Wednesday, February 8, 2017

2017-18 వార్షిక బ‌డ్జెట్ ముఖ్యాంశాలు

[2/7, 9:27 PM] @lm: 💐💐💐💐💐💐
*2017-18 వార్షిక బ‌డ్జెట్  ముఖ్యాంశాలు*


👉 కేంద్ర‌ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ  2017-18 వార్షిక బ‌డ్జెట్ ను పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశపెట్టారు.
👉* కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బుధవారం ఉదయం 11 గంటలకు పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

👉* ఫిబ్రవరి నెలాఖరులో ప్రవేశపెడుతూ వస్తున్న కేంద్ర బడ్జెట్టును ఒకటో తేదీకే మార్చడం, రైల్వే బడ్జెట్టునూ దీనిలో భాగంగా చేర్చడం ఈసారి ప్రత్యేకతలు.

👉* ఆదాయపు పన్నుపై ఎక్కువమందికి అంచనాలు ఉండడంతో ఈసారి ఒక కొత్త శ్లాబును దీనిలో చేర్చడం గానీ, పన్ను పరిమితిని పెంచడం గానీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
👉* గృహ, వ్యక్తిగత, పారిశ్రామిక రుణాలకు వడ్డీ తగ్గించే నిర్ణయాలు వెలువడే అవకాశాలున్నాయి.

👉* 65 ఏళ్లు పైబడినవారికి పింఛన్‌ ఆదాయాన్ని పూర్తిగా పన్ను రహితం చేయవచ్చు. వ్యవసాయ రంగానికీ వరాలు ప్రకటించవచ్చని భావిస్తున్నారు.
👉* కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కాసేపటి క్రితం పార్లమెంటుకు చేరుకున్నారు. ఉదయం ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ఆయన రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుతో పార్లమెంటుకు చేరుకున్నారు.
👉* బ‌డ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివ‌ర్గం.
[2/7, 9:27 PM] @lm: *‘పెద్దపద్దు’కు పెద్దలు వీరే!*
*👉బడ్జెట్‌ రూపకల్పనలో వీరిదే కీలక పాత్ర!!*

👉యోగ శాస్త్రం ప్రకారం వెన్నెముకలో మూడు నాడులున్నాయి. అవి ‘ఇడ, పింగళ, సుషుమ్న’. సుషుమ్న నాడిని అనుసరించి ఆరు కమలాలు లేక చైతన్య కేంద్రాలున్నాయి. అవి ‘మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధ, అజ్ఞ’. కృషి, ఆధ్యాత్మిక సాధనల ద్వారా కుండలిని మేలుకొంటుంది. అది కిందనున్న చక్రాలగుండా పయనించి చివరకు సహస్రారం అనే సహస్రదళ పద్మానికి చేరుకుంటుంది. ఇప్పుడిదంతా ఎందుకనుకుంటున్నారా... మనలోని అద్భుతశక్తిని బయటకు తీయడానికి ఏవిధంగా అయితే ఈ ఆరు చక్రాలు పని చేస్తాయో.. అదేవిధంగా 110 కోట్ల మందికి పైబడిన దేశ జనాభాకు సంబంధించిన పద్దు రూపకల్పనలో ఈఆరుగురు ప్రముఖులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

👉బడ్జెట్‌లో ప్రభుత్వ నిర్ణయాలు, చేపట్టబోయే కార్యక్రమాలు, పథకాలు, ప్రజలకు కల్పించే పన్ను ఉపశమనాలు అన్నీ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలోని ఈ బృందమే పర్యవేక్షిస్తుంది. ఫిబ్రవరి 1న కేంద్ర విత్తమంత్రి బడ్జెట్‌ 2017-18ను పార్లమెంట్‌కు సమర్పించనున్న నేపథ్యంలో ఆ ఆరుగురు ప్రముఖుల గురించి క్లుప్తంగా...

*👉అశోక్‌ లావాసా*: అశోక్‌ లావాసా హరియాణా కేడర్‌కు చెందిన 1980వ సంవత్సరం ఐఏఎస్‌ అధికారి. ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రస్తుత బడ్జెట్‌ రూపకల్పనలో ఈయనది కీలక పాత్ర. నిధుల కేటాయింపులూ, వివిధ మంత్రిత్వశాఖల డిమాండ్‌లూ... ద్రవ్యలోటు నియంత్రణకు మధ్య సమతుల్యం సాధించటంలో లావాసా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

*👉శక్తికాంతదాస్*‌: బడ్జెట్‌ తయారీలో అత్యంత కీలకమైన వ్యక్తుల్లో శక్తికాంతదాస్‌ ఒకరు. పెద్దనోట్ల రద్దు తర్వాత బాగా పరిచయమైన పేరు. తమిళనాడు కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం కేంద్ర ఆర్థికవ్యవహారాల కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత గాడితప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంతో పాటు, ప్రైవేటు పెట్టుబడులు పుంజుకునేందుకు దోహదపడేలా సూచనలు చేయడం శక్తికాంత్‌ పని. గత రెండున్నర నెలల నుంచి ఆయన అదే పనిలో నిమగ్నమై ఉన్నారు.

*👉హస్ముఖ్‌ అథియా*: జైట్లీ బృందంలో మరో కీలక వ్యక్తి హస్ముఖ్‌ అథియా. 1981 సంవత్సరానికి చెందిన గుజరాత్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. ప్రధాని మోదీకి అత్యంత విశ్వాసపాత్రుడు కావడంతో ఆయనే స్వయంగా అథియాను రెవెన్యూ కార్యదర్శిగా నియమించారు. తాజా బడ్జెట్‌లో అథియా ముందున్న లక్ష్యాలన్నీ చాలా పెద్దవనే చెప్పాలి. వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపు పెంచడం, భారీగా పన్ను రాయితీలు ఇవ్వాలని కోరుతున్న వేతన జీవులు, మధ్యతరగతి వర్గాల ఆశలు నెరవేర్చాల్సిన బాధ్యత అథియా పైనే పెట్టారు. భారీగా పన్ను రాయితీలు ఇవ్వాలంటున్న పారిశ్రామిక వర్గాల డిమాండ్‌లపై అధ్యయనం చేసే బాధ్యతా అథియాదే.

*👉అరవింద్‌ సుబ్రమణియన్‌*:ప్రముఖ ఆర్థికవేత్త. రఘురామ్‌రాజన్‌ తర్వాత ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఎంపిక చేసి ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమించారు. బడ్జెట్‌ ముందు విడుదల చేసే ఆర్థిక సర్వేను రూపొందించటంలో అరవింద్‌ సుబ్రమణియన్‌దే కీలక పాత్ర. సాధారణంగా ఆర్థిక సర్వేలో చేసిన సూచనల్లో కొన్నింటినైనా బడ్జెట్‌లో అమలు చేస్తూ ఉంటారు. మరి మంగళవారం వెలువరించే ఆర్థికసర్వేలో వెలువరించే ప్రతీ అంశంలో అరవింద్‌ సుబ్రమణియన్‌ పాత్ర తప్పనిసరిగా ఉంటుంది.

*👉అంజులి దుగ్గల్‌*: అంజులి చిబ్‌ దుగ్గల్‌ ప్రస్తుతం ఆర్థిక సేవల కార్యదర్శి వ్యవహరిస్తున్నారు. బ్యాంకింగ్‌, బీమా వంటి రంగాల అభివృద్ధి, విస్తరణదిశగా చేపట్టాల్సిన చర్యలపై కసరత్తు చేసే బాధ్యత అంజులి దుగ్గల్‌దే. పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రధానంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఆర్థిక సేవల రంగాలు, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సేవలు విస్తరించగలిగేలా బడ్జెట్‌లో చర్యలు చేపట్టడంతో పాటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం, బ్యాంకుల మొండి బకాయిల వంటి సమస్యలకు పరిష్కారాలు చూపాల్సి ఉంటుంది.

*👉నీరజ్‌కుమార్‌ గుప్తా* :
ఇన్వెస్ట్‌మెంట్‌, పబ్లిక్‌ అసెట్‌ మేనేజిమెంట్‌ కార్యదర్శి, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ కూడా కేంద్ర అజెండాల్లో ఒకటి. ఖాయిలాపడ్డ సంస్థలేవి? వాటిని తిరిగి లాభాల పట్టించాల్సిన అవసరం ఉందా? అసలు వాటిని కొనసాగించాలా? లేదంటే వాటిల్లో పెట్టుబడులను ఉపసంహరించాలా? ప్రైవేటీకరించాలా? తదితర అంశాలపై నీరజ్‌ ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిధుల సేకరణ లక్ష్యాన్ని నిర్దేశించడంలో నీరజ్‌కుమార్‌ గుప్తాదే ప్రధాన పాత్ర. పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించడంతో పాటు నష్టాల్లో నడుస్తున్న కంపెనీల్లో వాటాల విక్రయానికి ప్రణాళికలు రచించాల్సి బాధ్యత ఆయనపైనే పెట్టారు.
[2/7, 9:27 PM] @lm:
*ఒక బడ్జెట్‌ కాపీ ఖర్చు రూ. 3450*
*అందుకే ‘గ్రీన్‌ బడ్జెట్‌’కి సై*

👉: ఈసారి పర్యావరణహితంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఆర్థిక సర్వే, బడ్జెట్‌ కాపీలను 788మాత్రమే ముద్రించనున్నారు. ఇవి పార్లమెంట్‌ సభ్యులకే ఇస్తారు. మీడియాతో సహా బయట వ్యక్తులకు కేవలం వీటి డిజిటల్‌ కాపీలను మాత్రమే అందజేయున్నారు. వీటికి సంబంధించిన కాపీలను ఆయా తేదీల్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో పోస్టు చేస్తారు. ఆర్థిక సర్వే జనవరి 31న లోక్‌సభ ముందుకు రానుండగా.. బడ్జెట్‌ని ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు.

*గత బడ్జెట్‌ ప్రింటింగ్‌కు రూ.70లక్షలు*

👉బడ్జెట్‌ కాపీల ముద్రణకు 2016-17లో ప్రభుత్వానికి రూ.70.62లక్షలు ఖర్చయింది. మొత్తం 2047 కాపీలను ముద్రించారు. ఒక్కోకాపీకి రూ3,450 ఖర్చైంది. వీటిని సబ్సిడీ కింద రూ. 1,500కు లోకసభా కౌంటర్‌లో విక్రయించారు.

*పార్లమెంటు సభ్యులకే..*
👉గత కొన్నేళ్లుగా పార్లమెంట్‌ ప్రింటింగ్‌ వ్యయాన్ని తగ్గిస్తూ వస్తోంది. చివరికి కమిటీల నివేదికలను కూడా ముద్రించడం లేదు. దీంతో 2014-15లో కనీసం సభ్యులకిచ్చేలా అయినానివేదికలను ముద్రించాలని పార్లమెంటర్‌ స్టాండింగ్‌ కమిటీ ఆన్‌ ఫైనాన్స్‌ కోరింది. గత ఏడాది బడ్జెట్‌ కాపీలను 5,100 కాపీల నుంచి 2047కాపీలకు తీసుకొచ్చారు. ఈసారి దానిని మరింత కుదించి 788 కాపీలకు పరిమితం చేశారు. వీటిల్లో 543 లోక్‌సభ, 245 రాజ్యసభ సభ్యులకు వీటిని ఇస్తారు. వీరికి ఒక్క కాపీ కూడా అదనంగా అందజేయరు.

*కావాలంటే కొనుక్కోవచ్చు...*
👉రెండేళ్ల క్రితం మీడియా ప్రతినిధులకు ఆర్థికసర్వే, బడ్జెట్‌ కాపీలను అందజేసేవారు. కానీ గత ఏడాది దానిని మూడు కాపీలకు పరిమితం చేశారు. డబ్బు చెల్లించి కొనుగోలు చేసే వ్యక్తులు, సంస్థలకు మాత్రం కాపీలు అందుబాటులో ఉంటాయి. ఈసారి మీడియాకు ఎటువంటి ప్రింటింగ్‌ కాపీలను అందజేయకూడదని ఆర్థిక మంత్రిత్వశాఖ సలహాదారు ఉత్తర్వులు జారీ చేశారు.

👉పార్లమెంట్‌లోని లోక్‌సభ సేల్స్‌ కౌంటర్‌ వద్ద బడ్జెట్‌, ఆర్థిక సర్వే కాపీలను విక్రయానికి ఉంచుతారు. సాధారణ ప్రజలు ఆన్‌లైన్లో కూడా వీటిని పొందవచ్చు.
[2/7, 9:27 PM] @lm: *ఆర్థికమంత్రి అడుగుజాడలు*
*విద్యార్థి నాయకుడి నుంచి విత్తమంత్రి వరకు*

👉 నలుగురు ఉన్న చిన్న కుటుంబానికి బడ్జెట్‌ వేయాలంటేనే మధ్య తరగతి ప్రజలు తర్జనభర్జనలు పడుతుంటారు. అలాంటిది చిన్నా, పెద్ద కుటుంబాలు కోట్లలో ఉండే భారతదేశానికి బడ్జెట్‌ వేయడమంటే మాటలా! ఆ పనిని ఎంతో పద్ధతిగా, బాధ్యతతో, సమర్థంగా చేయాలి!! ఇలాంటి క్లిష్లమైన కార్యక్రమానికి అన్నీ తానే అయి నడిపించే వ్యక్తి ఆర్థికశాఖ మంత్రి. ఫిబ్రవరి 1న ఆర్థికశాఖ మంత్రిగా అరుణ్‌జైట్లీ 2017-18 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి క్లుప్తంగా..

👉అరుణ్‌జైట్లీ 1952 డిసెంబర్‌ 28న దిల్లీలో జన్మించారు. రత్నప్రభ జైట్లీ, మహారాజ్‌ కిషన్‌ జైట్లీ తల్లిదండ్రులు. విద్యాభ్యాసమంతా దిల్లీలోనే సాగింది. సెయింట్‌ జేవియర్‌ స్కూల్‌లో పాఠశాల విద్యనీ, శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌లో గ్రాడ్యుయేషన్‌నీ పూర్తి చేశారు. దిల్లీ యూనివర్సిటిలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అక్కడ చదువుకుంటున్నప్పుడే ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా పనిచేశారు. 1974లోదిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకుడిగానూ ఎన్నికయ్యారు. అత్యవసర పరిస్థితి సమయంలో 19 నెలల నిర్బంధాన్ని సైతం ఎదుర్కొన్నారు. 1973లో రాజ్‌ నరైన్‌, జయప్రకాష్‌ నారాయణ్‌లు సాగించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలోనూ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థి, యువత జాతీయ కమిటీకి కన్వీనర్‌గా పనిచేశారు. పౌరహక్కుల ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం జన్‌ సంఘ్‌లో చేరారు.

👉సుప్రీంకోర్టు న్యాయవాదిగా...
1977 నుంచి లోక్‌ తాంత్రిక్‌ యువ మోర్చా కన్వీనర్‌గా, దిల్లీ ఏబీవీపీ అధ్యక్షుడిగా, ఏబీవీపీ అఖిలభారత కార్యదర్శిగా, భాజపా యువవిభాగ అధ్యక్షుడిగా కీలక పాత్రలు పోషించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించిన జైట్లీ పలు హైకోర్టుల్లోనూ పనిచేస్తూ వచ్చారు. 1990 దిల్లీ కోర్టు ఆయనను సీనియర్‌ అడ్వొకేట్‌గా గుర్తించింది. వీపీ సింగ్‌ ప్రభుత్వ హయాంలో అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా నియమితులయ్యారు. బోఫోర్స్‌ కుంభకోణ విచారణ పత్రాలను తయారు చేసే బాధ్యత జైట్లీకి అప్పగించారు. శరద్‌యాదవ్‌, మాధవరావ్‌ సింథియా, ఎల్‌కే అడ్వాణీ తదితర రాజకీయ ప్రముఖులకు న్యాయసలహాదారుగా వ్యవహరించారు. 1998లో ఐక్యరాజ్యసమతి సాధారణ సమావేశాలకు ప్రభుత్వం తరపున ప్రతినిధిగా హాజరయ్యారు.

👉1991 నుంచి భాజపా జాతీయ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా జైట్లీ ఉన్నారు. 1999 సాధారణ ఎన్నికల సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. అనంతరం వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిగానూ పనిచేశారు. రెండు వేల సంవత్సరంలో న్యాయశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలను స్వీకరించారు. 2007లో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా జైట్లీ పేరును అడ్వాణీ ప్రతిపాదించారు. ‘ఒక వ్యక్తి.. ఒకే పదవి’ పద్ధతికి కట్టుబడి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి జైట్లీ రాజీనామా చేశారు. రాజ్యసభలో పలు కీలక బిల్లులు ఆమోదం పొందడంలో జైట్లీ తనదైన పాత్రను పోషించారు.

*👉నాలుగో బడ్జెట్‌*
👉2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మంత్రివర్గంలో ఆర్థికశాఖ మంత్రిగా జైట్లీ నియమితులయ్యారు. సంస్కరణల బాటలో నడుస్తూ జీఎస్‌టీ, నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం నాలుగోసారి కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టబోతున్నారు.


[2/7, 9:27 PM] @lm: *నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం నాలుగో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.*
ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న 2017-18 వార్షిక ఆర్థిక ప్రణాళికను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సారి మార్పు, శక్తిమంతం, స్వచ్ఛ భారత్ (TEC-Transfrom, Energise, Clean India) నినాదంతో రూ.21,46,735 కోట్ల విలువైన బడ్జెట్‌ను పార్లమెంటు ముందు ఉంచారు. పెద్ద నోట్ల రద్దు చర్య నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ డిజిటలీకరణ, డిజిటల్ లావాదేవీలను పెంపొందించడం, గ్రామాల్లోనూ దీనిని ప్రోత్సహించడంపై జైట్లీ దృష్టి సారించారు. డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడం నుంచి డిజిటలీకరణ మౌలిక సదుపాయాలను విస్తరించడం వరకూ అనేక నిర్ణయాలు వివరించారు. 92 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి పలికి తొలిసారి రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో కలిపి ప్రవేశపెట్టారు.

2017-18 బడ్జెట్ హైలెట్స్
మొత్తం బడ్జెట్ రూ.21,46,735 కోట్లుపథకాల వ్యయం రూ.9,45,078 కోట్లుపథకాలేతర వ్యయం రూ. 12,01,657 కోట్లురూ.5 లక్షల లోపు ఆదాయంపై పన్ను 5 శాతానికి తగ్గింపు.రిబేట్ (పన్ను తిరిగి చెల్లింపు) రూ.5,000 నుంచి రూ. 2,500కు తగ్గింపు.రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల లోపు ఆదాయంపై 20 శాతం పన్ను.పన్ను ఆదాయం రూ.50 లక్షలు దాటితే 10 శాతం సర్‌చార్జీ.రూ.50 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న సంస్థలపై కార్పొరేట్ పన్ను 30 నుంచి 25 శాతానికి తగ్గింపు.రూ.3 లక్షలకు పైబడిన అన్ని నగదు లావాదేవీల నిషేధం.2017-18లో వ్యవసాయ వృద్ధి లక్ష్యం 4.1 శాతం. రుణాల మంజూరు లక్ష్యం రూ.10 లక్షల కోట్లు. 5 ఏళ్లలో రైతుల ఆదాయం రెండింతలయ్యేలా చర్యలు.రాజకీయ పార్టీలకు రూ.2 వేలకు పైబడిన నగదు విరాళాలపై నిషేధం.రైల్వేలకు రూ. 1.31 లక్షల కోట్లు కేటాయింపు.IRCTC ద్వారా రైలు టికెట్ల బుకింగ్‌పై సర్వీసు చార్జీల ఎత్తివేత.చెక్ బౌన్‌‌స కేసులకు సంబంధించి ‘నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్’కు సవరణలు.దేశం విడిచి పారిపోయిన ఎగవేతదారుల ఆస్తులను స్వాధీనం చేసుకునేలా చట్ట సవరణలు.LNG (గ్యాస్)పై కస్టమ్స్ పన్ను 5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గింపు.వయోవృద్ధులకు ఆధార్ ఆధారిత ఆరోగ్య కార్డులు. కనీసం 8 శాతం రాబడినిచ్చే వర్షిత పింఛన్ పథకం ఏర్పాటుPOS పరికరాలపైసుంకం రద్దు. మార్చికల్లా 10 లక్షల పీఓఎస్‌ల కొనుగోలు.2017-18 లో 2.50 లక్షల డిజిటల్ లావాదేవీల లక్ష్యం.దేశంలో ఇంటర్నెట్ విస్తృతి కోసం భారత్ నెట్‌కు రూ. 10 వేల కోట్లు నిధులు.గ్రామీణుల కోసం కొత్తగా ‘డిజి గావ్’ ప్రారంభం2018 మే నాటికి దేశంలోని 100 శాతం గ్రామాలకు విద్యుత్.పేదలకు 2019 నాటికి కోటి గృహాల నిర్మాణంFDIల ప్రోత్సాహకానికి ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు-FIPB రద్దుడిజిటల్ పేమెంట్ల పర్యవేక్షణకు ‘పేమెంట్ రెగ్యులేటరీ బోర్డు’ ఏర్పాటుస్థిరాస్తులపై దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ పన్ను గడువు మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గింపు2017-18లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 15.8 శాతం, పరోక్ష పన్నుల వసూళ్లు 8.3 శాతం పెరుగుతాయని అంచనా.2017-18 ఆర్థిక సంవత్సరానికి ఆహారం, ఎరువులు, పెట్రో ఉత్పత్తులు తదితరాలపై రాయితీల అంచనా రూ. 2,40,338 కోట్లు. చక్కెరపై రాయితీ ఎత్తివేత.ప్రభుత్వ బ్యాంకులకు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు2017-18లో రూ.72 వేల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు విక్రయించినవారికి పన్ను మినహాయింపు. రాష్ట్రం ఏర్పాటు అయిన 2014 నుంచి ల్యాండ్ పూలింగ్‌లో ఉన్నవారికి క్యాపిటల్ గెయిన్స్ రద్దు.


శాఖలు, పథకాల వారీ కేటాయింపులు 

మౌలిక వసతుల కల్పనకు రూ.3.96 లక్షల కోట్లు.రక్షణ రంగానికి రూ.2,74,114 కోట్లు.హోంశాఖకు రూ. రూ.83 వేల కోట్లు.మహిళా శిశు సంక్షేమానికి రూ.1.84 లక్షల కోట్లు.వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 1.87 లక్షల కోట్లుఎస్సీ సంక్షేమానికి రూ. 52,393 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.31,920 కోట్లు, మైనారిటీ వ్యవహారాలకు రూ.4,195 కోట్లు.వైద్యం, ఆరోగ్యానికి రూ.47,352 కోట్లుగ్రామీణాభివృద్ధి శాఖకు రూ.1,07,758 కోట్లు. ( అత్యధికంగా ఉపాధి హామీకి రూ.48 వేల కోట్లు. పథకం ప్రవేశపెట్టిన తర్వాత కేటాయింపుల్లో ఇదే అత్యధికం. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-PMYAకు రూ.23 వేల కోట్లు. రూ. 20 వేల కోట్ల గృహ రుణాలు. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన-PMGSYకు రూ. 19 వేల కోట్లు)స్వచ్ఛ భారత్‌కు రూ.13,948 కోట్లు.శాస్త్ర, సాంకేతిక రంగానికి రూ.37,435 కోట్లు.పర్యాటక రంగానికి రూ. 1,840 కోట్లు.జాతీయ రహదారులకు రూ. 64 వేల కోట్లు.రవాణాశాఖకు రూ.1,24,373 కోట్లు.పాఠశాల విద్య, అక్షరాస్యతకు రూ.46,356 కోట్లు. ఉన్నత విద్యకు రూ.33,329 కోట్లు.


ద్రవ్యలోటు, రెవెన్యూలోటు లక్ష్యాలు

2017-18లో ద్రవ్యలోటు లక్ష్యం 3.2 శాతం.2018-19లో ద్రవ్యలోటుని 3 శాతంగా కొనసాగిస్తామని హామీ.2016-17లో ద్రవ్యలోటు 3.5 శాతం.2016-17లో రెవెన్యూ లోటు 2.1 శాతం2017-18లో రెవెన్యూ లోటు 1.9 శాతం

No comments:

Post a Comment