Thursday, January 26, 2017

Science tips

జనరల్‌ స్టడీస్‌లో భాగమైన సైన్సులోని అంశాలను వీలైనన్ని ఎక్కువసార్లు పునశ్చరణ చేస్తే మరిచిపోకుండా ఉంటారు. ఇలా చేసేటప్పుడు కఠినంగా భావిస్తున్నవాటి/ తరచుగా మరిచిపోతున్న వాటికింద ఒక గీతను గీయండి. లేదా విడిగా కాగితంపై రాసుకోండి. పునశ్చరణ చేసేటప్పుడు వీటిని మాత్రమే చదవండి.
భౌతిక, రసాయన, జీవశాస్త్రాల్లో ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టి చదివితేవీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షల్లో అధిక మార్కుల స్కోరుకు ఆస్కారం ఉంటుంది. ఈ సందర్భంలో పాటించాల్సింది- కొత్త అంశాలను అస్సలు చదవకూడదనేది.
భౌతికశాస్త్రం
దీనిలో సబ్జెక్టు సంబంధిత వాటికంటే అనువర్తనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నిత్యజీవితంలో భౌతికశాస్త్రం, పరికరాలు వాటి ఉపయోగాలు, మూలసూత్రాలపై శ్రద్ధపెట్టాలి. చదల్సిన ముఖ్యమైన అంశాలు:
* న్యూటన్‌ గమననియమాలు, పాస్కల్‌ సూత్రం, ఆర్కిమెడిస్‌ సూత్రం, బెర్నౌలి సూత్రం *కాంతి: దర్పణాలు, కటకాలు వీటి రకాలు, ఉపయోగాలు, దీర్ఘదృష్టి, హ్రస్వదృష్టి వంటి దృష్టిలోపాలు
* మన విశ్వం: గ్రహాల గురించిన సమాచారం
* ధ్వని: ధ్వని పరావర్తనం, అతిధ్వనులు, ధ్వనివేగం
* కాంతి పరావర్తనం, వక్రీభవనం, విక్షేపణం, ఉదాహరణలు, కలిగే ప్రభావాలు
* పారా, డయా, ఫెర్రో అయస్కాంత పదార్థాలు
* ఇంధనవనరులు రకాలు- పునరుద్ధరణ జరిగే ఇంధనవనరులు, పునరుద్ధరణ జరగని ఇంధన వనరులు, పెట్రోలియం శుద్ధి, సౌరశక్తి, బయోమాస్‌ శక్తి, పవనశక్తి.
గమనిక: ఇంధన వనరులు అనే అంశం భౌతిక, రసాయన, జీవశాస్త్రాల్లో, కరెంట్‌ ఎఫైర్స్‌లో ఉంది. దీన్ని తప్పనిసరిగా చదవాలి; ఎక్కువసార్లు పునశ్చరణ చెయ్యాలి.
రసాయనశాస్త్రం
రసాయనిక నియమాలు, రసాయనాల ఉపయోగాలు, రసాయనాల సాధారణ నామాలపై ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వీటిని ముఖ్యమైనవిగా భావించవచ్చు:
* పరిశ్రమల్లో వివిధ వస్తువుల తయారీ, పద్ధతులు
* కార్బోహైడ్రేట్లు- రకాలు, వీటి ఉదాహరణలు, చక్కెర, ఆల్కహాల్‌ తయారీ
* కొవ్వుల ఉపయోగం, సబ్బు, డాల్డా తయారీ
* మూలకాల లాటిన్‌ నామాలు
* ఆమ్లాలు, క్షారాలు, వాటి లక్షణాలు, రకాలు
* ద్రావణాలు, కర్బన రూపాంతరాలు
* భౌతిక మార్పులు, రసాయన మార్పులు
* రసాయనిక చర్యలలో సంయోగం, వియోగం, స్థానభ్రంశం
* రసాయన సంయోగ నియమాలు, వీటి ప్రాధాన్యం
జీవశాస్త్రం
దీనిలో గ్రామీణ ప్రాంత సమస్యలు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, వ్యాధులు, పోషకాహార లోపం, వ్యాధులు వ్యాపించే విధానం ప్రాధాన్యం ఉన్న అంశాలు. జనరల్‌ స్టడీస్‌లో 50 శాతం ప్రశ్నలు గ్రామీణ ప్రాంతాల అవగాహనపై ఉంటాయని సిలబస్‌లో పేర్కొన్నారని తెలిసిందే. అందుకే వీటిని వీలైనన్నిసార్లు పునశ్చరణ చేయాలి. జీవశాస్త్రంలో కింది అంశాలు ముఖ్యమైనవిగా భావించవచ్చు:
* హార్మోనులు- వీటిలోపం వల్ల కలిగే వ్యాధులు
* మెదడులోని భాగాలు, అవి నియంత్రించే పనులు
* పోషక పదార్ధాలు- మన శరీరానికి కలిగే ఉపయోగం, వీటిలోపం వల్ల కలిగే వ్యాధులు
* ఎయిడ్స్‌ వ్యాధి, నివారణ
* విటమిన్ల లోపం వల్ల కలిగే వ్యాధులు
* మొక్కల, జంతువుల వర్గీకరణం
* పశుసంవర్ధనం- జంతువుల్లో కలిగే వ్యాధులు
* మానవునికి బాక్టీరియా, వైరస్‌, ప్రోటోజోవాలవల్ల కలిగే వ్యాధులు. (బాక్టీరియా, వైరస్‌ల వల్ల కలిగే వ్యాధుల పేర్లు, బాక్టీరియా, వైరస్‌ల పేర్లు దాదాపుగా ఒకేరకంగా ఉంటాయి. వీటిలో 1 లేదా 2 వేరుగా ఉన్నవాటిని గుర్తించి వాటిని మాత్రమే పునశ్చరణ చెయ్యాలి).
* పర్యావరణం- కాలుష్యం.
* రక్తప్రసరణం, రక్తవర్గాలు, రక్తంలోని అంశాలు
* మానవ ఆరోగ్యం గమనిక: ఆరోగ్యం అనే అంశం జీవశాస్త్రంలో 3 సార్లు, కరెంట్‌ ఎఫైర్స్‌లో 2 సార్లు సిలబస్‌లో ఇచ్చారు. దీని ప్రాధాన్యం దృష్ట్యా సంబంధిత అంశాలన్నిటినీ వీలైనన్ని ఎక్కువసార్లు చదవాలి.
ఈవిధంగా ముఖ్యమైనవాటిని/ ఈ అంశాల నుంచి అడగవచ్చు అని భావించేవాటిని ఎక్కువగా పునశ్చరణ చేయాలి. చివరగా నమూనా పేపర్లు సాధన చెయ్యండి. సాధన చేసే సమయంలో రాని ప్రశ్నల గురించి బెంగపడకూడదు.

No comments:

Post a Comment