శివాజీ పాలన
శివాజీ ప్రత్యక్ష అజమాయిషీలో ఉన్న ప్రాంతాన్ని స్వరాజ్ అని పిలిచారు. అతని ప్రభావమున్న ప్రాంతాల నుంచి చౌత్, సర్దేశ్ముఖి పన్నులు వసూలు చేశారు.
చౌత్ పన్ను శివాజీ ఇతర గ్రామాలపై దాడి చేయకుండా విధించేవాడు. ఇది 1/4వ వంతు ఉండేది. దీన్ని ఖండేశ్వర్ అనే అధికారి వసూలు చేసేవాడు. సర్దేశ్ముఖి పన్నును ఇతరులు గ్రామాలపై దాడి చేయకుండా రక్షణ కల్పించినందుకు విధించేవాడు.
ఇది 1/10వ వంతు ఉండేది. దీన్ని గుమస్తా వసూలు చేస్తాడు.
పర్షియా స్థానంలో మరాఠీని అధికార భాషగా ప్రవేశపెట్టాడు.
శివాజీ ఆదేశంతో పండిట్ హనుమంత్ మరాఠీ భాషలో రాజ్య వ్యవహార కోశం అనే పాలనా గ్రంథాన్ని తయారుచేశాడు.
పరిపాలనలో సహాయం చేసేందుకు ‘అష్ట ప్రధానులు’ అనే మంత్రిమండలిని నియమించుకున్నాడు. వారు..
1. పీష్వా ప్రధానమంత్రి
2. అమాత్య ఆర్థికమంత్రి(మజుందార్)
3. మంత్రి (వాఖియనావిస్) హోంమంత్రి, స్వదేశీ వ్యవహారాలు
4. సచివ (సుర్నవిష్) ఉత్తర ప్రత్యుత్తరాలు
5. సుమంత్ (దాబీర్) విదేశీ వ్యవహారాలు
6. సేనాపతి సైనిక మంత్రి (సార్-ఇ-నేబత్)
7. పండిత్ రావ్ (సదర్) మతాధిపతి
8. న్యాయాధీశ్ న్యాయశాఖ
పీష్వా, మంత్రి, సచివలు ప్రాంతీయ పాలనా వ్యవహారాలను కూడా చూసేవారు. పండిత్రావు, న్యాయాధీశ్ మినహా మిగిలిన వారంతా యుద్ధాల్లో పాల్గొనాల్సివచ్చేది.
మంత్రులకు సహాయం చేసేందుకు దివాన్, మజుందార్, ఫడ్నవీస్, దఫ్తర్, దర్, కర్కానిస్, చిట్నీ, జామ్దార్, పాట్నీస్ వంటి అధికారులు ఉండేవారు.
గ్రామాల్లో పాలనా వ్యవహారాలను పటేల్ నిర్వహించేవాడు.
జాగీర్దారీ విధానం, వంశపారంపర్య హక్కులను శివాజీ రద్దు చేసి ఉద్యోగులకు జీతాలిచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు.
శివాజీ ముఖ్య నౌకాదళ కేంద్రం ‘కొలాబా’. నౌకాదళ ప్రాముఖ్యాన్ని గుర్తించిన మొదటి మధ్యయుగ పాలకుడు శివాజీ అని చెప్పవచ్చు.
శివాజీ కాలంలో కళ్యాణ్, భివాండి తదితర ప్రాంతాలు ప్రముఖ నౌకానిర్మాణ కేంద్రాలుగా వెలుగొందాయి.......✍
No comments:
Post a Comment