Tuesday, January 24, 2017

జీవ ఇంధనాలు(ఎకో ఇంధనాలు)

*♻ఎకో ఇంధనాలు*జీవ ఇంధనాలు*_



🔷సజీవులు వివిధ జీవరసాయన ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేసే ఇంధనాలే జీవ ఇంధనాలు. దీనిలో బయోడీజిల్, బయో ఇథనాల్, బయోగ్యాస్, బయోమాస్ ఉన్నాయి.


_*బయోడీజిల్*_


🔷కొన్ని రకాల మొక్కల విత్తనాలలోని నూనెలను ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ ప్రక్రియకు లోను చేసినప్పుడు తయారయ్యే ఇంధనమే బయోడీజిల్.

🔷నూనెలలోని లిపిడ్, ఆల్కహాల్స్ కలిపి ఫాటీ ఆమ్ల ఎస్టర్లను తయారు చేస్తాయి.


🔷బయోడీజిల్ ఉత్పత్తికి ఉపయోగించే మొక్కలు.. జట్రోఫా కర్కస్ (అడవి ఆముదం), పోంగామియా పిన్నేటా (కానుగ).


🔷జట్రోఫా 40 శాతం ఆయిల్స్, పోంగామియాలో 30 శాతం ఆయిల్స్ ఉంటాయి. ఈ మొక్కలు నీటి ఎద్దడిని సమర్థవంతగా తట్టుకొని బీడు భూములలో కూడా పెరుగుతాయి.

🔷బయోడీజీల్‌ను ఉత్పత్తి చేసే గ్లియోకాల్డియం అనే శిలీంధ్రాన్ని మాంటానా స్టేట్ యూనివర్సిటీ వారు కనుగొన్నారు. దీన్నే *మైకోడీజిల్ అంటారు.*


🔷సోయాబీన్‌తో అమెరికా, రేప్‌సీడ్‌తో ఫ్రాన్స్, పామాయిల్ మొక్కతో మలేషియాలు బయోడీజిల్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి.

   _*బయో ఇథనాల్*_


🔷జీవుల్లో జరిగే రసాయన చర్యల ఫలితంగా ఉత్పత్తయ్యే ఇథనాల్‌ను బయో ఇథనాల్ అంటారు.


🔷ఈ ఇంధన ఉత్పత్తి అవాయు శ్వాసక్రియ (AEROBIC RESPIRATION) ద్వారా జరుగుతుంది.


🔷ఈ ప్రక్రియలో విరివిరిగా పాల్గొనే జీవి ఈస్ట్ (శిలీంధ్రం) ఇది పిండి పదార్థాలను కిణ్వనం చెందించి ఇథనాల్‌ను ఏర్పరస్తుంది.


🔷దేశంలో చెరుకు నుంచి, అమెరికాలో మొక్కజొన్న నుంచి బయో ఇథనాల్ తయారవుతుంది.



   _*బయోగ్యాస్*_


👉🏼దీనికి గల మరో పేరు గోబర్ గ్యాస్ లేదా మార్ష్ గ్యాస్.


🔷ఇది జీవుల నుంచి ఉత్పత్తి అయ్యే వాయువు.


🔷ఇది మిథనోకోకస్, మిథనోబాసిల్లస్ అనే సూక్ష్మజీవుల అవాయు శ్వాసక్రియ ద్వారా ఉత్పత్తి అవుతుంది.


🔷దీని తయారీలో పశువుల పెండ, ఆకులు, కొమ్మలు, ఇతర వ్యర్థ పదార్థాలను ఉపయోగిస్తారు.


🔷ఇందులో ప్రధాన వాయువులు.. మీథేన్ (CH4) 60-70%, కార్బన్ డై ఆక్సైడ్ (CO2) 30-40 %. వీటితోపాటు కొద్దిగా హైడ్రోజన్ సల్ఫైడ్ ఆవిరి, సిలోక్జేన్లు ఉంటాయి.

      _*బయోమాస్*_



🔷ఇది రాబోయే కాలంలో ముఖ్యమైన ఇంధన వనరు కానుంది.



🔷ఇది పునరుత్పాదకం. అంతటా అందుబాటులో ఉండటం, కార్బన్ తటస్థ స్థితిని కలిగి ఉండటం వంటి లక్షణాలను కలిగి ఉంది.


🔷దీన్ని వినియోగించి విద్యుత్‌ను తయారు చేయడానికి


🔷 ప్రభుత్వం బయోమాస్ పవర్ అండ్ కో జనరేషన్ ప్రోగ్రామ్‌ను చేపట్టింది. బయోమాస్ నుంచి వివిధ ఉత్పత్తులను ఉష్ణ రసాయనిక పద్ధతుల ద్వారా (THERMO CHEMICAL PROCESS FOR CONVERTION) ఉత్పత్తి చేస్తున్నారు. ఈ పద్ధతిలో *నాలుగు రకాలు ఉన్నాయి అవి..*


👉🏼దహనం (COMBUSTION): ఇది ఎక్కవగా ఉపయోగించే ప్రక్రియ.


👉🏼గ్యాసిఫికేషన్: ఘనరూప బయోమాస్‌ను వివిధ ఉష్ణ రసాయన చర్యల ద్వారా దహనం చెందే వాయుస్థితిలోకి మార్చడం. ఉదాహరణ: ప్రొడ్యూసర్ వాయువు ఉత్పత్తి.


👉🏼పైరోలసిస్: ఆక్సిజన్ రహిత పరిస్థితుల్లో అధిక ఉష్ణోగ్రత వద్ద సేంద్రియ పదార్థాలు ఉష్ణ రసాయన విచ్ఛిత్తికి లోనవుతుంది.


👉🏼కో జనరేషన్: వ్యర్థ పదార్థాల పిప్పి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రక్రియ. దీన్ని చెరుకు మిల్లుల్లో ఉపయోగిస్తారు.


_*హైడ్రోజన్ శక్తి (HYDROGEN ENERGY)*_


🔷ఇది 21వ శతాబ్దపు ఇంధనం.


🔷హైడ్రోజన్ భూమిపై సహజ వాయువుగా ఉనికిలో ఉండగా, ఎల్లప్పుడు ఇతర పదార్థాలతో కలిసి ఉంటుంది. ఉదా: హైడ్రోకార్బన్స్

🔷హైడ్రోకార్బన్ల నుంచి వేడిని ఉపయోగించి హైడ్రోజన్‌ను వేరుచేసే ప్రక్రియను రీఫార్మింగ్ అంటారు.


🔷విద్యుత్ ప్రవాహాన్ని వేడి నీటి నుంచి హైడ్రోజన్‌ను వేరుచేసే ప్రక్రియను ఎలక్ట్రోలైసిస్ అంటారు.


🔷ఫ్యూయల్ సెల్స్ హైడ్రోజన్‌ను ఆక్సిజన్‌తో సంయోగం చెందించి విద్యుత్‌ను, నీటిని, ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తారు.


_*భూగర్భోష్ణశక్తి (GEO- THERMAL ENERGY)*_


🔷వేడినీటి బుగ్గలు గల ప్రదేశంలో భూమి పొరలలో 100 నుంచి 2000 ఉష్ణోగ్రత ఉంటుంది. కావున ఆ పొరలలోకి ట్యూబ్‌ను పంపి నీటిని ఆవిరి రూపంలోకి మార్చి టర్బైన్లను తిప్పి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు.

🔷ప్రపంచంలో ఈ శక్తిని అధికంగా ఉత్పత్తి చేస్తున్న ప్రాంతం-కాలిఫోర్నియా (40 శాతం), ఇతర ప్రాంతాలు- హవాయి, మెక్సికో.


🔷దేశంలో భూగర్భోష్ణశక్తిని వెలికితీయనున్న ప్రాంతాలు.. పుగాలోయ- కశ్మీర్‌లోయ, సూరజ్‌ఖండ్- జమ్ముకశ్మీర్, అలకనంద- ఉత్తరాఖండ్, తపోవన్- ఉత్తరప్రదేశ్, మణికరణ్-హిమాచల్ ప్రదేశ్.

_*సముద్ర అలల శక్తి (TIDAL ENERGY)*_


🔷సముద్ర అలలకు మార్గమధ్యంలో విద్యుత్ టర్బైన్లను అమర్చినపుడు జనరేటర్లలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

🔷ఈ శక్తి ఉత్పత్తికి అవకాశం ఉన్న ప్రాంతాలు.. ట్యుటికోరన్- తమిళనాడు, విజింజం- కేరళ, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, లక్షదీవులు, సుందర్‌బన్ ప్రాంతం- పశ్చిమబెంగాల్.

No comments:

Post a Comment