Showing posts with label indian geography. Show all posts
Showing posts with label indian geography. Show all posts

Thursday, January 26, 2017

విస్తీర్ణంలో పెద్ద రాష్ట్రాలు

        విస్తీర్ణంలో పెద్ద రాష్ట్రాలు


రాష్ట్రం                       విస్తీర్ణం(చ.కి.మీ)

1.రాజస్తాన్                 342,239

2.మధ్య ప్రదేశ్             308,245

3.మహారాష్ట్ర              307,713

4.ఉత్తర ప్రదేశ్              240,928

5.జమ్మూ కాశ్మీర్           222,236

6.గుజరాత్                  196,024

7.కర్ణాటక                     191,791

8.ఆంధ్రప్రదేశ్                160,205

9.ఒడిషా                      155,707

10.చత్తీస్ ఘడ్             135,191

11.తమిళనాడు            130,058

12.తెలంగాణా              114,840

Sunday, January 22, 2017

కేంద్రపాలిత ప్రాంతంలు రాష్ట్రంలు సమాచరంం

1.అండమాన్‌ నికోబార్‌ దీవులు 

నవంబర్‌ 1న ఈ అండమాన్‌ నికోబార్‌ దీవులను కేంద్రపాలిత ప్రాంతంగా రూపొందించారు.
అండమాన్‌ నికోబార్‌
- అండమాన్‌ నికోబార్‌ దీవుల రాజధాని -పోర్ట్‌బ్లయర్‌
- అండమాన్‌ నికోబార్‌ దీవులు విస్తీర్ణంలో అతి పెద్దవి.
- అండమాన్‌ నికోబార్‌ దీవులు జనసాంద్రత తక్కువగా గల కేంద్రపాలిత ప్రాంతం.
- అండమాన్‌ నికోబార్‌ దీవులలో నికోబార్‌ దీవి అతి పెద్దది.
- 1966 నవంబర్‌1,చండిఘర్‌ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు.

2.చండిఘర్‌

- చండిఘర్‌ రాజధాని -చండీఘర్‌
- చండిఘర్‌ ప్రధాన భాషలు -హిందీ, పంజాబీ
- 1966 నవంబర్‌ 15న ఢిల్లీని కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు.

3.ఢిల్లీ

- భారతదేశ రాజధాని -ఢిల్లీ
- కేంద్రపాలిత ప్రాంతాల పాలకుడిని -లెప్టినెంట్‌ గవర్నర్‌ అని పిలుస్తారు
- శాసనసభను కలిగి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు- ఢిల్లీ, పాండిచ్చెరి
- ఢిల్లీ తొలి మహిళా ముఖ్య మంత్రి -సుష్మాస్వరాజ్‌
- జనసాంద్రత ఎక్కువ గల కేంద్రపాలిత ప్రాంతం -ఢిల్లీ
- వైశాల్యంలో 2వ పెద్ద కేంద్రపాలిత ప్రాంతం -ఢిల్లీ
- యమునా నది ఒడ్డున కలదు - న్యూఢిల్లీ
- హిందీ తర్వాత ఉర్దూ అధికార భాషగా ప్రకటించిన రాష్ట్రం -ఢిల్లీ
- నగర జనాభా ఎక్కువ గల కేంద్రపాలిత ప్రాంతం -ఢిల్లీ
- అధికార సర్టిఫికెట్లలో తల్లిపేరు తప్పనిసరిగా చేర్చాలని ఇటీవల నిర్ణయించింది -ఢిల్లీ ప్రభుత్వం

4.డయ్యూ, డామన్‌

- 1962 లో 12వ రాజ్యాంగ సవరణ ద్వారా డామన్‌ డయ్యూను గోవా నుంచి వేరు చేసి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు.

- డయ్యూ, డామన్‌ రాజధాని -డామన్‌
- డామన్‌ గుజరాత్‌ తీరం మీద ఉంది.
- స్త్రీలు తక్కువగా గల కేంద్రపాలిత ప్రాంతం-డామన్‌ డయ్యూ
- 1954లో ప్రాన్స్‌, భారతదేశాల మధ్య కుదిరిన ఒక ఒప్పందం ద్వారా ఇది భారత యూనియన్‌లో అంతర్భాగమైంది.

5.పుదుచ్ఛేరి

- పుదుచ్ఛేరి కేంద్రపాలిత ప్రాంతం భారత్‌కు దక్షిణాన ఉన్నది.
- పుదుచ్ఛేరి ప్రాచీన నామం -వలికొండాపురం
- పుదుచ్ఛేరిలోని నదులు -మహే, గౌతమి

6.లక్షదీవులు

- 1956లో కేంద్రపాలిత ప్రాంతంగా రూపొందించారు.
- 1973 లో ఈ కేంద్రపాలిత ప్రాంతాన్ని 'లక్షద్వీప్‌' గా మార్చారు.
- జనాభా తక్కువ గల యూ.టి. -లక్షద్వీప్‌
- వైశాల్యంలో చిన్న కేంద్రపాలిత ప్రాంతం -లక్షదీవులు
- లక్షదీవులలో అధికంగా మాట్లాడే భాష -మలయాళం
- స్త్రీ అక్షరాస్యత ఎక్కువగా గల కేంద్రపాలిత ప్రాంతం -లక్షదీవులు
- 1956 కంటే ముందు లక్షదీవులు మద్రాస్‌ రాష్ట్రంలో భాగంగా ఉండేది.
- 1961, ఆగస్టు 11న దీనిని కేంద్ర పాలిత ప్రాంతంగా రూపొందించారు.

7.దాద్రానగర్‌ హవేలి

- దాద్రానగర్‌ హవేలి రాజధాని - సిల్వస్సా
- దాద్రానగర్‌ హవేలిలో మాట్లాడే భాషలు-భిలి, భిలోడి, గుజరాతీ, హిందీ
- షెడ్యుల్‌ తెగలు ఎక్కువ గల యూ.టి. - దాద్రానగర్‌
- జనాభా వృద్ధి రేటు ఎక్కువ గల యూ.టి. - దాద్రానగర్‌

1: ఒడిషా

- ఒడిషా రాష్ట్ర రాజధాని - భువనేశ్వర్‌
- ఒడిషా రాష్ట్ర ఆవిర్భావం - ఆగస్టు 19, 1949
- ఒడిషాలో మాట్లాడే భాషలు -ఒడియా, సంధాలీ
- ఒడిషా రాష్ట్రంలో నివశించే గిరిజన తెగలు- కురుక్‌ బరయానులు, చెంచు
- హెచ్‌.ఐ.వి. వ్యాధి గ్రస్తులకు పింఛను సౌకర్యం కల్పించిన మొదటి రాష్ట్రం -ఒడిషా
- విద్యుత్‌ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించిన తొలి రాష్ట్రం-ఒడిషా
- ఒడిషా పాత పేరు - ఒరిస్సా
- ఒడిషా జానపద నృత్యాలు - బహుకవాట, దండవాటి

2.పంజాబ్‌

- పంజాబ్‌ రాష్ట్ర రాజధాని - ఛండీగర్‌
- పంజాబ్‌ రాష్ట్ర ముఖ్య భాష - పంజాబీ
- పంజాబ్‌లో ప్రధాన మతాలు -సిక్కు, హిందూ, క్రైస్తవ
- రాష్ట్రపతి పాలన విధించిన తొలి రాష్ట్రం -పంజాబ్‌
- పంజాబ్‌ని 'గ్రాసరీ ఆఫ్‌ ఇండియా'గా పిలుస్తారు.
- షెడ్యూల్‌ కులాల వారు ఎక్కువ గల రాష్ట్రం -పంజాబ్‌
- నీటి పారుదల సాంద్రత ఎక్కువగా గల రాష్ట్రం-పంజాబ్‌
- పంజాబ్‌ రాష్ట్రాన్ని 1966 నవంబర్‌లో పంజాబ్‌, చండీఘర్‌, హర్యానా రాష్ట్రాలుగా విభజించారు.

3.రాజస్థాన్‌

- రాజస్థాన్‌ రాష్ట్ర రాజధాని -జైపూర్‌
- రాజస్థాన్‌ ఏర్పడిన సంవత్సరం -నవంబర్‌1, 1956
- రాజస్థాన్‌లో మాట్లాడే భాషలు -హిందీ, రాజస్థానీ
- భారతదేశంలో విస్తీర్ణంలో అతి పెద్ద రాష్ట్రం - రాజస్థాన్‌
- భారత్‌లో తొలిసారిగా రైతులకు క్రెడిట్‌ కార్డులు యిచ్చిన రాష్ట్రం -రాజస్థాన్‌
- దేశంలోనే పెద్ద ఎడారి అయిన థార్‌ రాజస్థాన్‌లో ఉంది.
- పంచాయితీ రాజ్‌ విధానాన్ని అమలుపరిచిన తొలి రాష్ట్రం -రాజస్థాన్‌
- శాశ్వత లోక్‌ అదాలత్‌లను ఏర్పాటు చేసిన రాష్ట్రం -రాజస్థాన్‌
- దేశంలో వాటర్‌ యూనివర్సిటీని ఏరాష్ట్రంలో నెలకొల్పారు -రాజస్థాన్‌
- దేశంలోనే తక్కువ వర్షపాతం గల ప్రాంతం
-రాజస్థాన్‌ లోని జైనల్మేర్‌
- సరస్సుల నగరమైన ఉదరుపూర్‌ -రాజస్థాన్‌ రాష్ట్రంలోనిది
- దేశంలో వెండి ఉత్పత్తిలో ప్రథమస్థానంలో గల రాష్ట్రం -రాజస్థాన్‌

4.సిక్కిం

- సిక్కిం రాష్ట్ర రాజధాని -గ్యాంగ్‌టక్‌
-  సిక్కిం రాష్ట్ర ఆవిర్భావం -మే16,1975
- భారతదేశంలో జనాభా తక్కువ గల రాష్ట్రం -సిక్కిం
- సిక్కిం రాష్ట్ర వృక్షశాస్త్ర వేత్తల స్వర్గంగా పిలుస్తారు.
- సిక్కిం రాష్ట్ర భాషలు -లెప్పా, హిందీ, లింబు, ఛుటియా, నేపాలీ
- సిక్కింలో ప్రసిద్ధి చెందిన నాట్యాలు -భుటియాలు, నేపాలీలు
- యాలకుల ఉత్పత్తిలో సిక్కిం రాష్ట్రానిది ప్రథమ స్థానం

5.తమిళనాడు

- తమిళనాడు రాష్ట్ర రాజధాని -చైన్నె
- తమిళనాడు ఆవిర్భావ దినం -నవంబర్‌ 26, 1956
- తమిళనాడు ప్రధాన భాష - తమిళం
- మూడు సముద్రాల కలయిక గల తీరరేఖ కలిగిన రాష్ట్రం
తమిళనాడు
- తమిళనాడును 'ల్యాండ్‌ ఆఫ్‌ టెంపుల్‌ 'గా పిలుస్తారు.
- తమిళనాడు సిమెంటు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది.
- దేశంలోనే పొడవైన మెరీనా బీచ్‌ తమిళనాడు రాజధాని అయిన చెన్నైలో కలదు.
- తమిళనాడులో పెద్దనది -కావేరి
- భారత్‌లో ఎక్కువ తీర రేఖ కలిగిన నగరం -చెన్నై
- తోలు వస్తువుల తయారీలో ప్రథమస్థానం -తమిళనాడు
- భారతదేశంలో ప్రాచీన భాష హోదా పొందిన తొలి భాష -తమిళం

6.త్రిపుర 

- త్రిపుర రాష్ట్ర రాజధాని -అగర్తల
- త్రిపుర ఆవిర్భావ దినోత్సవం -జనవరి21,1972
- భారత్‌ లో విస్తీర్ణం దృష్ట్యా త్రిపుర 2 వ చిన్న రాష్ట్రం.
- 1956 లో త్రిపురను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు.
- 1972లో రాష్ట్ర హోదా ప్రకటించారు.
- త్రిపురలో గోమతి నది ప్రవహిస్తుంది.

7.ఉత్తరాఖండ్‌

- ఉత్తరాఖండ్‌ రాష్ట్ర రాజధాని -డెహ్రడూన్‌
- ఉత్తరాఖండ్‌ రాష్ట్ర అవతరణ -నవంబర్‌ 9, 2000
- ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌ నుండి విడిపోయి ఏర్పడిన రాష్ట్రం.
- ఉత్తరాంచల్‌కు మరో పేరు -ఉత్తరాఖండ్‌
- దేశంలో మొదటిసారి యోగా యూనివర్సిటి ఉత్తరాఖండ్‌ లోని హరిద్వార్‌లో నెలకొల్పారు.
-హరిద్వార్‌ను మాయపూరిగా పిలిచారు.

8ఉత్తర ప్రదేశ్‌

- ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని -లక్నో
- ఉత్తర ప్రదేశ్‌ను 'భారత దేశ పంచదార పాత్ర' అని కూడా పిలుస్తారు.
- భారత్‌ లో జనాభా ఎక్కువ గల రాష్ట్రం -ఉత్తర ప్రదేశ్‌
- ఉత్తరప్రదేశ్‌ ఎన్ని రాష్ట్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది -8
- ఉత్తరప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి -విజయలక్ష్మీ పండిట్‌
- గోవధ నిషేద చట్టం చేసిన తొలి రాష్ట్రం -ఉత్తర ప్రదేశ్‌
- గంగ, యమున, సరస్వతి త్రివేణి సంగమం ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ఉంది.
- గౌతమ బుద్ధుడు తొలి ఉపన్యాసం చేసిన ప్రదేశం-సారనాథ్‌
- పాడిపశువులు అధికంగా ఉన్న రాష్ట్రం -ఉత్తర ప్రదేశ్‌

9‬: జార్ఖండ్‌

- జార్ఖండ్‌ రాష్ట్రం యొక్క రాజధాని -రాంచి
- జార్ఖండ్‌ ఆవిర్భవించిన దినం -నవంబర్‌ 15, 2000
- తెలంగాణ కంటే ముందు ఏర్పడిన రాష్ట్రం - జార్ఖండ్‌
- జార్ఖండ్‌లో నివసిస్తున్న గిరిజన తెగలు -ముండా, బిరోర్‌, గోండులు, కురుక్‌ ఒరియానులు
- జార్ఖండ్‌లో స్థాపించిన ఉక్కు కర్మాగారం ఆసియా ఖండంలోనే అతి పెద్దది
- భారతదేశంలో ఏర్పడిన 28వ రాష్ట్రం - జార్ఖండ్‌
- జార్ఖండ్‌ను ఏ రాష్ట్రం నుంచి వేరు చేసారు? -బీహార్‌

10-కర్ణాటక

 కర్ణాటక రాష్ట్ర రాజధాని -బెంగుళూరు
- కర్ణాటక రాష్ట్రం ఏ సంవత్సరంలో ఏర్పడింది?
-నవంబర్‌1, 1956
- కర్ణాటక రాష్ట్రం భాషలు -కన్నడం, తెలుగు, ఉర్దూ, తమిళం, కొంకణి
- భారత్‌లో దక్కన్‌ పీఠభూమి మీద ఉన్న రాష్ట్రం -కర్ణాటక
- రాగి ఉత్పత్తిలో -కర్ణాటక రాష్ట్రం-2వ స్థానం
- యక్షగానానికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం -కర్ణాటక
- దేశంలోనే అత్యధిక గాలివీచే ప్రాంతం - కర్ణాటకలోని కసిత్‌హిత్‌ ప్రాంతం
- దేశంలో తొలిసారిగా వైర్‌లైెన్‌ ఇంటర్నెట్‌ కనెక్టివిటి పొందిన నగరం - కర్ణాటకలోని మైసూర్‌
దేశంలో కాఫీ పంటలో ప్రథమ స్థానం గల రాష్ట్రం - కర్ణాటక
- దేశంలో తొలిసారిగా కృత్రిమ వర్షాలు కురిపించిన రాష్ట్రం - కర్ణాటక
- బంగారం ఉత్పత్తిలో ప్రథమ స్థానం - కర్ణాటక రాష్ట్రం

11.కేరళ

- కేరళ రాష్ట్ర రాజధాని - తిరువనంతపురం
- కేరళ రాష్ట్ర ఏర్పాటు? - నవంబర్‌1,1956
- కేరళ రాష్ట్రంలో పుష్పజలాలున్నాయి
- అక్షరాస్యతలో ప్రథమస్థానం గల రాష్ట్రం - కేరళ
- కేరళ కథాకళి నృత్యానికి ప్రసిద్ధి.
- హోంగార్డ్స్‌ లేని ఏకైక రాష్ట్రం - కేరళ
- దేశంలో మొట్టమొదట రాష్ట్రమంతా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను ఉపయోగించిన రాష్ట్రం - కేరళ
- జనాభావృద్ధి రేటు తక్కువగా గల రాష్ట్రం - కేరళ
- దేశంలో అతి చిన్న జిల్లా - కేరళ రాష్ట్రంలోని మహీ
- దేశంలో 100% అక్షరాస్యత సాధించిన తొలి జిల్లా- ఎర్నాకుళం
- దేశంలో 100% వ -లిటరసి సాధించిన తొలి జిలా - మాలప్పురం
- దేశంలో తొలి అంతరిక్ష విశ్వవిద్యాలయం కేరళలో ఉంది.
- కేరళలో కలదు
- దేశంలో తొలి ఎలక్ట్రానిక్‌ కలెక్టరేట్‌గా పేరుగాంచిన జిల్లా -కేరళలోని పాలక్కడ్‌ జిల్లా
- క్రైస్తవులు ఎక్కువున్న రాష్ట్రం - కేరళ
- ప్రవాన భారతీయుల మంత్రిత్వ శాఖను ప్రారంభించిన తొలి రాష్ట్రం - కేరళ
- మహిళా పోలిస్‌స్టేషన్‌ ఏర్పాటు చేసిన రాష్ట్రం - కేరళ

-12.మధ్యప్రదేశ్‌

 మధ్యప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని - భోపాల్‌
- మధ్యప్రదేశ్‌ ఏర్పడిన సంవత్సరం - నవంబర్‌1, 1956
- మధ్యప్రదేశ్‌ ప్రధాన భాష -(హిందీ)
- మధ్యప్రదేశ్‌ రాష్ట్రాన్ని మినీ ఇండియాగా పిలిచేవారు.
- మధ్యప్రదేశ్‌ రాష్ట్రాన్ని పులుల రాష్ట్రంగా కూడా పిలుస్తారు.
- మానవాభివృద్ధి నివేదికను రూపొందించిన తొలి రాష్ట్రం-మధ్యప్రదేశ్‌
- భారత్‌ దేశంలో ఎక్కువ అడవులు గల రాష్ట్రం - మధ్యప్రదేశ్‌
- భారత్‌లోని అతి పెద్ద స్థూపం -మధ్యప్రదేశ్‌లో ఉంది
- మధ్య ప్రదేశ్‌ మాంగనీస్‌ ఉత్పత్తిలో ప్రథమస్థానం.
- స్కూల్స్‌, కాలేజీలలో సామూహిక సూర్య నమస్కారాలు, యోగా తప్పనిసరి చేసిన రాష్ట్రం - మధ్యప్రదేశ్‌
- స్థానిక సంస్థల ప్రతినిధులను రీకాల్‌ చేసే అధికారం ప్రజలకు ఇచ్చింది -మధ్యప్రదేశ్‌

13.మహారాష్ట్ర

- మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని - ముంబాయి
- మహారాష్ట్ర ఏర్పాటు -మే 1, 1960
- దేశంలో నగర జనాభా అత్యధికం గల రాష్ట్రం-మహారాష్ట్ర
- చిన్న ఓడరేవులు అధికం గల రాష్ట్రం - మహారాష్ట్ర
- భారతదేశంలో వైశాల్యంలో 3వ పెద్ద రాష్ట్రం -మహారాష్ట్ర
- మహారాష్ట్రలోని గిరిజన తెగలు - వర్లీలు
- జొన్న పంట ఉత్పత్తిలో ప్రథమ స్థానం గల రాష్ట్రం-మహారాష్ట్ర
- మహారాష్ట్ర రాష్ట్రం నుండి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న ప్రాంతం -విదర్భ
- ఎయిడ్స్‌ నియంత్రణ కోసం ఏ.వి.ఈ.ఆర్‌.టి. అనే ప్రాజెక్టును చేపట్టిన రాష్ట్రం -మహారాష్ట్ర
- భారతదేశంలో 'జీరో బెస్ట్‌' బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టిన తొలి రాష్ట్రం -మహారాష్ట్ర
- భారతీయ కరెన్సీ నోట్లు ముద్రించే స్థలం -నాసిక్‌
- భారత దేశ వాణిజ్య రాజధాని - ముంబయి

14.మణిపూర్‌

- మణిపూర్‌ రాష్ట్ర రాజధాని - ఇంఫాల్‌
- మణిపూర్‌ రాష్ట్ర ఏర్పాటు -జనవరి21, 1972
- వజ్రాల భూమిగా ప్రసిద్ధి చెందిన రాష్ట్రం -మణిపూర్‌
- మణిపూర్‌ని 'స్విట్జర్లాండ్‌ ఆఫ్‌ ఇండియా'గా పిలుస్తారు.
- సంగారు అనే జింకలు ఈ రాష్ట్రంలో ప్రసిద్ధి -మణిపూర్‌
- మణిపూర్‌ నాట్యం -మణిపురి

15.మేఘాలయ

- మేఘాలయ రాష్ట్ర రాజధాని- షిల్లాంగ్‌
- మేఘాలయను 'స్కాట్‌లాండ్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌' గా పిలుస్తారు.
- రైలు మార్గాలు లేని రాష్ట్రం-మేఘాలయ
- పురుషులతో పాటు స్త్రీలు కూడా మసీదులో ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతించిన తొలి రాష్ట్రం -మేఘాలయ
- దేశంలో ఎక్కువ వర్షపాతం కురిసే ప్రాంతం-మాసిన్‌రోం

16.మిజోరాం

- మిజోరాం రాష్ట్ర రాజధాని - ఐజ్వాల్‌
- మిజోరాం రాష్ట్ర ఆవిర్భావం - ఫిబ్రవరి 20, 1987
- మిజోరాం ప్రధాన భాష -మిజో
- భారతదేశంలో ఎక్కువ అడవులు గల రాష్ట్రం-మిజోరాం
- 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత

17. అరుణాచల్‌ ప్రదేశ్‌

- అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని -ఈటానగర్‌
- భారత దేశంలో సూర్యుడు ఉదయించే రాష్ట్రం - అరుణాచల్‌ ప్రదేశ్‌
- అరుణాచల్‌ ప్రదేశ్‌ పూర్వ నామం -నార్త్‌ ఈస్ట్‌ ప్రాంటియర్‌ ఎజెన్సీ
- భారతదేశంలో అతి పెద్ద బౌద్ధ ఆరామం అయిన తవాంగ్‌ ఏ రాష్ట్రంలో ఉంది - అరుణాచల్‌ ప్రదేశ్‌
- అరుణాచల్‌ ప్రదేశ్‌లో గంగానదిని దిహంగ్‌ అని పిలుస్తారు.
- 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అత్యల్ప అక్షరాస్యత గల ప్రాంతం -డిబంగ్‌ లోయ
- అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దులు- అస్సాం, నాగాలాండ్‌, భూటాన్‌, చైనా, మయిన్మార్‌

18. అస్సాం

- అస్సాం రాష్ట్ర రాజధాని -దిన్‌పూర్‌
- అస్సాం ఏర్పాటు -నవంబర్‌ 1, 1956
- అస్సాంకు గల ఇతర పేర్లు -అసోం, కామరూప
- అస్సాం రాష్ట్రం తేయాకు ఉత్పత్తిలో ఎన్నవ స్థానం -ప్రథమ స్థానం
- అస్సాంకు భూటాన్‌, బంగ్లాదేశ్‌తో సరిహద్దు కలదు.
- అస్సాంలో తమకు స్వయం ప్రతిపత్తి కావాలనుకుంటున్న తెగ -బోడోఅస్సాం ఏ ఉత్పత్తిలో ప్రథమస్థానం-పెట్రోలియం -

19.బీహార్‌

- బీహార్‌ రాష్ట్ర రాజధాని -పాట్నా
- బీహార్‌ రాష్ట్రం ఏర్పాటు -నవంబర్‌1, 1956
- బీహార్‌ రాష్ట్రం అధికార భాష -హిందీ
- బీహార్‌లో రాజ్‌మహల్‌ కొండలు గలవు.
- దారిద్య్ర రేఖకు దిగువ గల జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రం -బీహార్‌
- బీహార్‌ రాష్ట్రంలో పేరుగాంచిన విశ్వ విద్యాలయం - నలంద
- బీహార్‌ రాష్ట్రం జానపద నృత్యాలు - జతాజతిన్‌, జాత్ర
- దేశంలో నేలబొగ్గు, బాక్సైట్‌, అబ్రకం ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్న రాష్ట్రం - బీహార్‌
- బీహార్‌ రాజధాని పాట్నా ఏ నది ఒడ్డున కలదు - గంగానది

20చత్తీస్‌ఘడ్‌

- చత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర రాజధాని - రారుపూర్‌
- చత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర ఏర్పాటు - నవంబర్‌ 1, 2000
- భారతదేశంలో ఏర్పడిన 26వ రాష్ట్రం - ఛత్తీస్‌గఢ్‌
- చత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర భాషలు - హిందీ, చత్తీస్‌ఘరీ
- భారత్‌లో అతిపెద్ద ఆదివాసి జిల్లా - ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌

21.గోవా

- గోవా రాష్ట్ర రాజధాని - పనాజీ
- గోవాలో మాట్లాడే భాషలు -ఇంగ్లీష్‌, పోర్చుగీస్‌, కొంకణి
- భారతదేశంలో అతి తక్కువ తీర రేఖ గల రాష్ట్రం - గోవా
- బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడాన్ని నిషేధించిన తొలి రాష్ట్రం - గోవా
- తొలిసారి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రం ఉపయోగించిన రాష్ట్రం - గోవా
- భారత దేశంలో వైశాల్యంలో అతి చిన్న రాష్ట్రం - గోవా
- కామన్‌ సివిల్‌కోడ్‌ ప్రవేశ పెట్టిన తొలి రాష్ట్రం - గోవా

22.గుజరాత్‌

- గుజరాత్‌ రాష్ట్ర రాజధాని - గాంధీనగర్‌
- గుజరాత్‌ రాష్ట్రం ప్రధాన భాష - గుజరాతీ
- భారత దేశంలో సూర్యుడు అస్తమించే రాష్ట్రం- గుజరాత్‌
- ఆసియాలో సంపన్న గ్రామం- గుజరాత్‌లోని మాదాపూర్‌
- గుజరాత్‌లోని వస్త్రాలకు ప్రసిద్ధి - సూరత్‌ వస్త్రాలు
- దేశంలోనే తొలి ఈ-న్యాయస్థానం ప్రారంభమైంది
- గుజరాత్‌ హైకోర్టులో
- సర్దార్‌ వల్లబారు పటేల్‌, గాంధీజీ జన్మించిన రాష్ట్రం- గుజరాత్‌
- భారత దేశంలో సముద్ర తీరం ఎక్కువున్న రాష్ట్రం-గుజరాత్‌

23.హర్యానా

- హర్యానాను ఏ రాష్ట్రం నుండి విభజించారు? -పంజాబ్‌
- హర్యానా రాష్ట్ర రాజధాని -చండీఘర్‌
- హర్యానా రాష్ట్ర భాషలు -హిందీ, పంజాబీ, ఉర్దూ
- అన్ని గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించిన తొలి రాష్ట్రం -హర్యానా
- ఇండియాలో తొలి సంచార న్యాయస్థానం మెవాత్‌ ప్రారంభమైంది -హర్యానాలో
- ఉత్తర భారతదేశంలో క్రాప్‌ ఇన్సూరెన్స్‌ స్కీం ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం -హర్యానా
- రైల్వే నెట్‌వర్క్‌లో అత్యధిక సాంద్రత గల రాష్ట్రం -హర్యానా
- హర్యానా గుండా ప్రవహించే ఏకైక నది -గగ్గర్‌
- హర్యానాలో అడవుల శాతం -తక్కువ
- దేశంలో వ్యాట్‌ను అధికారికంగా అమలు చేసిన తొలి రాష్ట్రం -హర్యానా
- బయోడిజిల్‌ తో బస్సులు నడిపిన తొలి రాష్ట్రం -హర్యానా

24.హిమాచల్‌ ప్రదేశ్‌

- హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర ఆవిర్భావం -జనవరి 25, 1971
- హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని -సిమ్లా
- హిందువులు ఎక్కువగా గల రాష్ట్రం-హిమాచల్‌ ప్రదేశ్‌
- హిమాచల్‌ ప్రదేశ్‌ జానపద నృత్యాలు- లుద్ది, కర్యాల
- భారత దేశంలో ప్లాస్టిక్‌ బ్యాగ్‌ల వినియోగాన్ని నిషేధించిన తొలి రాష్ట్రం -హిమాచల్‌ ప్రదేశ్‌
- ఆసియా ఖండంలోని అతి పెద్ద నాథ్‌జాక్రి జలవిద్యుత్‌ కేంద్రం హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉంది.
- హిమాచల్‌ ప్రదేశ్‌ స్పీకర్‌గా పనిచేసిన తొలి మహిళ -షానో దేవి

25.జమ్మూకాశ్మీర్‌

- జమ్మూకాశ్మీర్‌ వేసవి రాజధాని -శ్రీనగర్‌
- జమ్మూకాశ్మీర్‌ శీతాకాల రాజధాని -జమ్ము
- జమ్మూకాశ్మీర్‌ అధికార భాష -ఉర్దూ
ే భారత దేశంలో రాజ్యాంగ ప్రతిపత్తి కల్గిన రాష్ట్రం
-జమ్మూ కాశ్మీర్‌
- భారత దేశంలో జమ్మూ కాశ్మీర్‌లో ముస్లింలు ఎక్కువ.
- కాశ్మీర్‌ తొలి సి.యం -షేక్‌ అబ్దుల్లా
- పర్యాటకుల స్వర్గం -కాశ్మీర్‌ ప్రాంతం
- సౌరశక్తితో దీపాలు కలిగిన గ్రామం -కాశ్మీర్‌లోని చోగ్లామ్‌
- జమ్మూకాశ్మీర్‌ కు 370 ప్రకరణ ప్రకారం స్వయం ప్రతిపత్తి ఇచ్చారు.
- జమ్మూకాశ్మీర్‌ రాజ్యాంగం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది - జనవరి26, 1957

Wednesday, January 18, 2017

భారతదేశ నది వ్యవస్థ (నదులు)

భారతదేశ నది వ్యవస్థ (నదులు)



నదులకు మూడు దశలు ఉంటాయని డబ్ల్యూఎన్ డేవిస్ పేర్కొన్నారు. నదులను మానవుని జీవిత దశలతో పోల్చారు.
1. బాల్యదశ: పర్వతమార్గంలో నది ప్రవహించే దశ
2. యవ్వనదశ: నది మైదానంలో ప్రవహించే దశ
3. వృద్ధాప్యదశ: నది వంకలు తిరుగుతూ సముద్రంలో కలిసే ముందు దశ
దేశంలో నదులను నది పరీవాహక ప్రాంతం (ఆయకట్టు) ఆధారంగా కేఎల్ రావు అనే భారతీయ శాస్త్రవేత్త మూడు భాగాలుగా విభజించారు.
1. భారీ తరహా నదులు (MAJOR RIVERS)
ఇవి దేశంలో 14 ఉన్నాయి. 20,000 చ.కి.మీ. నది పరీవాహక ప్రాంతం ఉంది.
ఇవి సముద్రంలోకి 85 శాతం నీటిని తీసుకెళ్తాయి.
2. మధ్యతరహా నదులు (MEDIUM RIVERS)
ఈ తరహా నదులు దేశంలో 44 ఉన్నాయి.
2000 నుంచి 20,000 చ.కి.మీ. నది పరీవాహక ప్రాంతం కలిగిఉంది.
ఇవి సముద్రంలోకి 7 శాతం నీటిని తీసుకెళ్తాయి.
3. చిన్న తరహా నదులు (SMALL RIVERS)
ఈ నదులు దేశంలో చాలా ఉన్నాయి.
2000 చ.కి.మీ. కంటే తక్కువ నది పరీవాహక ప్రాంతం కలిగి ఉంది.
ఇవి సముద్రంలోకి 8 శాతం నీటిని తీసుకెళ్తాయి.
పై నదుల్లో 77 శాతం నదులు బంగాళాఖాతంలో కలుస్తుండగా, 23 శాతం నదులు అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి.
మొత్తం నీటి పరిమాణంలో 90 శాతం నీరు బంగాళాఖాతంలో కలుస్తుంది. 10 శాతం నీరు అరేబియా సముద్రంలో కలుస్తుంది.
నదుల గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని పాటమాలజీ అని, సరస్సుల గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని లిమ్నాలజీ అని, నీటి గురించి అధ్యయనాన్ని హైడ్రాలజీ అని పిలుస్తారు.
ప్రపంచ మంచినీటి దినోత్సవం- మార్చి 22
ప్రపంచ నదుల దినోత్సవం- సెప్టెంబర్ 28
2003 సంవత్సరాన్ని అంతర్జాతీయ మంచినీటి సంవత్సరంగా యూఎన్‌ఓ ప్రకటించింది.
ఒడిశాలోని రూర్కిలో ఉన్న జాతీయ జల విజ్ఞాన సంస్థను 1979లో ఏర్పాటుచేశారు.
జాతీయ జలమండలి - 1990లో ఏర్పాటుచేశారు.
నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ ఆధారంగా నీటి నాణ్యతను నిర్ణయిస్తారు. (BIOLOGICAL OXYGEN DEMAND)

హిమాలయ నదులు



బ్రహ్మపు్ర తనది
మొత్తం పొడవు: 2,900 కి.మీ.
మనదేశంలో పొడవు: 880 కి.మీ.
ఈ నది టిబెట్ (చైనా ప్రావిన్స్), ఇండియా, బంగ్లాదేశ్ గుండా క్షొపవహిస్తుంది.
జన్మస్థలం: మానస సరోవరం (టిబెట్)
ఇది టిబెట్‌లోని కైలాసనాథ పర్వత శ్రేణిలో ఉన్న మానస సరోవరం సరస్సు వద్ద ఉన్న షిమ్‌యమ్‌డంగ్ హిమనీ నదం వద్ద జన్మించి టిబెట్ గుండా ప్రవహిస్తూ ఇండియాలో నామ్చాబార్వా శిఖరం (అరుణాచల్‌ప్రదేశ్) వద్ద అడ్డు తిరిగి (యూ టర్న్ తీసుకొని) జిడో వద్ద అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రవేశిస్తుంది. అసోంలోకి సాదియా అనే ప్రాంతం వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది.
అసోం గుండా ప్రవహిస్తూ దుబ్రి వద్ద బంగ్లాదేశ్‌లో ప్రవేశించి గోలుండ్ వద్ద పద్మ లేదా గంగానదిలో కలుస్తుంది. ఆ తర్వాత డాఖిన్‌షా బాజ్‌పూర్ దీవుల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
బ్రహ్మపుత్ర నదిని వివిధ దేశాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.
టిబెట్‌లో- యార్లాంగ్ త్సాంగ్‌పో (టిబెట్ భాషలో శుద్ధి చేసేవాడు అని అర్థం. THE PURIFIER)

అరుణాచల్‌ప్రదేశ్- దిహంగ్
అసోం- సైడంగ్
బంగ్లాదేశ్- జమున (పద్మానదితో కలవకముందు)
బంగ్లాదేశ్‌లో గంగానది (పద్మానది)తో కలిసిన తర్వాత (రెండింటినీ కలిపి)- మేఘన
చైనా- యార్లాంగ్ జాంగ్‌బో జియాన్‌జిన్
ఇండియా- రెడ్ రివర్

బ్రహ్మపుత్ర ఉపనదులు


బ్రహ్మపుత్ర నదికి ఉత్తరాన కలిసే ఉపనదులు: తీస్తా, మానస, గంగాధర్, బేల్‌సిరి, ధరణ్‌సిరి, సుభనసిరి
దక్షిణవైపు నుంచి కలిసే ఉప నదులు: దిబ్రూ, డిక్కు, దిహంగ్
పర్వతీయ నది: రాగాత్సాంగ్‌పో
బ్రహ్మపుత్ర నదికి అసోం దుఃఖదాయని అనే పేరు ఉంది. (ఇది దిశను మార్చుకొని భయంకర వరదతో ప్రవహిస్తుంది)
బ్రహ్మపుత్ర నది చైనా, ఇండియా, బంగ్లాదేశ్‌ల మధ్య వివాదాస్పదమైనది.
ఈ నది అసోంలో మాజోలి అనే ద్వీపాన్ని ఏర్పర్చింది. దీని విస్తీర్ణం 1250 చ.కి.మీ.
ఇది ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపం
ఈ నది పరీవాహక ప్రాంతంలోని జోర్హాట్ జిల్లాలో కజిరంగా నేషనల్ పార్క్ (1905 - 2005 వందేండ్లు పూర్తి) ఉంది. ఇది ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి.
బ్రహ్మపుత్ర నది S ఆకారంలో ప్రవహిస్తుంది.
సాదియా (అసోం) నుంచి దుబ్రి (బంగ్లాదేశ్) వరకు 2వ నంబర్ జాతీయ రహదారి ఉన్నది.
ఈ నది పరీవాహక ప్రాంతంలోనే (అసోం) దేశంలో మొదటి చమురుబావి అయిన దిగ్భాయ్‌ని 1890లో స్థాపించారు.

గంగానది


గంగానది మొత్తం పొడవు- 2,525 కి.మీ.
ప్రవహించే దేశాలు- భారత్, బంగ్లాదేశ్
భారతదేశంలో పొడవు- 2,510 కి.మీ.
జన్మస్థలం: గంగానది భగీరథి, అలకనంద అనే రెండు నదుల కలయిక వల్ల జన్మించింది.
భగీరథి జన్మస్థలం- గంగోత్రి హిమానీనదం (ఉత్తరాఖండ్)
అలకనంద జన్మస్థలం- అలకపురి హిమానీనదం (ఉత్తరాఖండ్)
అలకనంద, భగీరథి అనే రెండు నదులు దేవప్రయాగ (ఉత్తరాఖండ్) వద్ద కలిసి గంగానదిగా ఏర్పడి అక్కడి నుంచి సుమారు 280 కి.మీ. అంతర్భూభాగ నదిగా ప్రవహిస్తూ హరిద్వార్ వద్ద మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది.
ఈ నది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ (జార్ఖండ్), పశ్చిమబెంగాల్ రాష్ర్టాల గుండా ప్రవహిస్తూ ఫరక్కా ప్రాజెక్టు వద్ద రెండు పాయలుగా విడిపోతుంది.
ఒక పాయ పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరంలోకి ప్రవేశింస్తుంది. దీనిని హుగ్లీ నది అని (రాజమహల్ కొండల వద్ద గంగానది - హుగ్లీ నది) (భగీరథి)
రెండో పాయ బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. దీన్ని పద్మానది అని అంటారు.
బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించిన పద్మానది గొలుండ్ వద్ద జమునా నదితో (బ్రహ్మపుత్ర) కలిసి మేఘన నదిగా ప్రవహిస్తూ డాఖిన్‌షా బాజ్‌పూర్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

గంగానది పొడవు వివిధ రాష్ర్టాల్లో


1. ఉత్తరాఖండ్ - 310 కి.మీ.
2. ఉత్తరప్రదేశ్ - 1450 కి.మీ.
3. బీహార్ - 445 కి.మీ.
4. పశ్చిమబెంగాల్ - 520 కి.మీ.

గంగానది ఉపనదులు


యమున (ఉత్తరప్రదేశ్), సోన్ (బీహార్), దామోదర్ (పశ్చిమ బెంగాల్) - ఇవి కుడివైపు నుంచి, దక్షిణ దిక్కు నుంచి గంగానదిలో కలిసే ఉప నదులు
రామ్‌గంగా, గోమతి, భాగమతి (ఉత్తరప్రదేశ్), గండక్, కోసి, ఘాగ్రా, కాలి (బీహార్)- ఇవి ఎడమ వైపు నుంచి, ఉత్తర దిక్కు నుంచి గంగానదిలో కలిసే ఉపనదులు.
గంగానది తీరాన ఉన్న ప్రధాన నగరాలు
హరిద్వార్ - ఉత్తరాఖండ్
కాన్పూర్ - ఉత్తరప్రదేశ్
అలహాబాద్ - ఉత్తరప్రదేశ్
వారణాసి - ప్రయాగ
మొఘల్ సరాయ్ - బీహార్
పాట్నా - బీహార్
ససారాం - బీహార్
నోట్: గోమతి నది తీరాన లక్నో, హుగ్లీ నది తీరాన కోల్‌కతా, సరయూ నది తీరాన అయోధ్య ఉంది.
ప్రాముఖ్యం: ఇది దేశంలో పొడవైన నది. అధిక నీటి పరిమాణంతో ప్రవహించే రెండో పెద్ద నది.
గంగానది అతి తరుణ నది (యవ్వన నది), భారతదేశ విస్తీర్ణంలో 26.3 శాతం భూభాగాన్ని పరీవాహక ప్రాంతంగా అత్యధికంగా కలిగి ఉంది.
గంగానది పరీవాహక ప్రాంతం మనదేశంలో 8,61,404 చ.కి.మీ.గా ఉంది.
గంగానది పరీవాహక ప్రాంతంలో సుమారు 40 కోట్ల జనాభా నివసిస్తున్నారు. గంగ, యుమన, సరస్వతి నదులు కలిసి అలహాబాద్ వద్ద త్రివేణిసంగమం ఏర్పడినది.
ఫరక్కా ప్రాజెక్టును గంగానది వల్ల కోల్‌కతా ఓడరేవును రక్షించడానికి నిర్మించారు.
2008 నవంబర్ 4న గంగానదిని జాతీయ నదిగా ప్రకటించారు.

గంగానది ఉప నదులు


యమునా నది
పొడవు: 1376 కి.మీ.
జన్మస్థలం: ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి హిమానీనదం వద్ద ఉన్న బండార్ పుంచ్ శిఖరం
మైదానంలోకి ప్రవేశించే ప్రాంతం- తజేవాలా (ఉత్తరాఖండ్)
ఈ నది ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల గుండా ప్రవహిస్తూ యూపీలోని అలహాబాద్ (ప్రయాగ) వద్ద గంగానదిలో కలుస్తున్నది.
అలహాబాద్ వద్ద సరస్వతి నది కూడా కలుస్తున్నది. దీనినే త్రివేణి సంగమం అంటారు. గంగా నది ఉప నదుల్లో కెల్లా యమునా నది పొడవైనది.
ఇక్కడ ప్రతి 144 ఏండ్లకోసారి (అలహాబాద్) మహాకుంభమేలా ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి 12 ఏండ్లకోసారి కుంభమేళ ఉత్సవాలు జరుగుతాయి. కుంభమేళ ఉత్సవాలు జరిగే ప్రదేశాలు
1. అలహాబాద్ (ఉత్తరప్రదేశ్)
2. హరిద్వార్ (ఉత్తరాఖండ్)- గంగా నదిపై
3. నాసిక్ (మహారాష్ట్ర)- గోదావరి నదిపై
4. ఉజ్జయిని (మధ్యప్రదేశ్)- శిప్రానదిపై
2 యుమునా నది ఉప నదులు: చంబల్, బెట్వా, క్రేన్. ఈ మూడు నదుల కలయికను కౌఠీలా అంటారు.
2 చంబల్ నది: ఇది మధ్యప్రదేశ్‌లోని జనపావో కొండల్లో గల మౌ అనే ప్రదేశంలో జన్మిస్తుంది.
2 బెట్వా నది: ఇది మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపాన ఉన్న కైమూర్‌కొండల్లో జన్మిస్తుంది. దీన్ని నేత్రావతి నది అని కూడా పిలుస్తారు.
2 కెక్ నది: ఇది మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపాన ఉన్న కైమూర్ కొండల్లో జన్మిస్తుంది. దీన్ని కర్ణావతి నది అని కూడా పిలుస్తారు.
2 ఈ మూడు నదులు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాలు, చంబల్ లోయ, రాజస్థాన్ గుండా ప్రవహిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని ఎటోవా జిల్లాలో యమునా నదిలో కలుస్తుంది. తర్వాత ఆ నది యమునా నదిగా ప్రవహిస్తూ అలహాబాద్ వద్ద గంగా నదిలో కలుస్తుంది.

దామోదర నది


చోటానాగపూర్ పీఠభూమిలోని టోరి వద్ద జన్మించి, రాజమహల్ కొండలను చీల్చుకుంటూ వాటి పగులు లోయల గుండా ప్రవహిస్తూ పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ నదిలో కలుస్తుంది.
దీన్ని బెంగాల్ దుఃఖదాయని అని పిలుస్తారు. దీని ఉప నదులు బార్కార్, కోనార్.
3. గండక్ నది: ఇది నేపాల్‌లోని ఎవరెస్ట్, ధవళగిరి శిఖరాల మధ్య జన్మించి బీహార్‌లో గంగానదిలో కలుస్తుంది. దీన్ని నేపాల్‌లో సాలగ్రామి అని, బీహార్‌లో నారాయణి అని పిలుస్తారు.
4. కోసినది: దీన్ని సంస్కృతంలో కౌసికి అంటారు. ఇది నేపాల్, టిబెట్, సిక్కిం ప్రాంతాల సరిహద్దుల్లో జన్మిస్తుంది. ఇది బీహార్‌లో గంగానదిలో కలుస్తుంది.
కోసిని ప్రారంభంలో సప్తకోసి అని పిలిచేవారు. వీటిలో ముఖ్యమైనవి అరుణ్‌కోసి, తుమార్‌కోసి, సన్‌కోసి. దీన్ని (కోసినది) బీహార్ దుఃఖదాయని అని పిలుస్తారు.

నదులు


మనదేశంలో నది జన్మ స్థానాలను అనుసరించి నదులను మూడు సముదాయాలుగా విభజించవచ్చు. అవి..
1. హిమాలయ నదులు
2. ద్వీపకల్ప నదులు
3. అంతర్ భూభాగ నదులు

హిమాలయ నదులు


హిమాలయాల కంటే పూర్వం ఏర్పడ్డ నదులు: అలకనంద, బ్రహ్మపుత్ర, సట్లేజ్, ఇండస్ (సింధు)
హిమాద్రి నదులు: గంగా, కాలి, గండక్, తీస్తా, ఘగ్రా
హిమాచల్ హిమాలయాల్లో జన్మించిన నదులు : జీలం, చీనాబ్, బియాస్, రావి.
శివాలిక్ నదులు: హిండన్, సొలాని
పురాణాల్లో పేర్కొన్న అతి ప్రాచీన నది- సరస్వతి
ద్వీపకల్ప నదులు : వృద్ధ నదులు
పశ్చిమాన ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నదులు- 13. అవి..
మహి, సబర్మతి (గుజరాత్)
బానీ, బనాస్ (రాజస్థాన్)
నర్మద, తపతి (మధ్యప్రదేశ్)
భరత్ పూజ, మాండవి (గోవా)
పంబ, పెరియార్ (కేరళ)
శరావతి, నేత్రావతి, గంగావళ్లి (కర్ణాటక)
తూర్పున ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నదులు- 9
గంగా, దామోదర (పశ్చిమబెంగాల్)
బ్రహ్మణి, మహానది (ఒడిశా)
గోదావరి, కృష్ణా, పెన్నా (ఆంధ్రప్రదేశ్)
కావేరి (తమిళనాడు)
తుంగభద్ర - ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణానదిలో కలుస్తుంది.
దక్షిణం నుంచి ఉత్తరాన ప్రవహించే నదులు: చంబల్, బెట్వా, కేన్ (ఈ మూడు నదులు యమునా నదిలో కలుస్తాయి)
సోన్ (గంగానదిలో కలుస్తుంది)
ఈశాన్యం నుంచి బంగాళాఖాతంలో కలిసే నదులు: బ్రహ్మపుత్ర
అంతర్ భూభాగ నదులు
ఈ నదులు రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో ఉన్న లూనీ, బనాస్, సరస్వతి
జమ్ముకశ్మీర్ లడఖ్‌లో ఉన్న గగ్గర్ (ఇది ఇండియాలో అతి పెద్ద అంతర్భాగ నది)
నోట్: ప్రపంచంలో అతి పెద్ద అంతర్భాగ నది- వోల్గా నది (రష్యాలో)
ఇండియాలో నీటి పరిమాణంలో పెద్ద నది- బ్రహ్మపుత్ర, రెండో పెద్ద నది - గంగా
దేశంలో పొడవైనది- గంగా (2,525 కి.మీ.), రెండో పొడవైనది - గోదావరి (1,465 కి.మీ.)
దేశంలో పొడవైన ఉపనది- యమున (1,372 కి.మీ.), రెండో పొడవైన ఉపనది- చీనాబ్ (1,180 కి.మీ.)
మనదేశ జాతీయ, పవిత్ర, కలుషితనది- గంగానది
గంగా నది భారతీయుల జీవనాడి అని పేర్కొన్నది
- జవహర్‌లాల్ నెహ్రూ
జాతీయ జల జంతువు- గంగా డాల్ఫిన్
ప్రపంచంలో నీటి పరిమాణంలో పెద్ద నది- అమేజాన్ (బ్రెజిల్, దక్షిణ అమెరికా)
ప్రపంచంలో నీటి పరిమాణంలో రెండో పెద్దనది- కాంగోనది (కాంగోదేశం జైరినది, ఆఫ్రికా)
ఇటీవల అమేజాన్ నదికి ఒక అంతర్‌వాహిని నదిని కనుగొన్నారు. దాని పేరు - హమ్ల
ప్రపంచంలో పొడవైన నది- నైలునది (ఆఫ్రికా 6,650 కి.మీ.)
అమేజాన్ 6,350 కి.మీ. (దక్షిణ అమెరికా)
అంతర్జాతీయనది- డాన్యూబ్ నది (ఐరోపా)

గంగ, యమున, సరస్వతి కలిసే ప్రదేశం - అలహాబాద్
భగిరథి, అలకనంద కలిసే ప్రదేశం - దేవప్రయాగ
మందాకిని, అలకనంద కలిసే ప్రదేశం - రుద్ర ప్రయాగ
పండార్, అలకనంద కలిసే ప్రదేశం - కరుణ ప్రయాగ
గంగానది అత్యధిక భాగం - ఉత్తరప్రదేశ్‌లో, గంగానది అత్యల్ప భాగం - ఉత్తరాఖండ్‌లో ప్రవహిస్తుంది.

EXOTIC నదులు


ఎడారి గుండా ప్రవహించే జీవ నదులు
1. నైలు నది- సహార ఎడారి (ఆఫ్రికా ఖండం)
2. ఆరెంజ్ నది- కలహరి ఎడారి (ఆఫ్రికా ఖండం)
3. ఇండస్ నది (సింధు) - థార్ ఎడారి (ఆసియా ఖండం)
4. డార్లింగ్ నది - ఆస్ట్రేలియా (ఆస్ట్రేలియా ఖండం)
పగులులోయ గుండా ప్రవహించే నదులు
నర్మద, తపతి, దామోదర్ (ఇండియా), రైన్ - జర్మనీ, కొలరాడో - అమెరికా
SINGLE LETTER RIVERS
మా నది- భూటాన్
టీ నది- భూటాన్
పో నది- ఇటలీ
డీ నది- అమెరికా

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు



1.అసోంలో భారీ వరదలు ఏ నది వల్ల వస్తాయి? (3)
1) గోమతి 2) గంగ
3) బ్రహ్మపుత్ర 4) యమున

2.దేశంలో ఎక్కువగా వరదలు వచ్చే నది? (4)
1) గోదావరి 2) గోమతి
3) కావేరి 4) బ్రహ్మపుత్ర

3.ప్రపంచ నీటి దినం? (2)
1) మార్చి 21 2) మార్చి 22
3) మార్చి 23 4) మార్చి 24

4.ఇండియాలో పడమర దిక్కు పారే నదులు (3)
1) గోదావరి 2) కావేరి 3) నర్మదా 4) కృష్ణా

5.కింది వాటిలో ఏ నదీతీరం అత్యధిక నీటి పరీవాహక ప్రాంతాన్ని కలిగి ఉంది? (1)
1) గంగా 2) బ్రహ్మపుత్ర
3) యమున 4) గోదావరి

6.కింది వాటిలో ఏ నది సమూహం టిబెట్‌లో ప్రారంభ మూలాల్ని కలిగి ఉన్నాయి? (4)
1) బ్రహ్మపుత్ర, గంగ, సట్లేజ్
2) గంగ, సట్లేజ్, యమున
3) చీనాబ్, రావి, సట్లేజ్
4) బ్రహ్మపుత్ర, ఇండస్, సట్లేజ్

7.ఎక్కువ పొడవైన నది ఏది? (2)
1) బ్రహ్మపుత్రం 2) గంగ
3) గోదావరి 4) నర్మద

8.గంగానది పొడవు ఎన్ని కిలోమీటర్లు? (4)
1) 2710 కి.మీ 2) 2610 కి.మీ
3) 2410 కి.మీ 4) 2510 కి.మీ

9.హిమాలయలకన్నా ప్రాచీనమైన నది? (2)
1) గంగ 2) బ్రహ్మపుత్ర 3) యమున 4) కోసి

10.బ్రహ్మపుత్ర నది పొడవు దాదాపుగా? (1)
1) 2900 కి.మీ. 2) 3900 కి.మీ.
3) 1800 కి.మీ. 4) 2100 కి.మీ.


11.గోమతి నది ఒడ్డున ఉన్న భారతీయ పట్టణం? (1)
1) లక్నో 2) అలహాబాద్ 3) నాసిక్ 4) ఢిల్లీ

12.దేశంలోని అతి పెద్ద నది ముఖద్వారం ఏది? (1)
1) హుగ్లీ 2) భగీరథి 3) గోదావరి 4) కృష్ణ

13.బ్రహ్మపుత్ర నదికి మరోక పేరు? (3)
1) అతి పెద్దనది 2) చిన్ననది
3) దుఃఖనది 4) తూర్పునది

14.సోన్ నది ఏ నదికి ఉపనది? (1)
1) గంగ 2) యమున 3) నర్మద 4) సట్లేజ్

15.చైనా, ఇండియాలో ప్రవహించే నది? (3)
1) గంగ 2) యమున
3) బ్రహ్మపుత్ర 4) తుంగభద్ర

భారత పద్దవ

              అతిపెద్దవి

» అతిపెద్ద డెల్టా - సుందర్ బన్స్
» అతిపెద్ద జిల్లా - లడఖ్ (జమ్మూ-కాశ్మీర్)
» అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారం - మధుర (ఉత్తర ప్రదేశ్)
ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)
» అతిపెద్ద విశ్వవిద్యాలయం - ఇగ్నో
» అతిపెద్ద చర్చి - సె కెథెడ్రల్ (పాత గోవా)
» అతిపెద్ద నౌకాశ్రయం - ముంబాయి
» అతిపెద్ద ద్వీపం - మధ్య అండమాన్
» అతిపెద్ద నగరం (వైశాల్యంలో) - కోల్ కతా
» అతిపెద్ద జైలు - తీహార్ (ఢిల్లీ)
తీహార్ జైలు (ఢిల్లీ)
» అతిపెద్ద మంచినీటి సరస్సు - ఊలార్ (జమ్మూ-కాశ్మీర్)
» అతిపెద్ద ఉప్పునీటి సరస్సు - సాంబార్ (రాజస్థాన్)
» అతిపెద్ద నివాస భవనం - రాష్ట్రపతి భవన్ (న్యూఢిల్లీ)
» అతిపెద్ద మసీదు - జామా మసీదు (ఢిల్లీ)
జామా మసీదు (ఢిల్లీ)
» అతిపెద్ద డోమ్ - గోల్ గుంబజ్ (బీజాపూర్, కర్ణాటక)
» అతిపెద్ద బ్యాంకు - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
» అతిపెద్ద తెగ - గోండ్
» అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు - గోవింద సాగర్ (హర్యానా)
» అతిపెద్ద వన్యమృగ సంరక్షణ కేంద్రం - శ్రీశైలం-నాగార్జున సాగర్ అభయారణ్యం
» అతిపెద్ద నదీ ద్వీపం - మజోలి (బ్రహ్మపుత్ర నదిలో – అసోమ్)
» అతిపెద్ద లైబ్రరీ - నేషనల్ లైబ్రరీ (కోల్ కతా)
» అతిపెద్ద ప్లానెటోరియం - బిర్లా ప్లానిటోరియం (కోల్ కతా)
» అతిపెద్ద ఎడారి - ధార్ ఎడారి
» అతిపెద్ద స్తూపం - సాంచి (మధ్యప్రదేశ్)
» అతిపెద్ద జూ - జూలాజికల్ గార్డెన్స్(కోల్ కతా)
» అతిపెద్ద గుహ - అమరనాథ్ (పహల్గాం –జమ్మూకాశ్మీర్)
» అతిపెద్ద బొటానికల్ గార్డెన్ - నేషనల్ బొటానికల్ గార్డెన్ (కోల్ కతా)
» అతిపెద్ద మ్యూజియం - ఇండియన్ మ్యూజియం (కోల్ కతా)
» అతిపెద్ద గురుద్వారా - స్వర్ణ దేవాలయం (అమృతసర్)
» అతిపెద్ద గుహాలయం - ఎల్లోరా (మహారాష్ట్ర)
ఎల్లోరా గుహాలయం (మహారాష్ట్ర)
» అతిపెద్ద పోస్టాఫీస్ - జీపీవో – ముంబాయి
» అతిపెద్ద ఆడిటోరియమ్ - శ్రీ షణ్ముఖానంద హాల్ (ముంబాయి)
» అతిపెద్ద ప్రాజెక్ట్ - భాక్రానంగల్ (పంజాబ్, హర్యానా, రాజస్థాన్)
» అతిపెద్ద విగ్రహం - నటరాజ విగ్రహం (చిదంబరం)
» అతిపెద్ద ఉప్పు తయారీ కేంద్రం - మిధాపూర్ (గుజరాత్)
అతిపొడవైనవి
» అతి పొడవైన స్తూపం - సాంచీ (మధ్యప్రదేశ్)
» అతి పొడవైన టన్నెల్ - జవహర్ టన్నెల్ (జమ్మూ-కాశ్మీర్)
» అతి పొడవైన రోడ్డు - గ్రాండ్ ట్రంక్ రోడ్డు (అమృతసర్-కోల్ కతా)
» అతి పొడవైన నది - గంగానది (భారత్ లో 2415 కి.మీ.)
గంగానది (భారత్ లో 2415 కి.మీ.)
» అతి పొడవైన ఉపనది - యమున
» అతి పొడవైన డ్యామ్ - హీరాకుడ్ డ్యామ్ (24.4 కి.మీ. –ఒడిశా)
» అతి పొడవైన బీచ్ - మెరీనా బీచ్ (13 కి.మీ. –చెన్నై)
» అతి పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్ - ఖరగ్ పూర్ (833 మీ. – పశ్చిమబెంగాల్)
» అతి పొడవైన జాతీయ రహదారి - ఏడో నెంబరు జాతీయ రహదారి (2325 కి.మీ. వారణాసి-కన్యాకుమారి)
» అతి పొడవైన పర్వత శ్రేణి - హిమాలయాలు
» అతి పొడవైన కాలువ - రాజస్థాన్ కాలువ/ ఇందిరాగాంధీ కాలువ (959 కి.మీ.)
» అతి పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం - గుజరాత్
» అతిపొడవైన హిమనీనదం - సియాచిన్ హిమనీనదం (75.6 కి.మీ.)
» అతిపెద్ద పొడవైన రోడ్డు బ్రిడ్జి - మహాత్మాగాంధీ సేతు (5575 మీ.) (పాట్నా వద్ద గంగానదిపై)
» అతిపొడవైన రైల్వే బ్రిడ్జి (నదిపై) - దెహ్రి (సోన్ నదిపై –బీహార్ లోని ససారం)
» అతిపొడవైన సముద్రపు బ్రిడ్జి - అన్నా ఇందిరాగాంధీ బ్రిడ్జి (2.34 కి.మీ.) (మండపం-రామేశ్వరం మధ్య)
అతి ఎత్తయినవి
» అతి ఎత్తయిన డ్యామ్ - భాక్రా డ్యామ్ (సట్లేజ్ నదిపై)
» అతి ఎత్తయిన పర్వత శిఖరం - కాంచన జంగా (8611 మీ.)
» అతి ఎత్తయిన రోడ్డు - లేహ్ –మనాలి (జమ్మూకాశ్మీర్)
» అతి ఎత్తయిన జలపాతం - జోగ్ లేదా జెర్సొప్పా(292 మీ. – కర్ణాటక)
» అతి ఎత్తయిన ప్రవేశద్వారం - బులంద్ దర్వాజా (53.5 మీ.)
» అతి ఎత్తయిన సరస్సు - దేవతల్
» అతి ఎత్తయిన జల విద్యత్తు కేంద్రం - రోహ్ తంగ్ (హిమాచల్ ప్రదేశ్)
ఇతరాలు
» అతి చల్లని ప్రాంతం - డ్రాస్ సెక్టార్ (జమ్మూకాశ్మీర్)
» అతి ప్రాచీన చర్చి - సెయింట్ థామస్ చర్చి ((క్రీ.శ. 52 నాటిది)
» అతి రద్దీ ఉన్న విమానాశ్రయం - ఛత్రపతి శివాజీ విమానాశ్రయం-ముంబాయి
ఛత్రపతి శివాజీ విమానాశ్రయం-ముంబాయి
» అతిపురాతన చమురుశుద్ది కర్మాగారం - దిగ్బోయ్ (1835 – అసోమ్)
» అతి పురాత టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ - కోల్ కతా