Wednesday, February 8, 2017

నోబెల్ అవార్డులు



నోబెల్ అవార్డులు

నోబెల్ బహుమతులు-2015 :

1. భౌతిక శాస్త్రం              

1.ఆర్డర్ మెక్ డొనాల్డ్(కెనడా)                                         2.తకాకికజిత(జపాన్)

2.రసాయన శాస్త్రం

1.థామస్ లిండాల్(స్వీడన్)
2.పాల్ మాడ్రిచ్(అమెరికా)
3.అజీజ్ సంకార్(టర్కీష్ అమెరికన్)

3.వైద్యశాస్త్రం

1.విలియం కాంప్ బెల్(అమెరికన్)
2.సతోషి ఒమురా(జపాన్)
3.తు యుయు (చైనా)

4.సాహిత్యం
1.స్వెత్లానా అలెక్సీవిచ్(బెలారస్)

5.ఆర్ధిక శాస్త్రం
1.ఆంగస్ స్టీవర్ట్ డేటన్(స్కాట్లాండ్)

6.శాంతి బహుమతి
1.టునీషియా నేషనల్ డైలాగ్ క్వార్టెట్(టునీషియా)

🔻ప్రపంచంలో అత్యుత్తమ పురస్కారం నోబెల్ బహుమతి.నోబెల్ బహుమతిని స్వీడన్ కి చెందిన రసాయన శాస్త్రవేత్త 'ఆల్ఫ్రెడ్ నోబెల్' జ్ఞాపకార్ధం ఇవ్వడం జరుగుతుంది.

ఆల్ఫ్రెడ్ నోబెల్ :

🔻ఆల్ఫ్రెడ్ నోబెల్ పూర్తీ పేరు ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ .ఆల్ఫ్రెడ్ నోబెల్ 1833 అక్టోబర్ 21 న స్వీడన్ లోని స్టాక్ హోం లో జన్మించాడు.17 ఏళ్ల వయసులో పారిస్ లోని ఒక పరిశోధనశాలలో పని చేసాడు.1862 లో 'నైట్రోగ్లిజరిన్' మీద ప్రయోగాలు చేసాడు.పారిశ్రామిక పేలుడు పదార్ధంగా పేటెంట్ తీసుకున్నాడు.1867 లో నైట్రోగ్లిజరిన్ ను ఉపయోగించి డైనమైట్ ను తయారుచేసి దానికి పేటెంట్ తీసుకున్నాడు.తరువాత స్వీడన్ ,అమెరికా,జర్మనీ లలో పేలుడు పదార్ధాల కంపనీలు ఏర్పాటు చేసి అతి తక్కువ కాలంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు.చివరికి తను చేసిన పేలుడు పదార్ధాల పట్ల విరక్తి చెంది 1895 లో తన ఆస్తినంతా తన పేరు మీదగా అవార్డుల కోసం వినియోగించాలని విల్లు రాసి 1896 డిసెంబర్ 10 న మరణించాడు.అందుకే ప్రతి సంవత్సరం అతని వర్ధంతి సందర్భంగా అనగా డిసెంబర్ 10 న స్వీడన్ రాజధాని స్టాక్ హోం లో విజేతలకు నోబెల్ అవార్డులు అందజేస్తారు.శాంతి బహుమతిని మాత్రం నార్వే రాజధాని ఓస్లోలో ప్రధానం చేస్తారు.

🔻నోబెల్ అవార్డులు 1901 నుంచి ప్రారంభమైనవి.
- 1901 నుంచి ఈ నోబెల్ అవార్డులు భౌతిక,రసాయన,మానవ శరీర ధర్మ లేదా వైద్య శాస్త్రాలు,సాహిత్యం,శాంతి రంగాల్లో ఇస్తూ వస్తున్నారు.
- అయితే 1968 లో స్వేరిజెస్ రిక్స్ బ్యాంక్ 300 వ వార్షికోత్సవం సందర్భంగా ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్ధం ఆర్ధిక శాస్త్రం లో కూడా ఒక బహుమతిని ప్రవేశపెట్టింది.
దీనిని 'ది స్వేరిజెస్ రిక్స్ బ్యాంక్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ ఇన్ మెమరి ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్' గా పిలుస్తారు.
- ప్రతి సంవత్సరం ఈ బహుమతిని ఒక ఫీల్డ్ లో గరిష్టంగా ముగ్గురికి ప్రధానం చేస్తారు.
- మరణించిన వారికి ఈ అవార్డును ప్రకటించరు.

🔻నోబెల్ అవార్డును ప్రస్తుతం 6 రంగాలలో ఇస్తున్నారు.

🔻నోబెల్ బహుమతిని ఎంపిక చేసి,ప్రధానం చేసే సంస్థలు :

🔻భౌతిక శాస్త్రం - రాయల్ స్వీడిష్ అకాడమి ఆఫ్ సైన్సెస్(స్వీడన్)

🔻రసాయన శాస్త్రం - రాయల్ స్వీడిష్ అకాడమి ఆఫ్ సైన్సెస్(స్వీడన్)

🔻వైద్య శాస్త్రం,శరీర ధర్మ శాస్త్రం - నోబెల్ అసెంబ్లీ ఆఫ్ కరోలిన్ స్కా ఇన్స్టిట్యూట్(స్వీడన్)

🔻సాహిత్యం రంగం - స్వీడిష్ అకాడమి(స్వీడన్)

🔻శాంతి రంగం - నార్వే పార్లమెంటరీ కమిటీ(నార్వే)

🔻ఆర్ధిక శాస్త్రం - స్వేరిజేస్ రిక్స్ బ్యాంక్(స్వీడన్)

🔻అత్యధిక నోబెల్ బహుమతులు పొందినవారు :

🔻ఇప్పటి వరకు అమెరికా పౌరులు అత్యధికంగా నోబెల్ బహుమతి పొందారు.

🔻మూడుసార్లు నోబెల్ బహుమతి పొందినది :

🔻రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీ (1917,1944,1963)

🔻ఒకే రంగాలలో రెండుసార్లు నోబెల్ పొందినవారు :

🔻జాన్ బర్దీన్ - (1956-భౌతిక శాస్త్రం,1972-భౌతిక శాస్త్రం)

🔻ఫ్రెడరిక్ సాంగర్ - (1958-రసాయన శాస్త్రం,1980-రసాయన శాస్త్రం)

🔻వేర్వేరు రంగాలలో రెండుసార్లు నోబెల్ పొందినవారు :

🔻మేరీ క్యూరీ(భౌతిక శాస్త్రం-1903,రసాయన శాస్త్రం-1911)

🔻లీనస్ కార్ల్ పౌలింగ్(రసాయనశాస్త్రం-1954,శాంతి-1962)

గ్రహీత              రంగం        సంవత్సరం

1.రవీంద్రనాథ్ ఠాగూర్        సాహిత్యం     1913

2.సి.వి.రామన్      ఫిజిక్స్             1930

3.మధర్ థెరిస్సా      శాంతి         1979

4.అమర్త్యసేన్         అర్ధ శాస్త్రం     1998

5.కైలాష్ సత్యార్ది        శాంతి        2014

No comments:

Post a Comment