ఈ పథకంలో విలీనం చేశారు.
* 2019 అక్టోబరు 2 నాటికి గాంధీజీ 150వ జయంతి వరకు పరిశుభ్ర భారతదేశాన్ని సాధించడం దీని ప్రధాన లక్ష్యం.
* స్వచ్ఛభారత్‌కు 2016-17 బడ్జెట్‌లో 11,300 కోట్ల నిధులను కేటాయించారు.
* స్వచ్ఛభారత్‌ లోగోగా మహాత్మాగాంధీ కళ్లద్దాలను రూపొందించారు. ఈ లోగోను మహారాష్ట్రకు చెందిన అనంత్‌ ఖసెబర్దార్‌ రూపొందించారు.
* స్వచ్ఛభారత్‌ అభియాన్‌కు నిధులు సమకూర్చడానికి సేవాపన్నుపై అదనంగా 0.5ు సెస్‌ను 2015 నవంబరు 15 నుంచి విధించారు.
* స్వచ్ఛభారత్‌ అభియాన్‌ కింద మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.12,000లను అందిస్తున్నారు.

*బేటీ బచావో బేటీ పడావో*
+ ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ 2015 జనవరి 22న హర్యానాలోని పానిపట్టులో ప్రారంభించారు.
+ స్త్రీ, పురుష నిష్పత్తి తక్కువగా ఉన్న 100 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలుచేస్తారు.
+ మహిళలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలపై వారికి అవగాహన కల్పించి వారి సామర్ధ్యాన్ని పెంచడం ఈ పథక ఉద్దేశం.

*హృదయ్‌*
HRIDAY (Heritage City Development and Augmentation Yojana)
* వారసత్వ నగరాలను సంరక్షించేందుకు ఈ పథకాన్ని 2015 జనవరి 21న ప్రారంభించారు.
* ఈ పథకం కింద తొలిదశలో 12 నగరాలను ఎంపిక చేశారు. అవి-
1) వారణాసి (ఉత్తరప్రదేశ్‌) 2) పూరి (ఒడిశా) 3) వరంగల్‌ (తెలంగాణ) 4) అమరావతి (ఆంధ్రప్రదేశ్‌) 5) అమృత్‌సర్‌ (పంజాబ్‌) 6) అజ్మీర్‌ (రాజస్థాన్‌) 7) గయ (బీహార్‌) 8) మధుర (ఉత్తరప్రదేశ్‌) 9) కాంచీపురం (తమిళనాడు) 10) వేలంగిణి (తమిళనాడు) 11) బాదామీ (కర్ణాటక) 12) ద్వారక (గుజరాత్‌)

*మిషన్‌ ఇంద్రధనుష్‌*
+ ఈ పథకాన్ని 2014 డిసెంబరు 25న ప్రారంభించారు.
+   ఏడు రకాల వ్యాధులకు సంబంధించిన టీకాలను పిల్లలకు వేయాలనే లక్ష్యంతో ఈ మిషన్‌ను ప్రారంభించారు. ఈ ఏడురకాల వ్యాధులు: 1) డిప్తీరియా 2) కోరింతదగ్గు 3) ధనుర్వాతం 4) పోలియో 5) క్షయ 6) తట్టు 7) హైపటైటిస్‌-బి

*ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన*
* ఒక దేశం - ఒక పథకం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
* రైతులకు సామాజిక భద్రత కల్పించడానికి ఈ నూతన పంటల బీమా పథకాన్ని రూపొందించారు.
* 2016 జనవరి 13 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది.
*   ఈ పథకం కింద ఖరీఫ్‌ పంటలు అయితే బీమా మొత్తంలో 2ు, రబీ పంటలైతే బీమా మొత్తంలో 1.5ు సొమ్మును రైతుల నుంచి ప్రీమియంగా వసూలు చేస్తారు. ఉద్యానవన పంటలైతే బీమా మొత్తంలో 5ు ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది.

*ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన*
+ పేదలకు ఇళ్లు నిర్మించేందుకు 2015 జూన్‌ 25న ప్రధాని ఆవాస్‌ యోజనను ప్రారంభించారు.
+   2022 సం.లోగా బలహీన వర్గాల వారికి పూర్తిస్థాయిలో గృహాలను నిర్మిస్తారు.
+ ఈ పథకం కింద పేదవారికి రెండు కోట్ల ఇళ్లను నిర్మిస్తారు.

*స్మార్ట్‌ సిటీ కార్యక్రమం*
*   2015 జూన్‌ 25న ప్రారంభించారు.
* దేశవ్యాప్తంగా వంద నగరాలను అభివృద్ధి చేయాలన్నది దీని లక్ష్యం.
*   98 స్మార్ట్‌ సిటీల జాబితాను 2015 ఆగస్టు 27న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.
*   అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 13 నగరాలను ఎంపిక చేశారు.
*   స్మార్ట్‌ సిటీలుగా తెలంగాణలో వరంగల్‌, కరీంనగర్‌ను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ, తిరుపతి, విశాఖపట్టణాన్ని ఎంపిక చేశారు.
*   తొలి విడతలో స్మార్ట్‌ సిటీలుగా 20 నగరాలను ఎంపిక చేశారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి విశాఖ, కాకినాడ ఎంపికయ్యాయి.
*   ఈ పథకం కింద ఎంపిక చేసిన నగరాల్లో అయిదు సంవత్సరాలపాటు ఏటా 200 కోట్లను కేటాయిస్తారు.
* ఈ కార్యక్రమంలో భాగంగా నీటిసరఫరా, విద్యుత్‌, పారిశుద్ధ్యం, గృహనిర్మాణం, ఐటి, ఈ-గవర్నెన్స్‌, సుస్థిర పర్యావరణం, ఆరోగ్యం, విద్య వసతులు కల్పిస్తారు.

*అమృత్‌*
*(AMRUT- Atal Mission for Rejuvenation and Urban Transformation)*
+   ఈ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ 2015 జూన్‌ 25న ప్రారంభించారు.
+   దేశవ్యాప్తంగా 500 పట్టణాల్లో అవస్థాపన సౌకర్యాలు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం.
+   2015-16లలో ఈ మిషన్‌ కింద 89 నగరాలను ఎంపిక చేశారు.

*ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన*
*   2015 మార్చి 20న ప్రారంభించారు.
*   ఈ పథకం కింద 24 లక్షల మందికి శిక్షణ ఇప్పించి పరిశ్రమల్లో ప్రమాణాలు ప్రాతిపదికగా స్కిల్‌ ట్రైనింగ్‌ ఇస్తారు.
*   ఈ పథకం కింద శిక్షకునికి రూ.8000 నగదు ఇస్తారు.
* యువతలో నైపుణ్యాలను పెంపొందించడం ఈ పథక ప్రధాన ఉద్దేశం.
*   ఈశాన్య ప్రాంత యువతకు శిక్షణ ఇచ్చేందుకు రూ.150 కోట్లను కేటాయించారు.
*   మొత్తానికి ఈ పథకానికి రూ.1,500 కోట్లు కేటాయించారు.

*దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన*
+   2014 నవంబరు 20న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
+   దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు.
+   గతంలో దీనిని గ్రామీణ విద్యుదీకరణ పథకంగా పిలిచేవారు.
+   ఈ పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ 2015 జూలై 15న పాట్నాలో ప్రారంభించారు.
+   వ్యవసాయ రంగానికి, గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయడం దీని ముఖ్య ఉద్దేశం.

*ప్రధానమంత్రి కృషి సంచాయ్‌ యోజన*
*   2015లో ఈ పథకాన్ని ప్రారంభించారు.
* వ్యవసాయరంగం, గ్రామాలకు నీటిపారుదల సౌకర్యం కల్పించే ఉద్దేశంతో దీనిని ప్రారంభించారు.
* ఈ పథకం కింద కేంద్ర- రాష్ట్రాలు భరించే వ్యయం 75:25.
*  ఈశాన్య రాష్ట్రాల్లో 90:10 నిష్పత్తిలో వర్తిస్తాయి.
* సేద్యపు నీటి వినియోగాన్ని, సామర్ధ్యాన్ని పెంపొందిస్తూ సూక్ష్మ సాగునీటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటారు.

*ప్రధానమంత్రి ఉజ్వల్‌ యోజన*
+ 2016 మే 1న ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో ప్రారంభించారు.
+   బిపిఎల్‌ కుటుంబాల్లోని మహిళలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు అందిస్తారు.
+ అయిదు కోట్ల కనెక్షన్లను మూడు సంవత్సరాల్లో అందిస్తారు.

*ప్రధానమంత్రి సురక్షబీమా యోజన*
* ఈ పథకాన్ని 2015లో ప్రారంభించారు.
* ఇది ప్రమాద బీమా పథకం.
*  దీనికోసం సంవత్సరానికి రూ.12 ప్రీమియం చెల్లించాలి.
* ఇది 18 - 70 సంవత్సరాల వయస్సు వారికి వర్తిస్తుంది.
*  ఈ పథకం కింద రెండు లక్షల రూపాయల బీమాను అందిస్తారు.
*  వైకల్యం ఏర్పడిన వారికి లక్ష రూపాయల బీమాను ఇస్తారు.

*ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన*
+  ఈ పథకం 2015 మే9న ప్రారంభించారు.
+ ఇది జీవితబీమా పథకం.
+ ఈ పథకం 18-50 సంవత్సరాల వయస్సు వారికి వర్తిస్తుంది.
+ ఈ పథకం కింద రెండు లక్షల రూపాయల బీమా సదుపాయాన్ని కల్పిస్తారు.
+ దీని ప్రీమియం సంవత్సరానికి రూ.330.

*అటల్‌ పెన్షన్‌ యోజన*
*   ఈ పథకాన్ని 2015 మే 9న ప్రారంభించారు.
*   ఈ పథకం కింద 60 సంవత్సరాల తరవాత రూ.1000 నుంచి రూ.5000 వరకు పెన్షన్‌ను అందిస్తారు.
* పథకంలో వయసును బట్టి ప్రీమియం ఉంటుంది.
* దీనికి 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు వారు అర్హులు.

*ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన పథకం*
+   ఈ పథకం నినాదం ‘సబ్‌ కా సాథ్‌ - సబ్‌ కా వికాస్‌’.
+ 2014 ఆగస్టు 28న దీనిని ప్రారంభించారు.
+ దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్‌ అకౌంట్‌ ఉండేవిధంగా చర్యలు తీసుకునేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు.
+ ప్రస్తుతం నగదు బదిలీ పథకాన్ని ఈ పథకానికి విస్తరింపచేశారు.
+ ఈ పథకం కింద అకౌంట్‌ కలిగిన వారికి రూ.30000 బీమా సౌకర్యం, రూ.ఒక లక్ష, ప్రమాదబీమా సౌకర్యం లభిస్తుంది.

*డిజిటల్‌ ఇండియా*
*   2015 జూలై 1న ప్రధాని ప్రారంభించారు.
* గ్రామీణ ప్రాంతాలను హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తూ డిజిటల్‌ లిటరసీని మెరుగుపర్చేందుకు ప్రారంభించారు.
* సేవలను డిజిటల్‌ రూపంలో అందించడం ఈ పథక ముఖ్య ఉద్దేశం.

*శ్యాంప్రసాద్‌ ముఖర్జీ జాతీయ రూర్బన్‌ మిషన్‌*
+   ఈ పథకాన్ని 2016 ఫిబ్రవరి 21న చత్తీస్‌గఢ్‌లోని కురుభాత్‌ అనే గ్రామంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.
+ పట్టణ ప్రాంత సౌకర్యాలను గ్రామాల్లో కల్పిస్తూ మూడు సంవత్సరాల కాలంలో 300 స్మార్ట్‌ విలేజ్‌లను అభివృద్ధి చేస్తారు.
+ దేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలను అభివృద్ధి పరుస్తూ దేశాభివృద్ధికి తోడ్పడుతూ సమతౌల్య అభివృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
+గ్రామీణ ప్రాంతాలను బలోపేతం చేస్తూ, పట్టణ ప్రాంతాలపై ఉన్న భారాన్ని తగ్గిస్తారు.

*స్టాండప్‌ ఇండియా*
* ఈ పథకాన్ని 2016 ఏప్రిల్‌ 5న ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ప్రారంభించారు.
* ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఈ పథకం కింద రూ.10 లక్షల నుంచి ఒక కోటి వరకు రుణం మంజూరు చేస్తారు.

*స్టార్ట్‌ప్ ఇండియా*
+ 2016 జనవరి 16న ప్రారంభించారు.
+ కొత్త కంపెనీలను, వెంచర్లను ఉద్యోగాల కల్పన దిశగా ప్రోత్సహించడం ఈ పథక ఉద్దేశం.
+ రూ.25 కోట్ల లోపు వార్షిక టర్నోవర్‌ కలిగిన భారత సంస్థలకు ఈ పథకం కింద ప్రోత్సాహకాలు అందిస్తారు.
*ప్రధానమంత్రి ముద్రా యోజన*
*  ఈ పథకాన్ని 2015 ఏప్రిల్‌ 8న ప్రారంభించారు.
* చిన్న వ్యాపారులు, స్వయం సహాయక బృందాల కు, స్వయంఉపాధి పొందేవారికి చేయూతనివ్వ డానికి ఈ పథకాన్ని ప్రారంభించారు.
*   ఈ పథకం కింద రూ.10లక్షల వరకు రుణాన్ని అందిస్తారు.
*   ఈ పథకం కింద మూడు రకాలుగా రుణాన్ని మంజూరుచేస్తారు.
1) శిశు(రూ.50,000ల వరకు రుణాన్ని అంది స్తారు.
2) కిశోర్‌(రూ.50,00ల నుంచి అయిదు లక్షల వరకు రుణం)
3) తరుణ్‌(అయిదు లక్షల నుంచి పది లక్షల వరకు రుణం)
* ఈ పథకం కింద కేటాయించే నిధుల్లో సుమారు 60ు శిశు రుణాల కింద ఇవ్వడం జరుగుతుంది.
*సుకన్య సమృద్ధి యోజన*
+ ఈ పథకాన్ని 2015 జనవరి 22న హర్యానాలోని పానిపట్‌లో ప్రారంభించారు.
+ ఈ పథకం ఆడ పిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించి ప్రారంభించారు.
+ ఈ పథకం కింద బాలిక పేర పది సంవత్సరాల లోపు వారికి ఖాతాను ప్రారంభించాలి.
ఈ ఖాతా పోస్టాఫీసు లేదా బ్యాంకులో గాని నిర్వహించవచ్చు.
+ఖాతా రూ.1000లతో తెరిచి తరవాత నెలకు ఎంత మొత్తమైనా జమ చేయవచ్చు. కానీ, సంవత్సరానికి కనీసం రూ.1000లు ఖాతాలో జమ చేయాలి.
+ ఖాతా తెరిచిన నాటి నుంచి బాలిక వయస్సు 21 సంవత్సరాలు చేరినప్పటికి ఈ పథకం ముగు స్తుంది. పథకం కింద 14 సంవత్సరాల వరకు డబ్బును జమ చేయాలి.
+ 18 సంవత్సరాల తరవాత విద్య కోసం సగం నగదు తీసుకోవచ్చు.
+ 2016-17లో దీని వడ్డీరేటు 8.6% నిర్ణయించారు.
మేక్‌ ఇన్‌ ఇండియా
* 2014 సెప్టెంబరు 25న న్యూఢిల్లీలో ప్రధాని ప్రారంభించారు.

*   ఈ కార్యక్రమం లక్ష్యాలు
1) విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం.
2) తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడం.
3) సంపూర్ణ ఉద్యోగిత కల్పించడం.
4) 25 రంగాల్లో ఉపాధి కల్పన, నైపుణ్య పెంపుదల.
5) సాంకేతికతను పెంపొందించడం.
6) ఎగుమతులకు వీలు కల్పించడం.
7) ప్రభుత్వ ఆదాయ స్థాయిని పెంచడం.
8) పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడటం.
9) సరళీకరణ విధానాల ద్వారా పెట్టుబడులకు ప్రోత్సాహం.