Thursday, January 26, 2017

కరెంట్ అఫైర్స్

*కరెంట్ అఫైర్స్*

*డైనమిక్ సిటీ హైదరాబాద్*

ప్రపంచంలో అత్యంత వేగంగా మార్పు చెందుతున్న నగరాల జాబితాలో హైదరాబాద్ ఐదోస్థానంలో నిలిచింది.
డైనమిక్ సిటీల పేరుతో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ జేఎల్‌ఎల్ ఏటా విడుదల చేసే గ్లోబల్ సిటీ మొమెంటమ్ ఇండెక్స్‌లో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, హోచిమిన్ సిటీ (వియత్నాం), సిలికాన్ వ్యాలీ (అమెరికా), షాంఘై (చైనా) తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలోని టాప్ 30 సిటీల్లో భారత్‌కు చెందిన ఆరు నగరాలు ఉన్నాయి. ఇందులో పుణె 13, చెన్నై 18, ఢిల్లీ 23, ముంబై 25వ స్థానం సంపాదించాయి.

*మ*
*అవార్డులు*



*జాతీయ సాహస బాలల పురస్కారాలు*

*ణి*
2017కుగాను జాతీయ సాహస బాలల పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బాలికల అక్రమరవాణాను అరికట్టేందుకు సహాయం చేసిన పశ్చిమబెంగాల్ అమ్మాయిలు తేజస్విద, శివానీలు గీతా చోప్రా అవార్డు, అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన తార్హ్ పీజు.. భారత్ అవార్డు, ఉత్తరాఖండ్‌కు చెందిన సుమిత్.. సంజయ్‌చోప్రా అవార్డు అందుకోనున్నారు.

*లెజెండ్స్ క్లబ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో కపిల్*

*కు*
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్‌కు క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాకు చెందిన లెజెండ్స్ క్లబ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది.

*కృష్ణారావుకు ఎల్లాప్రగడ అవార్డు*

*మా*
ప్రతిష్ఠాత్మక డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు అవార్డుకు ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ సీఈవో అమెరికన్ డాక్టర్ అప్పసాని కృష్ణారావు ఎంపికయ్యారు. బయాలజీ, కెమిస్ట్రీ, జెనటిక్స్, మెడికల్ సైన్స్‌లో చేసిన కృషికిగాను ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు.

*జాతీయం*

*ర్*
*కాలం చెల్లిన చట్టాల రద్దు*

కాలం చెల్లిన 105 చట్టాలను రద్దు చేయడానికి కేంద్ర మంత్రిమండలి జనవరి 18న ఆమోదం తెలిపింది. ఇందులో 2008 సార్లు సవరణలకు గురైన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంతోపాటు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల జీతాలు, పెన్షన్‌లకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల రద్దు కోసం రద్దు-సవరణ బిల్లు-2017ను తీసుకురానున్నారు.

*హిమాచల్‌ప్రదేశ్ రెండో రాజధానిగా ధర్మశాల*

*M*

హిమాచల్‌ప్రదేశ్ రెండో రాజధానిగా ధర్మశాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ జనవరి 19న ప్రకటించారు. 2005 నుంచి ధర్మశాలలో పూర్తిస్థాయి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.

*జల్లికట్టుపై నిషేధం ఎత్తివేత*🐂

*A*
తమిళుల సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ తమిళనాడు ప్రభుత్వం జనవరి 21న ఆర్డినెన్స్ జారీచేసింది. జంతుహింస నిరోధక చట్టం-1960లోని ప్రదర్శన జంతువుల (పెర్ఫామింగ్ యానిమల్స్) జాబితా నుంచి ఎద్దులను తొలగించేందుకు సవరణ కోసం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్‌ను ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆమోదించారు. 2014, మే 7న సుప్రీంకోర్టు జల్లికట్టును నిషేధించింది. అయితే కొన్ని మార్పులతో కేంద్ర అడవులు, పర్యావరణ శాఖలు జల్లికట్టు వంటి క్రీడను అనుమతించాయి. దీనిపై 2016 జనవరి 16న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.

*N*
*యుద్ధనౌకలో ఏటీఎం*💳

తొలిసారిగా యుద్ధనౌకలో ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఇండియన్ నేవీలోని అతిపెద్ద యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలో జనవరి 21న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సేవలు ప్రారంభించింది. ఈ యుద్ధనౌకలో విధులు నిర్వర్తిస్తున్న సుమారు 1500ల మందికిపైగా సిబ్బంది, అధికారులు ఈ సేవలను వినియోగించుకుంటారు.

*రైల్వే బడ్జెట్ విలీనానికి రాష్ట్రపతి ఓకే*🚊✅

*I*
కేంద్ర సాధారణ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ను విలీనం చేయడాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. దీనికి అనుగుణంగా భారత ప్రభుత్వ (వాణిజ్య కేటాయింపులు) నిబంధనలు-1961 చట్టంలో ప్రతిపాదించిన సవరణలకు జనవరి 20న రాష్ట్రపతి ఆమోద ముద్రవేశారు.

*అతి పొడవైన మానవహారం*

*K*

ప్రపంచంలోనే అత్యంత పొడవైన మానవహారాన్ని బీహార్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో అమలవుతున్న సంపూర్ణ మద్య నిషేధానికి మద్దతునిస్తూ 11,400 కి.మీ. పొడవైన మానవహారాన్ని ఏర్పాటు చేశారు. నిషాముక్త్ కాంపెయిన్ పేరుతో దీన్ని అమలు చేశారు. సుమారు మూడు కోట్ల మంది బీహార్ ప్రజలు కలిసి దీన్ని నిర్మించారు. ఇప్పటి వరకు ప్రపంచపు అత్యంత పొడవైన మానవహారం రికార్డు 1050 కి.మీ.తో బంగ్లాదేశ్ పేరున రికార్డయ్యింది.

*అంతర్జాతీయం*

*U*

*అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్*

అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ జే ట్రంప్ జనవరి 20న ప్రమాణస్వీకారం చేశారు. మాజీ అధ్యక్షుడు ఒబామా తీసుకొచ్చిన ఆరోగ్య చట్టం ఒబామా కేర్‌ను రద్దు చేస్తూ రూపొందించిన ఫైలుపై తొలి సంతకం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా మైక్ పెన్స్‌ను ట్రంప్ నియమించారు. వీరి ప్రమాణ స్వీకారం నేషనల్ మాల్ సమీపంలో జరిగింది.

అధ్యక్షతరహాకు మారిన టర్కీ
పార్లమెంటరీతరహా ప్రభుత్వం నుంచి టర్కీ అధ్యక్షతరహా ప్రజాస్వామ్యానికి మారింది. ఇందుకు ఉద్దేశించిన బిల్లును టర్కీ పార్లమెంటు జనవరి 22న ఆమోదించింది. దాంతోపాటు అధ్యక్షుడికి అసాధారణ అధికారాలను కూడా పార్లమెంటు కట్టబెట్టింది. ఈ బిల్లును త్వరలో ప్రజాభిప్రాయ సేకరణకు పంపనున్నారు. ప్రజాభిప్రాయం అనుకూలంగా వస్తే తక్షణం అమల్లోకి వస్తుంది. అంతేకాకుండా ప్రస్తుత అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ 2029 వరకు అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.

*నేపాల్ కూరగాయల స్వయం సమృద్ధి ప్రణాళిక*

*M*

వచ్చే పదేండ్లలో కూరగాయల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించేందుకు నేపాల్ పదేండ్ల ప్రణాళికలను చేపట్టింది. ప్రస్తుతం నేపాల్‌కు కూరగాయలు భారత్‌నుంచే ఎగుమతి అవుతున్నాయి. భారత్ నుంచి ఏటా రూ. 550 కోట్ల విలువైన 25,000 మెట్రిక్ టన్నుల కూరగాయలు ఎగుమతి అవుతున్నాయి.

*హాంకాంగ్‌కు వీసా ఫ్రీ సౌకర్యం రద్దు*

*A*

భారతీయ పర్యాటకులకు వర్తిస్తున్న వీసా ఫ్రీ సౌకర్యాలను రద్దుచేస్తున్నట్లు హాంకాంగ్ జనవరి 21న ప్రకటించింది. ఇప్పటివరకు భారతీయులు హాంకాంగ్‌లో పర్యటించాలంటే వీసా అవసరం లేకుండానే 14 రోజులవరకు అవకాశం ఉండేది. చైనా ప్రత్యేక పాలన కింద ఉన్న హాంకాంగ్‌లో ఇకనుంచి భారతీయులు పర్యటించాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలి.

*R*

*క్రీడలు*🏏⚽🏸

*మ*

*వన్డే సిరీస్ భారత్ కైవసం*

ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో భారత్ గెలుచుకుంది. మొదటి రెండు వన్డేల్లో విజయం సాధించిన భారత్ జనవరి 22న కోల్‌కతాలో జరిగిన మూడో మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. సిరీస్‌లో మొత్తం 232 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ కేదార్ జాదవ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్నాడు.
*ణి*

*సైనాకు మలేసియా గ్రాండ్ ప్రి టైటిల్*

హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా నిలిచింది. మలేసియాలోని సారావక్‌లో జనవరి 22న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన పోర్న్‌వవీ చోచువోంగ్‌పై 22-20, 22-20తో విజయం సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ తర్వాత సైనా గెలిచిన తొలి టైటిల్ ఇదే. ఆమె కెరీర్‌లో ఇది తొమ్మిదో గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్ కాగా, మొత్తంగా 23వ టైటిల్.

*వార్తల్లో వ్యక్తులు*

*కు*

*చంద్రునిపై చివరిగా కాలుమోపిన సెర్నన్ మృతి*😔


చంద్రునిపై చివరిసారిగా కాలుమోపిన అమెరికా వ్యోమగామి జీన్ సెర్నన్ జనవరి 17న మరణించారు. ఆయన 1972 డిసెంబర్‌లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన అపోలో 17 మిషన్‌కు కమాండర్‌గా పనిచేశారు. చంద్రమండలంపై ఇప్పటివరకు 12 మంది కాలుమోపారు.

*ఐసీఎస్‌ఐ కొత్త అధ్యక్షుడిగా శ్యామ్ అగర్వాల్*


*మా*
2017 ఏడాదికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) నూతన అధ్యక్షుడిగా శ్యామ్ అగర్వాల్, ఉపాధ్యక్షుడిగా మకరంద్ లెలెలు జనవరి 19 ఎన్నికయ్యారు. ఐసీఎస్‌ఐ అధ్యక్షులుగా ఎన్నికైన వారిలో శ్యామ్ అతి చిన్న వయస్కుడు. జైపూర్‌కు చెందిన ఆయన ప్రస్తుతం సీఎస్‌ఐ కేంద్ర మండలిలో సభ్యుడిగా ఉన్నారు.

*సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ కుమార్*

*ర్*
సీబీఐ నూతన డైరెక్టర్‌గా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ వర్మను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్, లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లికార్జున్ ఖర్గేలతో కూడిన త్రిసభ్య కమిటీ వర్మ నియామకానికి అనుమతించింది. సీబీఐ డైరెక్టర్ అనిల్ సిన్హా 2016, డిసెంబర్ 2న పదవీ విరమణ చేయడంతో అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది.

No comments:

Post a Comment