Tuesday, February 7, 2017

current affairs

[2/7, 9:08 PM] @lm: *🚩ఫ్రాన్స్‌ భామకు విశ్వసుందరి కిరీటం🌴*

మనీలా: ఫ్రాన్స్‌కు చెందిన 23ఏళ్ల *ఇరిస్‌ మిట్టెనరి* ఈ ఏడాది మిస్‌ యూనివర్స్‌గా ఎంపికైంది. ఫిలిప్పైన్స్‌లో జరిగిన విశ్వసుందరి పోటీల్లో హోస్ట్‌ స్టీవ్‌ హార్వే.. మిస్‌ ఫ్రాన్స్‌ ఇరిస్‌ను విజేతగా ప్రకటించారు. గతేడాది విశ్వసుందరి కిరీటం సొంతం చేసుకున్న ఫిలిప్పైన్స్‌ భామ పియా వుట్జ్‌బక్‌ ఇరిస్‌కు కిరీటం అలంకరించారు. ఈ పోటీల్లో తొలి రన్నరప్‌ మిస్‌ హైతి రక్వెల్‌ పెలిస్సైర్‌, రెండో రన్నరప్‌గా మిస్‌ కొలంబియా ఆండ్రియా తొవర్‌ నిలిచారు. మిస్‌ యూనివర్స్‌ ఇరిస్‌ ఫ్రాన్స్‌ ఉత్తర ప్రాంతంలోని లిల్లే పట్టణంలో జన్మించారు. డెంటల్‌ సర్జరీలో డిగ్రీ చేశారు. క్రీడలు, ప్రయాణాలు చేయడంతో పాటు ఫ్రెంచ్‌ వంటకాలు చేయడం ఆమె అభిరుచి.
ఈ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన *రోహ్మిత హరిమూర్తి* చాలా వెనుకబడిపోయారు. ఆమెకు టాప్‌ 13లో కూడా స్థానం దక్కలేదు. 1994లో మిస్‌ యూనివర్స్‌ కిరీటం గెలుచుకున్న భారత్‌కు చెందిన సుస్మితాసేన్‌ న్యాయనిర్ణేతల్లో ఒకరుగా వ్యవహరించారు.
[2/7, 9:27 PM] @lm: *బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ అబ్బూరి గోపాల కృష్ణ (81) విశాఖపట్నంలో జనవరి 31న కన్నుమూశారు.*
విశాఖలో పుట్టిన ఆయన ఆంధ్రా యూనివర్సిటీ నాటక విభాగం అధిపతిగా పని చేసి పదవీ విరమణ పొందారు. నటన, రచన, రంగస్థల దర్శకత్వం, చిత్రలేఖనం, సాహిత్యం, సంగీతం వంటి విభిన్న రంగాల్లో అబ్బూరి రాణించారు.

[2/7, 9:27 PM] @lm: *ఖమ్మం జిల్లాలోని భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంకితం చేశారు.*
ఈ మేరకు కొత్తూరు పంచాయతీ ఎర్రగడ్డ తండా వద్ద జనవరి 31న పథకాన్ని ప్రారంభించారు. ఈ ఎత్తిపోతల ద్వారా జిల్లాలోని 60 వేల ఎకరాలకు నీరు అందుతుంది.

[2/7, 9:27 PM] @lm: *ఆలిండియా రేడియో మొదటి మహిళా న్యూస్ రీడర్ డాక్టర్ జోలెపాళెం మంగమ్మ(92) చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఫిబ్రవరి 1న కన్నుమూశారు.*

మంగమ్మ సుబ్బన్న, లక్ష్మమ్మ దంపతులకు 1924 సెప్టెంబర్ 12న జన్మించారు. 1952లో ఆలిండియా రేడియోలో న్యూస్ రీడర్‌గా చేరి పదేళ్ల పాటు ఆ ఉద్యోగంలో ఉన్నారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అనేక పుస్తకాలు రాసిన ఆమె 2002లో తెలుగు అకాడమీ నుంచి ఉగాది పురస్కారం అందుకున్నారు. కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారం, సిద్ధార్థ కళాపీఠం విశిష్ట పురస్కారాలూ పొందారు.

[2/7, 9:27 PM] @lm: *తెలంగాణలో చేనేత వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి సమంత ఎంపికైంది.*

జనవరి 31 చేనేత వస్త్రాలకు సంబంధించి హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కె.తారకరామారావు ఈ మేరకుప్రకటన చేశారు. చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేనేత లక్ష్మీ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.

[2/7, 9:27 PM] @lm: *Former Delhi Police Commissioner Alok Verma on 1st February took charge as the new CBI Director.*

He will hold the charge of the premier investigating agency for a period of two years. A 1979-batch IPS officer, Mr Verma was selected by a three-member committee comprising Prime Minister Narendra Modi, Chief Justice J S?Khehar and Senior Congress leader Mallikarjun Kharge.


[2/7, 9:27 PM] @lm: *India beat England by 75 runs in the third T-20 match at Bengaluru and clinched the 3 match series, 2-1.*

Leg spinner Yuzvendra Chahal took 6 wickets for 25 runs. England collapsed from 118 for 2 to 127 all out. Jasprit Bumrah took 3 wickets, while Amit Mishra took one.

[2/7, 9:27 PM] @lm: *_Olympic and Paralympic medals for the Tokyo 2020 Games will be made from recycled mobile phones_*.

The Japanese public will be asked to donate old phones and small appliances to gather two tonnes of gold, silver and bronze for the 5,000 medals.
[2/7, 9:27 PM] @lm: *_India has been invited as a Guest Country at the St. Petersburg International Economic Forum to be held from 1st to 3rd June in Russia._*

Prime Minister Narendra Modi will attend the Forum as a Guest of Honour.


[2/7, 9:27 PM] @lm: *2017-18లో భారత స్థూల దేశీయోత్పత్తి-GDP రేటు 7.1 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ HSBC పేర్కొంది.*

వచ్చే సంవత్సరానికి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అధ్యయనంతో ఆ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. 2016-17 వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
[2/7, 9:27 PM] @lm: *2017-18లో భారత స్థూల దేశీయోత్పత్తి-GDP రేటు 7.1 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ HSBC పేర్కొంది.*

వచ్చే సంవత్సరానికి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అధ్యయనంతో ఆ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. 2016-17 వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
[2/7, 9:27 PM] @lm: *Former CBI chief Joginder Singh, who oversaw investigation of several high-profile cases including Bofors scam and Bihar's fodder scam passed away*.

The 1961 batch IPS officer of Karnataka cadre was chosen to head the premier investigative agency when H D Deve Gowda was the Prime Minister.

Singh, who joined Police Service at the age of 20, rose to take charge of CBI on July 31, 1996 when it was probing a large number of sensitive cases including Bofors, fodder scam, securities scam, the JMM MPs bribery scandal, Rs 133 crore urea scam, telecom deals by the then Union minister Sukh Ram, among others. A prolific writer, Singh, penned over 25 books on various subjects after retiring from the service.
[2/7, 9:27 PM] @lm: *శ్రీలంకలోని పొలన్నారువా జిల్లాలో విభిన్న తెగల విద్యార్థులకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసేందుకు ఆ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది.*

ఈ మేరకు ఏకాభిప్రాయ పత్రాలపై ఫిబ్రవరి 2న రెండు దేశాల అధికారులు సంతకాలు చేశారు. ఈ విద్యాలయంలో సిన్హాళీలు,తమిళులు, ముస్లింలకు సమాన అవకాశాలు కల్పించనున్నారు. మూడు భాషల్లో విద్యా బోధన అందించనున్న పాఠశాల నిర్మాణానికి భారత్ రూ.30 కోట్ల సహాయం అందిస్తుంది.
[2/7, 9:27 PM] @lm: *వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ స్వకృషి డెయిరీకి జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ-NDDB ఉత్తమ సహకార సంఘం అవార్డు లభించింది.*

ఫిబ్రవరి 2న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో డెయిరీ ప్రతినిధులు పురస్కారాన్ని అందుకున్నారు. మహిళల భాగస్వామ్యంతో 2002లో ప్రారంభమైన ఈ డెయిరీ మూడు సార్లు ఐఎస్‌వో గుర్తింపు పొందింది.
[2/7, 9:27 PM] @lm: *వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ స్వకృషి డెయిరీకి జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ-NDDB ఉత్తమ సహకార సంఘం అవార్డు లభించింది.*

ఫిబ్రవరి 2న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో డెయిరీ ప్రతినిధులు పురస్కారాన్ని అందుకున్నారు. మహిళల భాగస్వామ్యంతో 2002లో ప్రారంభమైన ఈ డెయిరీ మూడు సార్లు ఐఎస్‌వో గుర్తింపు పొందింది.
[2/7, 9:27 PM] @lm: *ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుగా సంజీవ్ సన్యాల్ ఎంపికయ్యారు.*

ఈ మేరకు అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్-ACC ఫిబ్రవరి 3న ఆయన నియామకాన్ని ఆమోదించింది. గతంలో డాషే బ్యాంక్ ఎండీగా పనిచేసిన సంజీవ్ పలు పుస్తకాలు రచించారు. పట్టణ అంశాలపై చేసిన కృషికి గాను 2007లో ఐసెన్ హోవర్ ఫెలోషిప్ పొందిన సంజీవ్ 2014 వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో సింగపూర్ ప్రభుత్వం నుంచి సత్కారం అందుకున్నారు.
[2/7, 9:27 PM] @lm: *ఏడు ఇస్లామిక్ దేశాలపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్-ACLUకు వివిధ కంపెనీలు బాసటగా నిలుస్తున్నాయి.*

ఈ మేరకు ఆ సంస్థకు ట్విట్టర్ 1.59 మిలియన్ డాలర్ల (రూ.10.8 కోట్లు) విరాళం ప్రకటించింది.
[2/7, 9:27 PM] @lm: *ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో రైల్వేలకు రూ.1.31 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం జోన్లు, ప్రాజెక్టుల వారీ వివరాలను ఫిబ్రవరి 3న వెల్లడించింది.*

ఈ సారి కొత్త రైళ్లేవి లేకుండా కొత్త లైన్ల నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించిన ప్రభుత్వం రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది.

ఏపీ, తెలంగాణకు కేటాయింపులు
దక్షిణ మధ్య రైల్వేకు రూ.5,135 కోట్లు.ఇందులో తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ప్రాజెక్టులకు రూ.1,729 కోట్లు.( కొత్తపల్లి-మనోహరాబాద్‌కు రూ. 350 కోట్లు, బల్షారా-కాజీపేట- విజయవాడ మూడో లైన్‌కు రూ.260 కోట్లు).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు రూ.3,406 కోట్లు.ఇందులో విజయవాడ-అమరావతి-గుంటూరులను కలుపుతూ 106 కి.మీ. మేర నిర్మించే అమరావతి రైలు మార్గానికి రూ.2,680 కోట్లు.

[2/7, 9:27 PM] @lm: *నలుగురు హైకోర్టు చీఫ్ జస్టిస్‌లు సహా మొత్తం ఐదుగురు సిట్టింగ్ హైకోర్టు జడ్జీల పేర్లను ఉన్నత న్యాయస్థానానికి సుప్రీంకోర్టు కొలీజియం ఖరారు చేసింది.*


ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహార్ నేతృత్వంలోని కొలీజియం ఫిబ్రవరి 3న జాబితాను ఆమోదించింది. మద్రాస్, రాజస్థాన్, కేరళ, ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల చీఫ్ జస్టిస్‌లు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ మోహన్ శాంతన గౌడర్, జస్టిస్ దీపక్ గుప్తలతోపాటు కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌లు ఈ జాబితాలో ఉన్నారు.

[2/7, 9:27 PM] @lm: *యూరోపియన్ యూనియన్-EU నుంచి వైదొలిగే ప్రక్రియకు బ్రిటన్ పార్లమెంటు ఆమోదం లభించింది*.

ఈ మేరకు దిగువ సభ-HOUSE OF COMMONS లో ఫిబ్రవరి 2న ప్రవేశపెట్టిన బ్రెగ్జిట్ బిల్లుకు అనుకూలంగా 498 మంది ఓటు వేశారు. మరో 114 మంది దీన్ని వ్యతిరేకించారు. ఎగువ సభ అయిన HOUSE OF LORDS లో ఆమోదం పొందిన తర్వాత బ్రెగ్జిట్ బిల్లు చట్టంగా మారుతుంది. ఆ తర్వాత లిస్బన్ ఒప్పందానికి సంబంధించిన ఆర్టికల్ 50 ద్వారా బ్రిటన్ ప్రధాని థెరిసా మే EU నుంచి లాంఛనంగా వైదొలగొచ్చు. బ్రెగ్జిట్‌పై 2016 జూన్‌లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 51.9 శాతం మంది ఈయూ నుంచి వైదొలగాలని 48.1 శాతం మంది ఈయూలో కొనసాగాలని ఓటు వేశారు.

[2/7, 9:27 PM] @lm: *ప్రముఖ సితార్, సుర్‌బహార్ విద్వాంసుడు ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ (82) ఇటీవల తనకు కేటాయించిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించారు.*


కేంద్ర ప్రభుత్వం తన ప్రతిభను చాలా ఆలస్యంగా గుర్తించిందని.. అవార్డును తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. 2017 సంవత్సరానికి గాను ఇటీవల 89 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం ఇమ్రత్ ఖాన్‌ను ఎన్‌ఆర్ ఐ విభాగంలో పద్మశ్రీకి ఎంపిక చేసింది.

[2/7, 9:27 PM] @lm: *ప్రముఖ సితార్, సుర్‌బహార్ విద్వాంసుడు ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ (82) ఇటీవల తనకు కేటాయించిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించారు.*


కేంద్ర ప్రభుత్వం తన ప్రతిభను చాలా ఆలస్యంగా గుర్తించిందని.. అవార్డును తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. 2017 సంవత్సరానికి గాను ఇటీవల 89 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం ఇమ్రత్ ఖాన్‌ను ఎన్‌ఆర్ ఐ విభాగంలో పద్మశ్రీకి ఎంపిక చేసింది.

[2/7, 9:27 PM] @lm: *_Current affairs..._*🌷Q :1 to 50)_*

🌻 *_*🌻
🍃🍃🍃🌺🙏🏼🌺🍃🍃🍃

1. అంతర్జాతీయ పోగాకు నియంత్రణ సమావేశం ఏ దేశంలో నిర్వహించనున్నారు?
1) ఇండియా
2) చైనా
3) ఆస్ట్రేలియా
4) జపాన్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ఈ సమావేశానికి 180 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. పోగాకు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా, పోగాకు వాడకంతగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు.

2. పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాంతంలో ‘మేక్ ఇన్ ఇండియా’ సమావేశం నిర్వహించనుంది?
1) హైదరాబాద్
2) చెన్నై
3) భువనేశ్వర్
4) ముంబయి

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: ఒడిశా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు డిసెంబర్ నెలలో ‘మేక్ ఇన్ ఇండియా’ పేరుతో వాణిజ్య సదస్సును కేంద్ర వాణిజ్య శాఖ నిర్వహించనుంది.

3. ఇటీవల ఏ రాష్ట్రం ‘ఆల్ ఇండియా కో ఆర్డినేటెడ్ రైస్ ఇంఫ్రూవ్‌మెంట్ అవార్డు - 2015’ నకు ఎంపికైనది?
1) హర్యానా
2) ఆంధ్రప్రదేశ్
3) తెలంగాణ
4) పశ్చిమ బెంగాల్

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: ఇందిరాగాంధీ క్రిషి వికాస్ కేంద్రం 51వ కమిటీ ‘పశ్చిమ బెంగాల్’ను ఈ అవార్డుకు ఎంపికచేసింది. శాస్త్రీయ విత్తన పరిశోధన, శాస్త్రీయ వ్యవసాయ విధానాలను పాటిస్తున్నందుకు పశ్చిమ బెంగాల్ ఈ అవార్డు సాధించింది.

4. బయోసైన్స్ జర్నల్ అధ్యయనం ప్రకారం సరైన సంరక్షణ చర్యలు తీసుకోకపోతే ఏ సంవత్సరంలోపు పెద్ద జంతువులు అన్ని అంతరించిపోతాయి?
1) 2050
2) 2100
3) 2150
4) 2200

View Answer

స‌మాధానం: 2

5. ఏ రాష్ట్రం తొలిసారిగా ప్రభుత్వ నియామకాల్లో లింగమార్పిడి వ్యక్తులకు అవకాశం కల్పించింది?
1) ఒడిశా
2) గుజరాత్
3) కేరళ
4) తమిళనాడు

View Answer

స‌మాధానం: 1

6. ఇటీవల త్రిపుర సుందరి అనే ఎక్స్‌ప్రెస్‌ను ఏ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభించారు?
1) నైనిటాల్ నుంచి ఢిల్లీ
2) అగర్తల నుంచి ఢిల్లీ
3) కొహిమా నుంచి ఢిల్లీ
4) ఐజ్వాల్ నుంచి ఢిల్లీ

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: అగర్తల నుంచి ఢిల్లీ మధ్య మొదటి బ్రాడేగ్రేజ్ రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుత్రిపుర సుందరి ఎక్స్‌ప్రెస్‌ను అగర్తలలో ప్రారంభించారు. ఈ ప్రాంతాల మధ్య దూరం 2461 కి.మీ.

7. ఇటీవల ఇండియా, థాయ్‌లాండ్ దేశాలు సంయుక్తంగా నిర్వహించిన సైనిక విన్యాసాల పేరు ఏమిటి?
1) In tho - 2016
2) Inomilo - 2016
3) Thomil - 2016
4) Maitree - 2016

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: ఇండియా, థాయ్‌లాండ్ సైనిక విన్యాసాలు థాయ్‌లాండ్‌లోని కర్బి ప్రాంతంలో నిర్వహించారు.

8. ఏ భారతీయ కళాకారుడు/కళాకారిణి ‘హీమ్ ట్రాన్స్ లేషన్ ఫండ్ గ్రాంట్ - 2016’ (PEN or Heim Translation Fund Grants) ని పొందారు?
1) అనితా గోపాలన్
2) అరుందతి సుబ్రమణియన్
3) ఉదయ్ ప్రకాష్
4) రుక్మిణి భయనాయర్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: అనితా గోపాలన్ ‘గీతా చతుర్వేది’ రచించిన సిమ్‌సిమ్ ని ఆంగ్లంలోకి అనువాదం చేసినందుకు గాను ఈ పురస్కారం లభించింది.

9. ఇటీవల అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని నియమించారు?
1) జస్టీస్ దిలిప్ బాబాసాహెబ్ భోసాలే
2) ధనుంజయ వై. చంద్ర చూద్
3) బిదు భూషణ్ మాలిక్
4) జస్టిస్ దిలిప్ గుప్తా
*_*
View Answer

స‌మాధానం: 1

10. మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) అనంత్ మహేశ్వరి
2) భాస్కర్ ప్రామాణిక్
3) సత్య నాదేళ్ల
4) స్టీల్ బాల్‌మర్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: అనంత్ మహేశ్వరి, భాస్కర్ ప్రామాణిక్ స్థానంలోమైక్రోసాఫ్ట్ఇండియా ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.

11. ప్రపంచంలో మొదటి సారిగా మానవ జన్యు సంకలన పరీక్ష నిర్వహించిన దేశం?
1) జపాన్
2) జర్మనీ
3) చైనా
4) ఆస్ట్రేలియా

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: చైనాకు చెందిన సిచువాన్ విశ్వవిద్యాలయం, ఊపిరితిత్తుల కాన్సర్‌ని నిరోధించడానికై మొదటిసారిగా మానవ జన్యు సంకలన పరీక్ష నిర్వహించింది.

12. ప్రస్తుత ప్రపంచ కరాటే చాంపియన్ ఎవరు?
1) వివేక్ తేజ
2) జేమ్స్ ఛాట్ ఫీల్డ్
3) ఆంథోని రాయస్
4) మాథ్యురొస్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ప్రపంచ కరాటే చాంపియన్‌గా ఎంపికైన మొట్టమొదటి భారతీయుడు వివేక్ తేజ.

13. ‘గ్రాస్ రూట్ ఇన్ఫోవేషన్’ పుస్తక రచయిత ఎవరు?
1) దువ్వూరి సుబ్బారావు
2) బీమల్ జలాన్
3) ప్రకాష్ ఝన్‌వాలా
4) అనిల్ కె గుప్తా

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: ఐఐఎం అహ్మాదాబాద్ ప్రొఫెసర్ అనిల్ కె గుప్తా ఈ పుస్తకాన్ని రచించారు. మేనేజ్‌మెంట్ రంగంలో ప్రొ అనిల్ గుప్తా చేసిన సేవలకుగాను 2004 లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది.

14. ఫెంటో కెమిస్ట్రీ పితామహుడు ఎవరు?
1) ఒట్టోహని
2) షాల్ ఆనాస్టన్
3) విక్టర్ గొల్డ్ స్మిత్
4) అహమ్మద్ జెవెల్

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: 1999లో శాస్త్రీయ రంగంలో అహమ్మద్ అసన్ జెవెల్ (Ahmed Hassan Zewail )కు నోబెల్ బహుమతి లభించింది. శాస్త్రీయరంగంలో నోబెల్ పొందిన మొదటి అరబ్ అహ్మద్ జెవెల్ ఆగస్టు 2న మరణించాడు.

15. కింది వాటిలో ఏ రాష్ట్రం మొదటిసారిగా మురికి, వ్యర్థమైన నీటి నిర్వహణ విధానాన్ని ఆమోదించింది?
1) కేరళ
2) రాజస్థాన్
3) తమిళనాడు
4) మహారాష్ట్ర

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: మురికి నీటిని శుభ్రపరిచి వ్యవసాయ అవసరాల కోసం వినియోగించాలనే లక్ష్యంతో రాజస్థాన్ మురికి, వ్యర్థ నీటి నిర్వహణ విధానాన్ని ప్రవేశపెట్టింది.

16. మొట్టమొదటి సారిగా పిజ్జా ఏటీఎంను ప్రవేశపెట్టిన దేశం ఏది?
1) ఇండియా
2) జపాన్
3) అమెరికా
4) యు.కె

View Answer

స‌మాధానం: 3

17. ఇటీవల ప్రధాన మంత్రి ‘ సత్తర్ సాల్ ఆజాదీ - యాద్ కరో కుర్బానీ’ వేడుకలను ఎక్కడ ప్రారంభించారు?
1) అలిరాజ్ పూర్
2) చిక్కలి
3) పోరుబందర్
4) కటక్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమై 75 సంవత్సరాలు, స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, చంద్రశేఖర్ ఆజాద్ జన్మించిన ఆలిరాజ్ పూర్‌లో ‘యాద్ కరో కుర్బానీ’ పేరుతో 15 రోజుల ఉత్సవాలను ప్రధాన మంత్రి ప్రారంభించారు.

18. బ్లూమ్‌బర్గ్ విడుదల చేసిన ‘సంతోషకరమైన దేశాల జాబితా’ లో మొదటి స్థానంలో నిలిచిన దేశం?
1) జపాన్
2) దక్షిణ కొరియా
3) థాయ్‌లాండ్
4) స్విట్జర్లాండ్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: 2015లో అసాధారణ స్థాయిలో తక్కువ నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో సంతోషంగా ఉన్న దేశాల్లో మొదటిస్థానంలో థాయ్‌లాండ్, త రువాతి స్థానాల్లో స్విట్జర్లాండ్, జపాన్, దక్షిణ కొరియా నిలిచాయి.

19. మిషన్ భగీరథ ద్వారా గ్రామీణ, పట్టణ వాసులకు పతిరోజుఎంత నీరు అందిస్తారు?
1) 50 లీ., 75 లీ.
2) 75 లీ., 100 లీ.
3) 90 లీ., 110 లీ.
4) 100 లీ., 150 లీ.

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: ఆగస్టు 7న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మిషన్ భగీరథ’ను ప్రారంభించారు. రూ.40,000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా పతి ఇంటికిగ్రామాల్లో 100 లీ., పట్టణాల్లో 150 లీ. సరఫరా చేస్తారు.

20. ‘ప్రపంచ ఆర్థిక సద స్సు 2016’ ను ఎక్కడ నిర్వహించనున్నారు?
1) సింగపూర్
2) న్యూఢిల్లీ
3) మనీలా
4) కౌలాలంపూర్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: 1971లో క్లాస్ ష్వాబ్ (Klaus Schwab) ప్రపంచ ఆర్థిక సదస్సును ప్రారంభించారు. దీని ప్రధాన కార్యాలయం ‘కోలోగ్ని’ స్విట్జర్లాండ్‌లో ఉంది.

21. ‘ప్రపంచ బానిసత్వ సూచీ - 2016’లో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం?
1) చైనా
2) భారత్
3) పాకిస్థాన్
4) బంగ్లాదేశ్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: వాక్ ఫ్రీ ఫౌండేషన్ విడుదల చేసిన ప్రపంచ బానిసత్వ సూచీ ప్రకారం 167 దేశాల్లో 45.8 మిలియన్ ప్రజలు బానిసత్వంలో మగ్గుతున్నారు. వీరిలో 58% బానిసలు భారత్, చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్థాన్‌లో ఉన్నారు.

22. 8వ గోవా చలన చిత్రోత్సవంలో జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు?
1) రోహిత్ పోకూట్టి
2) రాజ్ కూమార్ హిరణి
3) చంద్రశేఖర్ ఎన్
4) బాల

View Answer

స‌మాధానం: 3

23. దేశంలోనే మొదటిసారిగా ఒక దళిత మహిళను కుద్రోలి గోకర్ణనాథ్ దేవాలయంలో పూజారిగా నియమించారు. ఈ దేవాలయం ఎక్కడ ఉంది?
1) మంగళూరు
2) భావ్ నగర్
3) వారణాసి
4) నాసిక్

View Answer

స‌మాధానం: 1

24. జాతీయ చేనేత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1) ఆగస్టు 2
2) ఆగస్టు 4
3) ఆగస్టు 6
4) ఆగస్టు 7

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: 1905 స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 7న చెన్నైలో జాతీయ చేనేత దినోత్సవంను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

25. హిరోషిమా దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
1) ఆగస్టు 3
2) ఆగస్టు 6
3) ఆగస్టు 9
4) ఆగస్టు 11

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా మీద ఆగస్టు 6న అమెరికా మొట్ట మొదటి సారిగా అణుబాంబు వేసింది. ఈ దాడిలో 80,000 మంది చనిపోగా 35,000 మంది గాయపడ్డారు.

26. భారతదేశ అల్యూమినియం రాజధాని ఏది?
1) జార్ఖండ్
2) ఛత్తీస్ ఘడ్
3) మధ్య ప్రదేశ్
4) ఒడిశా

View Answer

స‌మాధానం: 4

27. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఆగస్టు 1 - 7
2) జూన్ 1 - 7
3) మే 1 - 7
4) జూలై 1 - 7

View Answer
*__*
స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: తల్లిపాలలో ఉండే పోషకాలు పిల్లలకు అందేలా, తల్లి పాల ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయటం కోసం ఈ వారోత్సవాలను నిర్విహ స్తారు.

28. వెరిస్క్ మాపిల్ క్రాఫ్ట్ విడుదల చేసిన పౌర అశాంతి సూచీలో మొదటి స్థానంలో ఉన్న దేశం?
1) భారత్
2) లిబియా
3) సిరియా
4) యెమెన్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: వెరిస్క్ మాపిల్ క్రాఫ్ట్ సంస్థ 198 దేశాల సమాచారంతో ‘పౌర అశాంతి సూచీ’ని తయారు చేసింది. ఇందులో మొదటి స్థానంలో సిరియా, తర్వాత స్థానాల్లో యెమెన్, లిబియా, ఇండియా (4వ స్థానంలో) ఉన్నాయి. ఈ జాబితాలో మెక్సికో 7వ స్థానం, దక్షిణాఫ్రికా 13వ స్థానం, బెజ్రిల్ 21వ స్థానంలో ఉన్నాయి.

29. టియాన్‌టాంగ్-01(Tiantong-01) అనే మొదటి మొబైల్ టెలికమ్యూనికేషన్ ఉపగ్రహంను ప్రయోగించిన దేశం?
1) దక్షి ణ కొరియా
2) చైనా
3) జపాన్
4) ఫ్రాన్స్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: మొదటి మొబైల్ కమ్యూనికేషన్ ఉపగ్రహం టియాన్ టాంగ్ -01 (Tiantong-01) ను చైనా ఇటీవల అంతరిక్షంలోకి పంపింది.

30. జిమ్నాస్ట్‌లో ఫైనల్స్‌కి చేరిన మొట్ట మొదటి భారతీయుడు(రాలు) ఎవరు?
1) లలితా బాబర్
2) వికాస్ గౌడ్
3) మనోజ్ కూమార్
4) దీపా కర్మాకర్

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: దేశం నుంచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఏకైక జిమ్నాస్ట్ దీపా.

31. 74వ క్విట్ ఇండియా స్మారకోత్సవం ఏ రోజున నిర్వహించారు?
1) ఆగస్టు 4
2) ఆగస్టు 8
3) ఆగస్టు 10
4) ఆగస్టు 13

View Answer

స‌మాధానం: 2

32. కింది వాటిలో ఏ సంస్థ దేశంలో మొట్ట మొదటి టైగర్ రిపాసిటరీని ప్రవేశ పెట్టింది?
1) IUCN
2) WWF
3) CITES
4) WII

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కింద ప్రత్యేక టైగర్ సెల్‌ను డెహ్రడూన్‌లో ప్రారంభించారు. టైగర్ సెల్‌లో పులల డేటాబేస్, డీఎన్‌ఏ, చారల నమునాలను పొందుపరుస్తారు.

33. గుజరాత్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
1) నితిన్ పటేల్
2) గణపత్ వాసవ
3) విజయ్ రూపానీ
4) భూపేంద్ర సిన్హా

View Answer

స‌మాధానం: 3

34. ప్రపంచ కబడ్డీ పోటీలు 2016ను నిర్వహించనున్న దేశం?
1) భారత్
2) బంగ్లాదేశ్
3) పోలాండ్
4) యు.కె.

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: కబడ్డీ ప్రపంచ కప్‌ను 2004లో ప్రారంభించారు. 2004 నుంచి కబడ్డీ కప్‌ను ఇండియా మాత్రమే గెలుచుకుంది.

35. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) బెర్న్
2) లాసాన్
3) జెనీవా
4) మనీలా

View Answer

స‌మాధానం: 2

36. రియో ఒలింపిక్స్ 2016 థీమ్ ఏమిటి?
1) స్పోర్ట్స్ ఫర్ ఆల్
2) న్యూ వరల్డ్, న్యూ విజన్
3) వరల్డ్ పీస్ అండ్ ఎన్విరాన్‌మెంట్
4) లెట్స్ కనెక్ట్ విత్ వరల్డ్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: 31వ ఒలింపిక్స్ బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో ఆగస్టు 6న ప్రారంభమై 21న ముగిశాయి. ప్రస్తుత ఒలింపిక్స్ కమిటీ చైర్‌పర్సన్ థామస్ బాచ్.

37. ఇటీవల ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీకి ఎంపికైన మొట్ట మొదటి భారతీయ మహిళ ఎవరు?
1) నీతా అంబానీ
2) పి.టి. ఉష
3) చందా కొచ్చర్
4) అంజూ జార్జ్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటికి ఎంపికైన మొదటి భారతీయ మహిళ రిలయన్స్ ఫౌండేషన్ స్థాపకురాలు నీతా అంబానీ.

38. 2020 ఒలింపిక్స్‌లో చేర్చనున్న నూతన క్రీడలు ఏవి?
1) సర్ఫింగ్
2) స్కేట్ బోర్డు
3) బేస్ బాల్
4) పైవన్నీ

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: 32వ ఒలింపిక్స్‌ను 2020లో టోక్యో నిర్వహించనుంది. ఈ ఒలింపిక్స్‌లో కరాటే, బేస్‌బాల్, సర్ఫింగ్, స్కేట్ బోర్డు, స్పోర్ట్స్ క్లైంబింగ్ నూతనంగా చేర్చనున్నారు.

39. నేపాల్ నూతన ప్రధాన మంత్రి ఎవరు?
1) సుశీల్ కోయిరాల
2) పుష్ప కమల్ దహల్ ప్రచండ
3) గిరిజా ప్రసాద్ కొయిరాల
4) ఖడ్గ ప్రసాద్ ఓలి

View Answer

స‌మాధానం: 2

40. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌కు నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
1) ఇడ్రిస్ హార్న్
2) హరుహికో కురోదా
3) తకహికా నకావో
4) తడావో చినో

View Answer

స‌మాధానం: 3

41. సార్క్ ఇమ్మిగ్రేషన్ ఆథారిటిస్ మీటింగ్ ఎక్కడ నిర్వహించారు?
1) న్యూఢిల్లీ
2) ఖాట్మండ్
3) ఇస్లామాబాద్
4) కాబూల్

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: సార్క్ దేశాల ఇమ్మిగ్రేషన్ ఆథారిటిస్ 8వ సమావేశం ఇస్లామాబాద్‌లో నిర్వహించారు.

42. రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన పురస్కారం 2016 కు ఎవరు ఎంపికయ్యారు?
1) శుభా ముద్గల్
2) ఆంజాద్ ఆలిఖాన్
3) ముజఫర్ ఆలీ
4) డి.ఆర్.మెహతా

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ఈ పురస్కారాన్ని ప్రతి సంవత్సరం రాజీవ్ గాంధీ జయంతి నాడు శాంతి, అహింస, దేశ సమగ్రత కోసం పాటు పడిన వారికి ్రపదానం చేస్తారు. పురస్కారం కింద రూ.5 లక్షల నగదు బహుమతిని అందిస్తారు.

43. ఇటీవల ఏ రాష్ట్రం ‘కల్లు’ పై ఉన్న నిషేధం ఎత్తి వేసింది?
1) తెలంగాణ
2) బీహర్
3) మధ్య ప్రదేశ్
4) గుజరాత్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: గతంలో బీహర్‌లో కల్లు, లిక్కర్, గుట్కాల మీద నిషేధం ఉంది. ఆరోగ్యానికి హాని కల్గించని సాంప్రదాయ కల్లు పై ఉన్న నిషేధంను బీహర్ రాష్ట్రం తొలగించింది.

44. ప్రతిష్టాత్మక రోజర్ కప్ పురుషుల టైటిల్‌ను ఎవరు గెల్చుకున్నారు?
1) ఆండి ముర్రే
2) రోజర్ ఫెదరర్
3) రఫెల్ నాదల్
4) నోవాక్ జకోవిచ్

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: కెనడియన్ ఓపెన్‌నే రోజర్ కప్ అని కూడా అంటారు. టోరంటోలో జరిగిన కెనడియన్ ఓపెన్‌లో నోవాక్, కీనిషికోరిని ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

45. జర్మన్ గ్రాండ్ ప్రీ ఫార్ములావన్ 2016 విజేత ఎవరు?
1) నికో రోస్‌బర్గ్
2) మాక్స్ వెర్సటపేన్
3) లేవిస్ హామిల్టన్
4) సెబాస్టియన్ వెటల్

View Answer

స‌మాధానం: 3

46. నాల్గవ కేరళ పరిపాలన సంస్కరణల కమిషన్‌కు చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) వి.ఎస్ అచ్యుతానందన్
2) పినరయి విజయ్
3) ఇ.పి. జయరాజన్
4) జి. సుధాకరణ్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: కేరళలో పరిపాలన సంస్కరణల కోసం కేరళ ప్రభుత్వం నాల్గో కమిషన్ను వి.ఎస్. అచ్యుతానందన్ (VS Achuthanandan) నాయకత్వంలో ఏర్పాటు చేసింది. ఇతర సభ్యులు సి.పి. నాయర్, నీలా గంగాధరన్.

47. ‘హైడ్రోకార్బన్ విజన్ - 2030’ మొదటి సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) భువనేశ్వర్
2) కటక్
3) గౌహతి
4) అగర్తల

View Answer

స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: రెండు రోజుల ‘‘హైడ్రోకార్బన్ విజన్- 2030’’ (Hydrocarbon Vision 2030) సమావేశం గౌహతిలో నిర్వహించారు. వచ్చె 15 సంవత్సరాల్లో 1,30,000 కోట్లతో ఈశాన్య రాష్ట్రాలను హైడ్రోకార్బన్‌ల హబ్‌గా మార్చునున్నారు.

48. లింబో స్కేటింగ్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది ఎవరు?
1) సంకీర్త్ గౌడ్
2) ఓమ్ స్వరూప్ గౌడ్
3) మణికంఠ గౌడ్
4) ధీరజ్ గౌడ్

View Answer

స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: కర్ణాటకకు చెందిన 7 సంవత్సరాల ఓమ్ స్వరూప్ గౌడ్ లింబో స్కేటింగ్‌లో 65.283 మీ. దూరం కార్ల కింది నుంచి ప్రయాణించి గిన్నిస్ రికార్డుకి ఎక్కాడు.

49. దక్షిణ భారతదేశంలో మొదటి డాప్లర్ వాతవరణ రాడార్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) కొయంబత్తూరు
2) శ్రీహరి కోట
3) హసన్
4) తిరువనంత పురం

View Answer

స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: వాతావరణ డాప్లర్ రాడార్ తుఫానులు, వాతావరణ మార్పులను ముందుగానే పసిగట్టి సమాచారంను అందిస్తుంది. దక్షిణ భారతదేశంలో తిరువనంతపురంలో ‘c’ బ్యాండ్ పోలారిస్ మెట్రిక్ డాప్లర్ వాతావరణ రాడార్‌ను ప్రారంభించారు. 2015లో చిరపుంజిలో దేశంలో మొదటి రాడార్‌ను నరేంద్ర మోదీ ప్రారంభించారు.

50. ఇటీవల ఏ రాష్ట్రం జలవనరుల సమాచారం పొందటం కోసం ఇస్రోతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) తెలంగాణ
2) కేరళ
3) మధ్యప్రదేశ్
4) ఆంధ్రప్రదేశ్

View Answer

స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ఇస్రోకు చెందిన జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌తో తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఇస్రో జలవనరుల సమాచారంను తెలంగాణ ప్రభుత్వానికి అందిస్తుంది.
🍃🌺🌺 🌺🌺🍃

[2/7, 9:27 PM] @lm: Today's current affairs...


*14వ బయో ఏసియా సదస్సు ఫిబ్రవరి 6న హైదరాబాద్‌లో ప్రారంభమైంది.*

HICC వేదికగా మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుని గవర్నర్ నరసింహన్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా శామీర్‌పేట మండలం తుర్కపల్లి పారిశ్రామిక వాడ జీనోమ్ వ్యాలీకి మరో రూ. 3 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కార్యక్రమంలో పాల్గొన్న నోబెల్ అవార్డు గ్రహీత, స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్త కర్ట్ వుట్రిచ్ (2002, రసాయన శాస్త్రం), జాన్సన్ అండ్ జాన్సన్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ పాల్ స్టౌఫెల్స్‌లను జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డులతో సత్కరించారు.


[2/7, 9:27 PM] @lm: *ఇటీవలే 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఫిబ్రవరి 6న రాణిగా 65 ఏళ్లు (sapphire jubilee) పూర్తి చేసుకున్నారు.*


దీంతో ఆమె ఎక్కువకాలం సింహాసనాన్ని అధిరోహించిన బ్రిటన్ రాజ వంశస్తురాలిగా నిలిచారు.

[2/7, 9:27 PM] @lm: *విశాఖకు చెందిన స్వాతంత్య్ర సమర యోధురాలు రాచర్ల సామ్రాజ్యం (98) ఫిబ్రవరి 6న కన్నుమూశారు.*రాజమహేంద్రవరంలో గోపరాజు వెంకట సుబ్బారావు, రాజ్యలక్ష్మి దంపతులకు 1919లో జన్మించిన సామ్రాజ్యం 1932లో కాకినాడ రామారావుపేటకు చెందిన రాచర్ల రామచంద్రరావును వివాహమాడారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1944లో విజయవాడలో అరెస్టయి 6 నెలల పాటు రాయవెల్లూరు జైళ్లో ఉన్నారు. 1972లో కేంద్ర ప్రభుత్వం ఆమెను తామ్రపత్రంతో సత్కరించింది.


[2/7, 9:27 PM] @lm: *సహారా సంస్థకు చెందిన రూ.39 వేల కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.*

ఈ మేరకు మహారాష్ట్ర పుణెలోనిఆంబే వాలీలో రూ.39 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయాలని ఫిబ్రవరి 6న తీర్పునిచ్చింది. ఫిబ్రవరి 20 లోపల ఎటువంటి వివాదాల్లేని ఆస్తుల జాబితాను అందించాలని సహారా గ్రూప్‌ను ఆదేశించింది. 2016 అక్టోబర్ 31 నాటికి సహారా గ్రూప్ ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన మొత్తం వడ్డీతో కలిపి రూ.47,669 కోట్లు.

[2/7, 9:27 PM] @lm: *ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ సంస్కరణల్లో భాగంగా గుంటూరులో రూ.1.10 కోట్లతో నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్‌ను ఫిబ్రవరి 6న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు*.ఇందులో పనిచేసే కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకు ఖాకీ డ్రెస్ కాకుండా ముదురు నీలిరంగు ప్యాంటు, లేత నీలిరంగు షర్టు డ్రెస్‌కోడ్‌ను పాటిస్తారు. వారి షర్టుపై ‘ఐయామ్ ఏ కాప్’ అనే రేడియం స్టిక్కర్ ఉంటుంది. మహిళా కానిస్టేబుల్ ఖాకీ చీరపై ముదురు నీలి రంగు కోటు ధరిస్తారు. సిబ్బందికి బాడీ వార్న్ కెమెరాలు అందించారు.

[2/7, 9:27 PM] @lm: *ఇంగ్లండ్ క్రికెట్ టెస్టు జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి అలిస్టెర్ కుక్ ఫిబ్రవరి 6న తప్పుకున్నాడు*.59 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన కుక్ మొత్తం 140 టెస్టులు ఆడి 11,057 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 53 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కుక్ 2013 ఐసీసీ ప్రపంచ టెస్ట్ కెప్టన్‌గానూ ఎంపికయ్యాడు.


[2/7, 9:27 PM] @lm: *అసోషియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ 91వ వార్షిక సదస్సు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 5 - 7 వరకు జరిగింది.*


సదస్సులో దేశవ్యాప్తంగా 300 మంది వీసీలు పాల్గొని ‘స్వాతంత్య్రం అనంతరం ఉన్నత విద్యారంగంలో మార్పులు, సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై చర్చించారు. టిబెట్ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ స్టడీస్ మాజీ వీసీ ప్రొఫెసర్ సాంథోంగ్ రిన్‌పచీ సదస్సుకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
[2/7, 9:27 PM] @lm: *టెస్టులు, వన్డేల్లో కొనసాగుతున్న అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి-DRS ని ఇకపై అన్ని ఫార్మాట్లలోఅమలు చేయాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి-ICC నిర్ణయించింది*.దుబాయ్‌లో ఫిబ్రవరి 4 నుంచి 6 వరకూ రెండు రోజుల పాటు జరిగిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. 2017 అక్టోబర్ నుంచి ఇది అమల్లోకి రానుంది.

[2/7, 9:27 PM] @lm: *భారత సంతతికి చెందిన ప్రఖ్యాత బ్రిటిష్ శిల్పి, సిరియన్ శరణార్థుల హక్కుల కోసం పోరాడిన అనిష్ కపూర్‌కు ప్రతిష్టాత్మక జెనెసిస్ అవార్డు లభించింది.*


శరణార్థుల పట్ల ప్రభుత్వాల దుర్మార్గపు విధానాలపై పోరాడినందుకు గాను ఇజ్రాయెల్‌కు చెందిన జెనెసిస్ ప్రైజ్ ఫౌండేషన్ ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది. అవార్డు కింద ఒక మిలియన్ డాలర్లు (రూ. 6.71 కోట్లు) నగదు బహుకరిస్తారు.

[2/7, 9:27 PM] @lm: *భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఫిబ్రవరి 6న చిన్నారుల కోసం ప్రత్యేక టెన్నిస్ అకాడమీని ప్రారంభించింది.*


ఫిల్మ్‌ నగర్‌లోని తన ఇంటికి సమీపంలో ఎస్ఎమ్ టీఏ గ్రాస్‌రూట్‌ లెవల్‌ పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 3 నుంచి 8 ఏళ్ల చిన్నారులకు శిక్షణ ఇస్తారు. సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ-SMTA 2013లో ఏర్పాటైంది.

[2/7, 9:27 PM] @lm: *ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే నాన్‌స్టాప్ విమాన సర్వీసును ఖతార్ ఎయిర్‌వేస్ ప్రారంభించింది.*


దోహా విమానాశ్రయం నుంచి ఫిబ్రవరి 5న బయలుదేరిన క్యూఆర్ 920 విమానం ఫిబ్రవరి 6 ఉదయానికి న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు చేరుకుంది. ఏకధాటిగా 16 గంటల 23 నిమిషాల్లో 14,535 కి.మీ. పయనించి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే విమానంగా రికార్డు నెలకొల్పింది. భూ ఉపరితలంపై ఉన్న దూరానికి అనుగుణంగా ప్రయాణించిన కిలోమీటర్లను లెక్కించారు. కాగా దూరాన్ని ఆకాశమార్గంలో కొలిచినపుడు ఎయిరిండియాకు చెందిన ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో విమానం అత్యంత ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది.

No comments:

Post a Comment